పెద్దమ్మ Part 17 5

బుజ్జితల్లీ …… నేను పైన భోజనం చేస్తాను – నీకు నిద్ర వస్తే పడుకో అని కేకవేసి పైకివచ్చారు బామ్మ …….
బామ్మా …… ఒంటరిగా భయపడి పైకి వచ్చేస్తేనూ ……
బామ్మ : నీ బుజ్జితల్లికి ప్రక్కనే ఉన్న ఈ బూత్ బంగ్లా అంటే మహా భయం , పైకి అస్సలు రాదు అని నవ్వుకున్నారు . ఈపాటికి అలసిపోయి పడుకునేది – నువ్వు పూర్తిచేసిన నవల కోసం ఇల్లంతా వెతికేస్తోంది , ఎంత వెతికినా దొరకదు కదా అని వడ్డించారు .
మీ బుజ్జితల్లికి కూడా తెలుసు బామ్మా …… , కానీ ఎవరు కాంపిటీషన్ లో సబ్మిట్ చేశారో అర్థం కావడం లేదు – నేనే …… మీకు కాల్ చేసి ఆ అడ్రస్ లో మీ బుజ్జితల్లి తరుపున సబ్మిట్ చెయ్యమని కాల్ చెయ్యబోయి ఆగిపోయాను – అంతదూరం మా బామ్మను ఒంటరిగా పంపించడం ఇష్టం లేక …… , ఎవరోకానీ చివరి నిమిషంలో సబ్మిట్ చేసి దేవత టెన్షన్ మొత్తాన్ని పోగొట్టారు .
బామ్మ : ఎవరో ఏమిటి , నేనే …… బుజ్జిహీరో , నువ్వే కదా నీ నెంబర్ నుండే కాల్ చేసి నవలను ఒక ఆడ్రెస్ లో నీ దేవత పేరు – కాలేజ్ తరుపున సబ్మిట్ చెయ్యమని చెప్పావు . వెంటనే నవల తీసుకుని ఇంటికి లాక్ చేసేంతలో ఒక కారు వచ్చి ఆగింది – మీ బుజ్జి మహేష్ పంపించాడని డ్రైవర్ డోర్ తీసి కూర్చోబెట్టుకుని ఆ ఆడ్రెస్ కు సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా ఇంట్లో వదిలి థాంక్స్ చెప్పేలోపు వెళ్ళిపోయాడు .
నేనా …… అంటూ షాక్ లో ఉండిపోయాను .
బుజ్జిహీరో బుజ్జిహీరో …….
నేనసలు కాలే చెయ్యలేదు బామ్మా కావాలంటే చూడండి అంటూ మొబైల్ తీసి చూస్తే లంచ్ టైం రీసెంట్ కాల్స్ లో బామ్మ అని ఉంది – అంతే మరింత షాక్ ……
బామ్మ : చూశావా ……. ? .
నేనైతే అస్సలు చెయ్యలేదు బామ్మా – మిమ్మల్ని అంతదూరం పంపిస్తానా …… ? .
బామ్మ : లేదు , అయితే ఎలా …… ఆ ఆ ఖచ్చితంగా మన దైవం పెద్దమ్మే ఇదంతా చేసి ఉంటారు అంటూ సంతోషంతో ప్రార్థించారు .
అవును బామ్మా …… పెద్దమ్మనే అంటూ కళ్ళు మూసుకుని మొక్కుకున్నాను – నవల సబ్మిట్ చెయ్యకపోతే దేవత కళ్ళల్లో కన్నీళ్లు ఆగేవి కావు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ soooooo మచ్ పెద్దమ్మా …… ఇప్పుడు హ్యాపీగా తింటాను – కానీ అక్కయ్య అంటూ లేచి బామ్మ ప్రక్కన చేరాను .
బామ్మ : నీ దేవత బాధపడితే నువ్వు బాధపడతావంటేనే ఇంత చేశారు – ఇక నువ్వు నీ దేవత నేను కూడా బాధపడతామంటే చూస్తూ ఊరుకుంటారా చెప్పు బుజ్జిహీరో ……. , పెద్దమ్మకు కాస్త సమయం ఇవ్వు అని ప్రాణంలా తినిపించారు .
అలాగే బామ్మా ……. , పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా …… అని ప్రార్థిస్తూనే తిన్నాను .

ఉదయం బస్టాప్ లో బస్సు ఎక్కిన క్షణం నుండీ అక్కయ్యను ఇంటివరకూ వదిలి చిరునవ్వులు పంచడం వరకూ దేవతతో జరిగిన చిలిపి మధురమైన అనుభూతులన్నింటినీ బామ్మ ఒడిలో వాలి నవ్వుతూ – సంతోషిస్తూ – సిగ్గుపడుతూ చెప్పాను .
బామ్మ : నీ దేవతతో అంతలా ఎంజాయ్ చేశావన్నమాట , చాలా చాలా సంతోషం బుజ్జిహీరో …… , ఎన్ని దెబ్బలు 1 2 3 …….
బామ్మా బామ్మా బామ్మా ……. మీ బుజ్జితల్లిని కొట్టనని మాటిచ్చారు .
బామ్మ : ఇచ్చేసానా ….. ? , నిజంగానే ఇచ్చానా బుజ్జిహీరో …… ? .
ఇంతకుముందే ప్రామిస్ చేశారు బామ్మా , మా మంచి బామ్మా ……. అని బుగ్గపై చేతితో ముద్దులుపెడుతూ నవ్వుకున్నాను . అమ్మో …… 11 గంటలు అయ్యింది – కింద దేవత ఒంటరిగా ఉన్నారు వెళదాము బామ్మా …….
బామ్మ : లవ్ యు బుజ్జిహీరో ……. దేవత అంటే ప్రాణం కంటే ఎక్కువ అంటూ బుగ్గలను అందుకుని నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జిహీరో …… నేను పాత్రలన్నింటినీ శుభ్రం చేస్తాను అంతవరకూ నిద్రపోతున్న నీ దేవతను కనులారా తిలకిస్తూ ప్రక్కనే నీకోసం ఏర్పాటుచేసిన బెడ్ పై పడుకో …….
లవ్ యు sooooo మచ్ బామ్మా …… అంటూ పాత్రలను ఎత్తుకుని చప్పుడు చెయ్యకుండా కిందకువచ్చి వంట గదిలో ఉంచాను .
బామ్మ : నా బుజ్జిహీరో బంగారం , వెళ్లు వెళ్లు నీ దేవత దగ్గరికి వెళ్లు అని ప్రాణంలా తోసేశారు .
నవ్వుకుని , దేవత గదిలోకి వెళ్ళాను .

హాయిగా నిద్రపోతున్న దేవతను చూడగానే నవ్వు వచ్చేస్తోంది – నవ్వు దేనికో ఈపాటికి మీకర్థమయ్యే ఉంటుంది .
Yes yes …… దేవత నోటిలో బొటన వేలుని చప్పరిస్తూ పడుకుని ఉండటం చూస్తే ముచ్చటేస్తోంది . లవ్లీ లవ్లీ అంటూ నవ్వుతూనే నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాను . బామ్మ చెప్పినట్లుగానే దేవత పడుకున్న మాస్టర్ బెడ్ ప్రక్కనే ఆనుకుని సింగిల్ బెడ్ ఉంది .
అమ్మో ……. దేవత ప్రక్కన పడుకోవడమా ఇంకేమైనా ఉందా అంటూ అతినెమ్మదిగా కాస్త దూరం లాగాను – క్రిక్ మని సౌండ్ రావడం దేవత డిస్టర్బ్ అయినట్లు కదలడంతో ఆగిపోయాను . Sorry sorry మేడం ……- పెద్దమ్మా …… please ప్లీజ్ సౌండ్ రాకూడదు అని మొక్కుకుని అత్యంత నెమ్మదిగా లాగాను .
సౌండ్ రాకపోవడంతో పెద్దమ్మకు థాంక్స్ చెప్పి కొన్ని అడుగుల దూరం లాగేసి , దేవతను కనులారా తిలకిస్తూ , అప్పుడప్పుడూ దేవత వేలుని మరింతగా నోటిలోకి తీసుకోవడం చూసి ఎంజాయ్ చేస్తున్నాను .

ఉమ్మా …… అంటూ నా తలపై ముద్దు – నీ దేవతను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అంటూ ప్రక్కనే కూర్చున్నారు బామ్మ .
ష్ ష్ బామ్మా …….
బామ్మ : లవ్ యు బంగారూ …… అంటూ రెండుచేతులతో చుట్టేసి నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జిహీరో ……. ఉదయం మన ఇంటి దగ్గర మొదలెట్టి బస్సులో – కాలేజ్లో – మళ్లీ బస్సులో – ఇలా రాత్రి మన ఇంటిలో చూస్తూనే ఉన్నావు కదా బోర్ కొట్టడం లేదా అని గుసగుసలాడారు .
అదేంటో తెలియదు బామ్మా …… మీరు చెప్పిన దగ్గరే కాకుండా రోజంతా 24 గంటలూ …… చూస్తూనే ఉండాలనిపిస్తుంది . ఎంతసేపు ప్రాణంలా చూస్తే ఇక్కడ అంత సంతోషం కలుగుతోంది అంటూ గుండెలపై చేతినివేసుకున్నాను . నిద్రపోతే చూడలేకపోతాను అని నిద్రకూడా పొబుద్దికాదు .
బామ్మ : ఉమ్మా ఉమ్మా …… నీకిష్టమైన నీ బామ్మ ఒడిలో పడుకుని నీ ఇష్టమైనంతవరకూ చూస్తూ పడుకో , ప్రాణంలా జోకొడతాను .
నిన్న కూడా అలాగే అని రాత్రంతా నిద్రపోకుండా జోకొడుతూనే ఉన్నారు , నో నో నో వెళ్లి దేవత ప్రక్కన పడుకోండి బామ్మా ……..
బామ్మ : నా బంగారం …….. , నీకు ……. నీ దేవతను 24 గంటలూ ఎలా చూస్తూనే ఉండాలనిపిస్తుందో నాకు కూడా నా బుజ్జిహీరోను అలానే చూస్తూ ఉండాలని ఆశ – నివ్వేమో …… నీ దేవతను బస్సులో కాలేజ్లో ఇంటిలో బానే చూస్తున్నావు ప్రాణంలా చూసుకుంటున్నావు , మరి నాకు అవకాశం లభించేది రాత్రికి మాత్రమే కదా ……. , అయినా మీరు కాలేజ్ కు వెళ్ళాక నాకేమి పని ఉంటుంది చెప్పు మధ్యాహ్నం వరకూ నిద్రపోయాను , నీ కాల్ రావడంతో లేచాను , రేపు కూడా అలాగే పడుకుంటానులే …… , నీకొక రూల్ నాకొక రూలా ……. అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకుని లవ్ యు లవ్ యు బామ్మా ……. , సరే నాకు ఇష్టమైన మా బామ్మ ఓడిలోనే పడుకుంటాను – మీకు నిద్ర రాగానే వెళ్లి పడుకోవాలి సరేనా …….
బామ్మ : సరే సరే అంటూ సంతోషంతో కేక వెయ్యబోయి నోటీకి చేతిని అడ్డుపెట్టుకుని హమ్మయ్యా అనుకున్నారు . లవ్ యు లవ్ యు బంగారూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి పడుకో అన్నారు .

చెల్లి కావ్యకు చూపు రావాలి – చెల్లి కావ్యకు చూపు రావాలి అని నిద్రలోనే దేవత కలవరించడం చూసి ఇద్దరి కళ్ళల్లో చెమ్మ చేరింది .
ఇద్దరమూ మళ్లీ పెద్దమ్మను ప్రార్థించాము – పెద్దమ్మా …… please ప్లీజ్ అక్కయ్యకు చూపును తెప్పించండి – దానికి ప్రతిఫలంగా ఏమైనా చేస్తాము .