పార్టనర్ సెక్సీ వైఫ్ 8 33

నువ్వు భయపడకు అని చెప్పి అనన్య కార్ స్టార్ట్ చేసింది. రాత్రి అంతా ఆ అమ్మాయిని ముంబై అంతా తిప్పి తనకి ఇష్టం అయినవి అన్నీ కనిపించి ఉదయం తనని డ్రాప్ చేయడానికి వెళ్తుంటే తను ఏడుస్తూ అన్నా నాకు వెళ్ళాలి అని లేదు ప్లీజ్ మీతో ఉంటాను మీ ఇంట్లో పని చేస్తాను చదువుకుంటాను అని ఏడ్చింది. అనన్య చాలా బాధ పడి కచ్చితంగా తీసుకెళ్తా తొందరలో అని చెప్పి లోపలకి పంపింది. మేము కార్ ఇచ్చేసి తనతో ఇప్పటికీ అయినా నమ్ముతావా అన్నాను. తను ఇప్పుడు నేను చాలా బాధ లో ఉన్నాను ఆఫీస్ లో కలుద్దాం అని వెళ్ళింది. నేను కూడా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్లగానే పడుకున్న. మధ్యాహ్నం లేచి చూస్తే ఫోన్ లో p. వర్ష మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏమైంది అబ్బా అని ఫోన్ చేశాను. తను లిఫ్టు చేయడం లేదు. సరే ఆఫీస్ లో ఉందేమో అని ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాను. మధ్యలో అనన్య కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడిగాను. ఇంట్లో అంది. ఆఫీస్ కి రాలేదా అని అడిగాను. రాత్రి అలిసిపోయాను కదా అందుకే రెస్ట్ లో ఉన్నా అంది. సరే రెస్ట్ తీసుకో అని చెప్పి పెట్టేసాను. ఇక ఆఫీస్ కి వెళ్తుంటే ఒక కొత్త నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరూ అని లిఫ్ట్ చేస్తే p. వర్ష మా దగ్గర ఉంది తనని కలవాలి అంటే నీ ఫోన్ కి పంపిన అడ్రస్ కి రా అన్నాడు. నాకు తనతో ఏమీ పని లేదు ఏమైనా చేసుకో అన్నాను. అవునా అయితే తనని చంపేస్తాం అన్నాడు. అది మీ ఇష్టం అన్నాను. నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా అన్నాడు. తను ఏమీ నా పెళ్ళాం కాదు లవర్ కాదు దానికి మొగుడు ఉన్నాడు వాడికి చేసుకో అని కట్ చేశాను.

తను రాత్రి నాకు చేసిన హెల్ప్ ఏమైనా తెలిసిపోయింది అనే డౌట్ వచ్చింది. అనన్య కి ఫోన్ చేసి విషయం చెప్పాను. తను అవునా ఒకసారి నీకు వచ్చిన నంబర్ చెప్పు ట్రేస్ చేపిస్తా అంది. సరే అని పంపిన. ఆఫీస్ కి వెళ్ళిన తరువాత తను ఫోన్ చేసి ఏమి టెన్షన్ పడకు అది మా నాన్న మనుషులే తను చాలా సేఫ్ గా ఉంది నువ్వు ఒకసారి ఇంటికి రా అంది. సరే అని వెళ్ళాను. అక్కడ p. వర్ష, నర్మద ఇద్దరూ టీవీ చూస్తూ ఉన్నారు. నేను వెళ్లి ఏంటి మేడం ఇది అన్నాను. నీకు ఇచ్చిన టైమ్ అయిపోతుంది కదా నువ్వు ఏది పట్టించుకోవడం లేదు అందుకే రమేష్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంది అంది. ఇంకా ఉంది కదా టైమ్ అప్పట్లో గా ఏదో ఒకటి చేస్తాను అన్నాను. నీకు ఎలా తెలుసు వర్ష ఇక్కడే ఉంది అని అంది. మీకే చెప్పాలి అనుకుని వచ్చాను తనని ఎవరో కిడ్నాప్ చేశారని చూస్తే ఇక్కడే ఉంది అన్నాను. అయినా నువ్వు రావు అనుకున్న అంది. రావలసి వచ్చింది అన్నాను. సరే ఇంకో రెండు రోజులు చూసుకో ఏదో ఒకటి చేయాలి అంది. సరే అని బయటకి వచ్చాను. అనన్య బయట కలిసి నువ్వు దగ్గరలో ఉన్న కాఫీ షాప్ లో వెయిట్ చెయ్ వస్తాను అంది. నువ్వు ఆఫీస్ కి రావా అన్నాను. ఇప్పుడు ఏమి ఆఫీస్ రేపు వస్తా వెయిట్ చేస్తు ఉండు అంది. సరే అన్నాను. కాఫీ షాప్ లో కి వెళ్ళాక p. వర్ష కి ఫోన్ చెద్దమా అనుకున్న కానీ ఇప్పుడు వద్దులే అని సైలెంట్ అయ్యాను. ఒక అరగంట కి అనన్య వచ్చింది. తను నీకు మా డాడీ నీ కలిపిస్తా ఏదో ఒకటి సెట్ చేసుకో అంది. థాంక్స్ అన్నాను. సరే పదా అంది. ఇద్దరం వాళ్ల డాడీ ఆఫీస్ కి వెళ్ళాము. అక్కడకి వెళ్ళాక తను వెయిట్ చెయ్ వస్తా అని లోపలకి వెళ్ళింది. నేను అక్కడ కూర్చున్న. కొంత సేపటికి తను వచ్చి లోపలకి తీసుకెళ్ళింది. ఆయన గుర్తు పట్టాడు నువ్వు మైనింగ్ చేస్తావు కదా అన్నాడు. అవును సార్ అన్నాను. విషయం ఏమిటి అన్నాడు. రమేష్ గురించి చెప్పాను. ఆయన నాతో నాకు రమేష్ చాలా సంవ్సరాలుగా తెలుసు పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు కానీ నీ కోసం నేను ఎందుకు చేయాలి అన్నాడు. మీరే అలా అంటే ఎలా సర్ అన్నాను. ఆయన అనన్య ని బయటకి వెళ్ళమని చెప్పి సీ యంగ్ మ్యాన్ రాజకీయాలు అంటే డబ్బులే కాదు చాలా ఉంటాయి, రమేష్ అడుగుతుంది షేర్ అంతే కదా ఇవ్వు అన్నాడు. నాకు ఆయనతో పాటు బిజినెస్ చేయడం ఇష్టం లేదు అన్నాను. సరే నువ్వు ఏమి చేయాలి అనుకుంటున్నావు అన్నాడు. నేను కష్టపడ్డా కదా సర్ అలా ఎలా ఈజీగా ఇచేస్త అన్నాను. సీ మ్యాన్ నీకు మైనింగ్ కంపెనీ లో మేము ఎలాంటి డబ్బులు తీసుకోకుండా ఇచ్చాము కావున వాటికి అయ్యే డబ్బులు నాకు ఇచే బదులు రమేష్ కి ఇవ్వు సెట్ అవుతుంది అన్నాడు. సరే అన్నాను. ఒకే డబ్బులు సెట్ చేసుకుని కలువు నేను రమేష్ ని పిలిపిస్తా అన్నాడు. అమౌంట్ ఎంతనో చెప్పండి అన్నాను. రెండు కోట్లు లోగానే ఉంటుంది అన్నాడు. అయితే ఇప్పుడే పిలిపించండి అన్నాను.