అంటీలు : బుజ్జిజానకీ ….. ఇంకేమి తింటావు ? .
బుజ్జిజానకి : ఇల్లు చూస్తూ ఫుల్ గా తిన్నాము అత్తయ్యలూ చాలు చాలు ……
అంటీలు : తినడం పూర్తయితే వెళదాము ఇంకా చాలా ఇళ్లకు వెళ్ళాలి , ఇంతలేడు సగం పైనే తినేశాడు .
దేవతల ఇంటిలో దేవతల చేతి వంటలు ….. మళ్లీ అదృష్టం ఉందో లేదో ……
అక్కయ్యలు : తథాస్తు తథాస్తు అనండి అమ్మలూ …….
అంటీలు : మీవల్లనే మరింత అల్లరి చేస్తున్నాడు , దెబ్బలుపడాలి మీకు , ఫంక్షన్ తరువాత ముద్దులు పెట్టడం కాదు కదా కలిసినా మాట్లాడినా ఊరుకునేదిలేదు , మాటిచ్చాడు మాటమీద నిలబడాలి ……
దేవతలకిచ్చిన మాటపైనే నిలబడతాను .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ……
అంటీలు : మంచిది మంచిది …..
బాధపడుతున్న అక్కయ్యల దగ్గరకువెళ్లి , తల్లులూ ….. దైవం ఇలాంటివి ప్రత్సహించరులే మీరు హ్యాపీగా ఉండండి , మీరు – మీ అమ్ములు …… అందరూ అందరూ హ్యాపీగా ఉండబోతున్నారు ఒక్కరుతప్ప – ఆ ఒక్కరి వలన అందరమూ ……. అన్నారు పెద్దమ్మ .
అక్కయ్యలు : ఎవరు ఎవరు పెద్దమ్మా ? .
పెద్దమ్మ : ఫంక్షన్ తరువాత తెలుస్తుంది , ఇప్పుడు ఇప్పుడైతే బుజ్జిజానకి సంతోషం ముఖ్యం ……
అక్కయ్యలు : అలాగే పెద్దమ్మా ….. , దేవతలూ ….. నెక్స్ట్ ఎక్కడికి ? .
అంటీలు – మేడమ్ : ఇక మిగిలిన దేవత ఇంటికి పెద్దమ్మ ఇంటికి ……
అక్కయ్యలు : ఇప్పటివరకూ పెద్దమ్మ గురించి ఏమీ తెలియదు , పెద్దమ్మా ఇల్లు ఎక్కడ ? .
పెద్దమ్మ : అబ్బో చాలా దూరం ……
ఎంతదూరమైన వెళదామన్నారు అందరూ ……
అదీ అలా అడగండి అంటూ పెద్దమ్మ వైపు కన్నుకొట్టి నవ్వుకుంటున్నాను .
పెద్దమ్మ : కొంటె కోపంతో చూసి , తల్లులూ …… మన ఇంటికి వెళితే ఇక ఎవ్వరి ఇంటికీ వెళ్లలేము వెళ్ళిరావడానికే రోజు గడిచిపోతుంది , నెక్స్ట్ టైం తప్పక తీసుకెళతాను , ప్రస్తుతానికి అదిగో ఎదురుగా కనిపిస్తున్న బుజ్జిహీరో ఇల్లే మన ఇల్లు …… అక్కడికే వచ్చి ఆహ్వానించండి ప్లీజ్ ప్లీజ్ …..
దేవతలు : అయోమయంగానే ok అన్నారు .
నో నో నో ….. నో పెద్దమ్మా ….. ( ఓన్లీ దేవతలు మాత్రమే ) .
పెద్దమ్మ : సరే అంటూ నవ్వుకున్నారు .
అక్కయ్యలు : పెద్దమ్మా ఏదో ఏదో చెప్పాడు , మొదటిరోజు నుండీ చూస్తున్నాము మమ్మల్ని లోపలికే రానివ్వలేదు , ఒక్కసారి మాత్రం దేవతలకు మాత్రమే ఆహ్వానం అన్నట్లు గుర్తు , అదిగో ఎలా సిగ్గుపడుతున్నాడో చూడండి .
లేదు లేదు అక్కయ్యలూ …… , అదేమీ ఇంద్ర భవనం కాదు పూరి గుడిసె …… మీరు ఒక్క క్షణం కూడా ఉండలేరు .
అక్కయ్యలు : మా తమ్ముడు ఉండే పూరి గుడిసెనే మాకు ఇంద్ర భవనానికి మించి ……
లవ్ యు అక్కయ్యలూ అంటూ ముద్దులుపెట్టి ఆనందిస్తోంది బుజ్జిజానకి ……
అక్కయ్యలు : లెట్స్ గో ……
Sorry అక్కయ్యలూ నో అంటే నో ……
అంటీలు : చూసారా ….. మీరు ఎంత ప్రేమ కురిపించారు కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు , పొగరు ……
అక్కయ్యలు : తమ్ముడు నో అన్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది .
అంటీలు : మిమ్మల్నీ ….. ఈ రెండు రోజులేలే …..
కారణం ఏమీలేదు అక్కయ్యలూ ….. , Entry for దేవతలకు మాత్రమే ……
అక్కయ్యలు : దేవతల పిచ్చి ……
అంటీలు : మెమొక్కటే అయితే రానే రాము ……
ఆ అదృష్టం కోసం ఎన్ని రోజులైనా ఎదురుచూస్తాను దేవతలూ …..
అంటీలు : అత్యాశ ….. , ఈ అల్లరి ఉండేదేకానీ పెద్దమ్మా ఎలా ? .
పెద్దమ్మ : మనింటిలోనే ఇక్కడే ఆహ్వానించండి ……
లవ్ టు లవ్ టు లవ్ టు అంటూ కారా వ్యాన్ నుండి తీసుకొచ్చి , అంటీలు – మేడమ్ అందరూ ఆహ్వానించి కౌగిలించుకున్నారు .
అంటీలు : పొగరు అన్నాము sorry మహేష్ …… , దేవతలాంటి పెద్దమ్మను కూడా ఈ ఇంటి మనిషిని చేసి అదృష్టాన్ని కలిగించావు .
అక్కయ్యలు ; చెబితే వినలేదు అమ్మలూ ….. , తమ్ముడు ఏమిచేసినా కారణం ఉంటుంది .
ఈ కారణం అయితే కాదు అక్కయ్యలూ ….. నన్ను మన్నించండి .
అక్కయ్యలు : నిజాయితీగా ఉంటావు తమ్ముడూ లవ్ యు లవ్ యు ……
అంటీలు : ముగ్గులు చేరిపేసి అందరి ముందు నవ్వులపాలు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకున్నాడా ? , ఇంకా చాలా విషయాలలో అల్లరిని ఒప్పుకున్నాడా ? .
అక్కయ్యలు : తమ్ముడు కాదంటే నమ్మడం లేదు మీరు ……
అంటీలు : కౌన్సిలర్ అంటీ చెప్పలేదూ ……
అక్కయ్యలు : తమ్ముడి మీద నింద వేసినదమ్మా …..
అంటీలు : మీరెంత చెప్పినా నమ్మములే కానీ , ఇక బుజ్జితల్లి ఫ్రెండ్స్ ఇళ్లన్నింటికీ వెళ్ళాలి .
తల్లులూ ….. చివరగా సంతోషమే అన్నారు పెద్దమ్మ .
లవ్ యూ పెద్దమ్మా అంటూ బుజ్జిజానకి అందరూ కారా వ్యాన్ లోకి చేరారు – నేనైతే రెండు చేతులలో స్వీట్స్ అందుకుని బాబుతో షేర్ చేసుకుని తింటున్నాను .
బుజ్జిజానకి : పెద్దమ్మా ….. మా ఫ్రెండ్స్ అడ్రెస్సెస్ .
పెద్దమ్మ : నీ స్నేహితురాళ్లందరి అడ్రెస్సెస్ అన్నీ నీ హీరోతో ఉన్నాయి , అన్ని ఇళ్లకూ తీసుకెళతాడు .
బుజ్జిజానకి : లవ్ యు మహేష్ అంటూ మురిసిపోతూ వెళ్లి అంటీల మధ్యలో కూర్చుని చేతులను చుట్టేసి నన్నే చూస్తోంది ప్రేమతో …..
అందరి ఇల్లులూ కాలేజ్ చుట్టూ దగ్గరలోనే ఏరియా లలో ఉన్నట్లు మొదటగా బుజ్జిజానకి బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి చేరుకున్నాము .
బాబు నిద్రపోవడంతో ఊయలలో పడుకోబెట్టాము .
బుజ్జిజానకి : దేవతలూ ….. మిమ్మల్ని ఇబ్బందిపెట్టను బస్సులోనే ఉంటాను కానీ ముద్దులు ఇచ్చి వెళ్ళండి .
లవ్ టు లవ్ టు అంటూ పళ్ళెంలో పసుపు కుంకుమ పట్టుచీర అందుకున్నారు .
పెద్దమ్మ : మొత్తం మూడు పట్టుచీరలు తీసుకోండి దేవతలూ ……
బుజ్జిజానకి : అంటీకి పట్టుచీర ….. లవ్ యు లవ్ యు దేవతలూ .
అంటీలు : ఈ లవ్ యు లన్నీ పెద్దమ్మ – మేడమ్ అంటీకు చెప్పు …..
పెద్దమ్మ – అంటీ : నావైపుకు చూయించారు .
నావైపు అలా ప్రాణంలా చూస్తుండిపోయింది .
వెళ్ళొస్తాము బుజ్జితల్లీ అంటూ ఐదుగురు దేవతలు ముద్దులు కురిపించి అమ్మమ్మతోపాటు వెళ్లారు .
అక్కయ్యలు : చెల్లీ ….. మేముకూడా వెళుతున్నాము , ముద్దులతో రుణం తీర్చుకో ……. అంటూ ముద్దులుపెట్టి వెళ్లారు .
బుజ్జిజానకి : నన్నే చూస్తూ వచ్చి ప్రక్కనే కూర్చుని చేతిని చుట్టేసింది , ఎందుకురా ……
నీకోసమేమీ కాదులే అమ్మకోసం ……
అంతులేని ఆనందపు నవ్వుతో ముద్దుపెట్టింది బుజ్జిజానకి ……
అఅహ్హ్ ….. , అమ్మా హ్యాపీనా ? , లవ్ యు …… , ఆపకు ఆపకు ఇలా జీవితాంతం చూస్తుండిపోవచ్చు తెలుసా ? .
బుజ్జిజానకి : లవ్ యు తథాస్తు అంటూ సంతోషం పట్టలేక బుగ్గపై కొరికేసింది .
స్స్స్ …… , పట్టుచీరకే కొరికేస్తే అమ్మో ఇంకా చెప్పలేదు .
బుజ్జిజానకి : ఏంటి ఏంటి ఏంటి …… ? .
( అమ్మా అమ్మా హెడ్ మిస్ట్రెస్ మేడమ్ మరియు మహి అమ్మమ్మ వచ్చారు అంటూ కేకలువేస్తూ లోపలికి పిలుచుకునివెళ్లింది మహి ఫ్రెండ్ …..
రండి రండి అంటూ సంతోషంగా ఆహ్వానించారు , తల్లి చెప్పింది వస్తారని నిన్నటి నుండీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫోనులో మాట్లాడుతూనే ఉన్నారు ……
మహి ఫ్రెండ్ : అమ్మమ్మా – మేడమ్ ….. మహి ఇంట్లోనే ఉందా ? .
మేడమ్ : బెస్ట్ ఫ్రెండ్ కోసం రాకుండా ఉంటుందా బయట బస్సులో ఉంది పద్మా …… .
మహీ మహీ అంటూ బయటకు పరుగులుతీసింది .
అందరితోపాటు మేడమ్ నవ్వుకుని , అక్కయ్యా ….. మహి ప్రాణమైన అత్తయ్యలు – పెద్దమ్మ – అక్కయ్యలు …..
అంటీ : సంతోషం ….. , తను నా తోడి కోడలు – తను అత్తయ్య ….. వారి పిల్లలు , విజయవాడ – రాజమండ్రిలో ఉంటారు , ఉదయమే వచ్చారు .
అంటీలు : మా మహికోసమే మహిని ఆశీర్వదించడం కోసమే సమయానికి ఆ దైవం ఇక్కడకు చేర్చారు , చెల్లీ …..
మేడమ్ : అక్కయ్యలూ …. అంటూ అంటీలతోపాటు కలిసి , రేపు సాయంత్రం కాదు కాదు మీరు ఉదయమే రావాలి మీరంటే చాలా ఇష్టం మహికి , మహి ఫంక్షన్ కు తప్పకుండా విచ్చేసి ఆశీర్వదించాలి అంటూ పసుపు కుంకుమ ఉంచి సంతోషంగా ఆహ్వానించారు .
అంటీ : మా మహి ఫంక్షన్ ఉదయమే వచ్చేసి అన్నీ పనులూ చేస్తాను .
చాలా సంతోషం అంటూ ఆనందించారు .
కూర్చోండి మా ఆతిధ్యం స్వీకరించండి ….. )
మహీ మహీ ….. బస్సు ఎక్కి hi మహేష్ …..
Hi సిస్టర్ ……
పద్మ – మహి అంటూ సంతోషంతో కౌగిలించుకుని మాటలు కలిపారు , నేను ఉదయమే వచ్చేస్తానే నాన్నకు చెప్పేసాను .
నవ్వుకుని లోపలనుండి షాపింగ్ బ్యాగ్స్ తీసుకొచ్చి బుజ్జిజానకికి అందించాను .
బుజ్జిజానకి : ఇదేనా లవ్ యు లవ్ యు ….. , పద్మా తీసుకోవే …..
మహి ఫ్రెండ్ : ఇన్ని గిఫ్ట్స్ ? .
బుజ్జిజానకి నావైపుకు చూసింది .
సిస్టర్ ….. మీ పిన్నమ్మ పిల్లలకు మరియు అత్తయ్య పిల్లలకు ……
మహి ఫ్రెండ్ : థాంక్యూ వే మహీ ….. అంటూ కౌగిలించుకుంది .
ఇంకా నావైపే చూస్తున్నట్లు , సిస్టర్ వధలగానే లేచి నన్ను చుట్టేసింది , లవ్ యు లవ్ యు మహేష్ ……
నీకోసం ……
బుజ్జిజానకి : తెలుసు అమ్మకోసం అంటూ బుగ్గపై మరింత గట్టిగా కొరికేసింది .
కెవ్వున కేకవేసి రుద్దుకుంటూ వెళ్లి కూర్చున్నాను .
ఫ్రెండ్స్ ఇద్దరూ సంతోషంగా నవ్వుకుని , గిఫ్ట్స్ తెరిచి చూసారు …..
మూడు పట్టు లంగావోణీలు – మూడు డ్రెస్సులు – బాయ్స్ డ్రెస్సెస్ తోపాటు మూడు బుజ్జి క్యూట్ టెడ్డీస్ ……
మహి ఫ్రెండ్ : థాంక్యూ థాంక్యూ వే ……
అంతలో దేవతలు – అక్కయ్యలు వచ్చారు .
మహి ఫ్రెండ్ : మేడమ్ – అమ్మమ్మా ….. మహి గిఫ్ట్స్ ఇచ్చింది .
మేడమ్ : హ్యాపీ కదా ….
మహి ఫ్రెండ్ : చాలా అంటే చాలా ….. , ఉదయమే వచ్చేస్తాను .
గుడ్ గుడ్ ….. , వెళ్లి అమ్మకు చూయించు …..
మహి ఫ్రెండ్ : మహీ రేపు కలుద్దాము బై అంటూ రెండుచేతులలో పట్టుకుని అమ్మా అమ్మా అంటూ సంతోషంతో కేకలువేస్తూ వెళ్ళింది . అప్పటికే పట్టుచీరలను చూస్తుండటం చూసి , అమ్మా – పిన్నీ – అత్తయ్యా ….. మీకే కాదు మా అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చింది మహి అంటూ పిల్లలందరికీ అందించింది .
పట్టుచీరలు – లంగావోణీలు – డ్రెస్సెస్ ….. అన్నీ అన్నీ చాలా విలువైనవి .
మహి ఫ్రెండ్ : మహికి మనమంటే చాలా ఇష్టం అమ్మా ……
అంటీ : చాలా సంతోషం , అందరమూ ఉదయమే వెళదాము .
అలా సాయంత్రం 5 గంటలవరకూ దగ్గరదగ్గరలో ఉన్న బుజ్జిజానకి ఫ్రెండ్స్ పేరెంట్స్ ను పసుపు కుంకుమ పట్టు వస్త్రాలతో సంతోషంగా ఆహ్వానించి ఇంటికి చేరుకున్నాము , 6 లోపు ఇంటిచుట్టూ తెలిసినవాళ్లను కూడా ఆహ్వానించి ఏమాత్రం అలసట లేనట్లు చిరునవ్వులు చిందిస్తూ ఇంటికి చేరుకున్నారు దేవతలు ………
ఇంటిముందు రెండు కొత్త కాలేజ్ బస్సెస్ ఆగి ఉండటం – బస్సెస్ ప్రక్కనే చాలామంది పిల్లలు – బామ్మలు ఉండటం చూసి ఆశ్చర్యపోతూనే కిందకుదిగారు .
పిల్లలూ ….. మన బుజ్జిదేవత వచ్చినట్లుంది అంటూ ఆయా చెప్పడంతో పిల్లలందరిలో ఒక్కసారిగా సంతోషం – ఉత్సాహం ……
అక్కయ్యా అక్కయ్యా – బుజ్జిజానకి బుజ్జిజానకి …… అంటూ సంతోషంతో పలుకుతూ దేవతల దగ్గరికి చేరుకున్నారు , అమ్మలూ అమ్మలూ ……
అంతమంది అనాధలు ….. అమ్మలూ అన్న పిలుపుకు దేవతలలో అంతులేని సంతోషం , పిల్లలూ ఎవరికోసం ఎదురుచూస్తున్నారు ? ఎప్పుడు వచ్చారు ? .
పిల్లలు : చాలాసేపు అయ్యింది అమ్మలూ ….. , మీకోసమే ఎదురుచూస్తున్నాము .
అంటీలు – మేడమ్ : చాలాసేపు అయ్యిందా ? , మాకోసం ? అంటూ ఆశ్చర్యపోతున్నారు .
పిల్లలు : అమ్మలూ అమ్మలూ ….. మా బుజ్జిదేవత ఎక్కడ ? .
అక్కయ్యలు : బుజ్జిదేవత అంటే చెల్లి బుజ్జిజానకే , చెల్లీ చెల్లీ ……
పిల్లలు : అవును బుజ్జిజానకే మా బుజ్జిదేవత ….. , బుజ్జిజానకీ – అక్కయ్యా అంటూ దిగిన బుజ్జిజానకిని ఆనందబాస్పాలతో చుట్టేశారు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ …….
వందలాది థాంక్స్ …… బుజ్జిజానకి కళ్ళల్లో ఆనందబాస్పాలను రప్పించాయి .
పిల్లలు : మీకోసం చాలాసేపు ఏమిటి ఎంతసేపైనా ఎదురుచూస్తాము , థాంక్యూ థాంక్యూ …… థాంక్యూ అక్కయ్యా అక్కయ్యా బుజ్జిజానకీ …..
బామ్మలు కూడా వచ్చి చల్లగా ఉండు బుజ్జిజానకీ ….. , ఇంతమంది సంతోషాలకు కారణమయ్యావు మా ఆయుష్షు కూడా పోసుకుని అంటూ దీవించారు .
అదిగో బుజ్జిదేవతతోపాటు బుజ్జిదేవుడు కూడా ఉన్నాడు అంటూ ఆయా ……
అన్నయ్యా – అన్నయ్యా ….. అంటూ చుట్టూ చేరి థాంక్స్ చెబుతున్నారు .
సిస్టర్స్ – బామ్మలూ …… మీ సంతోషాలకు కారణం , మీ బుజ్జిదేవత అయిన బుజ్జిజానకి మొదటి కారణం అయితే రెండవ కారణం తన అంటీ – అత్తయ్యలు – పెద్దమ్మ – అమ్మమ్మ ….. వారు చెబితేనే వచ్చాను , ఇదిగో ఆ సమయంలో భయపడిపోతున్న నాకు ధైర్యం చెప్పి వారి కారులో పంపించింది ఈ అక్కయ్యలు , నేను కేవలం పోస్ట్ మ్యాన్ మాత్రమే వెళ్ళండి వెళ్ళండి ……
బామ్మలు : పోస్ట్ మ్యాన్ వు అయినా బుజ్జిదేవత తల్లులతోపాటు మా బుజ్జిదేవుడివే , ఇక వీరంతా ఇకనుండీ మా దేవతలు అంటూ రెండు చేతులూ జోడించారు ఆనందబాస్పాలతో …..
అమ్మలూ అమ్మలూ ….. మీరు పెద్దవారు ఆశీర్వదించాలికానీ ఇలా చెయ్యకూడదు అంటూ ఆపారు ( పెద్దమ్మ వివరించినట్లు పిల్లలతోపాటు బుజ్జిజానకిని ప్రాణంలా కౌగిలిలోకి తీసుకున్నారు ) బుజ్జిజానకీ …… ఇంతమంది పిల్లలు – బామ్మల పెదాలపై సంతోషాలను నింపి నిజంగా బుజ్జిదేవతవు అయ్యావు …… , పిల్లలూ – అమ్మలూ ….. మిమ్మల్ని వేచి చూసేలా చేసాము క్షమించండి , లోపలికి రండి …..
ఆయా : మాకోసం ఎంతసేపైనా సంతోషంగా వేచిచూస్తారు , మీకిష్టమైతే మిమ్మల్ని మా శరణాలయానికి ఆహ్వానించడానికి వచ్చాము , కొద్దిసేపు కొద్దిసేపు ….. , మా బుజ్జిదేవత ఫంక్షన్ హడావిడిలో ఉన్నారని తెలిసింది అయినా మా ఆశ మాది , మమ్మల్ని మన్నించి ……
అంటీలు : బుజ్జితల్లీ ….. ok , ఆహ్వానాలన్నీ అయిపోయాయి , కొద్దిసేపు ఏమిటి మీకు ఇష్టమైనంతసేపు ……
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ …..
పిల్లలు : నిజంగా దేవతలే అన్నమాట అక్కయ్యా ……
బుజ్జిజానకి : అవును చెల్లెళ్ళూ – అక్కయ్యలూ …… , దేవతలు వచ్చాకనే నెనుకూడా మీలా సంతోషంగా మారిపోయాను , వారి వల్లనే మనందరి సంతోషం …….
అంటీలు : ఐదే ఐదు నిమిషాలు ….. మీ బుజ్జిదేవతను బుజ్జిదేవతగా మార్చి మీకు అప్పగిస్తాను .
పిల్లలు : అవునవును , మాకు ఊహతెలిసినప్పటి నుండీ ఫస్ట్ టైం కొత్త బట్టలు ఈరోజునే వేసుకున్నాము , థాంక్యూ బుజ్జిదేవత ……
అందరి కళ్ళల్లో ఆనందబాస్పాలు …… , బుజ్జిజానకి మోకాళ్లపై కూర్చుని పిల్లలను హత్తుకుని ముద్దులుపెడుతోంది .
అంటీలు : బుజ్జితల్లీ ….. 5 మినిట్స్ రామరి , మంచిపని చేసావు sorry రాత్రి అలా మాట్లాడకూడదు అంటూ నా కురులపై స్పృశించి లోపలికివెళుతున్నారు .
తమ్ముడూ తమ్ముడూ అంటూ అక్కయ్యలు ……
సంతోషంతో అందరి మధ్యలోకివెళ్లి , సిస్టర్స్ డాన్స్ వచ్చా అంటూ చిందులువేస్తున్నాను .
ఓ వచ్చు అంటూ నాతోపాటు సంతోషాన్ని పంచుకున్నారు .
దేవతలు : అల్లరి పిల్లాడు అంటూ లోపలికివెళ్లారు .
బుజ్జిజానకి : మధ్యలోకివచ్చి చెల్లెళ్ళూ – అక్కయ్యలూ – బామ్మలూ ….. మీముందు మీ బుజ్జిదేవుడిని కౌగిలించుకోవచ్చా ? .
మేమైతే ముద్దులుకూడా పెడతాము అంత ఇష్టం మీరంటే ……
బుజ్జిజానకి : థాంక్యూ అంటూ అంతులేని ప్రేమతో చుట్టేసి లవ్ యు అంటూ బుగ్గపై గట్టిగా కొరికేసి , బుజ్జాయిల చేతులుపట్టుకుని లోపలికి పరుగుణవెళ్లింది .
స్స్స్ ……
సిస్టర్స్ అందరూ నవ్వుతున్నారు .
సిస్టర్స్ ఐస్ క్రీమ్ తింటారా ? .
పిల్లలు : ఉదయం నుండీ తింటూనే ఉన్నాము బుజ్జిదేవుడా ….. , అయినా తింటాము .
అన్నయ్య – తమ్ముడూ అని పిలవండి ఆప్యాయంగా …..
పిల్లలు : మాకు దేవుడే …..
ఐస్ క్రీమ్ వెహికల్ ఆగడం చకచకా అందరికీ వారికి ఇష్టమైనవి అందించడంతో ముందుగా నాకు అందించారు , బుజ్జిదేవత – దేవతలకు ఇచ్చోస్తాము అంటూ లోపలికివెళ్లారు .
థాంక్యూ థాంక్యూ అంటూ సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ తిన్నాము .
అన్నయ్యా ….. బుజ్జిదేవత – దేవతలు వచ్చారు .
వచ్చా……రా …… పట్టు పరికిణీలో బుజ్జి సిస్టర్స్ ను పట్టుకున్న బుజ్జిజానకి – పట్టు లంగావోణీలలో అక్కయ్యలు – పట్టుచీరలలో దేవతలు ….. అహ్హ్ అంటూ ఫ్లాట్ అయిపోయినట్లు హృదయంపై చేతినివేసుకుని వెనక్కు ……
మహేష్ – తమ్ముడూ – హీరో ……
పిల్లలు : పట్టుకున్నాము పట్టుకున్నాము బుజ్జిదేవత – దేవతలూ ….. కంగారుపడకండి మాకు …. ఈ బుజ్జిదేవుడి గురించి పూర్తిగా తెలిసిపోయింది – మీరందరూ అంటే ప్రాణం అన్నమాట …….
బుజ్జిజానకి – అక్కయ్యల – మేడమ్ – పెద్దమ్మ అందమైన నవ్వులు , అంటీల కోపపు నవ్వులు …….
అఅహ్హ్ …… దగ్గరకు వచ్చేన్తవరకూ అలా కన్నార్పకుండా చూస్తుండిపోయాను .
