పెద్దమ్మ Part 17

బ్యాగులో బుక్స్ ఉన్నాయి అంటే కాలేజ్ కు వెళుతున్నారా అక్కయ్యా …….
అక్కయ్య : అవును తమ్ముడూ …… బ్లైండ్ కాలేజ్ కు వెళతాను . రోజూ కాలేజ్ బస్ మా అందరినీ ఇంటివరకూ వదులుతుంది – బస్ రిపేర్ వలన సిటీ బస్సులో వెళుతున్నాను , రేపు రిపేర్ పూర్తవుతుందని చెప్పారు – ఎక్కినప్పటి నుండీ వాళ్ళు ఏడిపిస్తున్నారు – టచ్ కూడా చేశారు అంటూ ఏడుస్తూ చెప్పారు .
అంటీ – మేడం ఓదారుస్తున్నారు .
మేడం please కూర్చోండి అంటూ లేచి ప్రక్కకువచ్చాను .
దేవత కూర్చుని అక్కయ్య కన్నీళ్లను తుడిచి , ఇక ఏ భయం లేదు చెల్లీ …… తమ్ముడు – అంటీ వాళ్ళు – నేను ఉన్నాము కదా ……
అంటీవాళ్ళు మళ్లీ కోపంతో చుట్టూ ఉన్న ఆడంగులను ఆడేసుకున్నారు .
Sorry sorry అంటూ తలలు దించుకున్నారు .
అంటీ : మీ sorry ల వలన పైసా ఉపయోగం లేదు – మీ ఇంట్లోవాళ్లకు ఇలానే జరిగితే ఊరుకుంటారా ….. ? , కాస్తయినా మారండి అనిచెప్పి వెళ్లి కూర్చున్నారు .

అక్కయ్యా ……. స్టాప్ వచ్చింది అంటూ విజిల్ వేసాను . బ్యాగు వేసుకుని వెళ్లి అక్కయ్యా …… నా చేతిని పట్టుకోండి ఇంటివరకూ తీసుకెళతాను .
అక్కయ్య : పర్లేదు తమ్ముడూ …… నువ్వు వెళ్ళాలి కదా ……
నేను ……. వీళ్ళలా కాదు , మా బామ్మ – మీ ప్రక్కన కూర్చున్న మేడం నన్ను బుజ్జిహీరో అని పిలుస్తారు , నాకు భయమన్నదే లేదు చీకటి పడినా సరే – ఈ వయసులోనే చాలా కష్టాలు పడి ఇక్కడ ఉన్నాను – నా గురించి ఆలోచించకండి రండి – నడుచుకుంటూనే ఇంటికి వెళ్లిపోగలను – మేడం …… మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి , మన స్టాప్ లో దిగగానే కాల్ చెయ్యండి అనిచెప్పి , జాగ్రత్తగా అక్కయ్య బస్సు దిగేలా చేసాను , అక్కయ్యా ….. ఎలా వెళ్ళాలి ? .
అక్కయ్య : గుర్తులు చెప్పారు .
ఆ ఆ కనిపిస్తోంది అక్కడ టర్న్ అవ్వాలన్నమాట …….
ఆటో అని దేవత మాటలు వినిపించడంతో వెనక్కు చూస్తే దేవత …….

మేడం ……. ? .
దేవత : మా బుజ్జిహీరో ప్రక్కన లేకపోతే నాకు భయం – ఇద్దరమూ కలిసి మీ అక్కయ్యను ఇంటివరకూ వదిలి మనం మన స్టాప్ కు వెళదాము అని నవ్వుకుంటూ చెప్పారు .
అక్కయ్య : నా వలన మీరు ఇబ్బందిపడుతున్నారు . Sorry అక్కయ్యా …….
మేడం : నో నో నో …… , అక్కయ్యా అంటూ నన్ను – తమ్ముడూ …… అంటూ మన బుజ్జిహీరోను ఆప్యాయంగా పిలిచావు , మరి మా తోబుట్టువును ఒంటరిగా ఎలా వదిలేస్తాము చెప్పు , చెల్లీ …… ఆటో వచ్చింది జాగ్రత్తగా ఎక్కు .
అక్కయ్యా ……. మీ స్టిక్ నాకు ఇచ్చి మేడం ను పట్టుకుని ఎక్కండి .
అక్కయ్య : అలాగే తమ్ముడూ అంటూ మేడం ప్రక్కన కూర్చున్నారు .
అక్కయ్యా …… అడ్రస్ చెప్పండి .
ఆటో డ్రైవర్ : తమ్ముడూ …… ఎక్కి కూర్చో కావ్య తల్లిది మా ఏరియా నే నేను తీసుకెళతాను .
అక్కయ్య : hi అంకుల్ ……..
ఆటో డ్రైవర్ : కావ్యా …… ఏంటి కాలేజ్ బస్సులో రాలేదా ….. ? .
అక్కయ్య : బస్సు పరిస్థితిని వివరించారు .
ఆటో డ్రైవర్: కావ్యా …… నా నెంబర్ ఇచ్చాను కదా , కాల్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని …….
అక్కయ్య : బస్సు అలవాటే కదా అంకుల్ …….
అక్కయ్యా …… నెక్స్ట్ టైం అంకుల్ కు కాల్ చెయ్యండి please అంటూ డ్రైవర్ ప్రక్కన కూర్చున్నాను .
తమ్ముడూ – బుజ్జిహీరో ……. అక్కడ డేంజర్ వెనుకవచ్చి కూర్చో ప్లేస్ ఉందికదా అంటూ అక్కయ్య సీట్ తడుముతూ ఒకేసారి చెప్పారు .
మా దేవతలాంటి మేడం – చక్కనైన అక్కయ్య ఆర్డర్ వేస్తే పాటించకుండా ఉంటానా అని వెనుకవెళ్లి అక్కయ్య ప్రక్కన కూర్చున్నాను.

అక్కయ్య తడుముతూ నా చేతిని అందుకుని , తమ్ముడూ …… ఏ కాలేజ్ ? .
******* ఇంటర్నేషనల్ కాలేజ్ అక్కయ్యా – 10th చదువుతున్నాను – అదే కాలేజ్లో మా మేడం ఇంగ్లీష్ టీచర్ – సూపర్ గా టీచ్ చేస్తారు , టీచ్ చేస్తుంటే అలా చూస్తూ వింటూ ఉండిపోవచ్చు – నేను అన్నీ క్లాస్సెస్ వదులుకుని ఉదయం నుండీ సాయంత్రం వరకూ మేడం క్లాస్సెస్ మాత్రమే వింటాను .
అక్కయ్య : క్లాస్సెస్ కోసం కాదులే , అక్కయ్యను చూడటానికి కదూ ……. – అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నావు అన్నమాట – బుజ్జిహీరో లేకుండా వెళ్లను అన్నప్పుడే అర్థం అయ్యింది తమ్ముడూ ……. – దేవతలాంటి మేడం అన్నావు అంటే అక్కయ్య అంత అందంగా ఉన్నారన్నమాట ……..
మా అక్కయ్య అందం కంటే తక్కువే …….
అక్కయ్య : థాంక్యూ తమ్ముడూ ……. అంటూ ఆనందిస్తున్నారు . చేతిపై ముద్దుపెట్టుకోవచ్చా తమ్ముడూ …….
అక్కయ్య అలా అడుగవచ్చా …… ముద్దే కాదు కొరికెయ్యవచ్చు .
అక్కయ్య సంతోషంతో నవ్వుతూనే , నా చేతిపై ముద్దుపెట్టి గుండెలపై హత్తుకున్నారు .
మేడం : చెల్లీ ……. నువ్వు నవ్వుతుంటే చాలా చాలా ముచ్చటేస్తోంది – నీ తమ్ముడు చెప్పినట్లు sooooo బ్యూటిఫుల్ , నాకైతే నీ బుగ్గపై ముద్దుపెట్టి ఆ అందాన్ని కాస్తయినా కొరుక్కుని తినాలని ఉంది .
అక్కయ్య : లవ్ టు అక్కయ్యా అంటూ నాచేతితోపాటు మేడం చేతిని కూడా అందుకుని ముద్దులుపెట్టి గుండెలపై హత్తుకున్నారు . అక్కయ్యా …… ఇంకా ముద్దుపెట్టలేదు .
మేడం : Ok ok అంటూ బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : తమ్ముడూ …… నీకు ఇష్టం లేదు అన్నమాట ……
లవ్ టు లవ్ టు లవ్ టు అంతకన్నా అదృష్టమా అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : థాంక్స్ తమ్ముడూ …… కానీ ఇద్దరూ ఒకేసారి ముద్దులుపెడితే నేను మరింత హ్యాపీ ………
మేడం వైపు చూడగానే స్మైల్ ఇవ్వగానే …… , లవ్ టు లవ్ టు అంటూ ఇద్దరమూ ఒకేసారి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టాము .
అక్కయ్య : థాంక్స్ అక్కయ్యా – లవ్ యు తమ్ముడూ …… అంటూ చిరునవ్వులు చిందిస్తూ మళ్లీ మా చేతులపై ముద్దులుపెట్టారు .
మేడం : చెల్లీ …… మీ తమ్ముడికి లవ్ యు అంటూ ప్రేమతో చెప్పి – ఈ అక్కయ్యకు మాత్రం థాంక్స్ …….
అక్కయ్య మరింత ఆనందంతో నవ్వుకుని , sorry అక్కయ్యా ……
మేడం : అదిగో మళ్లీ sorry , నేను బుంగమూతి పెట్టుకున్నాను .
అక్కయ్య : మరింత మరింత నవ్వుకుని , లవ్ యు లవ్ యు అక్కయ్యా …… అంటూ ఏకంగా బుగ్గపై ముద్దుపెట్టారు .
సూపర్ లవ్లీ అక్కయ్యా …… చూడటానికి రెండు కళ్ళూ చాలడం లేదు అంటూ మొబైల్ తీసి క్లిక్ మనిపించాను – అక్కయ్యా ఇప్పుడు నేను బుంగమూతిపెట్టుకున్నాను .
అక్కయ్య : అమితంగా చిరునవ్వులు చిందిస్తూ తమ్ముడూ …… నేనేమి చేసాను .
పో అక్కయ్యా …… మీ అక్కయ్యకేమో ప్రేమతో బుగ్గపై ముద్దు – నాకు మాత్రం పరాయివాడిలా చేతిపై మాత్రమే ముద్దు ……..
అక్కయ్య ఆనందాలకు అవధులు లేనట్లు కళ్ళల్లో చెమ్మ చేరేలా నవ్వుతున్నారు .
చూసి అక్కయ్యా అక్కయ్యా ……. sorry sorry , మిమ్మల్ని బాధపెట్టేలా మాట్లాడి ఉంటే క్షమించండి , మీరు బాధపడితే ఆవేవో అంటారు భూతాలు భూతాలు …… సరైన సమయానికి గుర్తుకురావు …….
అక్కయ్య : పంచభూతాలు తమ్ముడూ …….
ఆ ఆ పంచభూతాలూ ఆగ్రహించి ప్రళయాలను సృష్టిస్తాయి .
అక్కయ్య సంతోషంతో నవ్వుతూనే ఉన్నారు .

ఆటో డ్రైవర్ : మిర్రర్ లో చూసినట్లు , బాబూ …… మీ అక్కయ్య కళ్ళల్లో కన్నీళ్లు కాదు ఆనందబాస్పాలు ……
అక్కయ్య : అవును తమ్ముడూ ……. ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు – సంతోషించలేదు . నా లోపాన్ని మరిచిపోయేలా చేసావు – చిన్నప్పటి నుండీ చాలా చాలా ఇబ్బందిపడ్డాను , తెలిసినవాళ్లే వెక్కిరించడంతో మరింత బాధపడుతూ పెరిగాను , ఇదిగో బస్సుల్లో అక్కడక్కడా ….. ఇలాంటివి అంటూ బాధపడుతూ చెప్పారు .
మేడం : చెల్లీ చెల్లీ ….. అటూ గుండెలపైకి తీసుకుని ఓదార్చారు .
అక్కయ్య : sorry sorry తమ్ముడూ …… , ఇక ఎప్పుడూ కన్నీళ్లు కార్చను , అవన్నీ మరిచిపోయేలా చేసావు తమ్ముడూ ……. లవ్ యు సో మచ్ అంటూ తడుముతున్నారు .
అక్కయ్యా ……. బుగ్గ అదే ……
అక్కయ్య : నవ్వుతూ నాకు తెలుసులే తమ్ముడూ అంటూ నా తమ్ముడికి ప్రాణమైన ముద్దు నుదుటిపై అంటూ ముద్దుపెట్టి పరవశించిపోతున్నారు . తమ్ముడూ …… మీ కాలేజ్ నుండి కొద్దిదూరంలోనే మా కాలేజ్ …… అనిచెప్పి ఇంటివరకూ నవ్వుతూనే ఉన్నారు .
డ్రైవర్ : తల్లీ …… ఇంటికి చేరుకున్నాము , ఇంకాస్త దూరం ఉండి ఉంటే బాగుండేది – మా కావ్య తల్లి ఆనందాలను మరికాసేపు చూసేవాడిని .
అక్కయ్య : అప్పుడే వచ్చేసామా …… అంటూ మాఇద్దరి చేతులను గట్టిగా పట్టేసుకుని ఫీల్ అవుతున్నారు , ఇప్పటికే ఆలస్యం అయ్యింది తమ్ముడు – అక్కయ్య ఇంటికి వెళ్లాలికదా అని బాధను లోపలే దాచేసుకుని వెంటనే నవ్వుతూ తమ్ముడూ – అక్కయ్యా …… ఇంతలా ఎప్పుడూ నవ్వలేదు , మీరు జాగ్రత్తగా ఇంటికివెళ్లండి – అంకుల్ …….
డ్రైవర్ : తల్లీ …… నేను తీసుకెళతాను .
పర్లేదు అంకుల్ అక్కయ్యను జాగ్రత్తగా ఇంట్లోకి వదిలి దగ్గరలోని బస్టాండు వరకూ నడుచుకుంటూ వెళ్లి బస్సులో వెళతాములే మీరు వెళ్ళండి అనిచెప్పాను .
తమ్ముడూ – అక్కయ్యా ……. ఇంట్లోకి వస్తారా ? , ఉమ్మా ఉమ్మా ….. వెంటనే వెళ్లిపోతారని బాధపడ్డాను – రండి మన బామ్మను పరిచయం చేస్తాను అని చిన్న ఇంటిలోకి తీసుకెళ్లారు .

బామ్మ : బుజ్జితల్లీ ……. నువ్వేనా నవ్వుతున్నది చాలా చాలా సంతోషం అంటూ ప్రాణం కంటే ఎక్కువగా గుండెలపైకి తీసుకుని ఆనందబాస్పాలతో మురిసిపోతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *