లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ – 9 47

“అంత తక్కువ టైం లో ఎలా చెప్తారు?? కనీసం నెల ముందైనా చెప్పాలి గా ??”

“యా …… ఆఫీస్ లో ఫ్రెండ్ వెళ్ళాలి …… వాడికి హెల్త్ ఇష్యూ వల్ల నన్ను పంపిస్తున్నారు …… ”

“వెళ్లాలా ??”

“యా …..”

తనలో disappointment కనిపించింది.

“ఎందుకలా ఉన్నావ్ ??”

“మన వీకెండ్ ప్లాన్స్ cancel అయ్యాయి గా ??”

“అవునే ….. weekend ప్లాన్స్ cancel అంటున్నవ్ ……. మనం ఎం ప్లాన్ చేసాం అసలు cancel చేయటానికి??”

“మనం ప్లాన్ చేసినవి కావు ……. నేను చేసినవి …… ”

నేను తన వైపు చూసి “అవునా ……. ఎం ప్లాన్ చేసావే మన కోసం ??”

“ఐన నీకెందుకు రా ?? నువ్వు వీకెండ్ నువ్వు ఉండట్లేదు గా ……..” అని స్టైల్ గా అంది.

“అయితే ఏంటి ?? నెక్స్ట్ వీక్ ఉంటాను గా ……. ”

“యా ….. నెక్స్ట్ వీక్ చెప్తాను ……. ”

“పర్లేదు …… ఇప్పుడైనా చెప్పు ……. ”

“చెప్పేస్తారు మరి …….అన్ని చెప్పేస్తే surprise ఎలా ఉంటుంది ??”

“ఐన ఎం surprise ప్లాన్ చేస్తున్నావ్ నాకోసం ??”

“అబ్బా …… నేనంత పిచ్చిదాని లాగ కనిపిస్తున్నానా ?? నువ్వు question ఎలా ట్విస్ట్ చేసి అడిగిన నేను చెప్పను …… ”

“సరే …….నీ ఇష్టం …….. నేను కూడా నీకొక surprise ఇద్దామని అనుకున్నాను …….. ఎం చేస్తాం ……. ??”

“surprise ఆ ?? నా కోసమా ??”

“యా …… ”

“ఎం surprise రా ??”

“చెప్పేస్తారు మరి …….అన్ని చెప్పేస్తే surprise ఎలా ఉంటుంది ??”

“నా డైలాగ్ నాకే చెప్తున్నావా సంజు ??”

“yes ….. ”

తను “సరే …… ఒకపని చేద్దాం ……. నువ్వు నీ surprise ఏంటో చెప్పు ……. నేను నా surprise ఏంటో చెప్తాను …… ”

నేను అప్పుడు “సరే నువ్వు ముందు చెప్పు ……. ”

తను “అదేం కుదరదు …….. నువ్వే నాకు ఫస్ట్ చెప్పాలి …… నాది పెద్ద surprise …… ”

“నాది కూడా పెద్ద surprise ……”

“నో ….. కుదరదు…… ” అంది

నేను అప్పుడు “ఐన నువ్వే ముందు surprise గురించి ముందు ఎత్తావ్ కాబట్టి నువ్వే ఫస్ట్ చెప్పాలి …… ”

తను “సరే ……. కానీ నాకు నువ్వు నీ surprise గురించి నా surprise చెప్పాక కచ్చితంగా చెప్పాలి ……. ”

“ఓకే …… ”

“మళ్ళి మాట మార్చకూడదు ……. ”

“ప్రామిస్ …… ”

నేను తన చేయి పై నా చేయి వేసి “ప్రామిస్ ……. ” అని చెప్పి “…. ఐన మొగుడిని నమ్మని భార్య నువ్వొక్కదానివెనే …… ” అన్నాను.

“అబ్బా …… నాకు నీ గురించి బాగా తెలుసు …….. ” అంది.