పెద్దమ్మ Part 17 5

అలాంటి రౌడీ కళ్ళు ……. ? .
సెక్యూరిటీ అధికారి : మీ అక్కయ్య కూడా అంతటి దుర్మార్గుడివి వద్దే వద్దు అన్నారు . నిజమే ……. అందుకే ఈరోజే ఒక రాజకీయనాయకుడి బంధువుకు …… చనిపోతూ కళ్ళు దానం చేసిన ఒక పుణ్యాత్ముడివి పెట్టబోతున్నారు – డాక్టర్ ను కలిసి వాడు కూడా దుర్మార్గుడే కాబట్టి ఎక్స్చేంజి చెయ్యమని రిక్వెస్ట్ చెయ్యడంతో ఒప్పుకున్నారు .
సంతోషంతో అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వెళ్లి , సెక్యూరిటీ అధికారి సర్ కు నమస్కరించాను .
సెక్యూరిటీ అధికారి : నాకు కాదు బాబూ ……. , రాత్రి కలలో దేవతలా ఈ ఐడియా ఇచ్చారు వారికి చెప్పు …….
దేవతనా ……. ? , ఇంకెవరు పెద్దమ్మనే అంటూ కళ్ళుమూసుకుని మొక్కుకున్నాను – థాంక్యూ థాంక్యూ పెద్దమ్మా …… అంటూ సంతోషంతో అక్కయ్య దగ్గరికి చేరాను . అక్కయ్యా …… కళ్ళు రెడీగా ఉన్నప్పుడు సాయంత్రం వరకూ ఎందుకు wait చెయ్యడం ……. ? .
అక్కయ్య : నాకు చూపు రాగానే మొదటగా నా ప్రాణమైన తమ్ముడు – అక్కయ్యనే చూడాలి . ఆ కోరిక తీరడం కోసం ఎంతసేపైనా – ఎన్నిరోజులైనా wait చేస్తాను .
మేము కాలేజ్ కు వెళ్లాలనా ……. ? , మా మంచి అక్కయ్య – ఒక్కరోజు కాలేజ్ కు వెళ్లకపోతే ఏమీ అవ్వదు – మా అక్కయ్యకోసం ఒక్కరోజు ఏమిటి సంవత్సరమైనా కాలేజ్ కు వెళ్ళకుండా ప్రక్కనే ఉండిపోతాను .
దేవత : నేను మాత్రం , నా అందమైన చెల్లిని వదిలి వెళతానా చెప్పు – సెక్యూరిటీ అధికారి సర్ …….. వెంటనే ఆపరేషన్ కు ఏర్పాటుచేయ్యండి – మేమిద్దరం ఇక్కడే ఉంటాము .
బామ్మ : తల్లీ – బాబూ ……. అంటూ ఆనందబాస్పాలతో మొక్కారు .
బామ్మా ……. చెప్పాముకదా ఓన్లీ ఆశీర్వాదం అంటూ చెరొకవైపు హత్తుకున్నాము .

సెక్యూరిటీ అధికారి : డాక్టర్ మేడం ……. విన్నారుకదా , ఆపరేషన్ కు ఏర్పాటు చెయ్యండి .
డాక్టర్: ఎప్పుడో రెడీ సర్ ……. – మీరంతా బయటకు వెళితే …….
సెక్యూరిటీ అధికారి : sure ……. , ఆపరేషన్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము అని బయటకు వెళ్లారు.

మరికొద్దిసేపట్లో మా అక్కయ్యకు చూపు వచ్చేస్తుంది – ప్రపంచాన్ని చూడబోతున్నారు అంటూ మా నవ్వులను విని , అక్కయ్య సంతోషంతో నవ్వుకుని , తమ్ముడూ – అక్కయ్యా ……. మిమ్మల్ని – బామ్మను చూడటం కోసం మాత్రమే అంటూ చేతులపై ముద్దులుపెట్టి , ఆపరేషన్ సమయంలో నొప్పి ఎక్కువగా వేస్తుందట …….
అక్కయ్యా …… అంటూ చేతిని హత్తుకున్నాను కన్నీళ్ళతో ……
అక్కయ్య : కన్నీళ్లు వచ్చేసాయా ……. ? , నాకు తెలుసు – పూర్తిగా వినండి , మీరిద్దరూ ……. ఒకేసారి రెండుమూడు ముద్దులుపెడితే ఆపరేషన్ మొత్తం హాయిగా ఉంటుంది .
రెండు మూడు కాదు అక్కయ్యా …… బోలెడన్ని ముద్దులుపెడతాము – అక్కయ్యా …….. సెక్యూరిటీ అధికారి సర్ కలలో కనిపించినది , కనక దుర్గమ్మ పంపించిన మన దైవం పెద్దమ్మ – నొప్పివేసిన ప్రతీసారీ పెద్దమ్మను తలుచుకోండి అంటూ ప్రాణమైన ముద్దులు బోలెడన్ని పెట్టాము . డాక్టర్ మేడం ……. నొప్పిలేకుండా ఆపరేషన్ చెయ్యండి .
డాక్టర్ మేడం : చిన్న సూది గుచ్చుకున్నట్లుగా కూడా తెలియదు బాబూ ……. – దైర్యంగా ఉండండి .
థాంక్యూ థాంక్యూ మేడం అంటూ అక్కయ్య నుదుటిపై – బుగ్గపై – చేతిపై ముద్దులుపెట్టి , అక్కయ్యా ……. డోర్ ప్రక్కనే ఉంటాము అనిచెప్పి బామ్మను పిలుచుకుని బయటకువచ్చాము .
దేవత ……. కళ్ళుమూసుకుని ప్రార్థిస్తున్నారు .

ఆపరేషన్ లైట్ వెలుగగానే దేవతతోపాటు పెద్దమ్మను ప్రార్థించాను అక్కయ్యకు ఏమాత్రం నొప్పి తెలియకూడదు అని ……. , ఈ విషయం తెలిస్తే బామ్మ కూడా సంతోషిస్తారని ఇక్కడున్న బామ్మకు ధైర్యం చెప్పి ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టాను . దేవత ప్రక్కనే కూర్చుని చేతిని అందుకుని ధైర్యం చెబుతున్నారు . డోర్ కు ఉన్న చిన్నపాటి మిర్రర్లో ఆపరేషన్ జరుగుతుండటం చూసి , కాస్త ముందుకువెళ్లి బామ్మకు కాల్ చేసి విషయం చెప్పాను – మీరు ఉంటే మీ చిట్టి బుజ్జితల్లి మరింత సంతోషిస్తారు .
బామ్మ : చాలా సంతోషం బుజ్జిహీరో ……. , ఏ హాస్పిటల్ అన్నావు ? .
Govt హాస్పిటల్ బామ్మా …… , అంతే కాల్ కట్ అయ్యింది . ఆపరేషన్ రూంలోకి మరొక డాక్టర్ మేడం వెళ్లడం చూసి బామ్మకు మళ్లీ కాల్ చెయ్యడం మరిచిపోయాను .

అర గంటలో బామ్మనే ఆపరేషన్ రూమ్ దగ్గరికి వచ్చారు .
బామ్మా – బుజ్జిహీరో ……. అంటూ ఒకరినొకరం చూసుకుని కేకలువెయ్యబోయి దేవత గుర్తుకువచ్చి ఆగిపోయి ముసిముసినవ్వులు నవ్వుకున్నాము .
బామ్మా ……. అంటూ దేవత వెళ్లి సంతోషంతో కౌగిలించుకున్నారు . బామ్మా ……. మరికొన్నిగంటల్లో చెల్లికి చూపు రాబోతోంది అనితీసుకెళ్లి చూయించారు .
అంతా సవ్యంగా జరగాలి అని బామ్మ మొక్కుకున్నారు .
దేవత : బామ్మా ……. చెల్లెలి బామ్మ అంటూ పరిచయం చేసారు .
బామ్మ : చెల్లీ …… ఏమీ కంగారుపడకు , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి మనందరినీ చూస్తుంది , మనవైపు దైవం ఉన్నారు అంటూ నావైపు కన్నుకొట్టారు .
దేవత : బామ్మా ……. మీరు ? ఇక్కడికి ? .
బామ్మ : బుజ్జిహీరో కాల్ చేసాడు ? .
దేవత : నా స్టూడెంట్ మీకు కాల్ చెయ్యడం ఏమిటి ? .
బామ్మ : అదీ అదీ …… , నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాదు బుజ్జితల్లీ …… , నా బంగారుకొండ బుజ్జిహీరో కాల్ చేసాడు . మిమ్మల్ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకెళ్లడం చూసి ఫాలో అయ్యి ఇక్కడి నుండే కాల్ చేసాడు – నేను రాగానే బై చెప్పేసి వెళ్ళిపోయాడు . అయినా నీ స్టూడెంట్ బుజ్జిహీరో కాల్ చేసినా తప్పేంటి – మేము రెండుమూడుసార్లు ఫోనులో మాట్లాడుకున్నాము – నిన్న ఆలస్యమైనా నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చాడు , ఆటోలో కలిశాను – hi బుజ్జిహీరో …….
హలో బామ్మా ……. అంటూ ప్రక్కనవెళ్లి నిలబడ్డాను . దేవత చూడకుండా హైఫై కొట్టుకుని నవ్వుకున్నాము .
**********

లంచ్ సమయానికి ఆపరేషన్ దిగ్విజయంగా పూర్తయినట్లు డాక్టర్స్ సంతోషంగా బయటకువచ్చి విషయం తెలిపారు – రెండు మూడు గంటల తరువాత బ్యాండేజస్ తొలగిస్తాము – అంతవరకూ మత్తులో ఉంటుంది – మత్తు ఇచ్చినా తమ్ముడూ , అక్కయ్యా , పెద్దమ్మా …… అని నిరంతరంగా కలవరిస్తూనే ఉన్నారు – మామూలుగా అయితే ఆపరేషన్ అయిన వెంటనే ఎవ్వరినీ పేషెంట్ దగ్గరకు పంపించము కానీ మీ స్పర్శ కోసం ఆరాటపడుతోంది వెళ్ళండి – మీరెంత జాగ్రత్తగా చూసుకుంటారో మాకర్థమైపోయింది వెళ్ళండి వెళ్ళండి .
చాలా చాలా థాంక్స్ డాక్టర్ మేడమ్స్ – అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పారు అని అందరమూ సంతోషంతో చెప్పాము .
డాక్టర్స్ : మా డ్యూటీ మేము చేసాము . గంట తరువాత వచ్చి చూస్తాను – బ్యాండేజస్ మాత్రం టచ్ చెయ్యకండి .
లేదు లేదు డాక్టర్ మేడమ్స్ …….
డాక్టర్స్ : Ok అయితే వెళ్ళండి వెళ్ళండి , నర్స్ ఉంటుందిలే …… , SI గారూ …… అంటూ సంతోషంతో మాట్లాడుకుంటూ వెళ్లారు .