థర్డ్ MISSION 9 53

( మా అందరి ప్రాణమైన బుజ్జిదేవుడా ….. మాకోసం ఎంతగా శ్రమిస్తున్నావు …… అంటూ జానకి అమ్మ – జోకొడతాను హాయిగా నిద్రపో ……
ఆ శ్రమలో సంతోషం ఉంది అమ్మా …… , నా జానకి అమ్మ – బుజ్జిజానకి సంతోషం కోసం ఏమైనా చేస్తాను .
” నువ్వు …. ” నా ” అన్న ప్రతీసారీ పుల ….. ఎంత సంతోషం వేస్తుందో మాటల్లో చెప్పలేను అంటూ బుగ్గపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
అమ్మ ముద్దుకోసం ఇంకా ఇంకా చెయ్యాలని ఉంది .
” ఏమీ చేయకపోయినా నీ హృదయ బుజ్జిదేవత కంటే ఇష్టంగా ఎక్కువగా నా బుజ్జిదేవుడికే ముద్దులుపెడతాను ”
లవ్ యు అమ్మా ….. , అమ్మా ….. బుజ్జిజానకికి ఎక్కువ ముద్దులు పెడితేనే నాకిష్టం .
” నాఇష్టం కూడా నువ్వే చెబుతావా ….. ? , నువ్వు ….. నీ హృదయదేవతకు పెట్టుకో ఎవరు కాదన్నారు , నా ముద్దులు ….. నాఇష్టం , అయినా తల్లి ముద్దులుపెట్టమంటే ఎందుకు మోహమాటపడతావు ? ”
అదీ అదీ అమ్మా ….. , మీతో అపద్ధo చెప్పలేను కాబట్టి చెబుతాను – కొన్ని ముద్దులతో సంతృప్తి చెందలేను …..
” ఎన్నైనా పెట్టుకో తల్లి కాదంటుందా ఏమిటి ….. , నీ ముద్దుముద్దుకూ ఎంత ఆనందిస్తుందో చూసి ఎంతలా సంతోషిస్తున్నానో తెలుసా ? ”
అమ్మా అమ్మా ….. ఇప్పటికే ఆలస్యం అయ్యింది , పాపం బుజ్జిజానకి ….. అమ్మకోసం ఎదురుచూస్తూ ఉంటుంది .
” నిన్నూ ….. అంటూ బుగ్గపై కొరికేశారు …… ”
స్స్స్ ……
” లవ్ యు లవ్ యు …… ”
వద్దు వద్దు ముద్దులు వద్దమ్మా ….. , ముద్దుకంటే పంటిగాటే తియ్యగా ఉంది ఫీల్ అవ్వనివ్వండి , మీరు వెళ్ళండి వెళ్ళండి ……
” ఆనందబాస్పాలతో లవ్ యు అంటూ ముద్దుపెట్టి మాయమైపోయారు ”
లవ్ యు టూ అమ్మా …… , పెద్దమ్మా ….. ప్రతిఫలం అంతా బుజ్జిజానకికి చెందేలా పావులు కదుపుతున్నారా లేదా ? .
” ఆ సంగతి నేను చూసుకుంటాను కాసేపు హాయిగా పడుకో …… ”
పడుకో అంటే సరిపోతుందా ? .
” అల్లరి పిల్లాడు అంటూ పెదాలపై ముద్దుపెట్టడంతో ….. బెడ్ ను గట్టిగా చుట్టేసి పెదాలపై తియ్యదనంతో సుఖంగా నిద్రపోయాను ”
************

బుజ్జిజానకి పెదాలపై ముద్దు ……
బుజ్జిజానకి : ఫస్ట్ అక్కడికే వెళ్లివచ్చావు కదూ ….. , నాకంటే మహేష్ అంటేనే ఎక్కువ ప్రాణం .
అమ్మ : నీ హీరో బుగ్గపై ముద్దుపెట్టిన పెదాలతో నీ పెదాలపై ముద్దుపెట్టాను , ఏదీ ఇప్పుడు అడుగు , ఈ ముద్దుకోసమే ఎదురుచూస్తున్నావని తెలుసులే ……
బుజ్జిజానకి : లవ్ యు అమ్మా అంటూ ముసిముసినవ్వులు ……
అమ్మ : నా మహేష్ ముద్దుపెడితే కోప్పడుతున్నావట ……
బుజ్జిజానకి : ఎవరు నేనా ? , ఒక్కటంటే ఒక్క ముద్దైనా పెడితే చాలు అని అనుకుంటుంటే అలా చెప్పాడా ? ఉండు చెబుతాను ……
అమ్మ : ఇదిగో ఇలానే బెదరగొడితే ఎలా పాపం అమాయకుడు …..
బుజ్జిజానకి : అమాయకుడా ….. ? , ఒకేసారి నీ శిష్యురాలైన మేడమ్ అంటీకు – ముగ్గురు అత్తయ్యలకూ మరియు పెద్దమ్మకు ….. అందరికీ లైన్స్ వేస్తుంటాడు , పులిహోరా కలపడంలో నెంబర్ వన్ తెలుసా ? .
అమ్మ : ప్రాణమే ….. పులిహోరా అంటావా అంటూ బుగ్గపై గిల్లేసారు .
బుజ్జిజానకి : స్స్స్ ….. , అందుకే కదమ్మా ….. హెల్ప్ చేస్తున్నది , మహేష్ ఏమిచేసినా నాకిష్టమే , నా హీరో నా దేవుడు …… మన దేవుడు .
అమ్మ : అవును నా బుజ్జిదేవుడు – లవ్ యు తల్లీ …… , బాధపెట్టావో దెబ్బలుపడతాయి .
బుజ్జిజానకి : మా అమ్మ ప్రాణాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా ? .
అమ్మ : నువ్విచ్చిన డబ్బుతో రాత్రంతా నిద్రపోకుండా తిరుగుతూనే ఎంతమందిలో సంతోషాలను నింపాడో తెలుసా ? .
బుజ్జిజానకి : అమ్మా అమ్మా చెప్పమ్మా ……
అమ్మ : సర్ప్రైజ్ అట పెద్దమ్మ చెబుతోంది , రేపు నీకే తెలుస్తుందిలే ….. , కాసేపటి ముందే నిద్రపోయాడు ఆలస్యంగా వస్తే కోప్పడకు సరేనా ? .
బుజ్జిజానకి : ఆలస్యం అవుతుందా ? , అయ్యో ఇప్పటికే నావల్ల కావడంలేదే ….. , సరే సరే అమ్మా ….. వెంటనే వెళ్లి హాయిగా నిద్రపుచ్చoడి వెళ్ళండి వెళ్ళండి .
అమ్మ : లవ్ యు బంగారుతల్లీ ….. అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి మాయమై బుజ్జిజానకి కోరుకోవడం వలన ( దేవతల వరం ) నా చెంతకు చేరి జోకొడుతున్నారు ) .
*************

తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ …… అంటూ అక్కయ్యల పిలుపులు వినిపించడంతో మెలకువవచ్చి మొబైల్లో టైం చూస్తే 7 ….. అమ్మో ఉదయం 5:30 నుండీ 30 missed కాల్స్ అక్కయ్యల నుండి ….. , అంటే బుజ్జిజానకి దగ్గరకు వెళ్ళడానికి అంటీలు రెడీ అయిపోయారన్నమాట …… , అంతలో తల్లులూ తల్లులూ తల్లులూ …… ఆ అల్లరి పిల్లాడి దగ్గరకే వెళ్లకూడదు అని చెప్పానుకదా రండి అక్కడ మీ బంగారుచెల్లి ఎదురుచూస్తూ ఉంటుంది .
అఅహ్హ్ …… అంటీల మాటలు చాలు మనసుకు తెగ ఉల్లాసం అంటూ విండో దగ్గరకువెళ్లి అక్కయ్యలకు కనిపించకుండా అంటీలను చూసి మురిసిపోతున్నాను ( గుడ్ మార్నింగ్ అంటీలూ …… ) .
తల్లులూ …… రాత్రి ఎప్పుడు వచ్చాడో ఏమో పడుకోనివ్వండి – లేచేలోపు వెళ్లిపోవాలి లేకపోతే దేవతలూ దేవతలూ …… అంటూ ఆకాశానికి ఎత్తేస్తాడు అంటూ మురిసిపుతూనే ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అక్కయ్యలు : నవ్వుతున్నారు అంటే ఎంజాయ్ చేస్తున్నట్లే ……
అంటీలు : ష్ ష్ ష్ ….. ఆ అల్లరి పిల్లాడు విన్నాడంటే మరింత అల్లరి చేస్తాడు , లేచేలోపు వెళ్లిపోవాలి రండి అంటూ లాక్కుని వెళ్లిపోతున్నారు .
అమ్మలూ అమ్మలూ అమ్మలూ …… తమ్ముడు తమ్ముడు తమ్ముడు ……
లవ్ యు అంటీలూ …… , ఈమాత్రం చాలు అంటూ ఆనందిస్తున్నాను .
అక్కయ్యలను బలవంతంగా కారులో వెనుక తమ వెనుక కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు – అక్కయ్యలు వెనక్కు చూస్తూనే ఉన్నారు ……
నవ్వుకుని , నిద్ర ఆగడంలేదే ….. పెద్దమ్మా తెలుసుగా అంటూ వెళ్లి బెడ్ పై వాలిపోయాను .

అంటీల కంటే ముందుగా బుజ్జిజానకి పెరడులోని చెట్టుకింద గడ్డిమీద ప్రత్యక్షము అయ్యాను – హాయిగా నిద్రపోతున్నాను .
ఎందుకో పెరడులోకి వచ్చిన అమ్మమ్మ చూసి , తల్లీ బుజ్జిజానకి తల్లీ బుజ్జిజానకి అంటూ సంతోషంతో పిలిచి ష్ ష్ ష్ అంటూ లెంపలేసుకుని చూయించారు .
బుజ్జిజానకి : పెదాలపై కళ్ళల్లో ఒక్కసారిగా అంతులేని ఆనందం – అమ్మమ్మా ….. అంతగట్టిగానా కేకలువేసేది సంతోషం అన్నమాట అంటూ కౌగిలించుకుని పరుగునవచ్చి నా ప్రక్కనే కూర్చుని జోకొడుతోంది – ముద్దులుపెడుతోంది , రాత్రంతా నాకోసం నిద్రపోకుండా తిరిగావా ? లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై ముద్దులుపెడుతోంది .
అవునా బుజ్జిజానకి ……
బుజ్జిజానకి : అవును అమ్మమ్మా ….. , అమ్మ – పెద్దమ్మ కలలో కనిపించి చెప్పారు .
అమ్మమ్మ : అయితే హాయిగా నిద్రపోనివ్వు , ఉండు దిండు దుప్పటి తీసుకొస్తాను .
బుజ్జిజానకి : నేను తీసుకొస్తాను అమ్మమ్మా ……
అమ్మమ్మ : నేను తెస్తానుకదా ….. , నువ్వు ముద్దులతో జోకొట్టు ……
బుజ్జిజానకి : లవ్ టు అమ్మమ్మా ….. , నీ గుండెలపై వాలి నిద్రపోవాలని ఉంది మహేష్ – నిన్ను డిస్టర్బ్ చేస్తే అమ్మ కొట్టినా కొడుతుంది అంటూ ఆనందిస్తూ బుగ్గలపై – నుదుటిపై – హృదయంపై ప్రేమతో ముద్దులుపెడుతూ జోడుతోంద , ఇంకా బ్రష్ చేసుకోలేదు లేకపోతే లేకపోతే అంటూ నా పెదాలవైపే చూస్తూ సిగ్గుపడుతోంది , బుజ్జిదేవుడా ….. ఆ ఊహకే వొళ్ళంతా తియ్యనైన పులకింత కలుగుతోంది అంటూ హృదయంపై ఘాడమైన ముద్దుపెట్టింది .
మ్మ్ ….. అంటూ నిద్రలోనే కదిలి ముడుచుకుని పడుకున్నాను .
బుజ్జిజానకి : అమ్మమ్మా అంటూ చిన్నగా ……
అమ్మమ్మ : వచ్చేసాను వచ్చేసాను అంటూ తలకింద దిండు ఉంచి భుజాలవరకూ దుప్పటిని కప్పి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : ఎంతసేపయ్యిందో వచ్చి , అయినా నేరుగా లోపలికివచ్చి నా ప్రక్కనే బెడ్ పై పడుకుని ఉండొచ్చుకదా …..
అమ్మమ్మ : అవునవును ఇది తన ఇల్లు – ఈ బుజ్జిజానకి బుజ్జిదేవుడి సొంతం , ప్రక్కనైనా పడుకోవచ్చు లేదా మీదైనా పడుకోవచ్చు …… , అలా జరిగి ఉంటే మీ అమ్మతోపాటు నేనూ ఆనందించేదానిని …..
బుజ్జిజానకి : అమ్మమ్మా అంటూ తెగ సిగ్గుపడిపోతోంది .
అమ్మమ్మ : మీద వద్దా అయితే ……
బుజ్జిజానకి : అమ్మమ్మా ……
అమ్మమ్మ : ఊరికే అన్నానులే అంటూ కురులపై ముద్దుపెట్టారు .
బుజ్జిజానకి : లవ్ యు అమ్మమ్మా …… , అమ్మమ్మా ….. తెల్లవారుఘాముననే లేచావు కదా …….
అమ్మమ్మ : అప్పుడు లేడు బుజ్జిజానకి ….. , బయటే కాదు ఇక్కడకూడా శుభ్రం చేసాను ……
బుజ్జిజానకి : అంటే తెల్లవార్లూ …… లవ్ యు లవ్ యు లవ్ యు మహేష్ అంటూ కూర్చునే వొంగి తలను హృదయంపైకి వాల్చింది .
మ్మ్ అఅహ్హ్ ……
అమ్మమ్మ : కదలకు కదలకు బుజ్జిజానకీ …… , నిద్రలోనే అనుభూతి చెందుతున్నాడు , అయినా నా బంగారాల మధ్యన నేనెందుకు అంటూ లోపలకువెళ్లిపోయారు .
నా హృదయస్పందనను వింటూ మధ్యమధ్యలో లవ్ యు లవ్ యు అంటూ హృదయంపై ముద్దులుపెడుతూ ఎంజాయ్ చేస్తోంది .

అంటీలు – అక్కయ్యలు వచ్చినట్లు కారు ఆగింది , అమ్మలూ అమ్మలూ అమ్మలూ …… exam కు అయితే పూర్తిగా ప్రిపేర్ అయిపోయాము ఇక డైరెక్టుగా వెళ్లి రాయడమే , ఇంకా రెండు గంటల సమయం ఉంది స్కూటీలలో వెళ్లి తమ్ముడిని పిలుచుకుని వచ్చేస్తాము .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడితో మీరు మాట్లాడటమే ఇష్టం లేదు అలాంటిది వెనక్కు వెళ్లి తీసుకొస్తారా ….. ? నో అంటే నో , మీ చెల్లికి స్నానం చేయించాలి పదండి పదండి అంటూ లోపలికి లాగుతున్నారు .
అక్కయ్యలు : మా బంగారు అమ్ములు కదూ – తమ్ముడి దేవతలు కదూ ….. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ఉమ్మా ఉమ్మా ఉమ్మా …….

విన్నావా బుజ్జిదేవుడా ….. అక్కయ్యలకు నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ బుజ్జిజానకి ఆనందించి బుగ్గపై ముద్దుపెట్టి , అక్కయ్యలూ అక్కయ్యలూ …… ష్ ష్ ష్ .
అక్కయ్యలు : చెల్లీ చెల్లీ చెల్లీ ….. గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంతో కౌగిలించుకొన్నారు .
బుజ్జిజానకి : లవ్లీ గుడ్ మార్నింగ్ అక్కయ్యలూ – అత్తయ్యలూ ……
అంటీలు : గుడ్ మార్నింగ్ తల్లీ బుజ్జిజానకీ అంటూ కౌగిళ్ళలోకి తీసుకుని ప్రాణమైన ముద్దులుకురిపించారు .
అక్కయ్యలు : చూడు చెల్లీ …… మన బుజ్జిహీరోని పిలుచుకుని వస్తామంటే పోనివ్వడం లేదు , నువ్వైనా చెప్పు మీ అత్తయ్యలకు ……
బుజ్జిజానకి : నా సపోర్ట్ అయితే అత్తయ్యలకే …… అంటూ అక్కయ్యల వైపు కన్నుకొట్టింది .
అంటీలు : మా చిట్టి తల్లి బంగారం – చూసి నేర్చుకోండి .
ఒక్క నిమిషం ఒక్క నిమిషం అత్తయ్యలూ ….. పూర్తిగా వినండి , అక్కయ్యలు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అక్కయ్యలు ఆనందించేలా చేసాడు మీ అల్లరి హీరో ……
అంటీలు : హీరో కాదు తుంటరి పిల్లాడు .
బుజ్జిజానకి : ఈ దేవతలు ఎలా పిలిచినా ఇష్టమే తుంటరి పిల్లాడికి .
అక్కయ్యలు : ఎంతైనా తమ్ముడి దేవతలు కదా …… , చెల్లీ ….. ఈ అక్కయ్యలు సంతోషించేలా చేశాడా ? ఎలా ? .
బుజ్జిజానకి : ష్ ష్ ష్ అంటూ అక్కయ్యల చేతులను అందుకుని పెరడులోకి తీసుకొచ్చి చూయించింది ఇలా అంటూ ……
అక్కయ్యలు : తమ్ముడు తమ్ముడు తమ్ముడు ….. అంటూ ఒకేసారి బుజ్జిజానకిని చుట్టేసి ఆనందిస్తున్నారు , అయినా మాకంటే ముందుగా ఎలా ? , మేము వస్తూ పిలిచినప్పుడు లోపలే ఉన్నట్లు చప్పుడు వినిపించిందే ……