“పోయిన కంపెనీ లో 3 నెలలకే ఎందుకు మానేసారు?” అంటూ HR నుండి ప్రశ్న వచ్చింది.
దానికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాలేదు మళ్ళీ జాన్ కి. కాసేపటికి
“ఓకే జాన్, వి విల్ గెట్ బ్యాక్ టూ యు” అన్నాడు HR.
జాన్ నీరసం మొహం వేసుకుని బయటకు వచ్చాడు. రోజు కాళ్ళు అరిగేలా ఉద్యోగం కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఒకడు మధ్యలో ఎందుకు మానేసావ్? అంటాడు. అలా అని చేసిన ఎక్స్పీరియన్స్ తీసేస్తే, మళ్ళీ వాళ్ళే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఇలా తిప్పుకుంటూనే ఉన్నారు. తల బద్దలు అయిపోతుంది అని మెల్లగా పక్కనే ఉన్న టీ షాప్ లోకి టీ అడిగాడు.
“రేయ్ జాన్” అంటూ పలకరించాడు ఇన్స్టిట్యూట్ ఫ్రెండ్ అయిన మనోహర్.
“హాయ్ రా మనోహర్ ఎలా ఉన్నావ్? అయినా నువ్వెంటి ఇక్కడ?” అన్నాడు జాన్ ఆశ్చర్యం గా
“ఈ షాప్ నాదేరా” అన్నాడు మనోహర్.
వెంటనే ఇద్దరికీ రెండు కాఫీలు చేసుకుని, షాప్ లో కుర్రోడికి చూసుకోమని చెప్పి పక్కకి వచ్చాడు.
“ఏంట్రా ఎలా ఉంది నీ లైఫ్? మేఘన ఎలా ఉంది?” అన్నాడు.
“మేఘన బాగుంది రా, కానీ ప్రెసెంట్ లైఫ్ మాత్రం గందరగోళంగా ఉంది. జాబ్ కోసం తిరుగుతూనే ఉన్నాను” అన్నాడు జాన్ కాఫీ తాగుతూ
“ఏంట్రా ఇంకా జాబ్ దొరకలేదా?” అన్నాడు మనోహర్
“లేదు రా” అంటూ జాబ్ ఎలా పోయిందో మొత్తం చెప్పాడు జాన్
“ఆ మోసపోయిన వాళ్లలో నువ్వు కూడా ఉన్నావా? నేను కూడా ముందు ఇంటికి వెళ్ళా కదా, 2 నెలలు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను. మా ఇంట్లో గొడవ చదివి ఏం చేస్తున్నావ్ అంటూ, ఇంక హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం చాలా ట్రై చేసాను రాలేదు. ఇంక ఇలా అవ్వదు అని మన రవి గాడికి కాల్ చేసాను. నేను కూడా డబ్బులు అరేంజ్ చేసుకుంటాను అని. వాడు సరే అన్నాడు. ఇంక నేను ఇంటికి వెళ్లి లక్ష అడిగితే బాగోదు అని అబద్దం చెప్పి 3 లక్షలు తీసుకొని వచ్చా. మా నాన్న తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టి అప్పుడు డబ్బులు ఇచ్చాడు. హైదరాబాద్ వచ్చి వాడికి ఫోన్ చేస్తే విషయం తెలిసింది. అలా జాయిన్ అయిన వాళ్ళని తీసేసారు అని. అప్పుడు అనిపించింది హమ్మయ్య కొంచెం లో బ్రతికిపోయాను అని. అప్పుడు చేతిలో ఉన్న 3 లక్షలతో ఏం చేద్దామా అని ఆలోచించాను. నాకు ఎటు తిరిగి కాఫీ, టీ చేయటం బాగా వచ్చు. మా అమ్మ దగ్గర నేర్చుకున్న. ఇంక అదే బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఇలా జాబ్స్ కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యి ఇది మొదలుపెట్టాను” అన్నాడు మనోహర్
అదంతా శ్రద్ధగా విన్న జాన్
“అయినా ఇంత చదువు చదివి కాఫీ, టీ అమ్ముకోవటం ఏంట్రా?” అన్నాడు జాన్
“దేనిని అలా తీసి పారేయాకు మామ, నువ్వు ఇన్ని రోజులు కష్టపడి తిరిగావు కదా ఒకవేళ జాబ్ వచ్చినా నీకు ఎంత వస్తుంది అనుకుంటున్నావు శాలరీ?” అన్నాడు మనోహర్
“20 నుండి 30 లోపు అనుకుంటున్నాను” అన్నాడు జాన్
“నేను రోజుకి అన్నీ ఖర్చులు పోను 10 వేలు సంపాదిస్తా” అన్నాడు మనోహర్.
అది విని షాక్ అయ్యాడు జాన్
“ఒక్కటి గుర్తు పెట్టుకోరా ఎప్పటికి జాబ్ అనేది ఒకడి కింద బానిసత్వం చేయటమే. అదే నువ్వే సొంతంగా బిజినెస్ పెడితే నీ లైఫ్ కి నువ్వే కింగ్ వి. అయినా లంజతనం, దొంగతనం చేయకుండా ఏం చేసి సంపాదించినా తప్పు కాదు మామ, ఇది నీకు ఇప్పుడు అర్ధం కాదులే. అర్ధం అయిన రోజు ఇలా ఆలోచించవు” అన్నాడు మనోహర్.
మనోహర్ మాటలు జాన్ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసాయి. మనోహర్ చెప్పింది నిజమే ఇప్పటివరకు మేఘన, జాన్ ఆధునిక లంజతనం చేసి డబ్బులు సంపాదించారు. అది తప్పే అని అనుకున్నాడు జాన్ అందుకే ఆ లంజతనాన్ని వదిలేసాడు. ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటే జాబ్ ఒక్కటే మార్గం కాదు అని ఇప్పుడు మనోహర్ వల్ల తెలిసింది.
సాయంత్రం వరకు అవే ఆలోచనలు. మెల్లగా జాన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే తన ఫోన్ తీసుకొని మనోహర్ కి కాల్ చేసాడు.
“రేయ్ నాకు కూడా ఏమన్నా ఐడియా చెప్పరా, జాబ్స్ కోసం తిరిగి తిరిగి పిచ్చోణ్ణి అయిపోతున్నా” అన్నాడు
