బస్సు ఆగడంతో బుజ్జిదేవత – దేవతలూ …… వచ్చేసాము రండి రండి అంటూ చేతులు అందుకుని కిందకు తీసుకెళ్లారు .
విద్యుత్ వెలుగులలో వెలిగిపోతున్న శరణాలయంతోపాటు ” అమ్మ జానకి అనాథ శరణాలయం మరియు వృద్ధాశ్రమం ” బోర్డ్ ను చూసి బుజ్జిజానకి కళ్ళల్లో ఆనందపు చెమ్మ …… , పిల్లలవైపు చూసింది .
పిల్లలు : అవును బుజ్జిజానకీ అక్కయ్యా ….. , మా బుజ్జిదేవతకు అమ్మ అంటే ఎంతిష్టమో బుజ్జిదేవుడు చెప్పడం వలన తెలిసి అమ్మ పేరు పెడదామని వార్డెన్ – బామ్మలు సజెస్ట్ చేశారు అంతే అందరం సంతోషంతో గెంతులేసాము , అమ్మ శరణాలయంలో ఉంటే అమ్మతో ఉన్నట్లే కదా ……
బుజ్జిజానకి : ఆనందబాస్పాలతో అత్తయ్యలూ అత్తయ్యలూ అంటీ పెద్దమ్మా అక్కయ్యలూ అమ్మ ….. అమ్మ పేరు , థాంక్యూ థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ – బామ్మలూ ……
పిల్లలు : అమ్మ పేరుతో కొత్తగా రూపుదిద్దుకున్న అమ్మ జానకి శరణాలయాన్ని మా బుజ్జిదేవత ద్వారా ప్రారంభించాలని కోరిక – మాకోరిక తీరుస్తారా ? .
బుజ్జిజానకి : అంతకంటే అదృష్టమా , నేనే కాదు మనమంతా బిడ్డలమే రండి రండి అక్కయ్యలూ అంటూ వెళ్లి నావైపు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి రిబ్బన్ కట్ చేశారు .
సెలెబ్రేషన్ అన్నట్లు అందరిపై పూలవర్షం కురిసింది చూస్తే చుట్టూ పిల్లలు ….. పూలు కురిపిస్తున్నారు .
తమ్ముడూ …… సెలెబ్రేషన్ క్రాకర్స్ లేవా ? – అమ్మ శరణాలయం అంటే అధిరిపోవాలి .
పెద్దమ్మ వైపు చూడటం ఆలస్యం …… పూలవర్షంతోపాటు ఆకాశంలో తారాజువ్వలు అద్భుతాలనే సృష్టిస్తున్నాయి , అంతలోనే శరణాలయం చుట్టూ ఫ్లైయింగ్ చైనీస్ క్యాండిల్స్ ఆకాశంలోకి వెళుతుంటే అందరమూ కన్నార్పకుండా చూస్తుండిపోయాము .
అక్కయ్యలు : ఉన్నాయన్నమాట , ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వలన ఆలస్యం అయి ఉంటుంది అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి ఎంజాయ్ చేస్తున్నారు .
బుజ్జిజానకి ….. నావైపు చూసి హత్తుకోవాలని రెండుచేతులతో సైగచేసింది .
అఅహ్హ్ ….. లవ్ యు , ముందైతే ఈ సెలెబ్రేషన్ ఎంజాయ్ చెయ్యి ……
ప్చ్ ప్చ్ అంటూ వెళ్లి అంటీల కౌగిలిలోకి చేరి నావైపు చూస్తూ వాసంతి అత్తయ్య బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టింది .
అఅహ్హ్ ……
బుజ్జిజానకి : జాగ్ర ….. పెద్దమ్మా పట్టుకున్నారా ? లవ్ యు ……
పిల్లలు : బుజ్జిదేవతా ….. బయట పూలతోట మొదలుకుని శరణాలయం మొత్తం మీరు చెప్పినట్లు ఎలా మార్చారో చూయిస్తాము రండి అంటూ అక్కయ్యలతోపాటు పూలదారిలో పిలుచుకునివెళ్లారు , స్నాక్స్ అందించారు .
దేవతలకు ….. వార్డెన్ చూయించారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ ….. బామ్మలు చెప్పినట్లు నాకుకూడా మూడురోజులు మనింట్లో – మూడురోజులు ఇక్కడ ఉండాలని ఉంది ……
అక్కయ్యలు : మాకైతే వారమంతా ఇక్కడే ఉండిపోవాలని ఉంది , శరణాలయంలా లేదు 5 స్టార్ హోటల్లా ఎటుచూసినా లగ్జరీ …… , ఇక స్నాక్స్ కూడా సూపర్ ….. , చెల్లీ డిన్నర్ ఇక్కడే చెయ్యాలని ఉంది .
బుజ్జిజానకి : నాకు కూడా అక్కయ్యలూ ….. , వార్డెన్ – పిల్లల పర్మిషన్ తీసుకుందాము .
బుజ్జిదేవత – అక్కయ్యలూ ….. అంటూ బుంగమూతి పెట్టుకున్నారు .
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏమైంది అంటూ నవ్వుకుంటున్నారు అర్థమై , sorry sorry ….. పర్మిషన్ అడగములే డిన్నర్ ఇక్కడే చేస్తాము .
పిల్లలు : మీకోసం స్పెషల్ గా చెయ్యమని మీదగ్గరకు వచ్చే ముందే చెఫ్స్ కు ఆర్డర్స్ వేశాము .
బుజ్జిజానకి – అక్కయ్యలు : నో నో నో ….. మా ఫ్రెండ్స్ ఏది తింటే అదే మాకూ ఇష్టం …..
పిల్లలు : ఉదయం నుండీ అన్నీ స్పెషలే బుజ్జిదేవత ……
బుజ్జిజానకి – అక్కయ్యలు : మరొకవైపు నుండి దేవతలు లోపలికి రావడం చూసి కౌగిలిలోకి చేరి , వార్డెన్ ….. వారంలో మూడురోజులు ఇక్కడే మాకూ లాకర్ కీస్ ఇవ్వండి .
పిల్లలైతే సంతోషంతో కేకలు – చిందులు వేస్తున్నారు .
వార్డెన్ : అంతకంటే అదృష్టమా బుజ్జిదేవతా …..
పిల్లలు : మరి అన్నయ్య బుజ్జిదేవుడు ? , బుజ్జిదేవుడికీ ఇవ్వండి ……
థాంక్యూ సిస్టర్స్ ….. , మీ బుజ్జిదేవత ఇక్కడున్నన్ని రోజులూ ….. మెయిన్ గేట్ బయట వెహికల్లో ఉంటానులే , మీరు తీసుకొచ్చేవి అన్నీ ఒక్కటీ వదలకుండా కుమ్మేస్తానులే ……
పిల్లలు : నాట్ 100% హ్యాపీ బట్ ok ……
అందరమూ నవ్వుకున్నాము .
సిస్టర్స్ ….. వంటగది ప్రక్కగా వస్తుంటే ఘుమఘుమలు – సడెన్ గా ఆకలి పట్టేసింది .
బుజ్జిజానకి : నాక్కూడా …..
అక్కయ్యలు : నాక్కూడా నాక్కూడా ……
పిల్లలు : మాకు కూడా అంటూ నవ్వుకున్నారు .
వార్డెన్ వెంటనే గోడకున్న బర్జర్ ప్రెస్ చేసి , డిన్నర్ రెడీనా అని అడిగారు .
ఆల్మోస్ట్ వార్డెన్ ….. మీరు వచ్చేయొచ్చు ……
బుజ్జిజానకి – అక్కయ్యలు : షాక్ లో చూస్తుండిపోయారు .
పిల్లలు : మాకు ఏమిష్టమో ప్రెస్ చేసి ఆర్డర్వేస్తే చదువుకుంటున్న మన దగ్గరకే తీసుకొచ్చేస్తారు …… , ఉదయం నుండీ అందరమూ ఆర్డర్ చేసి ఎంజాయ్ చేసాము , సంతోషంగా తిన్నాము , థాంక్యూ థాంక్యూ బుజ్జిదేవతా ….. అంటూ కన్నీళ్లతో చుట్టేశారు .
ఫ్రెండ్స్ ……
వార్డెన్ : ఉదయం ఉప్మా – మధ్యాహ్నం రేషన్ బియ్యపు అన్నం నీళ్ళలాంటి చారు – రాత్రికి మధ్యాహ్నం మిగిలిన చారు అన్నం నీళ్ల మజ్జిగ …… , ఏడవనివ్వండి ఏడవనివ్వండి …… ఈరోజుతో బాధనంతా దూరం చేసుకోనివ్వండి .
వింటుంటేనే మా అందరి కళ్ళల్లో చెమ్మ చేరింది .
పిల్లలు : బుజ్జిదేవత – దేవతలూ …… అయిపోయింది అయిపోయింది sorry sorry , మీవలన ఇక కన్నీళ్లు అంటే ఏమో కూడా మరిచిపోతామేమో అంటూ నవ్వించారు .
అత్తయ్యలు – మేడమ్ : పిల్లలకు ఏ లోటూ రాకూడదు , మాదగ్గర చాలా నగలు ఉన్నాయి ……
వార్డెన్ : దేవతలు అని మళ్ళీ నిరూపించుకున్నారు , govt నుండి మరియు డోనేషన్స్ ద్వారానే పెద్ద మొత్తంలో చేరుతుంది , ఇంతవరకూ పంది కొక్కుల్లా దోచేసారు కానీ ఇప్పుడలా కాదు మొత్తం డబ్బు నేరుగా మాకే చేరిపోయేలా చేసేసారు మీరు , మీరు వస్తే చాలు పిల్లలకు సంతోషం …..
దేవతలు : తప్పకుండా తప్పకుండా అంటూ సంతోషంతో కన్నీళ్లు తుడుచుకున్నారు .
పిల్లలు : వారంలో మూడురోజులు బుజ్జిదేవత అక్కయ్యలు ఉంటారు కాబట్టి దేవతలూ వారి వెనుక రావాల్సిందే ……
అందరూ నవ్వుకున్నారు ……
బర్జర్ మ్రోగడంతో ……
బుజ్జిదేవతా – దేవతలూ …… డిన్నర్ రెడీ .
ఫస్ట్ నాకు ……
పిల్లలు : అలాగే అన్నయ్యా …… , రండి అంటూ చేతులుపట్టుకుని తీసుకెళ్లారు , బుజ్జిజానకిని – అక్కయ్యలను – దేవతలను ….. ఎదురుగా కూర్చోబెట్టి వరుసగా కూర్చున్నారు .
బామ్మలు రావడంతో బుజ్జిజానకి – అక్కయ్యలతోపాటు లేచివెళ్లి వారి చేతులను అందుకుని నడిపించుకుంటూ వచ్చి కూర్చోబెట్టి కూర్చున్నాము .
అంతే డిన్నర్ హాల్ మొత్తం చప్పట్లు – కేకలు ……
థాంక్యూ థాంక్యూ సిస్టర్స్ – ఫ్రెండ్స్ ……
బామ్మలకు మొదలుకుని చకచకా ప్లేటులో అన్నీ వడ్డించారు , తినబోతే వార్డెన్ నో నో అన్నట్లు సైగచెయ్యడంతో ఆగిపోయాను .
అన్నీ వడ్డించిన తరువాత ప్రేయర్ అంటూ సిస్టర్స్ అందరూ లేచారు .
మొట్టికాయ వేసుకుని లేచి నిలబడ్డాము ……
వార్డెన్ తోపాటు బుజ్జిజానకి – అక్కయ్యలు నవ్వుకున్నారు …..
ప్రేయర్ పూర్తికాగానే , అన్నయ్యా ….. కుమ్మేయ్యండి .
అవును నోరూరిపోతున్నాయి , అచ్చు ఇంటి వంటల్లా ఉన్నాయి .
పిల్లలు : చెఫ్స్ కూడా అమ్మలే అన్నయ్యా ….. , మీకు తెలియదా ? .
అలా అయితే కాసేపు నన్ను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకండి తృప్తిగా ఎంజాయ్ చెయ్యాలి అంటూ స్వీట్ తిని మ్మ్ ….. అన్నాను .
బుజ్జిజానకి : అంత టేస్ట్ గా ఉందా మహేష్ అంటూ అంటీల దగ్గరికివెళ్లింది .
దేవతలు ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రాణంలా తినిపించారు .
బుజ్జిజానకి : మ్మ్ మ్మ్ దేవతలు తినిపించడంతో మరింత రుచి …….
ఆశతో లొట్టలేస్తూ చూస్తున్నాను .
సిస్టర్స్ అందరూ లేచి దేవతల ముందుకు చేరి చేతులు చాపారు ……
బుజ్జాయిలకు ఆప్యాయంగా నోటికి అందించి అందరి చేతులలో గోరుముద్దలు పెడుతున్నారు ……
వరుసగా వెనుకే వెళ్లి చేతిని చాపాను …….
అంటీలు : ఊహూ ……
లవ్ యు అత్తయ్యలూ అంటూ బుజ్జిజానకి ముద్దులుపెట్టగానే , కూల్ అయిపోయి ముద్దలు పెట్టారు .
యాహూ ….. లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ అంటూ తిని సూపర్ కదా సిస్టర్స్ …..
పిల్లలు : మ్మ్ మ్మ్ అంటూ మళ్లీ వెళ్లారు .
అంటీలు : నువ్వు అక్కడే ఆగు ……
ప్చ్ ప్చ్ …..
సిస్టర్స్ ఒక్కొక్కరూ వచ్చి ముద్దలో సగం సగం ప్లేటులో ఉంచారు .
తినిపించొచ్చుకదా ……
పిల్లలు : హ్యాపీగా అంటూ తినిపించారు .
అలా చిలిపిపనులతో సిస్టర్స్ – బామ్మలకు సంతోషాలను పంచుతూ డిన్నర్ పూర్తిచేసి బయట పూలతోట దగ్గరికి చేరుకున్నాము .
అంటీలు : ఫుల్ గా తిన్నావుకదా , క్యారెజీ కూడానా ? .
అక్కయ్యలు : అమ్మలూ …….
అక్కయ్యలూ ….. తాతయ్యకు అంటూ ఎవరికీ వినిపించకుండా గుసగుసలాడాను .
అక్కయ్యలు : అమ్మలూ ….. ఎవరికో తెలుసా ? .
ష్ ష్ ష్ అక్కయ్యలూ ……
అక్కయ్యలు : నీ దేవతలు బాధపడితే చూడలేవు అంటూ ప్రాణంలా మొట్టికాయలువేశారు , ( చెల్లీ ….. తాతయ్యకు )
అంతే లవ్ యు అంటూ కౌగిలించుకుంది .
దేవతలు చూస్తున్నారు వదులు వదులు , వెళ్లి దేవతలను హత్తుకో కూల్ అవుతారు .
దేవతలు : బుజ్జిదేవతా …… నీ భక్తులందరినీ నీ ఫంక్షన్ కు ఆహ్వానిద్దామా ? .
బుజ్జిజానకి : లవ్ యు దేవతలూ ……
పిల్లలు : యాహూ యాహూ …… లవ్ యు దేవతలూ , ఆహ్వానించకపోయినా వచ్చేసేవాళ్ళం .
దేవతలు : మా పిల్లలందరికీ కొత్తబట్టలు కొనాలి .
పిల్లలు : దేవతలూ …… సంవత్సరానికి సరిపడా కొత్త బట్టలతో అన్నీ నిండిపోయాయి లోపల , చాలు చాలు ప్లీజ్ ప్లీజ్ …..
బుజ్జిజానకి : లవ్ యు అంటూ ఫ్లైయింగ్ కిస్ వదిలింది .
సిస్టర్స్ కు నిద్రవచ్చేన్తవరకూ ఉండి కౌగిలింతలతో బై చెప్పి బయలుదేరి ఇంటికి చేరుకున్నాము .
