వదినా! 2

జుట్టు పెరిగిపోవడం తో పోనీ టైల్ వేసుకున్నాను నేను. వైట్ మీద బ్లాకు డిజైన్ ఉన్న సల్వార్ వేసుకున్నాను నేను. చింటూ నావంకే ఆశ్చర్యంగా చూస్తూ ఆడుకుంటున్నాడు. సులోచన ఆంటీ తో ఆడుకోరా అంటూ నామీదకే వదిలింది. మా బావ ప్రమోద్ నన్ను సంభ్రమంగా చూస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు థాయిలాండ్ అంటూ అడిగాడు తను. ఇంకొక నెలలో వెళ్ళాలి అన్నయ్యా అంటూ సమాధానం చెప్పింది సులోచన. మీకేమైనా సపోర్ట్ కావాలంటే అడగండి నేను ఉన్నానని మర్చిపోకండి అన్నాడు ప్రమోద్. ఆ మరునాడు ప్రమోద్ బెంగుళూరు వెళ్ళిపోయాడు చింటూ ని వదిలేసి. వాడేమో నన్ను వదలడం లేదు సులోచన ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ పని ఉందని తప్పక వెళ్ళింది ఆఫీసు కి. వాడు నాతోనే ఆడుకుంటూ నన్ను ఆంటీ అంటూ నాతోనే ఉన్నాడు ఆరోజంతా. వాడికి అన్నం తినిపించి నిద్రపుచ్చుదామనుకుంటే వాడు నాప్రక్కనే పడుకుంటాను అన్నాడు. వాడిని నా ప్రక్కలో పడుకోబెట్టుకున్నాను వాడి స్పర్శ నాకో అనుభూతి గా అనిపించింది. ప్రమోద్ రెండు రోజుల్లో వచ్చేశాడు. చింటూ తనతో విజయవాడ వెళ్లనని మారాం చేస్తుంటే నాకు కూడా వాడిని వదిలి ఉండటం కష్టం అనిపించింది రెండు రోజులకే. నేను సులోచనతో చింటూని ఇక్కడే ఉంచెయ్యమను మీ అన్నయ్యతో అన్నాను. తను వాళ్ళ అన్నయ్యతో అరేయ్ అన్నయ్యా! వాడిని ఉంచేయమంటున్నాడు తను నువ్వెళ్ళు లే తనకు కూడా కాలక్షేపంగా ఉంటుంది అంది. సరే అని ప్రమోద్ వెళ్ళిపోయాడు. అప్పటినుండి చింటూ నాకు బాగా అలవాటైపోయాడు. సులోచన కూడా నమ్మలేకపోతోంది వాడు నాకు అంత మాలిమి అయిపోతాడని. చూస్తూ ఉండగానే సర్జరీ డేట్ దగ్గర పడింది. థాయిలాండ్ బయలుదేరాము. ప్రమోద్ కూడా మాతో పాటు వచ్చాడు. మొదటి ఫేజ్ లో బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం కోసం ఆపరేషన్ చేసి తరువాతి ఫేజ్ లో నా పురుషాంగాన్ని తొలగించేసారు. నాలుగు రోజులు మత్తు మందుల ప్రభావంలోనే ఉన్నాను. తరువాత ఫాలో అప్ స్టార్ట్ అయింది. ఒక ఇరవై రోజులకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేసారు. ఇప్పుడు నేను కృష్ణని కాదు నా పేరు కృష్ణప్రియ. నాకు శాపం గా పరిణమించిన మగతనాన్ని ప్రక్కన పెట్టి ఆడతనాన్ని సంతరించుకున్న సంపూర్ణమైన ఆడదాన్ని ఇప్పుడు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము.

హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ రూపాన్ని సంతరించుకుని మా ఇంటిలోకి అడుగు పెట్టగానే మొదట నన్ను పలకరించింది చింటూ గాడు. వాడికి నన్ను చూడగానే వాళ్ళ నాన్నని కానీ, సులోచన ని కానీ చూడకుండా నా దగరికి పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. నన్ను అల్లుకు పోయాడు. “ఆంటీ ఎక్కడికి వెళ్ళిపోయావు … ఆయమ్మ తో ఉండాలంటే యాక్” అంటూ ముద్దు ముద్దుగా పలుకుతుంటే “ఇక ఎక్కడికీ వెళ్ళను కన్నా … బోలెడు స్టోరీస్ చెప్పుకుందామే” అంటూ వాడిని నేను ముద్దు పెట్టుకున్నాను. ఆ నెక్స్ట్ డే ఈవెనింగ్ నేనూ సులోచనా షాపింగ్ కి వెళ్ళాము. నాకు కావలసిన చీరలూ. లోపలి లంగాలూ, జాకెట్లూ, కొన్ని సింపుల్ గా ఉండే నగలూ తీసుకున్నాము. మా ఏరియా లోనే ఉన్న లేడీస్ తిలోర్ దగ్గరికి వెళ్లి స్వయానా నా కొలతలు నేనే ఇచ్చుకున్నాను మొట్టమొదటిసారిగా. షాపింగ్ అయ్యాక ఇంటికి వెళ్లి మా అందరికీ నేనే వంట చేశాను. ప్రమోద్ అయితే చాలా మెచ్చుకున్నాడు. సులోచన లేనప్పుడు ఏదో మాట్లాడామని అనుకుంటున్నాడు కానీ మాట్లాడడం లేదని నేను గ్రహించాను. నెక్స్ట్ డే తను విజయవాడ వెళ్ళిపోయాడు.

నెక్స్ట్ డే సులోచన ఆఫీసు కి వెళ్ళిపోయింది. నేను ఆయమ్మ ని విజయవాడ పంపేశాను తను విజయవాడ లో చింటూ కి సంరక్షణగా ఉంటుందని ప్రమోద్ ఏర్పాటు చేసుకున్నాడు. చింటూని చూసుకోవడానికి నేను ఉన్నానుగా అందుకే పంపేశాను. చింటూ తో కాలక్షేపం అయిపోతోంది నాకు. అట్లా ఒక మూడు రోజులు గడిచిపోయాయి. ఆరోజు శ్రావణ శుక్రవారం సులోచనా నేనూ తలస్నానం చేసి ఇద్దరమూ వైలెట్ కలర్ పట్టుచీరలు ఇద్దరివీ ఒకే డిజైన్ కట్టుకుని గుడికి వెళ్ళాము. కార్ పార్క్ చేసి ఆలయం లోకి ప్రవేశించే ముందు మా ఇద్దరినీ చూసి ఒక ఆకతాయి ఈలవేస్తూ ఏదో కామెంట్ చెయ్యడం నేను గమనించాను. సులోచన అయితే వాడు నన్ను కాదు నిన్ను చూసే ఎలా వేస్తున్నాడు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వింది. గుడిలో దర్సనం అయిపోయాక చింటూ ని ప్రక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్ కి తీసుకువెళ్లాము. ఒక ముసలావిడ మమ్మల్ని చూసి చింటూ నా దగ్గరే ఉండటం చూసి నీ కొడుకుని కాలేజ్ లో జాయిన్ చేశావా అమ్మా అంటూ నన్ను అడిగింది. అప్పుడు కోడా సులోచన తనలో తను నవ్వుకోవడం గమనించాను. ఇంటికి వెళ్ళాక నేను కాటన్ చీర కట్టుకున్నాను. తనేమో నైటీ లో ఉంది. భోజనం అయిపోయాక పడుకునేముందు కృష్ణా! అందరూ నిన్ను స్త్రీగానే అంగీకరించేసారు ఆఖరికి ఊహ తెలీని చింటూ కూడా అంటూ నవ్వింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *