శశి శ్యామ్ 470

ముత్తుక్కల్ సిరికుం నిలత్తిల్ తిట్టికుం నినైపై విధైకుం…పోన్మగల్ వందాల్ పొరుల్ కోడి తందాల్…పూ మీదై వాశల్ పొంగుమ్ తెనాగా

శ్యామ్ : ష్… రామచంద్ర ఏంట్రా పొద్దున్నే నీ అరవ పాటలు.

కుమార్ : అరవకుండా లేచి రెడీ అవ్వు…. కాలేజ్ కి పోయి పది రోజులు పైనే అయింది…..ఒకసారి పలకరించేసి ఒద్దం.

శ్యామ్ : రేపు వెళ్దాం లేరా

కుమార్ : ఈరోజు అయితే క్లాస్ లు లేవు అంట…. సెమినార్ ఎదో ఉంది అంట…. అటెండన్స్ పడ్తాది… ఎంటర్టైన్మెంట్ అవతాది అని మనోళ్లు అందరు బయలు దేరుతున్నారు.

శ్యామ్ : ఆ ముక్క ముందు చెప్పాలి కదరా తిక్క నా కొడక.

************************

శ్యామ్ : ఒరేయ్ డ్రైవర్ తియ్యరా బండి.

కుమార్ : రండి సార్ ఎక్కండి…. ఎక్కడికి వెళ్తారు.

శ్యామ్ : ఎరా ఎటకారమ…. పోని

కుమార్ : స్పీడ్ బ్రేకర్ మీద ఎగరెసియాలి నా కొడుకుని.

శ్యామ్ : హ్మ్ నీ జీను పాంట్ చూసి బుల్లెమ్మో…

కుమార్ : నా బండి లో పెట్రోల్ చూడు బుల్లోడోయ్.

శ్యామ్ : నియబ్బా నా శశి ని తలచుకుని ప్రశాంతంగా పాట కూడా పాడుకొనివ్వ….. ఎం చేస్తుందో ఏంటో నా డార్లింగ్.

కుమార్ : నీ శశి సంగతి తర్వాత ఇక్కడ పెట్రోల్ రేట్ ల కి మాడి మసి ఐపోతున్నాం…. తలో పైసా ఎస్కుంటే కాని బండి ముందుకి వెల్లదు.

శ్యామ్ : పైసా తో ఎం ఒస్తాది లే కాని ఈ పది ఉంచు…..ఏంట్రా బండి ఆపేసి మరి చూస్తున్నావ్.

కుమార్ : సిగ్గు లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్న.

శ్యామ్ : నువ్ సిగ్గు పడితే నే క్యూట్ గా ఉంటావ్ రా పద.

కుమార్ : తుహ్ నా బతుకు.

*****************************
ఇద్దరు కాలెజ్ కి వెళ్లారు

శ్యామ్ : ఒరేయ్ ఆ బ్యానర్ ఏంట్రా

కుమార్ : మహిళలు మన బావలు….రేయ్ మహిళలు మనకి బావలు అవతార ఎలా రా

శ్యామ్ : తుహ్ నియబ్బా…. మహిళలు మనోభావాలు….. ముఖ్య అతిధులు… మహిళా మండలి అధ్యక్షులు xxxxxx ఫెమినిస్ట్ xxxxxxx స్.ఐ శశికళ గారు….. ఆ రేయ్ నా శశి రా….

కుమార్ : ఏంటి

శ్యామ్ : నా శశి వస్తుంది రా నన్ను చూడటానికి.

కుమార్ : చూడటానికి వస్తుందో బొక్క లో పెట్టడానికి వస్తుందో ఎవరికి తెలుసు.

శ్యామ్ : అమ్మో ఇంకో అరగంట లో షో స్టార్ట్ అవతాది…. ఎల్లి ఫస్ట్ రో లో కుర్చీలు కాసియాలి.

*********************

3 Comments

  1. Arey neeku stories yemi doraka leda ilanti vedavapooku stories ni pist chesi maa mind dobbutundi.next time don’t post such worst stories

  2. Bro story bagundhi comedy ga saradhaga continue chyndi ilanti stories chadivi chala days avuthundhi

  3. Update please

Comments are closed.