ప్రేమ 323

జాబ్ లో జాయిన్ అయిన రోజే వారం రోజులు లీవ్ పెట్టి వెళ్తున్న నన్ను అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నా పట్టించుకోకుండా ఆఫీస్ నుండి బయటకు వచ్చేసాను నేను…. సరాసరి విమానాశ్రయానికి వెల్లిపోయాను… ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెల్లిపోదామా అని తొందరగా ఉంది నాకు. ఫ్లైట్ బయలుదేరడానికి ఇంకా గంట టైం ఉంది… ఆ గంట సేపట్లో ఒక వెయ్యిసార్లయినా వాచ్ వంక చూసి ఉంటాను. సెకన్ల ముల్లు కూడా గంటల ముళ్లంత నెమ్మదిగా కదులుతున్నట్టనిపించింది నాకు … విమానం బయలుదేరే వరకు క్షణమొక యుగంగా గడిచింది… ఎట్టకేలకు విమానం బయలుదేరింది… ఈ క్షణం కోసం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాను నేను… విమానం కన్నా వేగంగా నా మనసు పరుగెడుతూ విమానానికి దారి చూపిస్తుంది… ఢిల్లీ నుండి హైదరాబాద్ కి సుమారు మూడు గంటలు ప్రయాణం… మూడేళ్లు వెయిట్ చేసిన నాకు ఈ మూడు గంటలు వెయిట్ చేయడం కష్టంగా ఉంది…. కిటికి లోంచి చూస్తే మేఘాలు వేగంగా వెనక్కి వెల్లిపోతున్నాయ్ … నా మనసులో ఆలోచనలు కూడా వేగంగా వెనక్కి పోసాగాయి …

మూడేళ్ల కింద ఇలాగే ఫ్లైట్ లో వెళ్తున్నాం…. అంతకు రెండు రోజుల ముందు అకస్మాత్తుగా దివ్య వచ్చి ఊటీ వెళదాం అంది…
” అందరూ పెళ్లయ్యాక హనీమూన్ కి ఊటీ వెళ్తారు …. నువ్వేంటి పెళ్లికి ముందే వెళ్దాం అంటున్నావు… పెళ్లికి ముందే శోభనం ప్లాన్ చేసావా ఏంటి…” అన్నాను చిలిపిగా….

“అబ్బా ఆశ … అంతలేదు కానీ …తీసుకెళతావా లేదా …” అంది …

సరే అని విమాన టికెట్లు బుక్ చెసా… విడిగా రెండు రూమ్స్ బుక్ చేస్తుంటే …. ” రెండు ఎందుకు ఒకటి చాలు…. నీ మీద నాకు నమ్మకం ఉంది” అంటూ ఒకే రూం బుక్ చేయించింది…

దివ్య నేను చిన్నప్పటినుంచే స్నేహితులం… ఒకే స్కూల్, ఒకే క్లాస్… ఇద్దరం పోటీ పడి చదివేవాళ్ళం… ఎప్పుడూ మేమే మొదటి రెండు ర్యాంకుల్లో ఉండే వాళ్ళం … ఇంటర్లోనూ ఒకే కాలేజ్ ….చిన్నప్పట్నుంచి ఉన్న స్నేహం ఇంటర్లో మరింత బలపడింది…. … ఇంటర్ ముగిశాక ఇద్దరం విడిపోయాం… ఎంసెట్ లో మంచి ర్యాంకులు వచ్చాయి… దివ్య ఫార్మసీలో చేరింది, నేను బిటెక్ లో చేరా… వేరయ్యాక మా మధ్య ప్రేమ మొదలయయింది… 3rd ఇయర్ పూర్తయ్యే సరికి పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాము… రోజూ దివ్యని కలవడానికి గంట జర్నీ చేసేవాణ్ణి… మరో గంట పాటు ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం… ఇంటికెళ్ళాక చాలాసేపు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం… అందువల్ల మాకు వచ్చే మార్క్స్ ప్రతి సంవత్సరం తగ్గిపోసాగాయి …..

నా 3 వ సంవత్సరం ఫలితాలు వచ్చిన రోజే దివ్య ఊటీ వెళ్దాం అనడంతో రెండు రోజుల తర్వాత వెళ్ళాం…. ఫ్లైట్ దిగి కార్ లో కాటేజ్ కి చేరుకున్నాక ఫ్రెష్ అయి బయటకు వెళ్ళాం…
కొండలు, లోయలు, పెద్ద పెద్ద చెట్లు, తేయాకు తోటలు, ఎటు చూసినా పచ్చగా ఊటీ వాతావరణమంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది… దివ్య చాలా ఎంజాయ్ చేసింది… సాయంత్రం వరకు ఊటీ అందాలు చూస్తూ తిరిగాం… చీకటి పడుతుండగా రోస్ గార్డెన్ చేరుకున్నాం… వేల రకాల గులాబీలను చూస్తూ ఒక బెంచ్ మీద కూర్చున్నాం… కొంచెం దూరం లో మరో బెంచ్ మీద ఒక జంట గాఢంగా ముద్దెట్టుకుంటున్నారు… నేను దివ్యకి ఆ జంటను చూపించి కొంటెగా నవ్వాను… దివ్య సిగ్గు పడుతూ తలదించుకున్నదల్లా… అకస్మాత్తుగా నా తలను పట్టుకొని నా పెదాలపై తన పెదాలతో గట్టిగా అదిమింది… జరిగింది అర్థం కావడానికి నాకు క్షణకాలం పట్టింది… మరుక్షణం నేను కూడా నా రెండు చేతుల్లో తన మొహాన్ని సున్నితంగా పట్టుకొని తన పెదాల్ని గట్టిగా వత్తాను.. మా ఇద్దరికీ అదే మొదటి ముద్దు…. ఎంత బాగుందో నేను మాటల్లో చెప్పలేను… రెండు నిమిషాల తర్వాత మా పెదాలు విడిపోయాయి… కానీ కొన్ని సెకన్ల వ్యవధిలో మళ్లీ కలుసుకున్నాయి… ఈ సారి అయిదు నిమిషాల దాకా అవి విడిపోలేదు…. తర్వాత కూడా నేను మళ్ళీ తన పెదాల్ని అందుకోబోతుంటే దివ్య నన్ను నెట్టేసి పైకి లేచి పరుగెత్తింది…. రోజ్ గార్డెన్ అంతా తిరిగి డిన్నర్ చేసి కాటేజ్ కి చేరుకున్నాం … దివ్య వాష్ రూమ్ కి వెళ్లి వచ్చే సరికి నేను బెడ్ పై పడుకున్నా … బాగా తిరగడం వల్ల పూర్తిగా అలిసిపోయినట్ట్టుండి కళ్ళు మూసుకున్న ..