కొన్నిరోజులతరువాత మా ఆడపడుచు, మా వారి సిస్టర్ అంటూ నన్ను ఆఫీసు లో పరిచయం చేసింది సులోచన. అట్లా నా ఆఫీసు లో నేను క్రొత్తగా అందరికీ పరిచయం చెయ్యబడ్డాను. కానీ ఈ నా ఆడజన్మ ఇంట్లోనే ఉండాలని ఇంటిపనులకే పరిమితమవ్వాలని ఉవ్విళ్ళూరుతోంది. చింటూని దగ్గరలో ఉన్న కిడ్స్ కాలేజ్ లో జాయిన్ చేశాము. వాడు కాలు జారి పడటంతో కాలు బెణికి మంచం మీద ఉండాల్సి వచ్చింది. ప్రమోద్ కూడా వచ్చాడు. సులోచన ఉంటానన్నా తనని ఆఫీసు కి పంపి వాడి బాగోగులు నేనే చూశాను. అప్పుడు ఒక రోజు సులోచన “కృష్ణ! నేను నిన్ను ఒక్కటి అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోవుగా?” అంది. నేను “నీకు నాదగ్గర ఏమైనా అడిగే చనువు ఉంది కదా … క్రొత్తగా మాట్లాడుతున్నావేమిటి డియర్ ” అన్నాను. అందుకు తను “ఏమీ లేదు. చింటూ నీకు బాగా అలవాటు అయిపోయాడు. వాడిని అన్నయ్య తీసుకుపోతాను అంటున్నాడు. వాడు వెళ్ళిపోతే ఉండగలవా?” అంది. నేను ఊహించని పరిణామం ఇది. నేను అయోమయం గా చూస్తూ ఉంటే “కృష్ణా నీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. నువ్వు ఆడదానిగా మారావు అంతలోనే ఆడతనం తో పాటు అమ్మతనం కూడా అలవాటైపోయింది నీకు. మా అన్నయ్య వేరే పెళ్లి చేసుకోమ్మన్నా చేసుకోలేదు ఇప్పటివరకూ. కానీ చింటూ తో నీ అనుబంధం చూసి నన్ను అడిగాడు చింటూ తల్లి గా కృష్ణ ప్రియ వస్తే నీకేమైనా ఇబ్బందా? అని”. నేను ఊహించని మలుపు ఇది ఒక స్త్రీకి తప్పక మగవాడి అండ ఉండాలి. ఇప్పటివరకూ నా జీవితంలో సులోచనతో పాటు ప్రమోద్ కూడా నా గురించి అన్నీ తెలిసి ఉన్నవాడు కావడం తను నన్ను భార్యగా స్వీకరిస్తాను అనే ప్రతిపాదన తో రావడం ఇది ఊహించలేకపోతున్నాను. ఒక ప్రక్క నా మనసులో తెలియని సంతోషం. కాసేపటి సుదీర్ఘ ఆలోచన తరువాత నా స్పందన కోసం ఎదురు చూస్తున్న సులోచనతో “సులోచనా! అసలు నేను ఈ సెక్స్ చేంజ్ ఎందుకు చేసుకున్నానో తెలుసా నీ జీవితంనుండి తప్పుకోవాలని అది ప్రేమ లేక కాదు … ఒకే ఒక కారణం నా వల్ల నీకు పిల్లలు పుట్టరని తెలిసిన తరువాత .. ఆడదానిగా ఉండాలనే నా కోరికను నువ్వు గౌరవించిన తరువాత నాకనిపించింది .. ఆడదానిగా మారిన తరువాత నీకు మళ్ళీ పెళ్లి చెయ్యాలనుకున్నాను అలాగైనా నువ్వు పిల్లాపాపలతో సంతోషంగా ఉంటావని. కానీ నా గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నేను మీ అన్నయ్యతో జీవితం పంచుకోవడం మొదలైన తరువాత నువ్వు ఏకాకి అయిపోతావు … అందుకే ముందు ఎవర్నైనా చూసి నువ్వు పెళ్లి చేసుకున్న తరువాత నేను ఆలోచిస్తాను” అన్నాను.
సులోచన నా గురించి ఇంత ఆలోచించావా కృష్ణా! అంటూ ప్రమోద్ ని లోపలి పిలిచింది. ప్రమోద్ వచ్చి కూర్చున్న తరువాత ప్రమోద్ తో పెళ్ళికి ఒప్పుకునే ముందు నేను పెట్టిన సులోచన పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పింది. ప్రమోద్ అందుకు “క్రిష్ణప్రియా! నేను ఒక సంకోచ పరిస్థితుల్లో ఉన్నాను … ఇప్పటివరకూ నిన్ను ఒక చెల్లెలి భర్తగా గౌరవించిన నేను భార్యగా అంగీకరించమని నా చెల్లి చెప్తే అంగీకరించలేక పోయాను. కానీ చింటూ తో నీ అనుబంధం చూసాక నువ్వు నా భార్యను మరిపించేసావు. నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను. నీ స్థానంలో చింటూకి వేరే తల్లిని తీసుకు రాలేను. ఇక నీకు అలవాటైన వ్యాపారం కాబట్టి నీ బిజినెస్ సెటప్ ని మార్చుకోకు నేనే ఇక్కడికి వచ్చేస్తాను. ఇక సులోచన పరిస్థితి అంటావా! నేను ఒక అబ్బాయి ని చూసాను తను మా మేనత్త కొడుకు కిరణ్ మీరు సెక్స్ చేంజ్ కోసం థాయిలాండ్ మొదటిసారి వెళ్ళినప్పుడు తనకు విషయాలన్నీ చెప్పి సులోచన ను రెండవ పెళ్లి చేసుకోవడానికి తనకి ఇష్టమా కాదా అని అడిగాను. తను మా ఇంటి తో ఉన్న చుట్టరికాన్ని బట్టి సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ మీ ఇద్దరికీ ఇష్టమైతేనే సుమా!” అన్నాడు.
నేను ప్రమోద్ కి భార్య అయితే సులోచన నాకు మరదలు అవుతుంది …. చింటూ నాతోనే ఉంటాడు … సెక్స్ చేంజ్ చేయించుకున్న నాకు ఎట్లాగు పిల్లలు పుట్టరు. సులోచన తన బావ కిరణ్ ని చేసుకుంటే తనకూ పిల్లలు పుడతారు తనూ సంతోషంగా ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. హైదరాబాద్ ఆఫీసు సెటప్ అంతా నేను చూచుకుంటూ నా భర్తా పిల్లాడితో ఇక్కడే ఉండొచ్చు … సులోచనతో నా బంధుత్వం కూడా కంటిన్యూ అవుతుంది. ఇక కాదనడానికి రీజన్స్ ఏమీ కనపడటం లేదు. ప్రమోద్ ముందు అప్పుడే ఒప్పుకోవాలంటే ఏదో సిగ్గుతెర అడ్డొస్తుంది. అందుకే రేపు ఆలోచించి చెప్తా అన్నాను. ప్రమోద్ నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటా. అన్నాడు. ప్రమోద్ వెళ్ళిపోయాక సులోచనతో “నిన్నటివరకూ నీ భర్త స్థానం లో ఉన్న నేను మీ అన్నయ్య భార్య స్థానంలోకి రావాలంటే ఏదో జంకు గా ఉంది. కానీ ఈవిధంగానే జరిగితే మనమందరమూ కలిసి ఉండొచ్చు. మీ అన్నయ్యను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ మనిద్దరి పెళ్ళిళ్ళూ ఒకేసారి జరగాలి సుమా” అన్నాను. మరునాడు కొంచెం లేట్ గా నిద్ర లేచేసరికి సులోచన బయటికి మార్కెట్ కి వెళ్ళింది. నేను లేచి స్నానం చేసి క్రీం కలర్ కాటన్ చీర కట్టుకున్నాను. నల్ల రంగు జాకెట్ వేసుకున్నాను. హాల్లోకి వచ్చిన నన్ను చూసి నవ్వుతూ ప్రమోద్ “థాంక్స్ డియర్ ఫర్ యాక్సెప్టింగ్ మీ యాస్ యువర్ లైఫ్ పార్టనర్” అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నేను సిగ్గుగా చూసాను తనవైపు. ఒక వారం రోజుల వ్యవధిలో కిరణ్ ని కూడా రప్పించి ముందు మా మ్యారేజ్ జరిగిన తరువాత కిరణ్ కాళ్ళు అన్నా వదినల పాత్రలో ప్రమోద్ నేనూ కలిసి కడిగాము.
