బుజ్జితల్లి ? …… ఇద్దరమూ ఒకరొకరిని చూసుకుని నవ్వుకున్నాము .
అక్కయ్య : తమ్ముడూ …… మీ నవ్వులకు కారణం ,నాకూ చెప్పొచ్చుకదా please ……..
అక్కయ్యా ……. మీ అక్కయ్యను కూడా వారి బామ్మగారు ఇప్పటికీ బుజ్జితల్లీ అని ఇలాగే పిలుస్తారు – మా అక్కయ్యను కూడా బామ్మగారు ……. బుజ్జితల్లీ అని ప్రాణంలా పిలవడంతో నవ్వు వచ్చేసింది .
బామ్మ : నాకు నా బుజ్జితల్లి ఎప్పటికీ బుజ్జితల్లినే ……
అవునవును బామ్మా …… చిన్న బుజ్జితల్లులు అంటూ గట్టిగా నవ్వుతున్నాను .
మేడం : బుజ్జిహీరో నిన్నూ …… అంటూ బుగ్గపై గిల్లేసారు .
స్స్స్ …… ఉండండి కాల్ చేసి బామ్మకు చెబుతాను .
మేడం : వద్దు వద్దు బుజ్జిహీరో …… , స్టూడెంట్ ను కొట్టినందుకే కొట్టేశారు – గిల్లానని తెలిస్తే గట్టిగా గిల్లేస్తారు అంటూ బుగ్గలను కప్పేసుకున్నారు .
అదీ …… ఆ మాత్రం భయం ఉండాలి అని నవ్వుకున్నాను .
బామ్మ : బుజ్జితల్లీ ……. వీరు ?
అక్కయ్య : జరిగినది వివరించారు .
బామ్మ : బాబూ – తల్లీ …… అంటూ కన్నీళ్ళతో దండం పెట్టారు .
బామ్మా – బామ్మా …… అంటూ ఆపి , మీరు ఆశీర్వదించాలి కానీ ఇలా …. అంటూ పాదాలను స్పృశించాము .
బామ్మ : నా ఆయుష్షు కూడా పోసుకుని చల్లగా ఉండండి బాబూ – తల్లీ ……
అక్కయ్య : ఈ ఆశీర్వాదాలన్నీ మా అక్కయ్యకు చేరాలి .
అక్కయ్య : లేదు లేదు తమ్ముడు – అక్కయ్యకు …….
లేదు లేదు అక్కయ్యకు – చెల్లికి ……
అక్కయ్య : లేదు లేదు అక్కయ్య – తమ్ముడికి …….
లేదు లేదు చెల్లికి – అక్కయ్యకు …….
అక్కయ్య : లేదు లేదు అంటూ నవ్వుతూనే ఉన్నారు .
అక్కయ్యా ……. మీరు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి .
అక్కయ్య : థాంక్స్ ….. లవ్ యు తమ్ముడూ అంటూ చేతిని చాపడంతో అందుకున్నాను . ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
బామ్మా …… అక్కయ్యకు ఎప్పటి నుండీ ఇలా ? .
బామ్మ : చిన్నప్పటి నుండీ బాబూ …….. , ఒకరి కళ్ళు పెడితే చూపు వస్తుందని డాక్టర్స్ చెప్పారు – నా కళ్ళు ఇవ్వడానికి రెడీగా ……
అక్కయ్య : బామ్మా …… అలా ఎప్పటికీ జరగనివ్వను – మా బామ్మ అంటే నాకు ప్రాణం ……. – తమ్ముడూ అక్కయ్యా …… భోజనం చేసి వెళ్ళాలి ముందుగా టీ తీసుకొస్తాను అని చిన్నప్పటి నుండీ అలవాటైనట్లు స్టిక్ సహాయం లేకుండానే సులభంగా వంట గదిలోకివెళ్లారు .
దేవత : బామ్మ గారూ …… ఒకరి కళ్ళు పెడితే చెల్లికి చూపు వస్తుందా …… ? .
బామ్మ : వస్తుందని డాక్టర్స్ చెప్పారు తల్లీ ……. , govt హాస్పిటల్లో చిన్నప్పటి నుండీ రోజూ వెళుతున్నా మా టర్న్ రావడం లేదు – వచ్చినా మాలాంటి పేదవారికి ఎలా మారుస్తారు ? , అందుకే నా కళ్ళు ఇస్తాను బుజ్జితల్లీ అంటే ఒప్పుకొనే ఒప్పుకోవడం లేదు – అంతకంటే ఇలానే నాకు సంతోషం బామ్మా అంటుంది .
దేవత : అవును బామ్మా …… మాకు మీరంటే ప్రాణం ఎలా ఒప్పుకుంటాము అని బాధపడుతున్నారు .
అక్కయ్య కాఫీ తీసుకురావడం చూసి , దేవత కన్నీళ్లను తుడుచుకునివెళ్లి అందుకుని , ప్రౌడ్ ఆఫ్ యు చెల్లీ …… అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
అక్కయ్య : స్వీటెస్ట్ కిస్ …… , అక్కయ్యా – తమ్ముడూ …… నిలబడే ఉన్నారా కూర్చోండి అని ఆనందిస్తున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ కాఫీ తాగి సూపర్ అన్నాము . చెల్లీ ……. బామ్మ ఎదురుచూస్తూ ఉంటుంది వెళ్ళొస్తాము .
అక్కయ్య : భోజనం ……. , ఆలస్యం అయ్యింది కదూ ok అక్కయ్యా – తమ్ముడూ ……. , మళ్లీ ఎప్పుడు కలుస్తామో ……
త్వరలోనే అక్కయ్యా …….. , మా అక్కయ్యను చూడాలని మాకు ఉండదా ఏమిటి అని చేతులను స్పృశించాము .
అక్కయ్య : అంతేనా …… ముద్దులు లేవా ప్చ్ ……
ఇద్దరమూ నవ్వుకుని ఒకేసారి అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , అందరమూ చిరునవ్వులు చిందిస్తూ బయటకువచ్చాము .
అంకుల్ …….
డ్రైవర్ : నా మనసుకు మాటిచ్చాను మిమ్మల్ని మీ ఇంటివరకూ వదులుతానని రండి …….
అక్కయ్య : థాంక్స్ అంకుల్ …….
అక్కయ్యా – చెల్లీ …… వెళ్ళొస్తాము అనిచెప్పి ఆటోలో ముందూ వెనుక కూర్చున్నాము .
దేవత : హలో బుజ్జిహీరో …… వెనుక కూర్చోండి .
మీరే కదా మేడం బస్సులో మూడో కన్ను తెరిచారు కూర్చోబోతే …….
దేవత : అదిగో చెల్లి పెదాలపై అంతటి ఆనందాలను పంచినప్పుడే ఆ విషయం మరిచిపోయాను వచ్చి కూర్చో …….
థాంక్స్ మేడం అంటూ నవ్వుకుంటూ కూర్చున్నాను – మేడం …… నిజంగా నేను …..
దేవత : ఆ విషయాన్ని మరిచిపోయాను అని చెప్పానుకదా వదిలెయ్యి , దానికంటే ఈ సంతోషం వంద రెట్లు …….
కానీ నాకు మా మేడం కోపం అంటేనే ఇష్టం కదా ఇప్పుడెలా ……
దేవత : కోపం అంటే ఇష్టమా ఇష్టమా …… అంటూ బుగ్గను గిల్లేసి నవ్వుతూనే ఉన్నారు . బుజ్జిహీరో ……. బస్సులో నలుగురు రౌడీలు – గూండాల్లా ఉన్నారు , భయం వెయ్యలేదా …… ? .
చాలా భయం వేసింది మేడం కానీ ప్రక్కనే అక్కయ్య కన్నీళ్లను చూడగానే కోపం వచ్చిందీ …… వాళ్ళను చంపేయాలనిపించి దైర్యంగా వెళ్ళాను .
దేవత : sooooo క్యూట్ – ప్రౌడ్ ఆఫ్ యు బుజ్జిహీరో ……. , నువ్వు ప్రక్కనే ఉంటే నాకు ఉన్న భయం స్థానంలో ధైర్యం వచ్చేస్తుంది థాంక్యూ …… అని మాట్లాడుకుంటూ మా స్టాప్ చేరుకున్నాము .
అంకుల్ స్టాప్ ఇక్కడే మేడం గారు దిగేది .
దేవత కిందకుదిగి జాగ్రత్తగా వెళ్లు బుజ్జిహీరో …… , ఒక అందమైన ఫీల్ ను కలిగించావు థాంక్యూ థాంక్యూ అంటూ హ్యాండ్ బ్యాగ్ నుండి అమౌంట్ ఇవ్వబోతే …….
అంకుల్ : మీ దగ్గర డబ్బు తీసుకుంటే నేను మనిషినే కాదు మేడం please ….. బాబూ ….. ఎక్కడికి వెళ్ళాలి ? .
దేవత : బుజ్జిహీరో ……. రేపు నిన్ను కలవాలని – తొందరగా రాత్రి గడిచిపోవాలని కోరుకుంటున్నాను .
Wow యాహూ ……. ఫస్ట్ టైం …… కానీ మేడం , నాకు ….. మీ కోపం అంటేనే ఇష్టం – రేపు కలవగానే కోపం తెప్పిస్తాను కదా ……..
దేవత : నిన్నూ అంటూ చెంపపై సున్నితంగా కొట్టి , జాగ్రత్తగా వెళ్లు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు .
అంకుల్ ఒక్కనిమిషం …….
దేవత మెయిన్ గేట్ దాటగానే , బుజ్జితల్లీ …… అంటూ బామ్మ కౌగిలించుకున్నారు .
అంకుల్ ok ……
ఆటో కదులగానే స్టాప్ స్టాప్ అంటూ బామ్మ ……
అంకుల్ అంకుల్ ……
బామ్మ వచ్చి చిరునవ్వులు చిందిస్తూ బుగ్గలను అందుకుని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టారు . ఎక్కడికి వెళ్లిపోతున్నావు ……. దానికోసం కాదు నీకోసమే వచ్చాను – నువ్వు ప్రక్కనే ఉంటే నాకెందుకు భయం .
లవ్ యు బామ్మా …… , అదిగో ముందుకువెళ్లి ఆగి వద్దామని ……
బామ్మ : అవసరం లేదు , నేను …… దాన్ని పిలుచుకుని వెళతాను వెనుకే వచ్చెయ్యి ……. , బయట ఉంటాను అని వెళ్లారు .
లవ్ యు బామ్మా ……, అంకుల్ కు థాంక్స్ చెప్పేసి వెనుకే లోపలికివెళ్ళాను .
దేవతను ఇంట్లోకి వదిలి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినమనిచెప్పి , బాక్స్ లో నాకోసం తీసుకొచ్చి ఇంటి మీదకు పిలుచుకునివెళ్లారు . చంద్రుడి వెన్నెలలో బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చారు .
బామ్మా …… ఫింగర్ చిప్స్ లవ్ యు అంటూ తిని బామ్మను కూడా తినమని చెప్పాను .
బామ్మ : నేను తిన్నానులే బుజ్జిహీరో …… , మొత్తం నీకే తిను ……
దేవత – నేను తినకుండా మీరు తినరని నాకు తెలుసులే బామ్మా …… , మీరు తింటేనే నేనూ తినేది అంటూ బాక్స్ కింద ఉంచేసి చేతులు కట్టుకున్నాను .
బామ్మ : నా బుజ్జిహీరో బంగారం అంటూ దిష్టి తీసి ముద్దుపెట్టారు . ఇదిగో తింటున్నాను .
మా బామ్మ కూడా బంగారం , సూపర్ గా ఉన్నాయి బామ్మా ….. బాగా ఆకలేస్తోంది అంటూ ఇష్టంగా తింటున్నాను .
బామ్మ : బుజ్జిహీరో ……. బస్సులో నా మరొక బుజ్జితల్లిని , నలుగురు వెధవలు నుండి కాపాడావట కదా …… , నీ దేవత …… నీకు ఫ్యాన్ అయిపోయింది – గేట్ దగ్గర నుండి ఇంటివరకూ నిన్ను పొగుడుతూనే ఉంది బుజ్జిహీరో అని …… – బామ్మా ……. నీ బుజ్జిహీరో , హీరో అవునా కాదో కానీ ….. నా స్టూడెంట్ మాత్రం రియల్ హీరో అంటూ …… – దానికి తెలియదు నా బుజ్జిహీరోనే తన బుజ్జిహీరో కూడా అని , తెలిసిన రోజు ఆకాశానికి ఎత్తేస్తుందేమో ……. , బుజ్జి నాన్నా …… నేను ఇంత సంతోషమైన విషయం చెబుతున్నా అలా మూడీగా ఉన్నావేమిటి ? , నీ దేవతేమైనా కొట్టిందా ……. ? .
అక్కయ్య గురించే ఆలోచిస్తూ కొట్టారు …….
బామ్మ : కొట్టిందా ……. ? , అయితే …….
నో నో నో బామ్మా …….
