పెద్దమ్మ Part 17 5

వెనుకే SI సర్ వచ్చారు .
దేవత : లంచ్ పంపించినందుకు థాంక్యూ సర్ …….
SI సర్ : కనీసం పరిచయం లేని అమ్మాయికోసం నిన్నటి నుండీ మీరు చేసినదానితో పోలిస్తే ……. , ఏదైనా జరగకముందే మీరు ప్రతిస్పందించిన తీరుకు నేను ఫిదా అయిపోయాను – బుజ్జిహీరో …… నిజంగానే హీరో నువ్వు – తరువాత ఎప్పుడైనా మనం కలుద్దాము .
పరిచయం లేకపోవడం ఏమిటి సర్ , అక్కయ్య – బామ్మ ……. అంటూ అక్కయ్య చేతిని ప్రాణంలా హత్తుకున్నాను , అక్కయ్య కన్నీళ్లు చూడగానే నా హృదయం తల్లడిల్లిపోయింది .
SI సర్ : కొట్టేలా ఉన్నావు బుజ్జిహీరో ……. , sorry sorry …….
అందరూ డాక్టర్ మేడం కూడా నవ్వుకున్నారు .
అక్కయ్య : తమ్ముడూ ……. , నాకు వెంటనే నిన్ను – అక్కయ్యను చూడాలని ఉంది , డాక్టర్స్ ఆలస్యం చేస్తే నేనే బ్యాండేజస్ తీసేస్తాను .

డాక్టర్ మేడం : నో నో నో , అంతపని మాత్రం చెయ్యకు కావ్యా …… , ఇంతసేపు ఆగావు మరొక్క 5 నిమిషాలు ఆగలేవా …… ? .
అక్కయ్యా …… 5 నిమిషాలే అంటూ లేవబోయాను .
డాక్టర్ మేడం : నో నో నో బుజ్జిహీరో గారూ …… , నన్ను కొట్టేస్తుందేమో అలానే పట్టుకుని కూర్చో అని నవ్వుతూనే నర్స్ సహాయంతో కట్లు విప్పుతున్నారు నెమ్మదిగా …… , కావ్యా …… ప్లీజ్ ప్లీజ్ అతినెమ్మదిగా తెరవాలి , బుజ్జిహీరో – అవాంతికా …… మీరు చెబితేనే వినేది .
అక్కయ్యా – చెల్లీ …… మేమెక్కడికీ వెళ్లము , నెమ్మదిగా తెరవండి అని చేతులపై ముద్దులుపెట్టాము .
డాక్టర్ మేడం బ్యాండేజీ మొత్తం వేరుచేసి , ఒక లిక్విడ్ తో కనురెప్పలపై అతి జాగ్రత్తగా శుభ్రం చేసి , now కావ్యా …… slowly open your eyes , నీకు ఇరువైపులా …… నీ ప్రాణమైన ఇద్దరే ఉన్నారు – నీకు మొదటగా కనిపించేది వారే ……..
అవును అక్కయ్యా – చెల్లీ ……. , నెమ్మదిగా నెమ్మదిగా ……. , చూడగానే ఉద్వేగానికి లోనై కన్నీళ్లు – ఆనందబాస్పాలు రప్పించకండి కళ్ళు నొప్పివేస్తాయి .
డాక్టర్ : బుజ్జిహీరో నువ్వు డాక్టర్ ఈ కూడా , నాకు రాని ఐడియా నీకు వచ్చింది , అవును కావ్యా ……. కొద్దిసేపు ఎలాంటి బావోద్వేగాలకూ లోను కాకూడదు ప్రమాదం – ఎంతైనా సంతోషపడు కానీ బాస్పాలు మాత్రం నో , బుజ్జిహీరో కూడా చెప్పాడు కదా వింటావులే …… రెడీ 3 2 1 …….

స్లోలీ స్లోలీ ….. అక్కయ్యా – చెల్లీ …….
అక్కయ్య : నా తమ్ముడు – అక్కయ్య చెబితే వింటాను అని అతినెమ్మదిగా కళ్ళుతెరిచి చూసి , అంతులేని ఆనందంతో తమ్ముడూ – అక్కయ్యా …… అంటూ ఇద్దరినీ హత్తుకున్నారు . తమ్ముడూ – అక్కయ్యా …… చూసాను , నాకు బాగా కనిపిస్తోంది అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి , కొన్ని క్షణాలపాటు మనసారా చూస్తున్నారు .
అక్కయ్యా ……. సో సో sooooo హ్యాపీ – బామ్మలను చూడండి .
అక్కయ్య : తరువాత చూస్తానులే అంటూ ఇద్దరినే చూస్తున్నారు .
బామ్మలిద్దరూ సంతోషంతో నవ్వుతున్నారు .
డాక్టర్ మేడం : బామ్మలనే తరువాత చూస్తాను అన్నది , ఇక మనల్ని చూడదులే SI గారూ , తరువాత వద్దాము పదండి .
డాక్టర్ మేడం – సెక్యూరిటీ అధికారి సర్ ……
డాక్టర్ మేడం : పర్లేదు పర్లేదు మీరు ఎంజాయ్ అంటూ నవ్వుతూ బయటకు వెళ్లారు .

అక్కయ్య : ఆఅహ్హ్హ్ ……. ఎంత ఆనందం కలుగుతోందో మాటల్లో చెప్పలేను తమ్ముడూ – అక్కయ్యా …… లవ్ యు లవ్ యు సో మచ్ అంటూ మా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
పెద్దమ్మా …… అక్కయ్యను ఎలా చూడాలో అలా చూసేలా చేశారు – బామ్మగారు కూడా చాలా చాలా హ్యాపీ , థాంక్యూ థాంక్యూ sooooo మచ్ .
అక్కయ్య – దేవత : థాంక్యూ పెద్దమ్మా …….
అక్కయ్యా …… బామ్మలు , మిమ్మల్ని కౌగిలించుకుని ఆనందించాలని తెగ ఆరాటపడిపోతున్నారు – ఆ తరువాత మీఇష్టం ……
అక్కయ్య : మీరిక్కడే ఉండాలి …….అలా అయితేనేనే ……
లవ్ యు అక్కయ్యా – చెల్లీ అంటూ ఒకేసారి ముద్దులుపెట్టాము .
అక్కయ్య తియ్యదనంతో నవ్వుకుని , బామ్మలూ …… నాకు కనిపిస్తున్నారు అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .

ఎంతసేపు హత్తుకుంటారు ఇక చాలు అలా కూర్చోండి అని ప్రేమతో తోసేసి , దేవత మరియు నా చేతులను అందుకుని , కనులారా తిలకిస్తూ ఆనందిస్తున్నారు .

అంతలో డాక్టర్ మేడం – SI సర్ వచ్చారు . అమ్మలూ …… ఇంకనూ …….
బామ్మలు : ఒకేఒక్క నిమిషం లేదు లేదు అర నిమిషం కౌగిలించుకుని ప్రక్కకు తోసేసింది మేడం అని తియ్యనైన కోపాలతో కంప్లైంట్ చేశారు .
నవ్వుకుని , అక్కయ్యా …… ఈ SI సర్ – డాక్టర్ మేడం వల్లనే మీరు చూడగలుగుతున్నారు .
అక్కయ్య చేతులు జోడించి నమస్కరించారు – అక్కయ్యతోపాటు నేను కూడా ……
SI సర్ : బీజం పడింది మాత్రం నీ తమ్ముడు బుజ్జిహీరో వల్లనే కావ్యా …… – నువ్వు చూడగలుగుతున్నావు చాలా చాలా సంతోషం – ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను – బై బై డ్యూటీ కాల్స్ ……..
డాక్టర్ మేడం : అక్కయ్య కళ్ళను చెక్ చేసి మిరాకిల్ ……. , ఇంత తక్కువసమయంలో ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడటం నేనెప్పుడూ చూడలేదు – మీకుఇష్టమైతే ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ అవ్వవచ్చు కానీ ఒక వారం రోజులపాటు సిటీ పొల్యూషన్ ఏమాత్రం తగలకూడదు , ఇంటిలోనే ఉంటే సరిపోతుంది , ఆ తరువాత నీ ఇష్టం , ఇన్ని సంవత్సరాలూ మిస్ అయిన ప్రపంచాన్ని కనులారా తిలకించు ……. , చెప్పు కావ్యా ….. ఇక్కడే ఉంటావా ? డిశ్చార్జ్ చెయ్యమంటావా …… ? .
అక్కయ్య : హాస్పిటల్లో పేషెంట్ లా ఉండటం ఇష్టం లేదు తమ్ముడూ – అక్కయ్యా …….
డాక్టర్ మేడం : డిశ్చార్జ్ …….
అక్కయ్య : థాంక్యూ థాంక్యూ soooo మచ్ డాక్టర్ అంటూ మా ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టారు .

అక్కయ్యా ……. ఒక్కనిమిషం ……
అక్కయ్య : తమ్ముడూ …….
అక్కయ్యా …… ఒకే ఒక్క నిమిషం ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగున SI సర్ ను వెతుక్కుంటూ బయటకువచ్చాను . సెక్యూరిటీ అధికారి జీప్ లో కూర్చోబోతుండటం చూసి సర్ సర్ అంటూ పరుగునవెళ్ళాను .
నాలో భయాన్ని చూసి ఏమైంది బుజ్జిహీరో …… , ఎందుకు అంత కంగారుపడుతున్నావు ? .
సర్ సర్ అదీ …… ఆ రౌడీ కళ్ళు మార్చకపోయినా బయట మాత్రం ఆ నోటా ఈ నోటా వాడిని చేరి బయటున్న వాడి అనుచరుల ద్వారా అక్కయ్యకు ఏమైనా అపాయం ……..
SI సర్ : నేనీ సంగతే ఆలోచించలేదు , గుడ్ గుడ్ లోపలేమో డాక్టర్ లా సలహాలు ఇచ్చావు – ఇప్పుడేమో సెక్యూరిటీ అధికారి లా ఆలోచించావు . గంట సమయం ఇవ్వు పరిష్కారం ఆలోచిస్తాను – గంట వరకూ డిశ్చార్జ్ అవ్వకండి – ఇది నా నెంబర్ …… , బిజీలో గంటతరువాత అంటే 6 గంటలకు కాల్ చెయ్యకపోతే గుర్తుచేయ్యి .
అలాగే సర్ అంటూ నెంబర్ మొబైల్లో సేవ్ చేసుకుని పరుగున లోపలికివెళ్ళాను . డాక్టర్ మేడం కనిపించడంతో విషయం చెప్పాను .
డాక్టర్ : అయితే గంట తరువాతనే డిశ్చార్జ్ చేస్తాను అన్నారు .
థాంక్యూ డాక్టర్ మేడం అంటూ ఆపరేషన్ రూమ్ చేరుకున్నాను – అక్కయ్యా …… 6 గంటలకు డిశ్చార్జ్ రెడీగా ఉండండి .