ఫోటో షూట్ అయ్యి రెండు రోజులు గడిచింది. ఆ మరుసటి రోజు వినోద్ నుండి కాల్ వచ్చింది.
“హాయ్ మేఘన” అన్నాడు వినోద్
“హాయ్ వినోద్” అంది మేఘన
“కంగ్రాట్స్ నీ ప్రొఫైల్ ఒక 3 స్టూడియోస్ సెలెక్ట్ చేసాయి” అన్నాడు వినోద్
అది విని మేఘన సంతోషపడిపోయింది.
“థాంక్యూ వినోద్, ఇప్పుడు నేను వాటిల్లో ఒకటి యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందా?” అంది
“నో మేఘన అప్పుడు 5 లక్షలు కూడా రావు” అన్నాడు వినోద్
“అదేంటి?” అంది మేఘన
“మూడిటిని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడే నువ్వు అనుకున్న 20 లక్షల అమౌంట్ వస్తుంది” అన్నాడు.
“కానీ మూడు అంటే ఎలా ఒకేరోజులో అవ్వదు కదా?” అంది
“ఒక్కరోజులో కాదు, వన్ వీక్ ఉంటుంది మొత్తం షెడ్యూల్. అందుకే మొదట్లో చెప్పాను. నెలలో రెండు వారాలు పని చేసిన చాలు అని” అన్నాడు వినోద్
అప్పుడు అర్ధం అయింది మేఘన కి. “హ్మ్, సాయంత్రం లోపు ఏ విషయం చెప్తాను వినోద్” అంది.
“సరే లేట్ చేయకు, మళ్ళీ వాళ్ళ మైండ్ మారిపోతుంది” అన్నాడు.
“హ్మ్” అంది.
మనసులో ఎందుకో కొంచెం భయంగా అనిపించింది. ఇప్పటివరకు లైవ్స్ కి కూడా ఎప్పుడు భయం అనిపించలేదు కానీ ఎందుకో ఇప్పుడు మాత్రం ధైర్యం లేదు. మనసులో తప్పు చేస్తున్న భావన వచ్చింది. సాయంత్రం వరకు ఇదే ఆలోచన ఒకసారి ప్రియా అభిప్రాయం తీసుకుందామా అనుకుంది కానీ వినోద్ అసలు ఈ మ్యాటర్ ప్రియా కి చెప్పొద్దు అన్నాడు అని ఆగిపోయింది. మళ్ళీ కాసేపు ఆలోచించి ప్రియా దగ్గరికి వెళ్ళింది.
“ప్రియా నీతో కొంచెం మాట్లాడాలి?” అంది మేఘన
“చెప్పు మేఘన?” అంది ప్రియా
“నేను కొత్త వర్క్ చూసుకుంటున్నాను అని చెప్పా కదా ఇందాకే సెలెక్ట్ అయ్యాను అని కాల్ చేసారు” అంది
“కంగ్రాట్స్, ఇంతకీ ఏం వర్క్?” అంది
“దాని గురించి అప్పుడే డీటెయిల్స్ చెప్పకూడదు. టైం వచ్చినప్పుడు చెప్తాను” అంది
“కొంపదీసి ఏమన్నా పోర్న్ వీడియోస్ లో చేస్తున్నావా ఏంటి?” అంది
అది విని మేఘన ఒక్కసారి గా భయపడింది. కానీ ఆ భయాన్ని దాచుకుని
