అక్కయ్య : లవ్ యు అక్కయ్యా …… అంటూ పరుగునవచ్చి సోఫాలో కూర్చున్న నా ప్రక్కనే కూర్చున్నారు చిరునవ్వులు చిందిస్తూ …….
బామ్మలిద్దరూ కూడా దేవతకు సహాయం చేయడానికి వంట గదిలోకి వెళ్లారు .
బామ్మా ……. SI సర్ ను మరియు లేడీ సెక్యూరిటీ అధికారి మేడం ఫ్యామిలీని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది .
బామ్మ : కొత్తగా ఇంటిలోకి వచ్చినప్పుడు ఆత్మీయులకు భోజనం పెట్టడం సాంప్రదాయం . పర్లేదు అన్నా వదలకుండా ఆహ్వానించు బుజ్జిహీరో ……
లవ్ యు బామ్మా …….
దేవత : బయటకువచ్చి సూపర్ అని చేతితో సైగచేసి వెళ్లారు .
బామ్మా – మేడం …… వంట సరుకులు ఏమైనా కావాలంటే చెప్పండి , కారులో వచ్చేటప్పుడు షాప్స్ చూసాను నిమిషంలో తీసుకొస్తాను .
బామ్మ వచ్చి కూరగాయలు కావాలి బుజ్జిహీరో అని లిస్ట్ ఇచ్చి డబ్బు ఇచ్చారు . నాతో ఉంది …… లేదు లేదు ఔట్ హౌస్ లో ఉంది కదా అని బామ్మ నుండి అందుకుని , అక్కయ్యా …… వెళ్ళొస్తాను .
అక్కయ్య : తమ్ముడూ …… నేనూ వస్తాను .
అమ్మో ఇంకేమైనా ఉందా పొల్యూషన్ – డస్ట్ అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి పరుగుతీసాను . 15 నిమిషాలలో తీసుకొచ్చి అందించి బామ్మా – మేడం వంటలు అధిరిపోవాలి సర్ వాళ్ళను ఆహ్వానించి వస్తాను .
అక్కయ్య : మళ్ళీనా తమ్ముడూ …….
10 మినిట్స్ 10 మినిట్స్ అక్కయ్యా ……. ప్లీజ్ ప్లీజ్ ……
అక్కయ్య : ఆలస్యమయితే పనిష్మెంట్ తెలుసుకదా …….
అయితే చాలా చాలా ఆలస్యంగా వస్తాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముడూ ……. ఉమ్మా ఉమ్మా …..
బుజ్జి బాడీగార్డ్ గారూ …… నేనూ వస్తాను ఆగండి అని అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి బయటకువచ్చారు దేవత – చెల్లీ …… అంతలోపు ఫ్రెష్ అవ్వు …….
అక్కయ్య : అక్కయ్యా …… ఆలస్యం అయితే మీకు కూడా సేమ్ పనిష్మెంట్ ……..
దేవత : యాహూ ……. అని కేకవేసి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవత …… నాతోపాటు , యాహూ …….
దేవత : నీకోసమేమీ రాలేదులే , చెల్లికోసం మరియు ముద్దులన్నీ నువ్వే తీసేసుకుంటావని వచ్చాను అని నవ్వుకుంటూ వెళ్లి లేడీ సెక్యూరిటీ అధికారి ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు .
డోర్ తెరుచుకుంది – లేడీ సెక్యూరిటీ అధికారి డ్యూటీ అయిపోయినట్లు చీరలోకి మారారు – మేడం , బుజ్జిహీరో …… లోపలికి రండి అని ఆహ్వానించి ఫ్యామిలీని – పిల్లలను పరిచయం చేసారు . కావ్యాతో Mముచ్చట్లు అయిపోయాయా ? , ఇంటికి బయలుదేరదామా …… ? .
దేవత : అప్పుడే ఈ అక్కాతమ్ముళ్ల ముచ్చట్లు అయిపోతాయా చెప్పండి . కొత్తగా ఇంట్లోకి చేరాము – పాలు పొంగించి తెలిసినవాళ్లకు భోజనాలు వడ్డించాలని ఆశపడుతున్నాము , కుటుంబసమేతంగా రావాలని మనఃస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : పిల్లలూ ……. మేడం – బుజ్జి అన్నయ్య ఇంటికి డిన్నర్ కు వెళదామా ….. ? .
పిల్లలు : వెళదాము వెళదాము – ఎందుకంటే మా ఇంగ్లీష్ మేడం , మా మహేష్ అన్నయ్య కాబట్టి…….
దేవత : కాలేజ్ డ్రెస్ లో లేకపోవడంతో గుర్తుపట్టనేలేదు పిల్లలూ ……
