లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

“అవ్వ ……. ” అని పిలిచాడు.

స్వీటీ వాడ్ని చూసి “రేయ్ ! నీకు చాక్లెట్ ఇచ్చాను కదరా ?? నన్ను అక్క అనే పిలువు ……. అక్క అని పిలవకపోతే నేను ఇంకా నీకు చాకోలెట్స్ ఇవ్వను ……. ”

నేను వాడి వైపు చూసి “రేయ్ ! అక్క ఇవ్వక పోయిన …… నేను నీకు పెద్ద పెద్ద చాకోలెట్స్ కొనిస్తాను …… అవ్వ అనే పిలువు …… ”

“అవునా ?? రేయ్ …… అయితే మీ తాతయ్యని ఆ పెద్ద చాక్లెట్ ఇప్పుడే ఇవ్వమని చెప్పు ……. ”

నేను తన వైపు చూసాను. తను నా వైపు చూసి నవ్వింది.

“నాకు ఇప్పుడే పెద్ద చాక్లెట్ కావలి ……. ” అని ఏడవటం స్టార్ట్ చేసాడు.

“రేయ్ రేయ్ …… ఆగు ఇస్తాను ……… ముందు నువ్వు తనని అవ్వ అని పిలువు అప్పుడు ఇస్తాను ……. ”

స్వీటీ వైపు చూసి “అవ్వ ….. ” అన్నాడు.

స్వీటీ అలాగే చూస్తుంది.

“అవ్వని ఎలా ఉన్నవో అడుగు ……. ”

“ఎలా ఉన్నావ్ అవ్వ ??” అని నవ్వుతు గట్టిగ అడిగాడు.

“తాతయ్యని అడగరా …… ”

“తాతయ్య ఎలా ఉన్నావ్ ……. ??” అని నా వైపు చూసి అడిగాడు.

ఈ లోగ పక్కింటి ఆమె వచ్చింది.

“ఏంటి మా వాడు బాగా అల్లరి చేస్తున్నాడా ??”

ఈ లోగ వాడు మా ఇద్దరినీ అవ్వ తాతయ్య అని పిలిచాడు. పక్కింటామెకి అసలేమీ అర్ధం కాలేదు. మేము జరిగిందంతా చెప్పి లోపలికి వెళ్లి డోర్ వేసుకొని కాసేపు నవ్వుకున్నాం.

“స్వీటీ ……. నేనొకటి చెప్పాలి ……. ”

“ఏంట్రా ??”

“నాకు మా బాస్ ఒక assignment ఇచ్చాడు ……. ఈ వీకెండ్ నేను వేరే సిటీ కి వెళ్లి మీటింగ్ అటెండ్ అవ్వాలి …….. ”

“మరి మన వీకెండ్ ప్లాన్స్ సంగతేంటి ??”

“sorry ……. “