లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 8 44

“ఓవర్ ఆక్షన్ ఆపు …….. పోయిన నెల ఆఫీస్ వాళ్ళు నీకు ఫోన్ చేసి ఓవర్ టైం వర్క్ చేయమంటే …….. ఎం చెప్పావ్ రా ??”

“ఎం చెప్పాను ??”

“గుర్తులేదా ??”

“లేదు …… ”

“అబ్బ …… ”

“నా పేరు సంజయ్ ……సంజయ్ రామస్వామిని …….. నాకు short term memory loss ఉంది…… ”

తను నవ్వి “చంపేస్తాను …… ” అంది.

“నిజం ……. అసలు ఎవరు నువ్వు ??” అని అడిగాను.

“టాపిక్ డైవర్ట్ చేయకు ……. ”

“ఎం టాపిక్ ??”

“అబ్బ …… ”

“అసలు మనం ఎక్కడున్నాం ?? ఇక్కడేం చేస్తున్నాం ??”

“సంజు …… ”

నా ఫోన్ ఓపెన్ చేసి స్వీటీ ఫోటో చూసి తనకి చూపించి “ఇది …… నువ్వేనా ?? ఇక్కడ నా వైఫ్ అని రాసుంది …….. ”

తను నవ్వుతు నా తొడ పై గిల్లి

“అబ్బా ……. రాక్షసి …… ”

“ఇప్పుడు …. గుర్తొచ్చానా ఎవరో నేను ??” అంది.

“లేదు …… ”

ఇంకోసారి గిల్లింది ……

“అబ్బా …….. శాడిస్ట్ …….. ”

“ఇప్పుడు గుర్తొచ్చానా ??”

నేను కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నట్లు నటించి “నీ పేరు స్వీటీ కదూ ….. ” అన్నాను.

“సంజు ……. టాపిక్ భలే డైవర్ట్ చేస్తావె నువ్వు ??”

నేను నవ్వి ఊరుకున్నాను.

“నువ్వు మాత్రం నన్ను వాడుకుంటావ్ ……… మీ ఆఫీస్ వాళ్ళకి ఏదో చెప్పుకుంటావ్ ……. నేను మాత్రం ఎం చెప్పకూడద ??”

“లేదు ….. మొగుడు గా నేనేం చెప్పిన అది రైట్ …. నేనేమైన చెప్పొచ్చు కానీ వైఫ్ గా నీకు అలా చేసే అధికారం లేదు ……. ”

“అబ్బా …… ఇంకా ??”

“అంతే కాదు …….. నేనేం చేసిన అది మన మంచికోసమే ……. ”

“మరి నేను చేస్తే ??” అని అడిగింది.

“స్వార్ధం కోసం ……. ”

“అబ్బో ……. ”

“నాది కల్మషం లేని మనసు ……. నీ లాగ కాదు ……. ”

“బాబోయ్ ……. నిజంగానే ??”

“అవును …….. నా లాంటి మచ్చ లేని మనసు నీకు రావాలంటే tide, surf excel కూడా సరిపోవు ……. “

2 Comments

  1. The writer/admn will not take viewers comments ilanti vedavapuku stories are being posted continuously. Most of the exciting stories are left in middle without completing. This our fate.

    1. Ippudu emindhi mawa eppudu sex storys ena ilanti vi kuda read chyli kadha ilanti kathalu vacheve konni vatini cheda thenguthe ela mawa ??

Comments are closed.