మధు’కలశం 106

ఆ రోజు రాత్రి 11 గంటలప్పుడు ఉరేసుకోవాలని అనుకున్నాం. అప్పుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాం అని ఒక ఉత్తరం రాసి పేట్టి హాల్లో ఉన్న రెండు ఫ్యాన్ లకి రెండు తాల్లు బిగించాడు. ఒక స్టూల్ మీద నన్ను ఎక్కించి, నా మెడకి తాడు తొడిగి ఆయన కూడా ఇంకో స్టూల్ మీద ఎక్కి తాడు మెడకు తగిలించుకుని నంబర్స్ కౌంట్ చెయ్యడం మొదలు పెట్టాడు. 10 వరకు కౌంట్ చెయ్యగానే స్టూల్ తన్నేయాలని అనుకున్నాం మేము. ఆయన ఒకటి, రెండు, మూడు అన్న సమయంలో డోర్ బెల్ శబ్ధం వినబడింది. ఆయన నేను మొఖాలు చూసుకున్నాం. ఈ టైం లో ఎవరా అని ఆలోచిస్తున్నాము. ఆయన కౌంటింగ్ ఆపేశాడు. ఇంతలో డోర్ మీద దబా డబా బాదడం ఎక్కువయింది. మేం ఉరి వేసుకుంటున్న సంగతి ఎవరికో తెలిసిందని అర్థం అయింది. ఏం చేద్దాం అన్నట్టుగా ఆయన వైపు చూసాను. ఇక్కడ వరకు వచ్చాక ఆగడం వద్దు అని చెప్పి ఆయన కౌంటింగ్ స్టార్ట్ చేసాడు. ఎనిమిది, తొమ్మిది అంటుండగా ధడేల్ మని తలుపు తీసుకుని ముగ్గురు నలుగురు లోపలికి వచ్చేశారు. ఇంటి ఓనర్, అతని భార్య, కొడుకుతో పాటు మా వారి కసిన్ చరణ్ కూడా వాళ్ళతో ఉన్నారు. లోపలికి రావడంతోనే మమ్మల్ని తాళ్లనుండి విడదీసి సోఫాలో కూర్చునబెట్టారు.

మేము రాసిన ఉత్తరం ఇంటి గలావిడకు దొరికింది. వాళ్లంతా ఏవేవో చెబుతున్నారు గానీ మాకు అవేవీ వినబడడం లేదు. బొమ్మల్లా కూర్చుండి పోయాం. కాసేపటికి చరణ్ తప్ప అందరూ వెళ్ళిపోయారు.
చరణ్ మా ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. అతని చేతిలో మేం రాసిన ఉత్తరం ఉంది.

అలా ఎంత సేపు కూర్చున్నాము అనేది తెలియదు కానీ చాలా సేపు మాత్రం అయ్యింది. చివరికి చరణ్ మా ఆయన పక్కన వచ్చి కూర్చొని ఏన్టన్నయ్యా ఈ పిచ్చి పని అని అడిగాడు.

ఒక్కసారిగా మా ఆయన బోరుమన్నాడు. చరణ్ ఓదారుస్తూ ఉంటే ఈయన జరిగిందంతా చెప్పాడు.

మరుసటి రోజు చరణ్ అప్పుల వాళ్ళ ను అందరినీ పిలిపించి మా అప్పులన్నీ తీర్చేసాడు. ముందు మా ఆయన దానికి ఒప్పుకోలేదు. అయితే చరణ్ వినలేదు. మా సంతృప్తి కోసం మా వద్ద ఉన్న షేర్స్ అన్నీ తీసుకొని అప్పులు కట్టేసాడు మమ్మల్ని ఆ ఇల్లు ఖాళీ చేయించి తనతో పాటే బెంగుళూరుకు తీసుకెళ్ళాడు.

చరణ్ మా వారికి దూరపు బంధువు . తమ్ముడి వరస అవుతాడు. వయసు 29. బెంగుళూర్ లో వాళ్ళకి ఒక ఫార్మా కంపెనీ ఉంది. కష్టపడి పైకొచ్చడని మా వారంటే వాళ్ళకి చాలా అభిమానం. ఎప్పుడు హైదరాబాదు వచ్చినా మా ఇంటికి వచ్చేవారు. అయితే మా వారు ఎప్పుడూ బంధువుల వద్ద తన ఇబ్బందులు చెప్పేవాడు కాదు.

ఆ రోజు సాయంత్రం నుండి ఫోన్ చేసినా మా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చేసరికి తన మీటింగ్స్ పూర్తి అయ్యాక సరాసరి ఇంటికే వచ్చేసాడట. మేము అదే సమయంలో స్తూల్స్ మీద ఉన్నాము. ఎలాగూ రాత్రి 11 అయ్యింది కదా అనో ఏమో కిటికీలు మూయక పోవడం లైట్స్ ఆన్ లోనే ఉంచడం మేము చేసిన పొరపాటు. చరణ్ అది చూసి వెంటనే ఓనర్ వాళ్ళని లేపి డోర్ పగలగొట్టుకునే వచ్చి మమ్మల్ని కాపాడాడు.

తర్వాత తనతో పాటు తీసుకుని వచ్చి ఇక్కడ బెంగళూర్ లో తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మా వారికి తన కంపెనీ లోనే ఒక మంచి జాబ్ ఇచ్చాడు. గత ఏడాది కాలంగా మేము మళ్ళీ హ్యాపీగా ఉన్నాము. మునుపట్లాగే సంతోషంగా ఉన్నాము. చరణ్ వాళ్ళ అమ్మా, నాన్న వైజాగ్ లో ఉంటారు. వారం కిందటే ఇక్కడికి వచ్చి ఎంతో బాధ పడుతూ నిన్ననే మళ్లీ వైజాగ్ వెళ్ళిపోయారు.

బాధ ఎందుకు అంటే. 29 ఏళ్లు వచ్చినా చరణ్ పెళ్లి చేసుకోను అని అంటుండడమే. ఎవరు నచ్చ చెప్పినా చరణ్ పెళ్లికి ఒప్పుకోవడం లేదు. వారం రోజులుగా వాళ్ళ అమ్మా నాన్న ఎంతో బతిమాలారు. గత ఏడాది కాలంగా మేము కూడా చాలా సార్లు చెప్పి చూసాము. కారణం ఏంటో తెలియదు. కానీ ఎప్పటికీ పెళ్లి చేసుకోను అంటాడు. ఒక్కగానొక్క కొడుకు ఇలా పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోతాను అంటే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో నేను కళ్ళారా చూసాను. నేను కూడా చాలా సార్లు అడిగా కానీ ఏమీ చెప్పలేదు. వదినా నన్ను బలవంత పెట్టొద్దు ప్లీజ్ అంటాడు. ఏం చెయ్యాలో ఎంతకీ అర్థం కాదు.

నిన్న రాత్రి చరణ్ వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయాక మరోసారి అడుగుదామని చరణ్ గదిలోకి వెళ్ళా.
అప్పటివరకు ఏదో రాస్తున్న వాడల్లా నేను గదిలోకి వెళ్లడంతో చటుక్కున మూసేసి లోపల పెట్టేశాడు. డైరీ లాగా ఉంది అది. ఏంటి వదినా ఇలా వచ్చావ్ అని అడిగాడు. నువు పెళ్లి ఎందుకు చెసుకోవో తెలుసుకుందామని వచ్చా అని చెప్పా. అబ్బా వదినా ప్లీస్ ఆ topic వద్దు నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. నేను ఇంకేమీ మాట్లాడకుండా వచ్చేశాను. ఆ రాత్రి నేను ఆయన కూడా చరణ్ గురించే మాట్లాడుకున్నాం. చరణ్ ఎందుకు ఇంత మొండిగా ఉన్నాడో మాకు అర్థం కాలేదు.

నాకొక డౌట్ అండి. ఎవర్నైనా ప్రేమించి ఉంటాడా? అడిగాను.

అలా ఏం లేదనుకుంటా. నాక్కూడా అదే డౌట్ వచ్చి ఆర్నెల్లు గా వాన్నే అబ్జర్వ్ చేస్తున్నా. ఎవర్నైనా కలవడం గానీ, ఫోన్ లో మాట్లాడడం గానీ చేయలేదు.

అయితే ఒక వేళ చరణ్ కి మగతనం లేదేమో అన్నాను.