చూసారా మేడం ……. మీకంటే నాకే ఎక్కువ ముద్దులు …….
దేవత : ఏ అక్కయ్యకైనా నీలాంటి బుజ్జిహీరో తమ్ముడు ఉంటే , ఆ అక్కయ్య ఇలానే హ్యాపీగా ఉంటుంది , ప్రౌడ్ ఆఫ్ యు మై బుజ్జిహీరో ………
లవ్ ……. థాంక్యూ మేడం ……..
దేవత : నర్స్ నుండి స్పెడ్స్ అందుకుని అక్కయ్య కళ్ళకు జాగ్రత్తగా ఉంచారు .
Wow – wow , బ్యూటిఫుల్ చెల్లీ – బ్యూటిఫుల్ అక్కయ్యా …… అని ఇద్దరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య : మా అక్కయ్య అందంలో కొద్దిగానైనా వచ్చి ఉంటే నేనూ సంతోషించేదానిని , నిజం చెబుతున్నాను అక్కయ్యా …… తమ్ముడిని చూడగానే మిమ్మల్ని చూసాను – తమన్నానే మా అక్కయ్యనా అనుకున్నాను .
కదా అక్కయ్యా …….. ( ఇక దేవత నడుము అయితే తమన్నా – ఇలియానా – పూజా ….. ముగ్గురి నడుములను మిక్స్ చేసి అమర్చినట్లు …… ఆఅహ్హ్ )
దేవత : పో చెల్లీ – పో బుజ్జిహీరో అంటూ నా బుగ్గపై గిల్లేసి సిగ్గుపడుతున్నారు .
స్స్స్ అంటూ స్పృహలోకొచ్చాను – నా వెనుకే బామ్మకూడా స్స్స్ అంటూ రెండు వేళ్ళను చూయించారు .
నో నో నో బామ్మా ……. , ఇంటికి వెళ్లగానే ఒట్టు వేయించుకోవాలి లేకపోతే దేవత బుగ్గలు ఎర్రగా కందిపోతాయి అని మనసులో అనుకున్నాను .
బామ్మ : జరగబోయేది అదే బంగారూ అంటూ బామ్మ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
దేవత : చెల్లీ …… నేనూ నిజం చెబుతున్నాను , కృతి శెట్టి బస్సులో ప్రయాణిస్తోంది ఏమిటీ అనుకున్నాను .
కృతి శెట్టి కృతి శెట్టి …… ఎక్కడో ఎక్కడో చూసాను ఆ ఆ ఉప్పెన హీరోయిన్ – మూవీ చూడలేదు కానీ ట్రైలర్ చూసాను – నిన్న ఏడుస్తున్న అక్కయ్యను చూడగానే ఎక్కడో చూసాను అనుకున్నాను – దేవత చెప్పాక తెలుస్తోంది అవునవును అచ్చు అలానే ఉంది అక్కయ్య …….
అక్కయ్య : అంటే ఏడుస్తున్న కృతి శెట్టి అన్నమాట అంటూ సిగ్గుపడ్డారు .
దేవత : సిగ్గుపడుతుంటే అచ్చు అలానే ఉన్నావు చెల్లీ ……
అవునవును నా కళ్లెదురుగా ఒకవైపు తమన్నా – మరొకవైపు కృతి శెట్టి …… అక్కాచెల్లెళ్లుగా ……..
బుజ్జిహీరో – తమ్ముడూ ……. అంటూ ఇద్దరూ చెరొక బుగ్గపై గిల్లేసి మురిసిపోతున్నారు .
స్స్స్ స్స్స్ ……. అదృష్టo అంటే నాదే రోజూ అతిదగ్గరగా ఇద్దరు హీరోయిన్స్ ను చూస్తాను – యాహూ యాహూ ……. అంటూ కేకలువేశాను .
బుజ్జిహీరో – తమ్ముడూ ……. అంటూ కొట్టబోతే బామ్మ గుండెలపైకి చేరాను .
బామ్మ : మూడు అంటూ వేళ్ళను చూయించారు .
అక్కయ్యతోపాటు చిరునవ్వులు చిందిస్తున్న దేవతవైపు దీనంగా చూసాను .
అక్కయ్య : రోజూ అక్కయ్యకు ముద్దులుపెట్టి అప్పుడప్పుడూ అక్కయ్య అందాన్ని కొరికేసి తిని నా తమ్ముడు – అక్కయ్య మాటలను త్వరలోనే నిజం చేస్తాను , కృతి శెట్టిలా మారిపోతాను .
దేవత : నా చెల్లి పుట్టుకతోనే అందగత్తె అంటూ ప్రేమతో హత్తుకున్నారు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా ……. , హాస్పిటల్ నుండి ఇంటికి వెళదాము తమ్ముడూ ……. అంటూ మాఇద్దరి చేతులను అందుకున్నారు .
లేడీ సెక్యూరిటీ అధికారి : మా మాటలన్నీ విని ఆనందించినట్లు , కారు exit దగ్గరకు తీసుకొస్తాను అనివెళ్లారు .
నర్స్ కు థాంక్స్ చెప్పేసి అక్కయ్య చేతులను పట్టుకునే బయటకువచ్చి కారులో బయలుదేరాము .
మెయిన్ రోడ్డులో కారు మా కాలేజ్ వైపు కదిలింది .
అక్కయ్య బామ్మ : సెక్యూరిటీ అధికారి మేడం …… ఇల్లు ఇటువైపు .
లేడీ సెక్యూరిటీ అధికారి : నాకు తెలియదా బామ్మా …… , అటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అనిచెప్పి కాలేజ్ కు దగ్గరగా చేరుకున్నారు . సరిగ్గా కాలేజ్ దగ్గర రైట్ టర్న్ తీసుకున్నారు .
అక్కయ్యా ……. మా కాలేజ్ అదే అంటూ చూయించాను .
అక్కయ్య : ఇంటర్నేషనల్ కాలేజ్ ……. అంటూ సంతోషంతో నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మెయిన్ రోడ్డు నుండి లోపలికి కొద్దిదూరం తీసుకెళ్లి కారుని ఆపి దిగమన్నారు లేడీ సెక్యూరిటీ అధికారి …….
దిగిచూస్తే సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ అపార్ట్మెంట్స్ అని రాసిఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ రెండు ప్రక్కప్రక్కనే ఉన్నాయి .
లేడీ సెక్యూరిటీ అధికారి : ఒక అపార్ట్మెంట్ ఫర్ మెన్స్ సెక్యూరిటీ అధికారి – ఒక అపార్ట్మెంట్ ఫర్ విమెన్ సెక్యూరిటీ అధికారి . కావ్యా …… మీ సేఫ్టీ దృష్ట్యా – నీ తమ్ముడి కోరిక మేరకు ఇకనుండీ కొన్ని నెలలపాటు విమెన్ అపార్ట్మెంట్స్ లోనే ఉండేలా SI సర్ ఏర్పాటుచేశారు – నెక్స్ట్ సెక్యూరిటీ అధికారి రిక్రూట్మెంట్ జరిగేంతవరకూ సేఫ్ గా ఇక్కడే ఉండవచ్చు – అపార్ట్మెంట్ లోని ప్రతీ హౌస్ ఫుల్లీ ఫర్నిషెడ్ …… – కొద్దిసేపట్లో మీ ఇంటి సామానులన్నీ కూడా వచ్చేస్తాయి రండి అంటూ లోపలికి లిఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ కు పిలుచుకునివెళ్లారు . ఇది మా హౌస్ ప్రక్కనే మీరు ఉండబోతున్నారు అని తాళం తెరిచి వెల్లమన్నారు . బుజ్జిహీరో ……. ఇంటికి వెళ్ళేటప్పుడు పిలవండి అనిచెప్పి వెళ్లిపోతూ – SI సర్ కూడా ప్రక్క అపార్ట్మెంట్ లోనే ఉంటారు అనిచెప్పారు .
లోపలికి వెళ్లగానే ఆటోమేటిక్ గా లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి . దేవత – నేను ….. ఒకేసారి బ్యూటిఫుల్ అన్నాము .
దేవత : మా చెల్లికోసం మోస్ట్ లగ్జరీయోస్ అండ్ safest హౌస్ …… , బుజ్జిహీరో ……. చెల్లి ఆ చిన్న ఇంటిలో అని ఒకవైపు బాధపడుతూనే ఉన్నాను , అక్కయ్యకోసం నాకంటే ముందే ఆలోచించావు సూపర్ …… రియల్ హీరో మా బుజ్జిహీరో …….
అక్కయ్య : తమ్ముడూ …… కాదు కాదు అన్నయ్యా అంటూ పిలవాలేమో అంటూ భావోద్వేగానికి లోనయ్యి నన్ను ప్రాణంలా హత్తుకున్నారు – నేనంటే ఎంత ప్రాణం ….
అక్కయ్యా ……. నో ఆనందబాస్పాలు ok అంటూ నవ్వుకున్నాము . నాకు …… మా అక్కయ్య ఆప్యాయంగా తమ్ముడూ అని పిలవడమే ఇష్టం – నేను పెద్దయ్యాక బాగా సంపాదించి మా అక్కయ్య కోరికలన్నీ తీర్చినప్పుడు అన్నయ్యా అని పిలిపించుకుంటాను .
అక్కయ్య : నా తమ్ముడి ప్రేమ తప్ప నాకెలాంటి కోరికలూ లేవు తమ్ముడూ ……. , తమ్ముడూ ……. ఈరాత్రికి ఇక్కడే ఉండగలవా …… ? .
ఒక్క రాత్రికి ఏమిటి అక్కయ్యా …… , రోజూ మా అక్కయ్య దగ్గరే ఉండాలని ఉంది కానీ కుదరదేమో …… నీ తమ్ముడు కొంతమంది ఫ్రెండ్స్ కు బాడీగార్డ్ గా పనిచేస్తున్నాడు – కష్ట సమయంలో వాళ్లే నాకు ఆశ్రయాన్నిచ్చి పెద్ద కాలేజ్లో చేర్పించారు – ఇప్పటికే ఉదయం నుండీ వాళ్లకు దూరంగా ఉన్నాను – మీ తొలి కోరికనే తీర్చలేకపోతున్నాను sorry అక్కయ్యా అంటూ కళ్ళల్లో చెమ్మతో చెప్పాను.
అక్కయ్య : నో నో నో తమ్ముడూ ……. , అక్కయ్యకు ఎవరైనా sorry చెబుతారా చెప్పు , అర్థం చేసుకోగలను తమ్ముడూ ……. నువ్వు ఎక్కడఉన్నా ఇక్కడ నా గుండెల్లో ఉంటావు అని కన్నీళ్లను తుడిచారు .
దేవత : బుజ్జిహీరో ……. మీ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు …….
నో నో నో అక్కయ్యా …… అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించాను .
అక్కయ్య …… తమ్ముడూ తమ్ముడూ చిన్నప్పటి నుండీ గిలిగింతలు ఎక్కువ అని నవ్వుతూనే వెళ్లి బామ్మ గుండెలపైకి చేరారు – నేనూ ……. మరొకవైపు బామ్మను హత్తుకున్నాను .
దేవత : మరి నేను అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
మేడం …… ప్లీజ్ అంటూ నా ప్లేస్ ఇచ్చాను . వెళ్లి సోఫాలో కూర్చుని ఆ అందమైన దృశ్యాలను మొబైల్లో క్యాప్చర్ చేసి ఆనందించాను .
అక్కయ్య : అక్కయ్యా – తమ్ముడూ – బామ్మా ……. భోజనం చేసైనా వెళ్ళాలి . ఒక్కనిమిషం అంటూ వంట గదిలోకివెళ్ళిచూసి అన్నీ ఉన్నాయి గంటలో వండేస్తాను అంటూ సంతోషంతో చెప్పారు .
నో నో నో , వారం రోజులు మా అక్కయ్య వంట చెయ్యడం కాదు కదా వంట గదిలోకే వెళ్ళడానికి వీలులేదు – బామ్మా …… మీరే చూసుకోవాలి .
అక్కయ్య బామ్మ : అలాగే బాబూ …… , కంటికి రెప్పలా చూసుకుంటాను మీ అక్కయ్యను …….
థాంక్స్ బామ్మా …….
దేవత : తమ్ముడికి వండి పెట్టాలన్న నా చెల్లి కోరికను నేను తీరుస్తాను – అంతవరకూ నీ తమ్ముడితోనే ఉండు చెల్లీ అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వంట గదిలోకివెళ్లారు .
