బామ్మ : నిజం చెప్పు బుజ్జి నాన్నా …….
కొట్టారు …… , నిన్నటికంటే ఒక దెబ్బ ఎక్కువనే తిన్నాను బామ్మా అంటూ సంతోషంగా చెప్పాను – బస్టాండులో అయితే కాస్త గట్టిగానే తగిలింది ఇప్పటికీ చుర్రుమంటూనే ఉంది అంటూ రుద్దుకున్నాను .
బామ్మ : అంత గట్టిగా కొట్టిందా నీ దేవత …… , ఏమంత తప్పు చేసావు అంటూ బుగ్గపై సున్నితంగా స్పృశిస్తున్నారు .
ముద్దుపెట్టు బామ్మా …… మాయమైపోతుంది .
బామ్మ : ఆమాత్రం కూడా తెలియదు నాకు అంటూ ప్రాణంలా ముద్దుపెట్టారు .
ఇప్పుడు హాయిగా ఉంది బామ్మా…….
బామ్మ : అంటే ఇప్పటివరకూ నొప్పి కలిగేలా దెబ్బ ఎందుకు కొట్టింది .
నిజం చెబితే బామ్మ బాధపడతారు – అదీ అదీ ఒక పెద్ద తప్పు చేశాను బామ్మా ……. , బస్టాండులో వెనుక నిలబడి మీ బుజ్జితల్లి రిబ్బన్ ను లాగేసాను .
బామ్మ : రిబ్బన్ లాగినంత మాత్రాన నా బుజ్జిహీరోను ఇంత గట్టిగా ……. ఆగు ఆగు ఆగు నా బుజ్జి మహేష్ ……. తన దేవతతో అలా ఎప్పటికీ ప్రవర్తించడు – ఇప్పుడు నిజం చెప్పు నా మీద ఒట్టు …….
బామ్మా …… అంటూ చేతిని లాగేసుకున్నాను . వదిలెయ్యండి బామ్మా ……. నా బాధకు కారణం …….
బామ్మ : ముందు ఈ కారణం చెప్పు , ఒట్టు వేశావు మరొక అపద్ధం చెప్పకూడదు .
బామ్మా బామ్మా అదీ …… వేరే వాడు లాగాడు – వెనకున్నది నేనే కాబట్టి ……
బామ్మ : నువ్వే లాగావని కొట్టిందన్నమాట , దెబ్బ గట్టిగా తగిలిందా బుజ్జిహీరో …… అంటూ బాధపడుతున్నారు .
ఇదిగో ఇలా బాధపడతారనే చెప్పలేదు . వాడిని అక్కడికక్కడే బాగా కొట్టి రిబ్బన్ తీసుకుని మీ బుజ్జితల్లికి ఇచ్చానులే బామ్మా …….
బామ్మ : బాగా కొట్టావు కదూ …… లేకపోతే నా బుజ్జిహీరోనే కొట్టిస్తాడా వాడు – నేను కనుక ఉండి ఉంటే ముందు వాడి రక్తం కళ్ళచూసి ఆ తరువాత నీ దేవత చెంపలు చెల్లుమనిపించేదానిని ….. – నీ దేవత రిబ్బన్ మాత్రమే కాదు ఏమైనా లాగే హక్కు అర్హత నా బుజ్జిహీరోకు ఉంది – నీకు ఏమైనా చెయ్యాలనిపిస్తే చేసెయ్యి బుజ్జిహీరో ….. నేనున్నాను కదా ……
తియ్యదనంతో నవ్వుకున్నాను . నో నో నో please please బామ్మా ……. , అందుకు కూడా చెప్పలేదు – ఉదయం మీరు దేవతను కొట్టిన దెబ్బలే కాలేజ్ చేరేంతవరకూ రుద్దుకునేలా చేశాయి – నావల్లనే అని నాకు చాలా బాధవేసింది .
బామ్మ : నా బుజ్జిహీరో బాధపడితే కొట్టనులే అని నవ్వుకున్నాము .
వెంటనే మళ్లీ sad మూడ్ లోకి వెళ్ళిపోయాను .
బామ్మ : బుజ్జి నాన్నా …… ఇప్పుడు చెప్పు , నా బుజ్జిహీరో బాధకు కారణం ఏమిటి ? .
బామ్మా బామ్మా …… అక్కయ్యకు – మీ చిన్న బుజ్జితల్లికి చిన్నప్పటి నుండీ చూపులేదు , ఆపరేషన్ చేసి వేరేవాళ్ళ కళ్ళు పెడితే చూపు వస్తుందని డాక్టర్స్ చెప్పారట – govt హాస్పిటల్లో చాలాసార్లు అక్కయ్య వంతు వచ్చినా డబ్బులకు వేరేవాళ్లకు …….. అంటూ కన్నీళ్ళతో బామ్మ ఒడిలోకి చేరాను – అక్కయ్యకు ఉన్నది కూడా మీలాంటి బామ్మగారే , నా కళ్ళు ఇచ్చేస్తాను తల్లీ అని రోజూ బాధపడుతున్నారు .
బామ్మ : నా బుజ్జితల్లి తప్పకుండా ఒప్పుకుని ఉండదు – దానికంటే ఇలానే ఉంటాను అని ఉంటుంది .
అవును బామ్మా ……. , చిన్నప్పటి నుండీ అక్కయ్య ఎన్నో ఇబ్బందులు – కష్టాలు – అవమానాలు – ఆకతాయిల వలన కన్నీళ్లు ……. , అక్కయ్యకు చూపు రావాలంటే ఏమిచెయ్యాలి బామ్మా ……. ? .
బామ్మ : అమ్మా దుర్గమ్మా …… , నా బుజ్జిహీరో స్వచ్ఛమైన కోరికను తీర్చలేరా ….. ?.
లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ బామ్మా …… , మన దైవమైన పెద్దమ్మను ప్రార్ధిస్తాను , అక్కయ్యకు చూపు రావడం కోసం ప్రతిఫలంగా ఏమి చెయ్యమన్నా చేస్తాను .
బామ్మ : నేను కూడా బుజ్జిహీరో …… , ప్రార్థించి ప్రతిఫలంగా ఏమి చెయ్యమన్నా చేస్తాను అంటూ ప్రార్థించారు – పెద్దమ్మా …… చూపు లేకపోతే ఎలా ఉంటుందో అదికూడా వయసుకొచ్చిన అమ్మాయికి చాలా చాలా కటం – నా బుజ్జితల్లిని కంటికి రెప్పలా చూసుకోవడానికి మన బుజ్జిహీరో ఉన్నాడు కాబట్టి , ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ ముసలిదాని ప్రాణాలను తీసుకుని నా చిట్టితల్లి చూపును ప్రసాదించు .
బామ్మా …… అంటూ నోటిని చేతితో మూసేసి కన్నీళ్ళతో గుండెలపైకి చేరాను . పెద్దమ్మా …… ఎవ్వరూ లేని అనాధను నేను , నా ప్రాణా …….
బామ్మ నా నోటిని మూసేసి , ఏమి కోరుకోబోతున్నావో నాకు తెలుసు , అలా ఎప్పటికీ జరగనివ్వను జరగనివ్వను అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకున్నారు.
బామ్మా బామ్మా …… ఒంటరిగా నాకు భయమేస్తోంది – ఇక్కడ కూడా నా స్టూడెంట్ బుజ్జిహీరో ఉంటే బాగుండేది – తప్పు తప్పు ఇలా కోరుకోవడం తప్పు , తన బామ్మగారిని చూసుకోవాలికదా అంటూ లెంపలేసుకున్నారు దేవత …….
బామ్మా ……. వెళ్ళండి , నేను హోమ్ వర్క్ చేసుకుని …….
బామ్మ : భోజనం మాత్రం ఇక్కడే చెయ్యాలి , ఎంత ఆలస్యమైనా సరే రావాలి , ఆకలివేస్తే కాల్ చెయ్యి ఫుడ్ అక్కడికే పంపిస్తాను .
లేదు లేదు బామ్మా …… , మీతో కలిసి తినాలని ఆశ ……
బామ్మ : అయితే మరీ మంచిది అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టారు . బుజ్జితల్లీ ……. వస్తున్నాను అని లేచి లంచ్ బ్యాగ్ తీసుకుని కిందకువెళ్లి , నా దేవతను లోపలికి తీసుకెళ్లగానే బ్యాగు వేసుకుని కిందకుదిగి వెళ్లి ఔట్ హౌస్ చేరుకున్నాను .
బ్యాగుని బెడ్ పై ఉంచి ఫ్రెష్ గా స్నానం చేసి వేరే డ్రెస్ వేసుకుని , పెద్దమ్మ పేపర్ ముందు కూర్చున్నాను .
పెద్దమ్మా …… అక్కయ్యకు చూపు వచ్చే మార్గం చూయించండి – చిన్నవాడినైనా ఎంత కష్టమైనా నేను చేస్తాను , నా దేవత మరియు బామ్మ కోరిక కూడా అదే అంటూ భక్తితో ప్రార్థించాను . మాకు అంటే అబ్బాయిలకు చూపు లేకపోతే ఎలాగోలా జీవనం కొనసాగిస్తాము కానీ అమ్మాయిలకు చాలా కష్టం – ఈరోజు జరిగినది మీరు చూసే ఉంటారు , ఈరోజే ఇలా జరిగిందంటే ఇన్నిరోజులూ …….. నో నో నో అలా ఇక ఎప్పటికీ జరుగకూడదు , అక్కయ్య చాలా చాలా మంచివారు – వారి బామ్మ కళ్ళు ఇస్తాను అన్నా వద్దు అని చెప్పారు అంటే అర్థమవుతోంది – మీకు చెప్పాల్సిన అవసరం లేదు , పెద్దమ్మా ……. please please అంటూ కన్నీళ్ళతో ప్రార్థించాను .
లేచి ఫ్రెండ్స్ కు కాల్ చేసి హోమ్ వర్క్ ఏమిటో తెలుసుకుని 8: 30 లోపు ఒక్క సబ్జెక్ట్ తప్ప అన్నీ పూర్తిచేసాను .
అదేసమయానికి ఫ్రెండ్స్ అందరూ వచ్చి హోమ్ వర్క్ మొదలుపెట్టారు . నేనూ అప్పుడే స్టార్ట్ చేసినట్లు వెళ్లి కూర్చుని అర గంటలో మిగిలిన సబ్జెక్ట్ కూడా పూర్తిచేసి , నా హోమ్ వర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ – కాలేజ్ కు కలర్ డ్రెస్ తో వెళ్లడం వలన గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ పనిష్మెంట్ వలన చాలా అలసిపోయాను వెళ్లి పడుకుంటాను అనిచెప్పి నీరసం నటిస్తూ ఔట్ హౌస్ చేరుకున్నాను .
బుక్స్ బ్యాగులో ఉంచేసి , లోపల నుండి గెళ్ళెం పెట్టేసి , ఔట్ హౌస్ వెనుక నుండి కాంపౌండ్ గోడను జంప్ చేసి నా దేవత ఇంటికి చేరుకున్నాను .
నాకోసమే ఎదురుచూస్తున్నట్లు గుమ్మంలో కూర్చున్న బామ్మ , ఆగమని చేతితో సైగచేసి పైకి వెళ్ళమని చూయించారు .
అంటే ఇంకా దేవతపడుకోలేదన్న మాట అంటూ నెమ్మదిగా మెయిన్ గేట్ తెరుచుకుని పైకివెళ్ళాను . పైన లైట్ వేసి డిన్నర్ కోసం దుప్పటిపై అంతా సెట్ చేసి ఉండటం చూసి ఆనందించాను .
