లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

రెండు రోజుల తర్వాత:

నేను స్వీటీ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాము.

మా అపార్ట్మెంట్ కి వెళ్లబోతుంటే ఎదురింటి పిల్లోడు “తాతయ్య …….. ” అని నా వైపు చూసి పిలిచాడు. స్వీటీ పక్కన దొంగ నవ్వులు నవ్వుకుంటూ ఆపుకుంటుంది.

నేను వాడి వైపు చూసాను. వాడు నవ్వుతు మళ్ళి “తాతయ్య ….. ” అన్నాడు.

నేను వాడ్ని ఎత్తుకొని “తాతయ్య ఏంట్రా ??” అని అడిగాను.

మళ్ళి తాతయ్య అన్నాడు.

“నీకు నేను తాతయ్య లాగ కానిస్తున్నానా రా ??”

“అవును ……. అక్క తాతయ్య అని పిలవమని చెప్పింది ……. ”

నేను స్వీటీ వైపు చూసాను. తను వేరే వైపు చూస్తూ ఏమి తెలియనట్లు నటించింది.

“అక్క ……. చాక్లెట్ …….. ”

“చాక్లెట్ కావాల్రా నీకు ??”

“అవును ……. అక్క నాకు తాతయ్య అని పిలిస్తే …… చాక్లెట్ ఇస్తానని చెప్పింది …… ”

నేను స్వీటీ వైపు చిరుకోపంతో చూసాను.

తను మూసి మూసి నవ్వులు నవ్వుకుంటుంది.

“అక్క ……. చాక్లెట్ ……. ” అన్నాడు.

తను హ్యాండ్ బాగ్ తీసి చిన్న చాక్లెట్ ఇచ్చింది.

“థాంక్స్ అక్క ……. ” అన్నాడు.

“థాంక్స్ నాకు కాదు …….. నీకు చెప్పాలి …… ” అని వాడి బుగ్గలు నలిపి “ఎప్పుడు ఇలాగే పిలువు ….. తనని …… ఓకేనా ??” అంది.

నేను తన వైపే చూస్తున్నాను.

“తాతయ్య …… ” అన్ని గట్టిగ నన్ను చూసి అరుస్తున్నాడు. నేను స్వీటీ వైపు చూసి మనసులో తిట్టుకొని వాడి వైపు చూసి “రేయ్ ……. నీకు ఇంకా పెద్ద చాక్లెట్ ఇస్తా ……. ఇక నుంచి తనని ……. అవ్వ అని పిలువు …… ”

“ఎంత పెద్ద చాక్లెట్ ??”

“బాగా పెద్ద చాక్లెట్ ……. ”

“నాకు అంత పెద్ద చాక్లెట్ కావలి …… ” అని పెద్ద చాక్లెట్ కావాలని చేతులతో చూపించాడు.

“సరే …… ఇస్తాలే …….. తనని ….. అవ్వ అని పిలువు ….. “