న్యూ హ్యాపీ ఎండింగ్ Part 25 46

సంతోష్ నిచ్చెన దిగి తన బ్యాగ్ తీసుకుని మెల్లగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు.

ఆ శబ్దానికి పూర్ణ, శ్రీకాంత్ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చారు. సంతోష్ వచ్చాడేమో అని పూర్ణలో కంగారు మొదలైంది.

“ష్… నేను చూసుకుంటాను” అంటు అక్కడ నుండి మెయిన్ డోర్ వైపు వెళ్ళాడు శ్రీకాంత్.

డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా సంతోష్ నిలబడి ఉన్నాడు.

“ఎలా ఉన్నావ్ శ్రీకాంత్?” అన్నాడు సంతోష్ మెల్లగా

“బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్?” అన్నాడు శ్రీకాంత్ మెల్లగా నవ్వుతూ

“బాగున్నాను” అన్నాడు సంతోష్

“ఫ్రెష్ అయ్యి రా నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు శ్రీకాంత్

“హ్మ్” అంటూ తన రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యాడు సంతోష్.

అటు శ్రీకాంత్ కూడా బ్రష్ చేసాడు, పూర్ణతో కూడా దగ్గరుండి బ్రష్ చేయించాడు. సంతోష్ ఫ్రెష్ అయి రాగానే తన కార్ లో ఇద్దరినీ మంచి హోటల్ కి తీసుకొని వెళ్ళాడు. తింటానికి టిఫిన్ ఆర్డర్ చేసాడు. పూర్ణ మొదట్లో ఏం ఆకలి లేదు అంది కానీ శ్రీకాంత్ తిను అన్నట్టుగా బ్రతిమాలటంతో మెల్లగా తినటం మొదలుపెట్టింది.

అక్కడ నుండి మెల్లగా తిరిగి ఇంటికి వచ్చారు. సంతోష్ తన గదిలోకి వెళ్ళాడు. శ్రీకాంత్ వెంటనే పూర్ణని తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.

“కాసేపు నిద్రపొరా బంగారం” అన్నాడు మెల్లగా

పూర్ణ ఏం మాట్లాడకుండా శ్రీకాంత్ ని గట్టిగా వాటేసుకుంది.

“నేను కూడా పడుకోనా?” అన్నాడు మెల్లగా నవ్వుతూ

“హ్మ్” అంది పూర్ణ

మెల్లగా ఇద్దరు బెడ్ మీదకి చేరారు. పూర్ణ గట్టిగా శ్రీకాంత్ గుండెలని హత్తుకుని పడుకుంది. శ్రీకాంత్ తన చేతులతో పూర్ణ తల నిమురుతూ ఉన్నాడు. కాసేపటికి పూర్ణ మెల్లగా నిద్రలోకి జారుకుంది.

పూర్ణ నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక శ్రీకాంత్ మెల్లగా బెడ్ మీద నుండి దిగి బెడ్ రూమ్ నుండి బయటకి వచ్చాడు. సంతోష్ బెడ్ రూమ్ డోర్ మీద తట్టాడు. కాసేపటికి సంతోష్ డోర్ ఓపెన్ చేసాడు.

“నీతో మాట్లాడాలి” అన్నాడు శ్రీకాంత్

“ఇందాకే మాట్లాడాలి అన్నావ్ తర్వాత బయటకి తీసుకొని వెళ్ళావ్. చెప్పు శ్రీకాంత్” అన్నాడు సంతోష్

“ఏం జరిగిందో నీకు తెలిసే ఉంటుంది” అన్నాడు శ్రీకాంత్

అది విని సంతోష్ ఏం మాట్లాడలేదు.

“వాళ్ళతో గొడవ జరుగుతున్నప్పుడు చూసాను నువ్వు గొడవ వెనుక ఉండి చూడటం. అక్కడ ఏం చేస్తున్నావ్ అని నేను అడగను. కానీ ఇప్పుడు పూర్ణకి నా అవసరం ఉంది. అర్ధం చేసుకోలేనంత చిన్నవాడివి కాదు. తనని కొన్ని రోజులు అలా బయటకు తీసుకొని వెళ్తాను” అన్నాడు శ్రీకాంత్

“హ్మ్ సరే” అన్నాడు సంతోష్ మెల్లగా

“ఇక నుండి మీ లైఫ్ ఇలా ఉండదు. మొత్తం మారుతుంది డోంట్ వర్రీ” అన్నాడు శ్రీకాంత్ తన చేతిని సంతోష్ భుజం మీద వేసి.

“థాంక్యూ శ్రీకాంత్” అన్నాడు సంతోష్ మెల్లగా.

శ్రీకాంత్ ఇంకేం మాట్లాడకుండా అక్కడ నుండి మళ్ళీ పూర్ణ బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు. ఖాళీగా ఉన్న బ్యాగ్ తీసుకుని కొన్ని చీరలని దాంట్లో సర్దాడు. షెల్ఫ్ లో పూర్ణ జీన్స్, వైట్ షర్ట్ కూడా కనపడటంతో దానిని కూడా చేతిలోకి తీసుకొని బ్యాగ్ లో సర్దాడు. కాసేపటికి తన కార్ లో ఇంటికి వెళ్లి తన లగేజ్ కూడా తీసుకుని ఇంట్లో వేరే పని మీద ఊరికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుండి పూర్ణ ఇంటికి వచ్చాడు. వచ్చేదారిలో బిర్యానీ తీసుకొని వచ్చాడు.

సాయంత్రం 3 అవుతుంది అనగా పూర్ణకి మెలుకువ వచ్చింది. లేచి చూస్తే శ్రీకాంత్ తన పక్కనే పడుకుని తననే చూస్తూ ఉన్నాడు.

“నిద్ర పోయావా అసలు” అంది మెల్లగా

“లేదు, నిన్ను చూస్తూ అలానే ఉన్నాను” అన్నాడు.

అది విని పూర్ణ పెదాల మీద చిన్న నవ్వు వచ్చింది.

“పద తిందాం” అన్నాడు

“ఒక్క క్షణం ఆగు, అయినా సంతోష్ ఉన్నాడు కదా అసలు ఇలా ఎలా ఉన్నావ్?” అంది పూర్ణ మెల్లగా

“మన ఇద్దరి విషయం సంతోష్ కి అర్ధం అయ్యేలా చెప్పాను” అన్నాడు శ్రీకాంత్

“ఏంటి?” అంది పూర్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి

“హ్మ్.., తను అర్ధం చేసుకున్నాడు. ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు శ్రీమతి గారు” అన్నాడు మెల్లగా నవ్వుతూ

అది విని పూర్ణ మనసు ఇంకాస్త కుదుటపడింది.

“ముందు ఆకలి వేస్తుంది పద” అన్నాడు మెల్లగా

“హ్మ్” అంది పూర్ణ మెల్లగా

ఇద్దరు లేచి హల్ లోకి వెళ్లారు. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద సంతోష్ ప్లేట్స్ సర్దుతూ ఉన్నాడు. ఎందుకో ఒక్కసారిగా పూర్ణకి సిగ్గుగా అనిపించింది.

శ్రీకాంత్ మెల్లగా అక్కడ నుండి కిచెన్ లోకి వెళ్ళాడు. సంతోష్ తన తల్లి పూర్ణ దగ్గరికి వచ్చి

“శ్రీకాంత్ అంతా చెప్పాడు అమ్మ, నేనేమన్నా అంటాను అని టెన్షన్ పడకు. నాకు తెలుసు యు ఆర్ ది బెస్ట్ మమ్మీ” అన్నాడు మెల్లగా

అది విని పూర్ణ మెల్లగా నవ్వింది. సంతోష్ నుదిటి మీద ముద్దు పెట్టింది. శ్రీకాంత్ వాటర్ బాటిల్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. మెల్లగా ముగ్గురు తినటం పూర్తి చేసారు.

“8 కి మన జర్నీ” అన్నాడు శ్రీకాంత్

“ఎక్కడికి?” అంది పూర్ణ

“సరదాగా అలా ట్రిప్ కి” అన్నాడు

“మరి శ్రీకాంత్ కి కాలేజీ ఉంది గా” అంది

“అందుకే నేను రావట్లేదు, మీ ఇద్దరే వెళ్తున్నారు” అన్నాడు శ్రీకాంత్

“అదేంటీ?” అంది పూర్ణ షాక్ అవుతూ

“నువ్వు అలా అన్నిటికి షాక్ అవ్వకు” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ

“నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను అమ్మ, మీరు వెళ్లి రండి” అన్నాడు సంతోష్