ఆమె ఫోన్ పెట్టేసి భర్త కి చెప్పింది.
“నాకు కుదరడం లేదు,ఒక పని చెయ్యి.నేను మిల్లు అడ్రస్ ఇస్తాను నువ్వు చూస్తూ ఉండు”అన్నాడు.
ఆమె తల ఊపింది.
అదే రోజు ఆఫిస్ లో పని చూసుకుని,పదకొండు న్నార అవుతూ ఉంటే,మిల్ వైపు స్కూటీ తిప్పింది.
ఎండ బాగ ఉంది,చాలా మంది కూలీలు బస్తాలు మోస్తున్నారు.
“ఇక్కడ కొండయ్య ఉంటాడు”అంది ఒక కూలీ తో.
“వాడా,,రెండో షెడ్ వద్ద ఉంటాడు”అన్నాడు వాడు.
మధురిమ అటు నడిచింది,ఆ షెడ్ ముందు కొందరు బీడీ కాలుస్తూ,పేకాట ఆడుతున్నారు.
వాళ్ళలో నిక్కర్,బనీన్ లో ఉన్న కొండయ్య ను చూసి గుర్తు పట్టింది మధురిమ.
వాడు ఆమె వైపు చూసాక పలకరింపుగా నవ్వింది.
వాడు కూడా గుర్తు పట్టి లేచి,వెళ్తుంటే”ఎవరు ఇది”అడిగాడు ఒక కూలీ.
“మా ఊరిలో శా.స్త్రి గారు అని ఉన్నారు, వాళ్ల కోడలు”అన్నాడు వాడు.
వాడు ఆమె వద్దకు వెళ్లి”మీరు ఇక్కడికి వచ్చారేమిటి”అన్నాడు బీడీ పొగ వదులుతూ.
“మీ నాన్నగారు,మిమ్మల్ని చూడమన్నారుట,ఆయనకి కుదరడం లేదు.
అందుకే నేను వచ్చాను”అంది నవ్వుతూ.
“నేను పిల్లోడిని కాదు,అయినా నేను మా అయ్య మాటే వినను “అన్నాడు నిర్లక్ష్యం గా.
ఆమె తల ఊపి”ఆయన్ని అన్నా అంటావు కదా”అంది
“అది చిన్నపుడు,మూడేళ్ల నుంచి వేరే పొలాల్లో చేశాను పని”అన్నాడు.
ఆమె “సరే,,నీకు అవసరం అయితే,నన్ను వదిన అనుకుని హెల్ప్ అడుగు”అని అడ్రస్ కాగితం ఇచ్చింది.
ఆమె నుదుట బొట్టు, ముక్కుపుడక చూసి”మీ ఇద్దరికీ కొన్ని తెలియవు.నేను వేరే మతం అమ్మాయిని చేసుకుని,మతం మారాను.”అన్నాడు.
“అయితే”అంది అర్థం కానట్టు.
“అప్పటి నుండి మీ మామగారి వద్ద పని చేయడం లేదు”అన్నాడు.
వాడి చేతిలో బీడీ చూసి”నిన్ను శా.స్త్రి గారు మందలించారు,నేను చూసాను.”అంది నవ్వి.
వాడు పొగ మధురిమ మొహం మీద వదులుతూ”గుట్కా కూడా తింటాను,నా ఇష్టం”అన్నాడు.
ఆమెకి కోపం వచ్చింది కానీ తమాయించుకుని”సరే,,ఉండేది ఎక్కడ “అంది.
“ఆ పాకల్లో”అని చూపించాడు.
సూపర్వైజర్ పిలిస్తే వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళాక,జరిగింది మామగారికి మేసేజ్ చేసింది.
“నాకు తెలుసు ,వాడికి పొగరు ఎక్కువ.అందుకే వాడి పెళ్ళాం పుట్టింటికి పోయింది”అని రిప్లై ఇచ్చారు.
వారం రోజుల తర్వాత,ఆమె ఆఫిస్ నుండి వస్తూ,సిగ్నల్ వద్ద ఆగింది.
పక్కనే ఆగిన జీప్ లో,కొండయ్య ను చూసింది.
“ఏమైంది”అంది వింతగా.
“కల్లు తాగి,,డబ్బు అడిగితే కొట్టాడు ట”అన్నాడు పోలీ.స్ గార్డ్.
ఇంటికి వెళ్ళాక భర్త కి చెప్పింది.
“ఏడవని, వాడొక వెధవ”అన్నాడు జయ్.
మర్నాడు ఉదయం మధురిమ పూజ గది నుండి వస్తుంటే భర్త ఫోన్ మోగింది.
అతను లేకపోయేసరికి తీసి చూసింది.
“అమ్మగారు నేను”అన్నాడు కొండయ్య తండ్రి.
“చెప్పు”అంది
“వాడిని లోపలేశారు ట.నేను అక్కడికి రాలేను.విడిపిస్తార”అన్నాడు.
ఆమె ఆలోచించి”డబ్బు ఖర్చు అవుతుందేమో”అంది.
“మీరు ఎంత అయ్యిందీ చెప్తే,నేను శా.స్త్రి గారికి ఇస్తాను.”అన్నాడు.
“మామగారికి వద్దు.మా అడ్రస్ కి పోస్ట్ చెయ్యి”అంది.
తర్వాత భర్త కి చెప్పింది విషయం.
“నాకు కుదరదు.నువ్వు చూసుకో”అన్నాడు విసుగ్గా.
ఆమె ఆఫిస్ కి వెళ్ళే ముందు స్టేషన్ కి వెళ్ళింది.
రాత్రి బాగా వర్షం కురవడం తో,,బురదగా ఉన్నాయి రోడ్లు.
చలిగాలి వీస్తోంది.
ఆమె లోపలికి వెళ్ళేసరికి,ఒక ముసలి లేడీ గార్డ్ ఉంది.
“ఏమిటి విషయం”అంది బొంగురు గొంతు తో.
మధురిమ విషయం చెప్తే,కింద నుండి పైకి చూసి”లక్షణం గా ఉన్నావు.వీడితో ఏమిటి నీకు పరిచయం”అంది.
“మా వారి ఊరిలో ఉంటారు వీళ్ళు”అంది చిన్నగా నవ్వి.
“ఆ లాకప్ లో ఉన్నాడు,ఐదు వందలు ఇమ్మంటే లేవు అన్నాడు”అంది.
తాళం తీసే ఉండేసరికి లోపలికి వెళ్ళింది మధు.
