ఇంటి యజమాని 6 142

.సార్ ఈరోజు మా జీవితం లో మరచిపోలేని రోజు… ఇలాంటి రోజు నా జీవితం లో ఇచ్చిన మీ ఋణం తీర్చుకోలేము అని ఇమోషనల్ అయ్యారు… సరే మీ అభిప్రాయం ప్రకారం హోటల్ రూం లో వనిత విజయ్ ని ఎమి చేస్తూ ఉంటుంది అని అడిగా.. ఇద్దరూ సిగ్గు పడ్డారు.. వాళ్ళ ఇమోషన్ ని లైట్ చేసి.. కాసేపు మాట్లాడాక వాళ్ళు వెళ్ళిపోయారు.. నేను మధ్యాన్నం అయిన ప్లాంట్ ఎక్స్పాన్షన్ మీటింగ్ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నా.

మార్నింగ్ లేచి రెడీ అయ్యి డ్రెస్ చేసుకునే సరికి బ్రేక్ ఫాస్ట్ వచ్చింది..తింటూ ఉంటే [b]అరవింద ఫోన్…సార్ మోడిఫికేషన్ వర్క్స్ పూర్తి అయ్యాయి ఇల్లు చూడమని మన సివిల్ ఇంజినీర్ చెప్పారు.. వెళ్దామా అని అడిగింది.. ఆమె ఆల్రెడీ హోటల్ కి వచ్చి కింద వెయిట్ చేస్తుంది.. నేను లాబీకి వచ్చి అరవిందా కాఫీ త్రాగుతావా? అని అడిగా.. లేదు సార్ బంగ్లా లో త్రాగుదాం అని చెప్పి కుమార్ కి ఫోన్ చేసింది కార్ వచ్చింది.. ముత్తు, కుమార్ ఇంకా నలుగురు డ్రైవర్ లు వేరే వేరే కార్లకు ఉన్నారు.. నేను కార్లో కూర్చున్నాక డ్రైవర్ డోర్ క్లోస్ చేశాడు.. అరవింద తన కార్ దగ్గరకి వెళ్తుంది.. కుమార్ అరవింద ని కూడా ఈ కార్లో నే రమ్మను అన్నా.. సార్ ఈ కార్ మీ ఫామిలీకి మాత్రమే అని చెప్పాడు.. వేరే కార్ ఇక్కడ ఉందా అని అడిగా.. ముత్తు వచ్చాడు.. నేను, అరవింద ఆ కార్లో బయలు దేరాం.. అరవింద బాడీ పెర్ ఫ్యూం నన్ను మత్తెకిస్తుంది.. ఇంటికి రాగానే ముత్తు డోర్ ఓపెన్ చేసాడు.. నేను దిగేసరికి ఇంట్లో పనివాళ్ళు బయటికి వచ్చి నమస్కరించారు.. అందరికీ నమస్కారం చెప్పి లోపలికి వెళ్ళి నాన్నగారు పంపించిన వాట్స్ అప్ ఓపెన్ చేసి పాయింట్స్ అన్నీ చూసా.. అన్ని పనులు పూర్తి అయ్యాయి.. అరవింద నాతో ఇల్లంతా తిరిగింది.. ఆమె కూడా మొదటి సారి ఇంట్లోకి రావటం అని అర్థం అయ్యింది.. అంతా చాలా బాగా చేసారు.. కొత్త ఇల్లు లాగా తయారయ్యింది.. కార్ల పార్కింగ్, ఔట్ హౌస్ అన్నీ రిమేక్ చేసారు.. సర్వెంట్స్, డ్రైవర్లు ఉండటానికి 10 ఇల్లు సెపరేట్ గా కట్టించారు.. వాళ్ళంతా రావాలంటే మెయిన్ గేట్ నుండే రావాలి వెళ్ళాలి ఆ ఇళ్ళకీ మా ఇంటికీ మధ్యలో వాల్ ఉంది… సెక్యూరిటీ సిస్టం అన్నీ ఆక్టివేట్ చేసారు.. కెమెరాలని ఎక్కడ నుండైనా ఆక్సిస్ చెయ్య వచ్చు.. అంతా చూసేసరికి అరవింద అలిసిపోయింది.. గెస్ట్ డైనింగ్ రూం లో కూర్చున్నాక టీ కాఫీ సర్వ్ చేసారు.. టీ త్రాగేప్పుడు అడిగింది అరవింద సార్ వనిత మీతో ఉన్నప్పుడు మీరు చెప్పినట్లు ఫోన్ చేసి మీతో కొంచెం హార్ష్ గా మాట్లాడా కదా.. మీరు నన్ను క్షమించాలి అంది.. అదేంటి నేను చెపితేనే కదా నువ్వు చేసావు.. దీనికి సారీ ఏంటి అన్నా.. అది సరే కానీ సార్ మీకు నేను ఫోన్ చేసింది అర్థ రాత్రి 12:20 కి.. అప్పుడు మీరు, వనిత విడిగా ఎక్కడ ఉన్నారు, అని సూటిగా ప్రశ్నించింది..

నేను నవ్వా… అదే నా సమాధానం.. అరవింద నన్ను చూస్తూ సార్ నాతో కూడా ఆ టైం వరకు విడిగా ఉండొచ్చు కదా అని అడిగింది…అరవింద కి నా మీద కోరిక ఉందని నాకు తెలుసు..లాస్ట్ రెండు నెలల్లో ఎన్నో సార్లు ఆమె నాకు సిగ్నల్ ఇచ్చింది…ఇస్తుంది..ఆమె కళ్ళు నన్ను తినేసాలా చూడటం నేను చాలా సార్లు గమనించా… నేను మళ్ళీ నవ్వి ఈ సాయంత్రం నువ్వు ఫ్రీ గా ఉంటే కలవొచ్చు అని చెప్పా.. థాంక్స్ అని చెప్పింది.. ఇంతలో మెయింటెనన్స్ స్టాఫ్ హెడ్ వచ్చింది.. వంట వాళ్ళని, క్లీనింగ్ స్టాఫ్, మెయింటెనన్స్ స్టాఫ్ ని సెక్యూరిటీ వాళ్ళనీ అందరినీ నాకు పరిచయం చేసింది అరవింద.. ఇంట్లో ఇద్దరు సెక్రటరీలు, ఇద్దరు ఆఫీస్ అసిస్టెంట్లు ఎల్లప్పుడూ ఉంటారు.. అందరి పేర్లూ తెలుసుకుని గుర్తు పెట్టుకున్నా.. వస్తా అని చెప్పి కార్ ఎక్కా.. అరవింద కూడా కార్ ఎక్కాక ప్లాంట్ 1 కి తీసుకుని వెళ్ళమని ముత్తు కి చెప్పా.. సార్ నన్ను హోటల్ దగ్గర డ్రాప్ చేస్తే నా కార్లో వస్తా అంది.. మేడం సాయంత్రం మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాం మాతో రండి, అన్నా నవ్వుతూ..ముత్తు కూడా నవ్వి చెప్పాడు.. సార్ మీకు పెద్దయ్య గారికి ఉన్న ఒకే తేడా పెద్దయ్య గారు ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు.. అందరితో దూరం మెయింటెయిన్ చేస్తారు.. మీరు అందరిలో ఒకరిగా కలిసిపోతారు అన్నాడు… ముత్తు – సాయంత్రం మేడం ని హోటల్లో డ్రాప్ చేసే బాధ్యత నీదే అని చెప్పా.. సరే సార్ అన్నాడు ముత్తు.. కుమార్ ని కార్ తీసుకుని ఆఫీస్ కి రమ్మను అని చెప్పా.. వెంఠనే అరవింద కుమార్ కి ఫోన్ చేసి చెప్పింది.. ఫాక్టరీకి రాగానే నా రూం కి వెళ్ళి బాబూ రావ్ ఇచ్చిన నా మార్క్ టీ త్రాగి ప్రియాంక కి వైశాలికి పనులు చెప్పి బయలు దేరా.. వైశాలి, పరమేశ్వరన్ & రాజేంద్రన్ పర్సనల్ ఫైల్స్ టేబిల్ మీద పెట్టింది.. మీరు అడిగారు సార్ అంది.. అవును అక్కడ పెట్టు అని వనిత ఎక్కడా అని అడిగా.. రాలేదు సార్ అంది.. సరే నేను జనార్థన్ సార్ దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి ప్రొడక్షన్ హెడ్ చాంబర్ కి వెళ్ళా.. చాంబర్ బయట సుగుణ, మల్లి జనార్ధన్ గారి సెక్రెటరీలు ఇద్దరు బిజీగా ఉన్నారు.. ప్రపంచం లో అన్ని పనుల్లో ముఖ్యమైనది ప్రొడక్షన్.. మల్లి రిసీవ్ చేసుకున్నాడు… నేను వస్తున్నా అని చెప్పడానికి సుగుణ జనార్థన్ గారి రూం లోకి పరిగెత్తింది..

జనార్థన్ గారు మామయ్య క్లాస్మేట్స్..మామయ్య తలలో నాలుక.. జనార్థన్ గారికి తెలియకుండా మామయ్య ఒకటికి కూడా వెళ్ళడు అంట.. నేను అక్కడికి వచ్చేసరికి ఆయన లేచి నిలబడి రండి సార్ అన్నారు.. నేను ఆయన కాళ్ళకి నమస్కారం చేసి నన్ను మీరు సార్ అని పిలవకండి.. ఈశ్వర్ అని గానీ రాజు అని గానీ పిలవండి అన్నా.. నేను ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టడంతో సుగుణకి మల్లికి మూర్చ వచ్చినంత పనైంది.. నా స్ట్రాటజీలు ఆయనకి చెప్పి ఆయన అంగీకారం తీసుకున్నా.. నేను తీసుకునే నిర్ణయాలు ఏమైనా ఆయన సరి చెయ్యదలచుకుంటే నిరభ్యంతరం గా నాకు చెప్పమని అక్కడి నుండి ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్ కి వెళ్ళా.. సెంథిల్ దీప ఉదయకుమార్ సెక్రెటరీలు.. అక్కడ కూడా సీన్ రిపీట్ చేసా… మార్కెటింగ్, బిజెనెస్ డెవలప్ మెంట్, ఇంఫర్మేషన్ టెక్నాలజీ, క్వాలిటీ, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ లన్నింటికీ వెళ్ళా… ఇలా మామయ్య టాప్ మేనేజ్ మెంట్ అందరినీ కంపెనీలో విడి విడిగా కలిసా.. మొత్తం 5 గురు సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు.. నా రూం కి వచ్చేసరికి కల్నల్ రమేష్ వెయిట్ చేస్తున్నారు.. అప్పటికే కంపెనీలో అందరికీ విషయం పాకి పోయింది.. నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలో ఎవరికీ అర్థం కావటం లేదు.. నేనవరికీ అర్థం కాని స్థితికి వెళ్ళిపోయా.. కల్నల్ వచ్చిన విషయం మర్చిపోయి నన్ను పొగిడాడు.. తర్వాత వచ్చిన విషయం చెప్పాడు.. వనిత రాజీనామా చేసింది..ఆమె భర్త ఊరికి వెళ్ళిపోతుంది.. యాక్సెప్ట్ చెయ్యమని రమేష్ రికమండ్ చేసాడు..back ground లో జరిగిన విషయం నా ఆఫీస్ వరకే కనుక ఎవరికీ తెలియదు.. నేను కూడా అరవింద, వైశాలి, ప్రియాంక లని పిలిచి విషయం చెప్పా… ఆమె తన భర్తతో వెళ్ళిపోతుంది కనుక ఆమెని రిటైన్ చెయ్యటం కంటే రిలీజ్ చెయ్యటం కరెక్ట్ అని చెప్పా..

ఎప్పుడైనా ఆమె తిరిగి మన కంపెనీకి రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చని రిలీవ్ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చెయ్యమన్నా.. రమేష్ థాంక్స్ చెప్పాడు.. అమ్మాయిలు వెళ్ళాక భారతి హస్బెండ్ కి ప్లేస్మెంట్ అయినట్లు జాయిన్ అయినట్లు చెప్పాడు..భారతి ఇప్పుడు ఫామిలీ తో హాపీ గా ఉందని చెప్పాడు.. నేను కూడా థాంక్స్ అని చెప్పా.. ఆయన వెళ్ళాక వైశాలిని, భారతిని పిలిచా..సౌభాగ్య రేపు మధ్యహ్నం ఇక్కడికి వస్తుంది కనుక ఆమె టికెట్ గురుంచి వాకబు చేసా.. వైశాలి తెలివైంది కనుక రెండు టికెట్ లు బిజినెస్ క్లాస్ లో బుక్ చేయించి సౌభాగ్యకి జలజకి బోర్డింగ్ పాస్ ఏర్పాటు చేసి హైదరాబాద్ లో మా ట్రావెల్ ఏజెంట్ ఇంటి దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కించి ఇక్కడికి వచ్చాక రెసీవ్ చేసుకునే దాకా కంటిన్యూస్ టచ్ లో ఉండేట్లుగా ఆమె ఇటినెరరీ తయారు చేసుకుంది.. వైశాలి నువ్వు, భారతి రిసీవ్ చేసుకోని తీసుకుని రండి.. నా కార్లో కి వచ్చాక మేము ఇంటికి వెళ్తాం.. మీరు కూడా ఇంటికి రండి అని చెప్పా.. రమేష్ గారిని, అరవిందని, ప్రియాంకని కూడా ఇంటికి రమ్మని చెప్పండి అని ప్రోగ్రాం ఫైనల్ చేసా.. రమేష్ గారిని భారతి ప్రమోషన్ లెటర్ తీసుకుని రమ్మన్నా.. బాబు రావ్ ని పిలిచి కుమార్ ని కార్ రెడీ చెయ్యమని చెప్పి కిందకి వచ్చి రోల్స్ రాయిస్ లో ఇంటికి వెళ్ళి.. జలజ రూం, నా రూం అన్నీ చూసి హౌస్ కీపింగ్ వాళ్ళకి ఆ రూంలలో ఏమేమి పెట్టాలో చెప్పి ప్లాంట్ 1 కి వచ్చేసా.