ఇంటి యజమాని 9 93

. నిన్న అక్క పెద్ద నాటకం ఆడి తెలిసేట్లు చేసింది అన్నాను.. దామోదరం తమ్ముడు మోహన్ కూతురు పూజిత.. దామోదరం తాత, మా నాన్న గారి తాత ఒకరే.. వీళ్ళు నాకు దాయాదులు, నా బ్లడ్ గ్రూప్, నా DNA, మెయిడ్ తీసుని వచ్చిన కాఫీని పూజిత తీసుకుని నాకు ఒక కప్పు ఇచ్చింది.. ఎలా తెలుసుకున్నావ్ రా అంది.. నీకంటే 6 సంవత్సరాలు తర్వాత పుట్టా.. నాకామాత్రం తెలీదా అన్నా.. పెద్దమ్మ నవ్వింది.. టిఫిన్ రెడీ చెయ్యమని మెయిడ్ కి చెప్పింది.. పెదనాన్న చెప్పారు.. భలే దెబ్బ కొట్టావు.. శవాలని కుళ్ళిపోయిందని ఇంట్లో పెట్టలేదు.. స్మశానం లోనే రాత్రంతా ఉంచి ప్రొద్దున్నే తగలెట్టేసారు.. అని చెప్పాడు.. ఆయన సంతోషం గా ఉన్నట్లుంది.. నేనే మీ మాట్లాడ లేదు.. IAS ఆఫీసర్ల బుద్ది నీకు కూడా ఉన్నట్లుంది.. మాట్లాడరు కానీ పనులు చేసుకు పోతారు.. ఏమైనా మేమంతా సంతోషించాం అన్నారు.. పూజిత మా నాన్నమ్మ లాగే ఉంది.. అందుకే ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తూనే ఉంది.. అలాగే పెదనాన్న గారి మాట, వాయిస్ నాన్న గారి మాట, వాయిస్ లాగా నే ఉన్నాయి.. పెదనాన్న నన్ను ఇంట్లో ఒక వైపు తీసుకుని వెళ్ళారు.. అది నాన్న గారు పుట్టినది.. అక్కడే పెరిగారు కూడా.. ఆయన చిన్నప్పటి ఫోటో లు నుండి ఇప్పటి వరకూ అన్నీ కలెక్ట్ చేసి ఉన్నాయి.. నువ్వొచ్చి కొన్ని రోజులు ఇక్కడ ఉండు అన్నారు పెదనాన్న.. నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పా.. తాతయ్యా అని ఇద్దరు పిల్లలు వచ్చారు.. పూజిత పిల్లలు.. వెనకాలే పూజిత హజ్బెండ్.. బావగారి తో పరిచయం అయ్యింది.. ఆయనది వేరే బిజినెస్… పిల్లలకి మామయ్య అని పరిచయం చేసారు.. పూజిత అన్న ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు.. ఫామిలీతో సహా.. అందరం టిఫీన్ చేసాం.. సెట్ దోస వడ కర్రీ.. ఫ్రైడ్ ఇడ్లీ.. వెన్ పొంగల్.. అందరం తిన్నాక బయలు దేరాం.. పూజిత నాతో పాటు వస్తా అంది.. ఇద్దరం కార్ దగ్గరికి వచ్చాం.. కుమార్ రెండు చేతులూ జోడించి.. నమస్కారం అమ్మా.. నా బిడ్డలు మీ పల్లిలోనే సదూతున్నారు (నా పిల్లలు మీ స్కూల్లోనే చదువుకుంటున్నారు).. ఆమె కూర్చున్నాక డోర్ క్లోజ్ చేసాడు.. బయటకి వచ్చిన పెదనాన్న కాళ్ళకి మొక్కి అయ్య నాకు జోలి ఇప్పించినారు..నాను ఈ ఇంటికి అడిమై అన్నాడు.. (నాకు జాబ్ ఇప్పించారు నేను ఈ ఇంటికి దాసుడని) కార్ బయలుదేరాక పూజిత అడిగింది.. నీ పేరు ఏమి.. కుమార్ అమ్మా అని చెప్పాడు.. కుమార్ మంచిగా జోలి చేసుకునేవు.. యారికి అడిమై అని సెప్పకూడాదు.. వీడు నా తంబి.. నల్లగా సూస్కోండి అంది.. (కుమార్ నువ్వు మంచిగా పని చేసుకుంటున్నావు.. నువ్వు ఎవరికీ దాసుడవి కాదు..

వీడు నా తమ్ముడు.. మంచి కేర్ తీసుకోండి) ఈ లోకల్ తెలుగు నాకు కొంచెం అర్థం అవుతుంది.. చిన్నయ్య నల్ల మనిసి అన్నాడు కుమార్.. వీడు చిన్నయ్య అల్ల.. అయ్యదా.. అని చెప్పింది పూజిత.. సరింగ అమ్మా.. అన్నాడు.. కుమార్.. (చిన్నయ్య మంచి మనిషి అన్నాడు కుమార్.. వీడు చిన్నయ్య కాడు.. మీకు అయ్య.. సరేనమ్మా) ఎలారా తెలుసుకున్నావ్ అని అడిగింది.. బుర్ర వాడామండీ అన్నా.. సాయంత్రం ఏమిటి ప్రోగ్రాం అంది.. ఫ్రీ అయితే క్లబ్ కి రా మన వాళ్ళని పరిచయం చేస్తా.. ఒక్కడివే ఏం చేస్తావ్… ఈ వయసులో ఎంజాయ్ చెయ్యాలి అంది.. సరే అక్కా వస్తా.. అని చెప్పా.. ఆమె కంపెనీ లో ఆమెని డ్రాప్ చేసాం.. కుమార్ ఆమె డోర్ తియ్యడం ఆమె మీద గౌరవం చూపడం చూస్తే తెలుస్తుంది వాళ్ళ కుటుంబానికి ఎంత గౌరవం ఉందో అని.. ఆమె సెక్రెటరీలు వచ్చి ఫైల్స్, ఆమె బేగ్ తీసుకున్నారు.. నేను మా కంపెనీకి వచ్చేసా… కల్నల్ ని పిలిచి కంపెనీ లో అందరూ క్లీన్ గా రావటం లేదు.. అందరికీ Rs 5,000/- సాలరీ లో గ్రూమింగ్ అలవెన్స్ ఇవ్వండి అని చెప్పా.. అలాగే Sr. Manager and above కేటగిరీల్లో వాళ్ళందరికీ గ్రూమింగ్ Rs 5,000/- Extra ఇవ్వండి.. అలాగే వాళ్ళ సెక్రెటరీలందరికీ గ్రూమింగ్ Rs 5,000/- Extra ఇవ్వండి.. కానీ సెక్రెటరీలు బిల్లు సబ్మిట్ చెయ్యాలి.. ఓన్లీ Reimbursment.. ఆర్డర్లు రిలీజ్ చెయ్యమని చెప్పా.. అలాగే కంపెనీ డ్రెస్ మార్చాలి.. ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేస్తా.. సాంపిల్స్ తెప్పించండి అని చెప్పా.. ఆర్డర్లు నోటీస్ బోర్డ్ లొకి వచ్చాయి.. అందరికీ Rs 5,000/- పెరిగింది.. సెక్రెటరీలైతే సంతోషం గా ఉన్నారు.. వీళ్ళకి అదనం గా Rs 5,000/-. అంటే మొత్తం Rs 10,000/- అరవింద టీం, ఇతర జనెరల్ మేనేజర్ల సెక్రెటరీలు అంతా వచ్చి థాంక్స్ చెప్పారు.. రూం అంతా సీతాకోక చిలకలతో నిండి పోయింది.. ఒక అమ్మాయి అరవింద పక్కనే నుంచుంది.. ఆమెని చూస్తే నాకు సౌభాగ్య గుర్తుకు వచ్చింది.. నీ పేరేంటి అని అడిగా.. అబిష, ప్రొడక్షన్ -1 సెక్షన్ అని చెప్పింది.. చూడండి మీరంతా మంచి డ్రెస్ లో చక్కగా గ్రూమింగ్ చేసుకుని రండి.. మన కంపెనీ కి ఒక ఇమేజ్ తీసుకుని రండి..

మీరంతా చక్కగా ఉండాలని నా కోరిక అన్నా.. తప్పకుండా సార్.. అందం గా తయారవ్వండి డబ్బులిస్తాం అంటే అమ్మాయిలందరూ ఇష్టపడతారు కదా…. అందరూ వెళ్ళిపోయారు.. Sr Manager and above అందరికీ Rs 10,000/- ఒక్క రోజు లో పెరిగి పోయింది. డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ స్పెషల్ పవర్స్ ఇచ్చా.. వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి నెలకి ఒకసారి get-together లాగా బయటకి తీసుకుని వెళ్ళచ్చు.. అన్ని ప్లాంట్ లో నూ ఒక సంతోష వాతావరణం నెలకొంది.. సివిల్ హెడ్ శేఖర్, గోపాల్ ని పిలిచి కంపెనీ అంతా రిఫర్బిష్మెంట్ చెయ్యాలనీ ఏమేమి చెయ్యాలో చెప్పా.. మంచి Architect ఇంటీరియర్ డిజైనర్ లని పిలవమని చెప్పా.. అరవింద వచ్చి సార్ మీ ఇంటి ఇంటీరియర్ చేసిన వాళ్ళకి అవకాశం ఇవ్వొచ్చు కదా అని అడిగింది.. మూడు పార్టీలు చూసాకే డిసైడ్ చేస్తాం అని చెప్పాను.. అందరూ ఆనందం గా ఉన్నప్పుడు మనం ఎందుకు అని బయలుదేరి ఇంటికి వచ్చేసా.. సుధ రెడీ గా ఉంది.. విజయన్ వచ్చాడు.. కాఫీ త్రాగి విజయన్, పార్వతి ఒక వైపు నేను, సుధ ఇంకొక వైపు బయలు దేరాం.. సుధ ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసా.. సుధ పేరెంట్స్, సుభాషిణి సుధని చూసి సంతోషించారు.. నెల రోజుల్లో 50 – 52 కి వచ్చేస్తుంది.. మంచి అబ్బయిని చూసి పెళ్ళి చేస్తా అని చెప్పా.. అరుణ ఇక్కడికి వచ్చింది.. ప్రొద్దునే కర్మ కాండలు అవటం వలన అందరూ ఇంట్లోనే ఉన్నారు.. సుధకి జాగ్రత్తలు చెప్పి సుభాషిణితో ఏమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చెయ్యమని చెప్పి బయటకి వచ్చా.. అరుణ, సుభాషిణి నా కార్ వరకూ వచ్చారు.. అక్కడినుండి తాజ్ హోటల్ కి వచ్చా.. క్లబ్ ఇక్కడి నుండి దగ్గర.. 6:30PM గంటలకి బయలు దేరి వెళ్తా..5:30 PM కి అలారం పెట్టి నిద్రపోయా..

అలారం మ్రోగింది.. లేచి టీ త్రాగి హాట్ షవర్ తీసుకుని డ్రెస్ మార్చా.. మస్క్ సాండల్ పెర్ఫ్యూం వేసుకుని క్రిందకి వచ్చా.. శ్రీలేఖ లాబీ లో ఉంది.. ఆమెతో పాటు ఆమె కూతుర్లు ఉన్నారు.. నాకు ఇంట్రడ్యూస్ చేసింది.. ఆమె పెద్ద కూతురు డిగ్రీ కంప్లీట్ చేసి మాస్టర్స్ కి ఇక్కడ ట్రై చేస్తుంది.. చిన్న కూతురికి డిగ్రీ ఫైనల్ ఇయర్ అడ్మిషన్ కోసం ట్రై చేస్తుంది.. అను, కీర్తి వాళ్ళ పేర్లు.. శ్రీలేఖ కి చెప్పా. Madam, రేపు వీళ్ళిద్దరినీ భారతి దగ్గరికి పంపండి.. ఇద్దరికీ ఏ కాలేజీల్లో కావాలో ఆ కాలేజీల్లో సీట్ వస్తుంది.. ఈ పని నాకు వదిలెయ్యండి అని చెప్పా.. పెద్ద భారం వదిలినట్లు శ్రీలేఖ హస్బెండ్ నన్ను గట్టిగా షేక్ హాండ్ ఇచ్చి థాంక్స్ థాంక్స్ చెప్పాడు.. పిల్లలిద్దరినీ చూస్తూ మీకే కాలేజీ కావాలో డిసైడ్ చేసుకోండి అని చెప్పి బయలు దేరా.. కుమార్ కి మా క్లబ్ తెలుసు.. టైం 6:45 అయ్యింది.. పూజిత ఫోన్.. అందమైన నా తమ్ముడా ఎక్కడ అని అడిగింది.. వస్తున్నా… సుందర సోదరీ 5 మినిట్స్ అని క్లబ్ కి వెళ్ళా.. అప్పటికే ఇంఫర్మేషన్ ఉందేమో నన్ను లోపలికి allow చేసారు.. అక్క నన్ను లోపలికి తీసుకుని వెళ్ళింది.. ఒక పెద్ద హాల్లో మీటింగ్ నడుస్తుంది.. ప్రతి నెలా ఒక ప్రోగ్రాం చేస్తారు.. గ్రామాల్లో వసతులు కల్పించటం, గవర్న్మెంట్ స్కూళ్ళని బాగు చేయించడం, అనాధ శరణాలయాలని అభివృద్ధి చెయ్యడం ఇలా ఎన్నో.. ఆ మీటింగ్ లో చాలా మంది లేడీస్ కొద్ది మంది జెంట్స్ ఉన్నారు.. నన్ను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి మీటింగ్ లో మునిగిపోయారు.. నేను కూడా చాలా ఇంటరెస్ట్ గా పాల్గొన్నా.. నేను కూడా మామయ్య పేరు మీద ఇవన్నీ చెయ్యాలి కదా.. వాళ్ళందరూ నా ఇన్వాల్వ్మెంట్ ని మెచ్చుకున్నారు.. కొన్ని చోట్ల 2 కోట్ల రూపాయల వరకూ కమిట్మెంట్లు కూడా ఇచ్చేసా.. మీటింగ్ అయ్యాక ఒక్కక్కరినీ నాకు పరిచయం చేసింది అక్క.. ఎలా ఉంది? డిఫరెంట్ గా అనిపించిందా అని అడిగింది..