పున్నమి రాత్రులు
మొదటి పున్నమి
సాధువు వెళ్ళిపోయాక నక్షత్ర ఇచ్చిన బట్టలు వేసుకొని అక్కడే కూలబడింది చంద్రలేఖ. తన కళ్లలో నుండి నీళ్లు కారుతున్నాయి..
సానుభూతిగా లేఖ భుజంపై చేయి వేసి పక్కనే కూర్చుంది నక్షత్ర.
నక్షత్ర: సారీ నే.. ఇలా జరుగుతుందనుకోలేదు… … అంది బాధగా…
చంద్రలేఖ: ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పు..
నక్షత్ర: అయినా నాకొక డౌటూ… ఆ సాధువు కి శపించేంత శక్తి ఉందా… అసలు నిజమైన సాధువేనా … ఈ రోజుల్లో అసలు తపస్సులు చేసే మునులు ఉంటారంటావా… ఉన్నా శపించగలిగే మునులు ఎక్కడున్నారు… లేక ఎవడైనా వేషం వేసుకుని మన మీద ఫ్రాంక్ చేశాడేమో… అవును అంతే అయ్యుండొచ్చు… నువ్వేం బాధ పడకు … పద వెళ్దాం… అంటూ విషయాన్ని తేలిక చేసే ప్రయత్నం చేసింది.
చంద్రలేఖ: ఒక వేళ నిజమే అయితే…
నక్షత్ర: పౌర్ణమి రోజున మాత్రమే అన్నాడుగా పదా… అప్పుడు చూసుకుందాం..
చంద్రలేఖ: ఇవ్వాళే పౌర్ణమి
నక్షత్ర: అవును ఇవ్వాళ పౌర్ణమి అని చెప్పాడు కదా… అంటే ఈ రోజు నుండే ఆ శాపం పని చేస్తుందా… టెస్ట్ చేసి చూద్దామా…
చంద్రలేఖ: ఏంటి టెస్టు చేసి చూస్తావా… నా బతుకు నీకు నవ్వులాట గా ఉంది కదే…
నక్షత్ర: చీ చీ అలా ఏం కాదే… శాపం నిజమో కాదో ఎలా తెలుస్తుంది మరి…
చంద్రలేఖ: ఏమీ తెలియక్కర లేదు… అది నిజం కానీ కాకపోనీ… మనం మాత్రం ఈ రోజు ఎవరి కంటా పడకుండా ఉంటే చాలు… ఆయన చెప్పినట్టు శాప విమోచనం అయిపోతుంది. ఒక వేళ అతను చేసింది ఫ్రాంక్ అయినా కూడా ఈ నైట్ ఇక్కడెక్కడైనా ఉన్నందువల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదు… మహా అయితే మన టీం వాళ్ళు మనల్ని తిడుతారు అంతే …
నక్షత్ర: అంతే అంటావా…
చంద్రలేఖ: ఇంకో విషయం… ఆ శాపం నిజం కానీ కాకపోనీ.. ఇక్కడ జరిగింది మాత్రం మనం ఎవరికీ చెప్పొద్దు… ఎందుకు రాలేదు అంటే ఏదో ఒకటి చెప్పేద్దాం లే …
సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడేలోగా ఇద్దరూ కలిసి చుట్టు పక్కల ఆ రాత్రికి పడుకునేందుకు అనువైన ప్రదేశాన్ని వెతికారు. జలపాతానికి దగ్గరలోనే ఒక పెద్ద మర్రి చెట్టు కనబడింది… విశాలమైన దాని కొమ్మల పైన ఎక్కి రాత్రికి పడుకోవచ్చని డిసైడ్ అయ్యారు.
మళ్ళీ జలపాతం వద్దకు వచ్చి గట్టిన కూర్చున్నారు.
చుట్టు వెన్నెల పరుచుకుంటుంది. పండు వెన్నెల్లో ఎత్తిమీదునుండి జారుతున్న జలపాతం, ఆ నీళ్ల శబ్దం చూస్తుంటే ఎంతో రమణీయంగా ఉంది అక్కడి వాతావరణం. ఇద్దరూ చాలాసేపు అక్కడే కూర్చుని ఆ ప్రకృతి రమణీయతను చూస్తూ మైమరచి పోయారు.
చంద్రలేఖ: ఎంత అందంగా ఉందే… ఇక్కడ… ఆ నీళ్ళు, ఈ గాలి, వెన్నెల, ఇక్కడ ఈ ఒడ్డున నువ్వూ నేను… బ్యూటిఫుల్… ఇంతటి అందాన్ని ఎప్పుడూ చూడలేదు… ఎంత సేపు చూసినా తనివి తీరడం లేదు…
నక్షత్ర: లేఖా… ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా…
చంద్రలేఖ: ఎంత…
నక్షత్ర: 8.30… ఇంకాసేపైతే 9 అవుతుంది
చంద్రలేఖ: ఆ తర్వాత.. పది అవుతుంది.. అయితే ఏంటి
నక్షత్ర: 9 తర్వాత ఇటు వైపుగా ఎవడైనా మగవాడు వస్తే…ఈ పండు వెన్నెల లో, ఈ అందమైన ప్రదేశంలో… ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి లో… ఈ జలపాతపు హోరు సాక్షిగా.. నేను చూస్తుండగానే… ఈ రోజే నీకు శోభనం జరుగుతుంది… అంది నవ్వుతూ
చంద్రలేఖ: దొంగ ముండా… నీకు నవ్వులాట గా ఉందే…
అంటూ కొట్టబోయింది లేఖ…
ముందే ఊహించిన నక్షత్ర తప్పించుకుని లేచి పరిగెత్తింది.
లేఖ తన వెంట పడింది…
పరుగెత్తుతూ వచ్చిన లేఖ సరాసరి మర్రి చెట్టు మీదికి ఎక్కగా లేఖ కూడా తనని అనుసరించింది.
ఇద్దరూ చెట్టెక్కి తమ బ్యాగ్ లలో నుండి వెంట తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ తినేసి పడుకుందామని try చేస్తున్నారు. సమయం 9 దాటింది. చెరో కొమ్మపై పడుకున్న ఇద్దరికీ అదో లాంటి భయం పట్టుకుంది.
**************************
**************************
చంద్ర లేఖ, నక్షత్ర ఇద్దరూ వాటర్ ఫాల్ వైపు వెళ్ళాక వారి టీం మేట్స్ అక్కడే కాసేపు రెస్టు తీసుకున్నారు..
గంట లో వస్తాం అని వెళ్ళిన వాళ్ళు రెండు గంటలైనా రాక పోయే సరికి వాళ్ళకు ఏం చెయ్యాలో తెలియలేదు.
పైకి వెళ్ళాలా… లేక వాళ్ళు వచ్చే వరకు ఆగాలా అని డిస్కస్ చేశారు.
అక్కడే ఆగితే వాళ్ళు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది.
వాళ్ళలో హరి అనే వాడికి వీళ్ళిద్దరూ కాలేజ్ నుండి ఫ్రెండ్స్… అందుకని
హరి: మీరు పైకి వెళ్ళండి… నైట్ మీరు టెంట్ వేసిన చోట చెట్లకి మన తెల్ల జెండాలు కట్టండి… నేను వాళ్ళని వెతికి తీసుకొని అక్కడికి వస్తాను.. అని చెప్పాడు.
ఆ విధంగా డిసైడ్ అయ్యాక వాళ్ళంతా పైకి వెళ్లగా హరి నీటి శబ్దం వింటూ… నక్షత్ర వాళ్ళు వెళ్ళిన వైపుగా బయలు దేరాడు…
నక్షత్ర వాళ్ళు జలకాలాడిన ప్రదేశానికి హరి వచ్చిన సమయంలో వాళ్ళిద్దరూ సాధువు దగ్గర ఉన్నారు.
హరికి వాళ్ళు కనబడకపోవడంతో అలాగే ఆ జలపాతపు నీళ్ళ వెంబడి వెతుకుతూ కింది వైపుకు వెళ్ళాడు. ఒక గంటకు పైగా కిందికి చూస్తూ వెళ్ళి ఎక్కడా కనబడక పోయే సరికి మళ్ళీ వెనక్కి నీటి వెంబడే నడుస్తూ వచ్చాడు. చుట్టు పక్కల కూడా చూస్తూ, నక్షత్రా…, లేఖా… అంటూ గట్టిగా పిలుస్తూ పరిసర ప్రాంతాలు అన్నీ గాలిస్తూ వచ్చాడు.
9.30 సమయానికి హరి మళ్ళీ మన నాయికలు ఉన్న ప్రదేశానికి వచ్చాడు.
నక్షత్రా అనే పిలుపు వినబడగానే ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఇలా హరి తమను వెతుక్కుంటూ వస్తాడని వాళ్ళు ఊహించలేదు.
చంద్రలేఖ: వీడొచ్చాడేంటే …..ఇప్పుడేం చేద్దాం…
నక్షత్ర: కామ్ గా పడుకో… అరిచి, అరిచి వాడే వెళ్ళిపోతాడు…
చంద్రలేఖ: పాపం … మన కోసమే వచ్చాడు… కంగారు పడుతున్నాడు… పోనీ ఒక పని చేయవే… నువ్వెల్లి మనం సేఫ్ గానే ఉన్నాం… కంగారు పడొద్దని చెప్పి వస్తావా?
