బామ్మా …… లైట్స్ ఆఫ్ చెయ్యండి , మీ బుజ్జితల్లి ఇబ్బందిపడుతున్నారు .
బామ్మ : మరి నీకు కనిపించదు కదా …….
పెద్దమ్మను తలుచుకుంటే X- ray కళ్ళు ఇస్తారు – ఎంత చీకటిలోనైనా ఎంత దూరంలో ఉన్నా క్లియర్ గా కనిపిస్తారు . బామ్మా ……. దేవత మరింత వెలుగులో కనిపిస్తున్నారు .
బామ్మ : నాకు కూడా నా బుజ్జిహీరో ……..
అంటే మీరు కూడా పెద్దమ్మను ……. అంటూ నవ్వుకున్నాము సౌండ్ లేకుండా …..
దేవతను చూస్తూ చూస్తూనే హాయిగా నిద్రపోయాను .
***********
అలారం చప్పుడుకు దేవత మేల్కొని గుడ్ మార్నింగ్ బామ్మా ……. అంటూ కళ్ళు తిక్కుకుంటూ బాత్రూం వైపుకు వెళ్లిపోయారు నిన్నటిలానే ……
హమ్మయ్యా అని నవ్వుకుని లేచికూర్చున్నాను . నాకు జోకొడుతూనే గోడకు ఆనుకుని నిద్రపోతున్న బామ్మపై తియ్యనికోపం వచ్చింది – బామ్మా …… అంటూ మురిసిపోతూ అతిజాగ్రత్తగా బెడ్ పై పడుకోబెట్టాను . నాకు జోకొడుతూ ఎప్పుడు నిద్రపోయారో ఏమో హాయిగా నిద్రపోండి అని దేవత కప్పుకున్న దుప్పటిని అందుకుని ఆఅహ్హ్ …… అంటూ గుండెలపై హత్తుకుని నన్ను నేను మరిచిపోయాను . బామ్మ చలికి ముడుచుకోవడం చూసి మొట్టికాయ వేసుకుని బామ్మ భుజాలవరకూ కప్పి గుడ్ మార్నింగ్ బామ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టాను .
గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో …… అంటూ నిద్రలోనే కలవరించారు బామ్మ .
నవ్వుకుని డోర్ తాళం తెరిచి , తలుపులు ముందుకువేసుకుని ఔట్ హౌస్ చేరుకున్నాను .
రోజూలానే ఫ్రెష్ అయ్యి కాలేజ్ డ్రెస్ వేసుకునేంతలో కాలింగ్ బెల్ మ్రోగింది . బామ్మ ……. టిఫిన్ పంపించారు అని పెదాలపై చిరునవ్వులతో ఓపెన్ చేసి క్యారెజీ అందుకుని తిన్నాను . క్యారెజీ శుభ్రం చేసి కాలేజ్ బ్యాగ్ మరియు శుభ్రం చేసిన క్యారీజీతోపాటు బయటకువచ్చాను .
మురళి కూడా అదేసమయానికి కాలేజ్ బ్యాగుతో బయటకు రావడం చూసి , మురళి సర్ …… మీ పనిష్మెంట్ ఇంకా పూర్తికాలేదు కాలేజ్లో కలుద్దాము అని వెనుతిరిగిచూడకుండా బయటకువచ్చాను . నాకది పనిష్మెంట్ కాదు మురళీ అనుకుని నవ్వుకుంటూ దేవత ఇంటికి పరుగుతీసాను – దేవత …… బామ్మను కౌగిలించుకుని వెళ్ళొస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ – లంచ్ బ్యాగుతోపాటు మెయిన్ గేట్ వైపు నడిచారు , మధ్యమధ్యలో బుగ్గలను రుద్దుకుంటున్నారు .
దేవత కాస్తదూరం వెళ్లగానే , బామ్మ దగ్గరికి చేరి దేవతను కొట్టనని ప్రామిస్ చేసి కొట్టారు కదూ అని బుంగమూతిపెట్టుకునే నవ్వుతున్నాను – నేనంటే బామ్మకు ఎంత ప్రాణమో అర్థమయ్యి …….
బామ్మ : లేదు లేదు , నా బుజ్జి బంగారానికి ప్రామిస్ చేసి కొడతానా చెప్పు – బుగ్గలను గట్టిగా గిల్లేసాను అంతే …….
బామ్మా ……..
బామ్మ : కొట్టనని ప్రామిస్ చేసాను కానీ గిళ్లను అని చెప్పలేదుకదా ……. – లేకపోతే నా బుజ్జిహీరోనే కొడుతుందా …… ? అంటూ కౌగిలిలోకి తీసుకుని ముద్దుపెట్టారు .
నవ్వగానే , టిఫిన్ క్యారెజీ అందుకుని గుమ్మం ప్రక్కనే ఉంచిన లంచ్ బ్యాగ్ అందించారు .
అమ్మో ……. దేవత ఫాస్ట్ గా వెళ్లిపోతున్నారు అని బామ్మ బుగ్గపై ముద్దుపెట్టి , బై చెప్పి పరుగుతీసాను .
బామ్మ : జాగ్రత్త బంగారూ …… బై ……
మెయిన్ గేట్ బయట లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు …… దేవతతో మాట్లాడుతుండటం – ప్రక్కనే సెక్యూరిటీ అధికారి జీప్ చూసి , కంగారుపడుతూ మరింత వేగంగా దేవతను చేరుకున్నాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : మేడం …… నిన్న బస్సులో నలుగురిని కొట్టింది మీరేనా ….. ? .
జీప్ లో ఆటో డ్రైవర్ అంకుల్ కూడా ఉండటం చూసి , వారికేమైనా అయ్యిందా …… ? , కొట్టింది నేనే నన్ను అరెస్ట్ చెయ్యండి అన్నాను .
దేవత : లేదు లేదు మేమే రక్తం వచ్చేలా కొట్టింది – చిన్నపిల్లాడు ఎలా కొడతాడు చెప్పండి – నన్ను తీసుకెళ్లండి ……
లేడీ సెక్యూరిటీ అధికారి : నో నో నో అలాంటిదేమీ లేదు , మా SI సర్ మీ ఇద్దరినీ పిలుచుకుని రమ్మన్నారు .
సెక్యూరిటీ అధికారి మేడం ……. , మేడం కు ఎటువంటి సంబంధం లేదు , అదిగో బస్ వస్తోంది – మేడం …… మీరు కాలేజ్ కు వెళ్ళండి , నేను SI సర్ ను కలిసి అటునుండి ఆటే కాలేజ్ కు వచ్చేస్తాను .
దేవత : నో నో నో నేను వెళ్లను , సెక్యూరిటీ అధికారి మేడం …… నేనూ వస్తాను పదండి అని జీప్ వైపు అడుగులువేశాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : అరెస్ట్ కాదు మేడం – బాబూ …… , మిమ్మల్ని జాగ్రత్తగా పిలుచుకురమ్మని SI గారు వారి సొంత కారుని పంపించారు , రండి అంటూ పిలుచుకునివెళ్లి జీప్ ప్రక్కనే ఉన్న కార్ డోర్స్ తెరిచారు .
ఆశ్చర్యపోతూనే ఒకరినొకరం చూసుకుని లగ్జరీ కారులో వెనుక ప్రక్కప్రక్కనే కూర్చున్నాము .
లేడీ సెక్యూరిటీ అధికారి : అంకుల్ …… మీరుకూడా అంటూ పిలిచి ముందు సీట్లో కూర్చోబెట్టారు .
లేడీ సెక్యూరిటీ అధికారి స్వయంగా డ్రైవ్ చేస్తూ 20 నిమిషాలలో govt హాస్పిటల్ కు తీసుకెళ్లారు .
మేడం ……. హాస్పిటల్ కు అంటే , ఎముకలు విరిగేలా కొట్టేసినట్లున్నాము .
దేవత : వాళ్లకు ఆ శిక్ష పడాల్సిందే బుజ్జిహీరో ….. – you are a real బుజ్జిహీరో ……. లేకపోతే మీ అక్కయ్యను , నా చెల్లిని ఏడిపిస్తారా ? .
లేడీ సెక్యూరిటీ అధికారి : మేడం – బాబూ – అంకుల్ ……. లోపలికి రండి అని ఆరడుగుల ఎత్తున్న సెక్యూరిటీ అధికారి దగ్గరికి తీసుకెళ్లారు .
సెక్యూరిటీ అధికారి : ప్రౌడ్ ఆఫ్ యు మై బాయ్ – మేడం అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి , దేవతకు నమస్కరించారు . ఇంత చిన్నవయసులో అంత ధైర్యం శభాష్ సెల్యూట్ చేస్తున్నాను . లేడీస్ తో కుమ్మించావట కదా హాట్సాఫ్ ……. , sorry నేనే స్వయంగా రావాల్సినది – మిస్ కావ్య అదే అదే మీ ఇద్దరి తోబుట్టువు దగ్గర ఉండాల్సి వచ్చింది.
అక్కయ్య – చెల్లి ……. అంటూ ఇద్దరమూ కంగారుపడ్డాము . సెక్యూరిటీ అధికారి సర్ – సర్ …. అక్కయ్యకు – చెల్లికి ఏమయ్యింది …… ఎక్కడ ఉన్నారు అంటూ చుట్టూ చూస్తున్నాము .
సెక్యూరిటీ అధికారి : నో నో నో కంగారుపడాల్సిన అవసరమే లేదు – ఇది సంతోషించాల్సిన విషయం . మీ అక్కయ్య …… ఆపరేషన్ రూంలో ఉంది .
ఆపరేషన్ రూమ్ అంటూ ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి .
సెక్యూరిటీ అధికారి : sorry sorry ఇంత ప్రాణమా – అక్కడ కావ్యకూడా ఇంతే మీరొస్తేనే కానీ ఆపరేషన్ చేయించుకోను అంటోంది . ముందు మీ ముగ్గురినీ కలపాలి లేకపోతే గోదావరి పారేలా ఉంది అంటూ ఆపరేషన్ రూమ్ కు తీసుకెళ్లారు .
ఆతృతగా డోర్ తెరిచాను . బెడ్ పై అక్కయ్య చిరునవ్వులు చిందిస్తుండటం చూసి ప్రాణం లేచొచ్చింది . అక్కయ్యా – చెల్లీ …… అంటూ ఆప్యాయంగా పిలిచి బెడ్ దగ్గరకు వెళ్ళాము .
అక్కయ్య : తమ్ముడూ – అక్కయ్యా ……. అంటూ చేతులు చాపడంతో అందుకుని ముద్దులుపెట్టాము . మా బుగ్గలను స్పృశించి , బామ్మా …… చెప్పానుకదా నేను హాస్పిటల్లో ఉన్నానని తెలియగానే కన్నీళ్లు వచ్చేస్తాయని …….
బామ్మ : అవును బుజ్జితల్లీ …… ,నువ్వంటే ఎంత ప్రాణమో ఆ కన్నీళ్లే చెబుతున్నాయి .
అక్కయ్య : లవ్ యూ తమ్ముడూ – లవ్ యు అక్కయ్యా …….
లవ్ యు అక్కయ్యా – చెల్లీ ……..
అక్కయ్య : sorry తమ్ముడూ ……. , కాలేజ్ కు వెళ్లే మిమ్మల్ని ఒకసారి కలవాలనిపించి పిలిపించాను – కలిశాను మీరు వెళ్ళండి సాయంత్రమే ఆపరేషన్ చేయించుకుంటాను కాలేజ్ వదిలాక ……..
అక్కయ్యా – బామ్మా ……. ఆపరేషన్ ? .
సెక్యూరిటీ అధికారి : నిన్న మీరు పట్టించిన వాళ్లపై ఎన్నో కేసులు ఉన్నాయి . వాళ్ళల్లో ఒకరి కళ్ళు తీయించి మీ అక్కయ్యకు పెట్టించాలని నేనే నిర్ణయం తీసుకున్నాను .
