అమ్మా ….. ఎంత పరిశుభ్రంగా ఉంది – మొక్కలు కళకళలాడుతున్నాయి .
” ఖర్చులేనిది కదా బాబూ ….. , పిల్లలు – మా వృద్ధులమే సంతోషంగా శుభ్రంగా ఉంచుతాము , ఇక్కడ శుభ్రం చేసింది చాలదన్నట్లు అమ్మాయిలు చదువుకునే సమయంలో చాలాదూరం నడిపించుకుంటూ తీసుకెళ్లి మా వార్డెన్ తన ఇంటిలోకూడా పనులు చేయించుకుని , పనులు చేయించుకోవడమే కాదు అభం శుభం తెలియని అమ్మాయిలను నానా హింసలు పెడుతుంది , ఆట స్థలాలు ఉన్నా ఆడుకునే వస్తువులు ఉండవు ఆ డబ్బునూ తీసేసుకుని రికార్డ్ లో మాత్రం అప్డేట్ చేస్తుంది , డ్యామేజ్ అయిన మెయిన్ డోర్ తెరిచి వెలగాలా వద్దా అన్నట్లు వెలిగిన 60w బల్బ్స్ రెండు వెలుగులో నిద్రపోతున్న నా వయసు మొదలుకుని బుజ్జాయిలను చూయించారు .
చిన్న హాలులో రెండింతలు మూడింతల అమ్మాయిలు అడ్జస్ట్ అయ్యి కటిక నెలపైననే పడుకుని ఉండటం – ఒకవైపు కప్పుకోవడానికి సరిగ్గా దుప్పట్లు కూడా లేకపోవడం మరొకవైపు దోమలు ….. నిద్రలోనే దోమల వలన అటూ ఇటూ కదలడానికి కూడా వీలులేదు , సరిగ్గా క్లోజ్ చెయ్యడానికి కూడా లేని కిటికీలనుండి వస్తున్న చల్లటి గాలికి నిద్రలోనే వణుకుతుండటం చూసి చలించిపోయాను , బిల్డింగ్ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు ఎప్పుడు పైనుండి పెచ్చులు ఊడి ఎవరిమీద పడతాయో అని భయం వేసింది , కళ్ళల్లో చెమ్మతో …… అమ్మా బయటనుండి చూస్తే పెద్దగా ఉందికదా ? .
” అదిగో మూసిన తలుపులు …… , లోపల ఇలాంటి హాల్ ఉంది దానిని చక్కగా పిల్లలతోనే రెడీ చేయించుకుని తను ఇక్కడ ఉండే 10 నిమిషాలకోసం ఎవ్వరూ లోపలికి వెళ్లకుండా లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది – పిల్లలు భయంతో ఇలా సర్దుకుంటున్నారు , ఇక బాత్రూమ్స్ పరిస్థితి మరింత ఘోరం …… గొళ్ళెం లతోపాటు తలుపులూ లేవు , మేము అడ్డుగా నిలబడటంతో స్నానం చేస్తారు , సబ్బు ఉండదు పేస్ట్ ఉండదు – కాలేజీకు వెళ్లాలంటే డ్రెస్సెస్ ఉండవు బుక్స్ ఉండవు పాదాలకు చెప్పులు ఉండవు , ఇక భోజనం పరిస్థితి చెప్పనక్కర్లేదు – పిల్లలు మధ్యాహ్నం కాలేజ్ నుండి వచ్చేన్తవరకూ ఆకలితోనే ఉండాలి ” .
అమ్మా …….
” అవును బాబూ ….. టిఫిన్ ఉండదు , ఆ డబ్బును కూడా దోచేసుకుంటోంది , పిల్లలు ఆకలితో బాధపడుతూనే కాలేజీకు వెళ్లడం చూసి మేమంతా ఏమీ చేయలేక కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తున్నాము ఎప్పటికైనా ఆ దేవతల అనుగ్రాహం పిల్లలపై కురావాలని …… ”
కన్నీళ్లు ఆగడంలేదు ……
” వింటుంటేనే నీ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి , పాపం ఈ అమ్మాయిలు ….. అనాధాలుగా మారడమే వీరు చేసుకున్న పాపం ”
అమ్మా …… అధికారులు పట్టించుకోరా ? .
” అవినీతి లేనిది ఎక్కడ బాబూ …… , ఈ డబ్బును చూడగానే పందికొక్కుల్లా పంచేసుకుంటారు , నిన్ను లోపలికి తీసుకొచ్చిన ఉద్దేశ్యం ఏమిటో తెలిసిందని అనుకుంటున్నాను , ఈ డబ్బు నువ్వే ఉంచుకుని చెయ్యాల్సినది చేసి పిల్లలలో సంతోషాలను నింపితే అంతే చాలు ….. ”
నింపుతాను అమ్మా …… , శరణాలయం – వృద్ధాశ్రమం రూపురేఖలే మార్చేస్తాను , ఈ డబ్బుతోపాటు సంవత్సరాలుగా పిల్లలు – మీకు చేరాల్సిన డబ్బుతోనే మొత్తం మార్చేస్తాను , మీ అందరిలో సంతోషాలను నింపమని పంపించిన నా బుజ్జిజానకి కోరిక తీరుస్తాను .
” బుజ్జిజానకి …… సంతోషంగా ఉండాలి ”
థాంక్యూ అమ్మా ….. , మీలాంటి పెద్దవారి ఆశీస్సులు తనకు ఉండాలి అంటూ ఆనందించాను .
అమ్మా …… అంతా మ్యాజిక్ లా ఉంటుంది , ఉదయం లేచి కంగారుపడకండి , అంతా దైవేచ్చ …… , ఈ ఒక్క పూట అడ్జస్ట్ అవ్వండి నన్ను నమ్మి వెళ్లి పడుకోండి , ముందైతే లైట్స్ ఆఫ్ చెయ్యండి నిద్ర డిస్టర్బ్ అవుతోంది – అమ్మా ….. నన్ను నమ్ముతారా ? .
” ఈ సమయంలో వచ్చి సహాయం చేస్తాను అన్నావు – దైవేచ్చ అంటున్నావు – ఏమీ కాకపోయినా పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయి కన్నీళ్లు కార్చావు …… ఇవి చాలదా ? నమ్మడానికి ….. , ఇంతమంది పిల్లలకు మంచి జరిగితే అంతే
చాలు అంటూ ప్రార్థించారు , బాబూ ….. బుజ్జిజానకి అమ్మ పేరేమిటి ? ” .
” జానకి – మహి ….. తల్లీబిడ్డలు ” , వీరందరి సంతోషమే వారి సంతోషం .
” అర్థమైంది అర్థమైంది అమ్మపై మమకారంతో బుజ్జిజానకిగా పిలవబడుతోందన్నమాట మహి – మహీ ….. నీ అక్కాచెల్లెళ్లకోసం బుజ్జిదేవుడిని పంపించావన్నమాట ” .
అమ్మా ….. మీరుకూడానా ? .
” అయితే బుజ్జిదేవుడిగా ఈపాటికే పిలవబడుతున్నావన్నమాట అంటూ ఆనందిస్తున్నారు ”
మహేష్ అని పిలవండి చాలు , సూర్యోదయానికల్లా మీపెదాలపై సంతోషాన్ని ఇక్కడున్న అమ్మాయిలు మరియు బామ్మల పెదాలపై కూడా విరాజిల్లేలా చేస్తాను , అమ్మా ….. దోమలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి నిమిషంలో వెళ్లి ALLOUT తీసుకొస్తాను .
” లోపల ఉన్నాయి బాబూ …… వాటిని కూడా బయట అమ్ముకుంటుంది ”
వార్డెన్ మనిషేనా ? అంటూ వెళ్లి తాళం పగలగొట్టి , అమ్మతోపాటు వెళ్లి తీసుకొచ్చి నాలుగువైపులా ఉంచి తలుపులువేసి బయటకువచ్చాను .
మెసేజ్ …… పెద్దమ్మ నుండి …..
” చిటికెలో మా బుజ్జిదేవుడి మనసులోని ఊహలా శరణాలయాన్ని మార్చేయమంటావా ? ”
నో నో నో పెద్దమ్మా ….. , ” కష్టే ఫలి ” అంటారుకదా ….. , శరణాలయం – వృద్దాశ్రమం కోసం సంతోషంగా శ్రమిస్తాను – ఫలితపు ప్రతిఫలాన్ని మాత్రం మన బుజ్జిజానకికి చెందేలా చూస్తే చాలు పెద్దమ్మా ……
” ఇందుకు కాదూ ….. మా బుజ్జిదేవుడు అంటే మాకు పిచ్చిప్రేమ అంటూ ముద్దులు …… ”
నాదగ్గర కాకుండా అక్కడ ఒంటరిగా ఉన్న అమ్మ దగ్గరికి వెళితే చాలా సంతోషం – పాపం అమ్మకు ఒంటరిగా బోర్ కొడుతూ ఉంటుంది .
” సరేసరే ….. – ఈ విషయం జానకికి చెబుతానులే , చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో ….. , బిడ్డ గురించి తల్లికి తెలియదా ఏమిటి ? ”
మురిసిపోతున్నాను …… , పెద్దమ్మా పెద్దమ్మా ….. అలాగే మధ్యమధ్యలో బుజ్జిజానకి నిద్రలో ఉండగా ఇద్దరూ వెళ్లగలరు …..
” అది జరగదు ”
అయితే ఇప్పుడే నేను పైకి వచ్చేస్తాను …..
” కూల్ కూల్ …… జరగదు అంటే వెల్లము అనికాదు అర్థం , పూర్తిగా చెప్పేంతవరకైనా ఆగవు – ఒకరిని సొంతం అనుకుంటే ఎంత దూరమైనా వెళ్లిపోతావని నాకు తెలుసులే , విషయం ఏమిటంటే నిద్రలో ముందుగా నీ కలలో కనిపించి ప్రేమను పంచికానీ బుజ్జితల్లి దగ్గరకు వెళ్లనని ఇలానే మారాం చేస్తుంది జానకి …… ”
అంతే పట్టరాని సంతోషంతో పొంగిపోతున్నాను , లవ్ యు అమ్మా …… , అమ్మా ….. ఈరాత్రికి పడుకోవడం ఆలస్యం అవ్వవచ్చు ఈ ఒక్కసారికి మొదట బుజ్జిజానకి దగ్గరకే వెళ్ళండి ……
” జానకి ఒప్పుకోవడంలేదు బుజ్జిదేవుడా ….. , ఎంతసేపైనా సరే వేచిచూసే వెళతాను అంటోంది , బుజ్జిజానకి మాట ప్రకారం ఏమిచెయ్యబోతున్నావో నాద్వారా అపుడే వినేసింది , ఆ క్షణం నుండీ ఇంకా ప్రాణం అయిపోయావు మరి …… ”
లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా …..
” ఎంజాయ్ ఎంజాయ్ …… ”
నవ్వుకుని , పెద్దమ్మా ….. మీరు సహాయం చేయాలనుకుంటే ఆ వార్డెన్ ఇప్పటివరకూ శరణాలయం ద్వారా తిన్నదంతా కక్కించాలి , పిల్లలు – బామ్మలు లేచేసమయానికి వారి ముందు మోకరిల్లి క్షమాపణలు చెప్పి వార్డెన్ గా తప్పుకోవాలి – అందరి సంతోషం కోరుకునే ఆయా అమ్మ వార్డెన్ అవ్వాలి .
” అలాగే ….. , ఉదయంలోపల నేనేమి చెయ్యాలో ఆజ్ఞలు వెయ్యి ”
లవ్ యు పెద్దమ్మా ….. , ముందైతే కార్ కావాలి – మెయిన్ గేట్ ముందు ఆగింది , ముందు డోర్ తెరిచి కూర్చోబోతే వెనుక సీట్లో కట్టల కట్టల డబ్బు ……
” వార్డెన్ తిన్న డబ్బు – నల్ల డబ్బులా గోడలో దాచుకుంది ”
అంతలోనేనా ….. , అయినా అక్కడ దాచుకుని ఏమిచేస్తుందో , అయినా ఇంత డబ్బు ఎలా ? , అలాగే అలాగే పై అధికారులు కూడా తిన్నారని ఆయా చెప్పారు .
” అమ్మో కనిపిస్తోంది కనిపిస్తోంది చాలా అధికారుల బిల్డింగులలో దాక్కుంది , ఈ కారు సరిపోయేలా లేదు పెద్ద వెహికల్ కావాలి ”
అలా పెద్ద వెహికల్లోకి మారిపోయాను ….. , వెనుక నిండిపోయి ముందు కూర్చున్న నామీదకు పడేంత డబ్బు …… , చిన్న శరణాలయంలో ఇంత అవినీతి ? .
” పెద్ద పెద్ద వ్యాపారవేత్తల నుండి పెద్ద మొత్తంలో విరాళాలు వచ్చాయి , ఎవ్వరికీ తెలియకుండా మొత్తం పంచేసుకున్నారు ”
పెద్దమ్మా ……
” డన్ …… , అందరూ బయటపడతారు – తదనుగుణంగా శిక్షనూ అనుభవిస్తారు ”
శిక్ష పడాల్సిందే పెద్దమ్మా …… , లోపల చూసి చలించిపోయాను .
” నువ్వెలా అంటే అలా …… ”
పెద్దమ్మా ….. మొదట ఫర్నిచర్ & షాపింగ్ చెయ్యాలి , కాట్స్ – బెడ్స్ – బ్లాంకెట్స్ – లాకర్స్ – డ్రెస్సెస్ – కాలేజ్ కు వెళ్ళడానికి అవసరమైనవి – కాలేజ్ కు వెళ్ళడానికి కాలేజ్ బస్ – చెల్లెళ్లకు ఆడుకోవడానికి బొమ్మలు ……. ఇలా అన్నీ అన్నీ రాత్రికి రాత్రి చేర్చాలి , నేను షాప్స్ కు వెళ్ళేటప్పటికి ఒక్కరోజు ఇబ్బందిపడినా పర్లేదు తెరిచే ఉండాలి – ట్రాన్స్పోర్ట్ available గా ఉండాలి .
” డన్ డన్ …… ”
నేను షాపింగ్ చేసుకొచ్చేలోపు శరణాలయం ….. స్టార్ హోటల్లా మారిపోవాలి ఇరుకుగా కాదు విశాలంగా పడుకునేలా – బాత్రూమ్స్ కూడా …… , అలాగే అలాగే ఆట స్థలాలు రెడీ అయిపోవాలి – గేమ్స్ ఆడుకోవడానికి అన్నీ అనుకూలంగా ఉండాలి – కాంపౌండ్ లోపలికి ఎవ్వరూ ప్రవేశించకుండా పటిష్టం అవ్వాలి – ముఖ్యంగా ముఖ్యంగా …… డిన్నర్ హాల్ – వంటలు అధిరిపోవాలి – వారికిష్టమైనవి వారికిష్టమైన సమయంలో వండి ముందు ఉంచేలా వంటవారు 24/7 అందుబాటులో ఉండాలి – చదువుకోవడానికి వీలుగా లైబ్రరీ …..
” ఆజ్ఞ బుజ్జిదేవుడా ”
లవ్ యు పెద్దమ్మా అంటూ బయలుదేరాను , ఒక్కొక్క షాప్ కే వెళుతూ అందరికీ అవసరమయ్యేలా అన్నింటినీ తీసుకుని శరణాలయానికి పంపించి స్పాట్ పేమెంట్ చేసేస్తున్నాను – అన్నీ చకచకా జరిగిపోయాయి , షాపింగ్ కు పోనూ ఇంకా కొద్ది డబ్బు మిగిలి ఉండటంతో ….. పెద్దమ్మా ఒక పని చేద్దాము ఈ డబ్బునంతా శరణాలయంలోని అందరి పేరుమీద సమానంగా బ్యాంక్ అకౌంట్స్ లోకి చేర్చేయ్యండి .
” ఒక్కరికి కూడా అకౌంట్స్ లేవు బుజ్జిహీరో …… ”
పెద్దమ్మా ….
” జస్ట్ ఫర్ ఫన్ బుజ్జిహీరో …… , కష్టపడుతున్నావుకదా నవ్విద్దామని ….. లవ్ యు లవ్ యు ఇష్టంగా కదూ ……. , డన్ బుజ్జిహీరో ….. ఒక్కొక్కరి అకౌంట్ లో లాక్షా పాతిక వేలు – వారికిష్టమైనవి కొనుక్కోవచ్చు ”
ఇకనుండీ govt ఫండ్స్ మరియు విరాళాలు ……. నేరుగా కొత్త వార్డెన్ అకౌంట్లోకి చేరిపోతాయి , నెలాఖరున మిగిలిన మొత్తం అమ్మాయిల అకౌంట్ల లోకి వెళ్లిపోతాయి ”
సూపర్ పెద్దమ్మా …… , అన్నీ పూర్తయ్యి శరణాలయం చేరుకునేసరికి ఉదయం 5 గంటలు అయ్యింది – కాస్తoత వెలుగులో పూర్తిగా కొత్తగా మారిపోయిన శరణాలయాన్ని చూసి అవాక్కైపోయాను – సంతోషాశ్చర్యంతో అలా చూస్తుండిపోయాను , లోపలికివెళ్లి చూస్తే వరుసగా కాట్స్ బెడ్స్ పై విశాలంగా AC లో హాయిగా నిద్రపోతుండటం చూసి చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చాను , బుజ్జిజానకి చూస్తే ఎంత ఆనందిస్తుందో అంటూ మురిసిపోతూ ఇంటికి చేరుకున్నాను , నాకోసం వేచిచూస్తూ వేచిచూస్తూ బుక్స్ చేతుల్లోనే బాల్కనీలో అక్కయ్యలు నిద్రపోతుండటం చూసి sorry అక్కయ్యలూ ఆలస్యం చేసాను , పెద్దమ్మా ……
” నేనే స్వయంగా ఎత్తుకునివెళ్లి పడుకోబెడతాను , నువ్వెళ్ళి కాసేపైనా రెస్టుతీసుకో ఫంక్షన్ కు ఒక్కరోజే సమయం ఉంది ”
లవ్ యు పెద్దమ్మా ….. అంటూ తలుచుకుని లోపలికివెళ్లి బెడ్ పైకి వాలగానే నిద్రపట్టేసింది .
