శశి శ్యామ్ 470

అంత లో శశి ముందు కి వొచ్చి ఒక సెక్యూరిటీ అధికారి జీప్ ఆగింది.

అందులోంచి కానిస్టేబుల్ దిగి శశి కి సెల్యూట్ చేసి రండి మేడమ్ అని ఆహ్వానించాడు.

అప్పుడు అర్ధం అయింది శ్యామ్ కి మన శశి ఆ ఏరియా కి కొత్తగా ఒచ్చిన S.I అని.

కుమార్ : రేయ్ ఆపరా బాబు జరిగింది చెప్తున్నావా జడిపించటానికి చెప్తున్నావా…… గుండెల్లో గుంతలకడి గుల గుల మని బీట్స్ వస్తున్నాయి రా నువ్ చెప్పింది వింటుంటే.

శ్యామ్ : అలా నా కలల రాణికి దూరం ఐపోయాను.

కుమార్ : కలల రాణి అంట…. ఈసారి కనిపిస్తే కాల్చి పడేద్ది.

శ్యామ్ : మళ్ళీ కనిపిస్తాది అంటావా రా.

కుమార్ : ఏమో నీ చావు తన చేతి లో ఉంటే కచ్చితంగా కనిపిస్తాది.

శ్యామ్ : ఆపు ర అపరిదుష్టుడ…..నోటి నుంచి మంచి మాటలు రావే.

కుమార్ : మరి….ఇంత జరిగాక తనకి కనిపించకుండా తిరగాలి అనుకోవాలి కానీ మళ్ళీ కనిపిస్తాది అంటావా అంటావేం.

శ్యామ్ : ఒరేయ్ కుమారు…. నేను ఎప్పుడైనా అమ్మాయిల తో మాట్లాడటం చూసావెంట్ర….అలాంటిది ఒక అమ్మాయికి వెళ్లి అలా ధైర్యం గా చెప్పాను అంటే ఎంత నచకుండా అలా చేస్తా చెప్పు.

కుమార్ : పోయే కాలం దాపురిస్తే అలాంటి ధైర్యాలే ఒస్తాయ్ లే.

శ్యామ్ : ఫ్రండ్ అంటే సపోర్ట్ లా ఉండాలి రా తలపోటు లా కాదు.

కుమార్ : ఈ విషయం లో సపోర్ట్ అన్నావ్ అంటే మొహం సపోటా ఐపోద్ది.

శ్యామ్ : అది సరే కాని *****పల్లి లో రూమ్ రెంట్ లు ఎలా ఉంటాయ్ అంటావ్.

కుమార్ : ఎందుకు

శ్యామ్ : తను అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉండి ఎం చేస్తాం రా…. మనం కూడా అక్కడికే.

కుమార్ : రేయ్ నీకు బ్రెయిన్ పనిచేస్తుందా….

శ్యామ్ : ఒక్క ఎగ్జాం హాల్ లో తప్ప ఎప్పుడు ఆన్ లోనే ఉంటాది కదరా….ఎమ్ అలా అడిగావ్.

కుమార్ : మరి లేకపోతే ఎం మాట్లాడుతున్నావ్….పెళ్లి ఐపోయింది అని చెప్తుంది కదా….దాని మొగుడు కూడా ఏ పొలిసో అయి ఉంటే ఎన్కౌంటరే.

శ్యామ్ : ఛా పిల్ల అలా చెప్పింది కాని నా మనసు చెప్తుంది రా తనకి పెళ్లి కాలేదు అని.

కుమార్ : రేయ్ బాబు నన్ను ఒదిలేయ్….

శ్యామ్ : ఎందుకో రా తను సెక్యూరిటీ అధికారి అని తెలిసినా నా పల్స్ లో ఎలాంటి చేంజ్ లేదు అంటే ట్రూ లవ్ ఏమో రా.

కుమార్ : నీతో ఉంటే నేను కూడా ఎన్కౌంటర్ లో పోతాను అని భయం గా ఉంది రా.

శ్యామ్ : ఎం చేసినా కలిసే చెయ్యటం అలవాటు కదరా…. అది కూడా అంతే.

3 Comments

  1. Arey neeku stories yemi doraka leda ilanti vedavapooku stories ni pist chesi maa mind dobbutundi.next time don’t post such worst stories

  2. Bro story bagundhi comedy ga saradhaga continue chyndi ilanti stories chadivi chala days avuthundhi

  3. Update please

Comments are closed.