థర్డ్ MISSION 10 30

అదిగో దేవతలూ …… తమ్ముడు వచ్చాడు అంటూ అక్కయ్యల సంతోషం .
” గాల్లో తేలినట్లుందే ….. గుండె పేలినట్లుందే ….. తేనేపట్టుమీద రాయిపెట్టి కొట్టినట్లుందే ….. ” యాహూ యాహూ అంటూ సంతోషంలో గెంతులువేస్తూ లోపలకువెళ్లి , wow wow wow బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ సో సో లవ్లీ ….. మిరుమిట్లుగొలుపుతున్న పట్టుచీరలలో దేవతలు – పట్టు లంగావోణీలలో దేవకన్యలు మరియు మరియు నా నా ….. అంటూ హృదయంపై చేతినివేసుకుని వెనక్కు పడేంతలో ……
తమ్ముడూ తమ్ముడూ మహేష్ …… వెనకున్న అక్కయ్యలు – బుజ్జిజానకి .
ముందున్న అంటీలు పట్టుకుని చాలు చాలు అంటూ నిలబెట్టారు ( లవ్ యు అమ్మలూ – దేవతలూ అంటూ అక్కయ్యలు – బుజ్జిజానకి ఆనందం ) ఏదో ఉద్ధరించినవాడిలా పాటలు పాడుకుంటూ వస్తున్నావు అంటూ మూడో కన్ను తెరిచినట్లుగా కోపాలతో నా చుట్టూ తిరుగుతున్నారు .
అఅహ్హ్ ….. కోపంలో తెగ ముద్ ….. ముచ్చటగా ఉన్నారు , ఇంతకూ మీ అందమైనకోపాలకు కారణం ? .
అంటీలు : నీకు తెలియదా ? .
తెలియదే …….
అంటీలు : ఫంక్షన్ డెకరేషన్ ఎక్కడ ? .
సర్ప్రైజ్ ……
అంటీలు : ఫంక్షన్ ఆహ్వానితులు – పిల్లలు ఎక్కడ ? .
సర్ప్రైజ్ ……
అంటీలు : కనీసం మా బుజ్జిజానకిని కూర్చోబెట్టే బ్యూటిఫుల్ ఆసనం ఎక్కడ ? .
సర్ప్రైజ్ …….
అంటీలు : అన్నింటికీ సర్ప్రైజ్ సర్ప్రైజ్ …… అంటూ మొట్టికాయలు వేశారు .
యాహూ యాహూ …… దేవతలు కొట్టారు దేవతలు కొట్టారు .
బుజ్జిజానకి ఎంజాయ్ చేస్తోంది .
అక్కయ్యలు : అమ్మలూ అమ్మలూ ….. విషయం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు కొడుతున్నారు కూడా , తరువాత మీరే ఫీల్ అవుతారు .
అంటీలు : మేమిక్కడ టెన్షన్ పడుతుంటే ఈ అల్లరి పిల్లాడికి ఆటలా ఉంది – ఏమీ చెయ్యని ఈ అల్లరి పిల్లాడిపై ఫీల్ అవ్వడం కూడానా , ఫంక్షన్ కు గంట సమయం కూడా లేదు , గుడికి కూడా వెళ్ళాలి .
సర్ప్రై ……. , లవ్ …… sorry sorry దేవతలూ , గుడికి వెళ్ళడానికి పూలతో అలంకరించిన లగ్జరీ బస్ రెడీ దేవతలూ ……
అక్కయ్యలు : Wow wow బ్యూటిఫుల్ ….. , లవ్ యు తమ్ముడూ …..
అంటీలు : ఏమిచేశాడని లవ్ యు అంటున్నారు , మాకొస్తున్న కోపానికి …… ఈ అల్లరి పిల్లాడిని అంటూ కోపంతో చూస్తున్నారు .
అఅహ్హ్ ……
అంటీలు : చూసారా చూసారా …..
అక్కయ్యలు : కూల్ కూల్ అమ్మలూ …… , ముందైతే మా ఈ దేవతలను గన్న దుర్గమ్మ తల్లిని దర్శించుకుందాము .
అంటీలు : సమయం లేదు వెళదాము , నువ్వు రావడం లేదు …….
బుజ్జిజానకి – అక్కయ్యలు : అత్తయ్యలూ – అమ్మలూ ……
అంటీలు : ఈ విషయంలో ఇంతే , ప్లీజ్ ప్లీజ్ బుజ్జిజానకీ …… , నువ్వు ఇక్కడే ఉండి ఫంక్షన్ ఏర్పాట్లు పూర్తిచేయ్యి , మేము వచ్చేలోపు మినిమం పూర్తి చెయ్యి చాలు , మా బంగారుతల్లి ఫంక్షన్ ను ఎంతో అంగరంగవైభవంగా జరిపించాలని ఆశపడ్డాము , మా ఆశలన్నీ వమ్ము చేసావు – నీ వల్ల కాకపోతే ముందే చెప్పాల్సింది మాకొస్తున్న కోపానికి అంటూ బుగ్గలపై – చేతిపై గిల్లేసారు .
స్స్స్ స్స్స్ స్స్స్ …… స్వీట్ షాక్ ఎంజాయ్ చేస్తున్నాను .

బుజ్జిజానకి నవ్వుతూనే పెద్దమ్మా అంటూ దీనంగా గుండెలపైకి చేరింది .
పెద్దమ్మ : సర్ప్రైజ్ ….. , నువ్వు బాధపడటం చూస్తే నీ మహేష్ పై మరింత కోప్పడతారు నీ దేవతలు .
బుజ్జిజానకి : లేదు లేదు లేదు ……
పెద్దమ్మ : ఈ బంగారానికి మోస్ట్ బ్యూటిఫుల్ & మోస్ట్ మెమొరబుల్ సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇప్పటివరకూ దూరంగా ఉన్నాడు , ఇప్పటి నుండి ఫంక్షన్ పూర్తయ్యి ఇంటికి చేరుకునేంతవరకూ నీ కనుచూపులోనే ఉంటాడు .
అంటే ……
పెద్దమ్మ : మనతోపాటు గుడికి వస్తున్నాడు కానీ బస్సులో కాదు , నీ దేవతలు చూస్తే అంతే ……
బుజ్జిజానకి : వస్తున్నాడు అదిచాలు పెద్దమ్మా అంటూ నావైపు ప్రేమతో చూస్తోంది .
సో సో సో బ్యూటిఫుల్ అంటూ కళ్ళు – చేతివేళ్ళతో సైగచేసాను .
లవ్ యు అంటూ అందమైన సిగ్గుతో పెద్దమ్మ కౌగిలిలో దాచుకుంది .
పెద్దమ్మ : హ్యాపీ అన్నమాట అంటూ బుజ్జిజానకి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , నీ దేవతలు మరింత కంగారుపడేంతలో వెళదాము అంటూ ఇద్దరూ నావైపుకు చూస్తూనే బస్సు ఎక్కారు , వెనుక కారువైపు సైగచేసారు .
లవ్ యు పెద్దమ్మా అంటూ బుజ్జిజానకి వైపు ప్రేమతో ముద్దువదిలి గుడివరకూ ఫాలో అయ్యాను .

అమ్మవారి బిడ్డల్లా ……. అత్తయ్యలూ – అంటీ – పెద్దమ్మ – అక్కయ్యలు …… అందరూ అందరూ మా అందరి బుజ్జిదేవకన్యను మధ్యలో ఉంచుకుని గుడిలోపలికి తీసుకెళ్లారు .
నేను వెనుకే వస్తున్నానో లేనో అని బుజ్జిజానకి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూనే అమ్మవారికి మొక్కుకుంటూ లోపలికి వెళుతోంది .
చెల్లీ …… ఇక్కడిదాకా వచ్చిన నీ హీరో లోపలికి రాకుండా ఎక్కడికి పోతాడు అంటూ అక్కయ్యలు గుసగుసలాడి ముద్దులుకురిపిస్తున్నారు .
అమ్మవారి సన్నిధికి చేరుకుని , పూజారిగారూ …… బుజ్జిజానకి …. మహి పేరున పూజలన్నీ జరిపించండి , మా బంగారుతల్లి సంతోషంగా – ఆయురారోగ్యాలతో ఉండాలి అంటూ అత్తయ్యలు ……
మహి : అలాగే మా అత్తయ్యలు – అంటీ – పెద్దమ్మ – అక్కయ్యలు మరియు మరియు ( అంటీవాళ్ళు కోపంతో చూస్తుండటం ) చూసి నవ్వుకుని లవ్ యు అత్తయ్యలూ అంటూ బుగ్గలపై ముద్దుపెట్టి మహేష్ కూడా అంటూ నవ్వుతోంది .
సూపర్ చెల్లీ అంటూ అక్కయ్యలు ……
అంటీవాళ్ళు మొట్టికాయలు వెయ్యబోయి అమ్మవారి సన్నిధిన లెంపలేసుకుని ఇదే చివరిసారి అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుకురిపించారు .
ప్రతీసారీ ఇదే చివరిసారి అంటూనే ఉన్నారు అమ్మలూ అంటూ నవ్వుకుంటున్నారు అక్కయ్యలు .
ష్ ష్ ష్ ఇదే చివరిసారి అంటూ అంటీలు కూడా నవ్వేశారు .
లవ్ యు బుజ్జిజానకి – అక్కయ్యలూ అంటూ ఆనందిస్తున్నాను .

పూజ మొదలవ్వడంతో అందరూ భక్తితో బుజ్జిజానకి కోసం ప్రార్థిస్తున్నారు , హారతి – తీర్థ ప్రసాదాలు స్వీకరించారు , అమ్మవారి కుంకుమను బుజ్జిజానకికి ఉంచి అందరూ పెట్టుకున్నారు .
మహి : అక్కయ్యలూ …..
అక్కయ్యలు : తమ్ముడికే కదా మనందరి కుంకుమను ఉంచుతాము అంటూ అందరి చేతుల్లోని కుంకుమను ఒక చేతిలోకి తీసుకుని బయటకువచ్చి నాముందు ఉంచారు .
లవ్ యు అక్కయ్యలూ అంటూ పెట్టుకున్నాను , అందరూ ప్రసాదం తింటూ గుడి ఆవరణలోకి చేరిన తరువాత అమ్మవారి సన్నిధికి వెళ్లి అందరూ సంతోషంగా ఉండాలి అమ్మా అని ప్రార్థించి అక్కడనుండే చూసి ఆనందిస్తున్నాను .

బుజ్జిజానకీ వెళదామా ? అంటూ అంటీలు .
బుజ్జిజానకి : మీరెలా అంటే అలా అత్తయ్యలూ ……
అంటీలు : అక్కడ ఇంటిదగ్గర చిన్న డెకరేషన్ అయినా పూర్తి చేశాడో లేదో ఆ అల్లరి పిల్లాడు , అమ్మా దుర్గమ్మ తల్లీ అంటూ ప్రార్థించి బస్సులో బయలుదేరారు , కంగారుపెడుతూనే ఉన్నారు నాపై కోప్పడుతూనే ఉన్నారు .
కూల్ కూల్ అత్తయ్యలూ ….. ALL IS WELL అనుకోండి అంటూ బుజ్జిజానకి ముద్దులుకురిపిస్తోంది .
అంటీలు : ఇటు వెళుతున్నాము ఏంటి మనం వెళ్ళాల్సినది అటు కదా ……
అక్కయ్యలు : ఎటు వెళ్లినా మనం వెళ్ళాల్సినది చెల్లి సెలెబ్రేషన్ కు అంతేకదా , ట్రాఫిక్ ఉందేమో అందుకే ఇటువైపు వెళుతున్నాడేమో అమ్మలూ అంటూ నవ్వుకుంటున్నారు .

15 నిమిషాలలో బుజ్జిజానకి కాలేజ్ ముందు బస్సు ఆగింది .
అక్కయ్యలు : అమ్మలూ …… చెల్లి చదివే కాలేజ్ రండి రండి అంటూ దిగారు .
అంటీలు : మాకు తెలుసులే తల్లులూ ….. ఇప్పటికే సమయం అయ్యింది ఎందుకు దిగుతున్నారు .
బుజ్జిజానకి : వెళదాము అత్తయ్యలూ ……
అంటీలు : జానకి మీ అమ్మ ఆశీర్వాదాల కోసం వెళదాము అంటూ బుజ్జిజానకి నుదిటి – బుగ్గలపై ముద్దులుపెట్టి కిందకుదిగారు , తల్లీ ….. మొత్తం చీకటిగా ఉంది govt కాలేజ్స్ ను ఏమాత్రం పట్టించుకో……రు …..

అంతే ఒక్కసారిగా కాలేజ్ మొత్తం విద్యుత్ కాంతులతో ధగా ధగా వెలిగిపోయింది , అక్కయ్యలూ – దేవతలూ …… స్వాగతం సుస్వాగతం అంటూ అనాథ పిల్లలందరూ పూలవర్షం కురిపిస్తున్నారు , ఆకాశంలో తారాజువ్వల వెలుగులు ఆ వెంటనే కాలేజ్ చుట్టూ ఫ్లైయింగ్ క్యాండిల్స్ వందల వేలల్లో ఆకాశంలోకి వెళుతూ అద్భుతాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి .
బుజ్జిజానకి – అక్కయ్యలతోపాటు దేవతలు ఐదుగురూ అమ్మమ్మ తాతయ్య సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండిపోయారు , పూలవర్షం కురుస్తూనే ఉంది .
అక్కయ్యలు : Wow బ్యూటిఫుల్ కదా దేవతలూ …… , మీరు చూస్తున్నంతసేపూ వెలుగులు వెదజల్లుతూనే ఉంటాయి అమ్మలూ ….. , సెలెబ్రేషన్ ఎలా ఉన్నాయి ? .
Wow బ్యూటిఫుల్ అద్భుతం అత్యద్భుతం తల్లులూ …… రెండు కళ్ళూ చాలడం లేదు , ఇలానే ఇలానే ఇలానే మా బుజ్జిజానకి సెలెబ్రేషన్స్ కోరుకున్నది అంటూ బుజ్జిజానకిని ఆనందబాస్పాలతో కౌగిలించుకుని మురిసిపోతున్నారు .
అక్కయ్యలు : బయట వెల్కమ్ కే ఇలా అయిపోతే ఇక లోపల అద్భుతాలను చూస్తే ఏమైపోతారో వెళదామా ? .
అంతే అక్కయ్యలను ప్రక్కకు లాగేసి బుజ్జిజానకి చేతులు అందుకుని పూలదారిలో – పూల వర్షం ఆస్వాదిస్తూ లోపలికి తీసుకెళ్లారు .
తమ్ముడూ …… ఇక దాగుడుమూతల అవసరం లేదు రా అంటూ చెరొకవైపు చేతులు చుట్టేసి బుగ్గలపై కొరికేశారు .
స్స్స్ …… అంటీలు చూస్తే …..
అక్కయ్యలు : ష్ ష్ ష్ చూస్తే చూడనివ్వు భయపడేది నువ్వు మాకేం భయం లేదు అంటూ కొరికినచోట ముద్దులుకురిపిస్తున్నారు , నీ దేవతలు సో సో సో హ్యాపీ ……
నవ్వుకుని , అక్కయ్యలూ ….. ఇప్పుడు ఉండాల్సినది నాదగ్గర కాదు .
అక్కయ్యలు : తెలుసు తెలుసు నీ హార్ట్ ప్రక్కన , ఇందాకే చూశావుకదా నీదేవతలు ఎలా ప్రక్కకు లాగేసారో , అన్నీ వారి చేతులతోనే సాంప్రదాయబద్ధంగా జరిపించి మురిసిపోతారు ముందైతే వెళదాము , తమ్ముడూ …… చూడు ఫౌంటైన్ మొదలుకుని అద్భుతాలన్నింటినీ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో నీ దేవతలు – నీ హార్ట్ ……

అంతలో మహీ మహీ తల్లీ తల్లీ …… అంటూ చాలామంది వచ్చారు .
బుజ్జిజానకి : పిన్నీ – అత్తయ్యలూ – అంటీ – పెద్దమ్మలూ …… అక్కయ్యలూ – చెల్లెళ్ళూ …… అందరూ అందరూ వచ్చారు అంటూ ఆశ్చర్యపోతోంది .
అమ్మమ్మ – తాతయ్యకు సంతోషంలో నోటివెంట మాట రావడం లేదు , మీరు ఇక్కడ ఇలా …… నిజమేనా కల గంటున్నానా ? .
అక్కయ్యలు : తమ్ముడూ ఎవరు ? .
బుజ్జిజానకి బంధువులు ……
అక్కయ్యలు : నువ్వేనా తమ్ముడూ సూపర్ …..

బంధువులు : దూరాభారం వలన రాలేకపోతున్నామన్నాము క్షమించు తల్లీ – బామ్మా అమ్మా అత్తయ్యా క్షమించండి , అప్పుడు వచ్చాయి కాల్స్ ….. మహి ఫంక్షన్ కు మీరు లేకపోతే ఎలా అండీ , మీ మీ అందుబాటులో ఉండేలా బస్ – ట్రైన్ – ఫ్లైట్స్ టికెట్స్ పంపిస్తున్నాను దయచేసి రండి , మీ బిడ్డ తొలి ఫంక్షన్ ను మీచేతులతో జరిపించి జీవితాంతం గుర్తుంచుకునేలా అనుభూతిని పంచండి అని మా కర్తవ్యాన్ని తెలియజెయ్యడంతో అందరం అందరం వచ్చేసాము , వైజాగ్ చేరిన క్షణం నుండీ మా అవసరాలన్నీ తీర్చాడు , ఫస్ట్ టైం స్టార్ హోటల్లో బస చేసాము సూపర్ గా ఉంది నీవల్లనే తల్లీ …… వయసు చిన్నదే అయినా మా బాధ్యత గుర్తుచేశాడు , ఇక నుండీ నీ ఏ ఫంక్షన్ మిస్ చెయ్యము మమ్మల్ని క్షమిస్తావు కదూ ……
నావైపుకు చూసి , పిన్నీ – పెద్దమ్మా – అత్తయ్యలూ ….. అంటూ సంతోషంతో హత్తుకుంది బుజ్జిజానకి , మీరు లేని లోటును ఈ ఐదుగురు దేవతలు ….. ముగ్గురు ప్రాణమైన అత్తయ్యలు – చిన్నప్పటి నుండీ ప్రాణంలా చూసుకున్న అంటీ – ఇక పెద్దమ్మ అయితే దేవతే …… అంటూ పరిచయం చేసింది .
అందరూ సంతోషంగా పలకరించుకున్నారు .
బంధువులు : మహీ ….. ఇది అమ్మ కాలేజ్ లానే లేదు మీ అమ్మ ఉంటున్న దేవలోకంలా ఉంది , అద్భుతంగా రెడీ చేశారు …… , ఆ పిల్లాడేఅయి ఉంటాడు నిన్ను కూర్చోబెట్టెలోపు మొత్తం చూడాలని ఉంది .
మహి : చూడండి చూడండి పిన్నీ – అత్తయ్యలూ ……
బంధువులు : మా బంగారం ……

మహి : అత్తయ్యలూ …… అంటూనే నావైపు చూస్తోంది .
అత్తయ్యలు : నో నో నో …… నీమనసులో ఏముందో తెలుసు .
మహి : అత్తయ్యలూ …… ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అంటూ ముగ్గురినీ చుట్టేసింది .
అంటీ : అక్కయ్యలూ …… మీరే సంభ్రమాశ్చర్యానికి లోనయ్యే ఏర్పాట్లు చేశాడు , మీరు కోరుకున్నట్లుగానే మన బుజ్జిజానకి బంధు బలగాన్ని రప్పించాడు , బుజ్జిజానకి ఎక్కడయితే ఫంక్షన్ జరుపుకోవాలనుకుందో తెలుసుకుని ఇక్కడ ఇలా …….
నీ బుజ్జిజానకిని చూడు చూడు నీవైపే చూస్తోంది ఆనందబాస్పాలతో …… , మాకు తెలిసి నిన్ను కౌగిలించుకోవాలని తెగ ఆరాటపడుతోంది , దేవతల అనుమతి కూడా తీసుకుంటోంది .
అత్తయ్యలు : సరే త్వరగా వచ్చేయ్యాలి .
మహి : అలాగే అలాగే …… పర్మిషన్ .
అత్తయ్యలు : సరే ……
మహి : ఈమాట చాలు లవ్ యు అత్తయ్యలూ అంటూ ముద్దులుకురిపించి పరుగున నాదగ్గరకు వచ్చి సెంటీమీటర్ గ్యాప్ లో ఆగిపోయి అంతులేని ఆనందంతో ఆయాసపడుతూ ఆగిపోయింది .
అక్కయ్యలు : చెల్లీ ….. అంటూ కన్ను కొట్టారు .
లవ్ యు లవ్ యు సో సో మచ్ మహేష్ …… , అమ్మ నిలయాన్ని ఇలా అత్యద్భుతంగా మార్చేశావు – దేవతలను సంతోషపరిచావు – బంధువుల ఆశీస్సులు అందించావు …… అన్నీ అన్నీ అంటూ ప్రేమతో కౌగిలించుకుంది .