“ఛీ ఛీ లేదు” అంది
“హహహ అది చాలా డేంజర్ అందుకని అలా అన్నాను లే. ఇంతకీ నీ అనుమానం ఏంటి?” అంది ప్రియా
“ఏమో ఏం అర్ధం కావట్లేదు. మొన్నటివరకు ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని ఉండేది. ఇప్పుడు ప్రాజెక్ట్ చేతిలో ఉంది. దాని వల్ల నేను అనుకున్నది జరుగుతుంది. కానీ ఎందుకో అర్ధం కావట్లేదు యాక్సెప్ట్ చేయాలా? వద్దా?” అని అంది
“నేనైతే వద్దనే చెప్తాను, ఎందుకు అంటే మనసులో అనుమానం ఉన్నప్పుడు ఏది చేయకూడదు. కానీ అది నీ ఇష్టం మేఘన. ఇంత ఆలోచిస్తున్నావు అంటే పెద్ద విషయమే అయి ఉంటుంది. నా మాట విని ఆగిపో” అంది ప్రియా
అది విని మేఘన కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
“చాలా కష్టపడితే ప్రాజెక్ట్ వచ్చింది ప్రియా” అంది మేఘన తన ఫోటో షూట్ గుర్తు చేసుకుని.
“అది నా ఒపీనియన్ మాత్రమే, ఒకసారి నీకు ఇంకా దగ్గర అయిన వాళ్ళని అడిగి చూడు” అంది
“ఎవరు?” అంది మేఘన
“ఇంకెవరు జాన్” అంది ప్రియా
“అసలు నేను తనకి గుర్తు ఉన్నానో లేదో, కనీసం ఇప్పటి వరకు ఒక్క మెసేజ్ కూడా లేదు” అంది మేఘన
“అబ్బాయిలు అలానే ఉంటారు. మనం మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు. అసలు మీరు విడిపోవటానికి కారణం ఆ చివరి లైవ్ ఏ కదా. ఆ రోజు చాలా వరకు తప్పు నీదే మేఘన. అందుకే అతను అలా రియాక్ట్ అయ్యాడు. మనం ఒకళ్ళని ప్రేమించాం అంటే అర్ధం వాళ్ళతో పడుకోవటం కాదు. వాళ్ళకి నచ్చినట్టు కూడా కొన్ని మన పద్ధతులు మార్చుకోవాలి. ఇప్పుడు మా వాడిని చూడు మా ఇద్దరికీ అసలు గొడవలు రావు అనుకుంటున్నావా ఏంటి? ఇద్దరికీ ఏదోక గొడవ ఉంటూనే ఉంటుంది. కాకపోతే వాడికి నచ్చకపోతే నేను మార్చుకుంటాను. నాకు నచ్చకపోతే వాడు మార్చుకుంటాడు. సో ఇదే లైఫ్ అంటే. కలిసి ఉండాలి అంటే కాంప్రమైస్ అయ్యి బ్రతకాలి మేఘన. అది ఇప్పుడు నీకు అర్ధం అవ్వకపోవచ్చు ముందు ముందు అర్ధం అవుతుంది.” అంది ప్రియా
మేఘన మెల్లగా ఆలోచనలో పడింది. నిజంగా ఆ రోజు తప్పు తనదే. జాన్ అన్నట్టు ఊరి నుండి వచ్చిన తర్వాత లైవ్ చేసినా కూడా ఈ రోజు ఇద్దరు ఇలా విడి విడిగా ఉండేవాళ్ళు కాదు. కళ్ళ ముందు జాన్ తో కలిసిన మూమెంట్స్ అన్నీ మెదిలాయి.
“ఇప్పుడు ఏం చేయాలి?” అంది మేఘన మెల్లగా
“ఒకసారి జాన్ కి కాల్ చెయ్, అతను నీకు కాల్ చేయకపోవటానికి కారణం అతను నిన్ను కొట్టాడు అనే గిల్టీ ఫీలింగ్ ఒకటి, నువ్వు అతను జాబ్ కోసం చేస్తున్న ట్రైల్స్ ని ఎగతాళి చేయటం. తన ప్రాణం అనుకున్న నువ్వే అతని ప్రయత్నం గురించి అలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పు. పాపం నీ ఫోన్ కోసమో, మెసేజ్ కోసమో ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకసారి చేసి మాట్లాడు. తర్వాత ఈ విషయం చెప్పు. తనకి ఇష్టం అనుకుంటేనే ముందుకి వెళ్ళు” అంది ప్రియా
“హ్మ్ సరే ప్రియా కాసేపాగి కాల్ చేస్తాను” అంది.
“సరే ఈ రోజు నైట్ కి నేను, కిషన్ ముంబై వెళ్తున్నాం. ఇది స్పేర్ కీ నీ దగ్గర పెట్టుకో” అంది
“అదేంటి సడెన్ గా” అంది
“కిషన్ వాళ్ళ నాన్న గారికి కొంచెం ఆరోగ్యం బాలేదు అంట చూద్దామని వెళ్తున్నాం” అంది
“అయ్యో ఏం కాదులే, మీరు టెన్షన్ పడకండి” అంది
“మాకు టెన్షన్ ఏం లేదు అక్కడ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. దీని డాక్టర్ మాత్రం వేరే చోట ఉన్నాడు. ముందు అతనితో మాట్లాడు” అంటూ మేఘన గుండె మీద చేయి వేసి చెప్పింది.
“థాంక్స్ ప్రియా” అంది మేఘన.
కాసేపటికి ముగ్గురు తినేసారు. 9 అవుతుంది అనగా కిషన్, ప్రియా వాళ్ళు వెళ్లిపోయారు. మేఘన తన రూమ్ లోకి వచ్చి ఫోన్ తీసుకొని జాన్ నెంబర్ టైప్ చేసింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అసలు తనకి లైవ్స్ ఏ ఇష్టం లేదు. అలాంటిది వద్దు అంటే ప్రియా చెప్పినట్టు నన్ను నేను మార్చుకుని ఆగిపోవాలా? అనుకుంది. ముందు మాట్లాడదాం అని కాల్ చేసింది. రింగ్ అవుతుంటే తన గుండె చప్పుడు తనకే వినపడుతుంది. వెంటనే అటు సైడ్ నుండి కాల్ కట్ చేసినట్టు అనౌన్స్మెంట్ వచ్చింది.
అదేంటి కట్ చేసాడు అనుకుంది. పొరపాటున చేయి తగిలింది ఏమో అని మళ్ళీ చేసింది. అప్పుడు కూడా కట్ చేసాడు. ఒక పది సెకండ్స్ ఆగి మళ్ళీ చేసింది. ఈ సారి కాల్ లిఫ్ట్ అయింది.
“హలో” అంది మేఘన
“హేయ్……. కాల్ కట్ చేస్తుంటే అర్ధం కావట్లేదా?” అన్నాడు సీరియస్ గా జాన్
