థర్డ్ MISSION 10 30

నేను ఎక్కడికీ చెప్పాను బుజ్జిహీరో …… , నీ అక్కయ్యలే వినలేదు .
అక్కయ్యలు : పెద్దమ్మా చెప్పనేలేదు అసలు …..
పెద్దమ్మ : మీ సంతోషమే నా సంతోషం , మీరు కోరితే చాలు నాకు ఆనందం , ముందూ వెనుకా చూడకుండా తీర్చేస్తాను , అలా జరిగిపోయింది .
ఇక ఈ మ్యాటర్ ఇక్కడితో ఆపేద్దాము , బుజ్జిజానకీ ……
బుజ్జిజానకి : సరే సరే అంతకంటే అదృష్టమా ? అంటూ బుగ్గపై చేతితో ముద్దు …..

బుజ్జితల్లీ – తల్లులూ – పిల్లలూ …… గంగమ్మ పూజకు బయలుదేరాలి .
రెడీ దేవతలూ అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి పరుగులుతీసింది బుజ్జిజానకి ……
పూజాసామాగ్రి – కలశములతో ఇంటికి దగ్గరలోని గంగమ్మ బావిని చేరుకుని , సాంప్రదాయబద్ధంగా బుజ్జిజానకితో గంగమ్మకు పూజ జరిపించి సంతోషంగా ఉండేలా దీవించమని ప్రార్థించి ఇంటికి చేరుకున్నాము .
మధ్యాహ్నం వరకూ బుజ్జిజానకి – దేవతలను కనులారా తిలకించి కలిసి భోజనం చేసి బయలుదేరాను .
ఆర్టిస్ట్స్ రెడీగా ఉండటంతో ఫ్లవర్ లైవ్ డెకరేషన్ వర్క్ మొదలుపెట్టాము .

పిల్లలతో సమయాన్ని పట్టించుకోకుండా సరదాగా ఆడుకుంటూ పదే పదే నా రాకకోసం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి చూస్తోంది బుజ్జిజానకి .

5 గంటలు అవుతుండటంతో చిట్టితల్లీ బుజ్జిజానకీ …… ఉండమన్నా వెళ్లిపోయాడుకదా ఇంకెందుకు ఆశతో చూస్తున్నావు , మా బుజ్జి బంగారం ఈరోజుతో జానకిలా మారిపోతుంది కాబట్టి పుత్తడి బొమ్మలా కుందనపు బొమ్మలా రెడీ చెయ్యాలి …… అంటూ అంటీలు పిలిచారు .
కమింగ్ మై డియర్ బ్యూటిఫుల్ అత్తయ్యలూ ……. , సిగ్గే సిగ్గే అంటూ గిలిగింతలుపెట్టి హత్తుకుంది బుజ్జిజానకి .
అక్కయ్యలూ – మేడమ్స్ …… మేమూ రెడీ అయ్యి వచ్చేస్తాము , డ్రెస్సెస్ శరణాలయంలో ఉన్నాయి అన్నారు పిల్లలు .
బుజ్జిజానకి – అక్కయ్యలు : త్వరగా వచ్చేయ్యాలి .
అలాగే అలాగే అంటూ బస్సులలో బయలుదేరారు .

అక్కయ్యలు : నువ్వు మరియు నీ హీరో పొగిడిన ప్రతీసారీ ఇదే రియాక్షన్ చెల్లీ చెల్లీ అంటూ నవ్వుకుంటున్నారు .
అంటీలు : బుజ్జిజానకి పొగిడినప్పుడు మాత్రమే , ప్రతీసారీ ఆ అల్లరి పిల్లాడిని ఎందుకు తీసుకొస్తారు , మీకు దెబ్బలుపడాలి ……
బుజ్జిజానకి : అత్తయ్యా అత్తయ్యా ……
అంటీలు : లేదులే లేదులే అంటూ ముద్దులు కురిపించారు , తల్లులూ …… ఆ అల్లరి పిల్లాడిని వెనకేసుకురావడం కాదు – కొన్ని గంటలలో ఫంక్షన్ – ఇంటిలోపల కానీ బయట కానీ ఫంక్షన్ తాలూకు ఏర్పాట్లు ఏమీ చెయ్యనేలేదు – నేను చేస్తాను నేనే చేస్తాను అన్నాడు కదా తొందరగా ఆ ఏర్పాట్లు పూర్తిచేయమను , మీ చెల్లిని బాపూ బొమ్మలా రెడీ చేసి వచ్చేలోపు ఏర్పాట్లు పూర్తవ్వకూడదు అప్పుడు చెబుతాము మీ సంగతి ఆ అల్లరి పిల్లాడి సంగతి …….
అక్కయ్యలు : తమ్ముడంటే ఎంత ఇష్టం అమ్మలూ మీకు , అల్లరి పిల్లాడు అల్లరి ….. పిల్లాడు అంటూ మా నలుగురి కంటే ఎక్కువసార్లు తలుచుకుంటారు .
అవునా అవునా లేదు లేదు లేదు ……
అవును అత్తయ్యలూ …… మమ్మల్ని ఒకసారి తలిస్తే మీ బుజ్జిహీరోని మూడుసార్లు తలుచుకుంటున్నారు , లవ్ యు దేవతలూ అంటూ ముద్దులుకురిపించి ఆనందిస్తోంది బుజ్జిజానకి .
అత్తయ్యలు : అంతటి అల్లరి చేస్తూ మైండ్ లో పాతుకుపోయినట్లున్నాడు , ఎంత వద్దు అనుకున్నా ఇలా ……. , సరే సరే కానీ ఆ అల్లరి పిల్లాడి గురించి ……
అదిగో మళ్లీ అంటూ బుజ్జిజానకి – అక్కయ్యల నవ్వులు ……
అత్తయ్యలు : ఆ అల్లరి పిల్లాడిని …..
అదిగో మళ్లీ అంటూ నవ్వులు ……
అంటీలు : అందమైనకోపాలతో నలుగురికీ మొట్టికాయలు వేసి పెద్దమ్మా పెద్దమ్మా ……
పెద్దమ్మ : బయట కాంపౌండ్ లో ఉన్నాను దేవతలూ , మీ బుజ్జితల్లికోసం వేడి నీళ్లు – పసుపు నీళ్లు – పూరేకుల నీళ్లు – పన్నీరు – పూలు సిద్ధం చేస్తున్నాను .
పెద్దమ్మా పెద్దమ్మా ….. మాకు చెప్పొచ్చుకదా అంటూ బుజ్జిజానకి బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లారు అక్కయ్యలు .
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ …… , అత్తయ్యలూ ….. అక్కయ్యలు చెప్పినట్లు మాకంటే అల్లరి పిల్లాడంటేనే ఎక్కువ ఇష్టం కదూ ……
బుజ్జితల్లీ బుజ్జితల్లీ ….. నిన్నూ నిన్నూ ……
బుజ్జిజానకి : ఇష్టం కాదు ప్రాణమా ….. అంటూ మరింత కవ్విస్తూ హాల్లో దొరకకుండా పరుగులుతీస్తోంది , మధ్యమధ్యలో దేవతల బుగ్గలపై ముద్దులు కురిపిస్తోంది .
అంటీలు : నవ్వితూనే జాగ్రత్త జాగ్రత్త అంటూనే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు .
బుజ్జిజానకి : ఇష్టం – ప్రాణం అన్నందుకు కొట్టడానికి వస్తున్నారా ……. , సరే సరే ఆ అల్లరి పిల్లాడంటే ప్రాణం కంటే ఎక్కువ …… అక్కయ్యలూ అక్కయ్యలూ పెద్దమ్మా అంటూ బయటకు పరుగులుతీసింది .
జాగ్రత్త జాగ్రత్త అంటూనే వెనుకే వెళ్లి , బుజ్జిజానకితోపాటు ఆశ్చర్యపోతున్నారు .

పూలమొక్కల మధ్యన పుత్తడి బొమ్మకు స్నానం చేయించడం కోసం అందంగా ఏర్పాటుచేసిన పూల గుడారం , wow wow బ్యూటిఫుల్ ……
పెద్దమ్మ : నీకోసమే బుజ్జిజానకీ ….. , బాత్రూమ్లో కాదు ప్రకృతిలో స్నానం చేయించాలి అని నీ దేవతలు గుసగుసలాడుకోవడం విని నీ బుజ్జిదేవుడు ఈ ఏర్పాట్లు చేసాడు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ ……
అంటీలు : మాకు కాదు ఆ అల్లరి పిల్లాడికి ……
బుజ్జిజానకి : అత్తయ్యలూ ఇప్పుడేమంటారు , నేరుగా మీ మనసులలోనుండే వచ్చింది కదూ ……
అంటీలు : అవును కాదు …… కాదు కాదు కాదు , అయినా మేము మనసుల్లో అనుకున్నది ఎలా తెలిసింది ఆ అల్లరి పిల్లాడికి ……
అక్కయ్యలు – బుజ్జిజానకి : అక్కడ ఉన్నదే ఆ అల్లరి పిల్లాడు కదా అంటూ నవ్వులు ……
మిమ్మల్నీ …….
ముందు నాకు ముందు నాకు అంటూ దేవతల ముందుకు చేరారు .
అంటీలు : మా బంగారం అంటూ ఒక్కసారిగా పెదాలపై అందమైన నవ్వులతో ముద్దులు కురిపించి కౌగిలిలోకి తీసుకున్నారు .
అంటే దేవతల తియ్యని దెబ్బలు లేవా ? .
అంటీలు : ఊహూ అంటూ ముద్దులు ……
ఓహో దెబ్బలన్నీ మీ ప్రియమైన అల్లరి పిల్లాడికే అన్నమాట …… , దెబ్బలతో పాటు ముద్దులుకూడా ……
అంటీలు : మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ ప్రేమతో మొట్టికాయలువేసి పూల గుడారంలోకి తీసుకెళ్లి చుట్టూ చూస్తున్నారు .
పెద్దమ్మ : లోపలనుండి బయటకు – బయట నుండి లోపలికి కనిపించకుండా మందంగా అందమైన పూలతో అలంకరించాడులే మీ ప్రియాతిప్రియమైన అల్లరి పిల్లాడు .
అంటీలు : పెద్దమ్మా మీరుకూడానా ? అంటూ నవ్వుకున్నారు .

బుజ్జిజానకి : సిగ్గుపడటంలో మీకు సాటిరారు ఎవ్వరూ ముద్దొచ్చేస్తారు అంత అందం అంటూ ముద్దులుకురిపిస్తోంది .
అంటీలు : పో బుజ్జితల్లీ ….. అంటూ అందంగా సిగ్గుపడుతూనే బుజ్జిజానకిని స్నానం చేయించడానికి కూర్చోబెట్టారు .
చుట్టూ అక్కయ్యలు చేరి పూలవర్షం కురిపిస్తున్నారు .
తిలకిస్తున్న అమ్మమ్మ సంతోషం ఎల్లలు దాటుతోంది .

పూలవర్షంలోనే బుజ్జిజానకి ఒంటిపై పట్టు లంగావోణీ వస్త్రాలను ఒక్కొక్కటిగా వేరు చేసి తెల్లని గుడ్డను చుట్టూ చుట్టారు , అందం అంటే మా బంగారుతల్లిది – మేము పొగడాలి కానీ మమ్మల్ని పొగుడుతున్నావు , ఇంతటి అందం ఎవరికి దక్కుతుందో కానీ మహా అదృష్టవంతుడు …….
అక్కయ్యలు : ఎవరికో మాకు తెలుసులే అంటూ చెవిలో గుసగుసలాడి బుజ్జిజానకి అందాన్ని కొరికేశారు.
బుజ్జిజానకి : స్స్స్ స్స్స్ ….. లవ్ యు అక్కయ్యలూ అంటూ తెగ మురిసిపోతోంది అందమైన సిగ్గుతో , పెద్దమ్మను రమ్మని కళ్ళతోనే సైగచేసి చెవిలో …… దేవతలచే పసుపు – గంధపు స్నానమాచరించడం ఇదే చివరిది కదా మహేష్ చూ ……
పెద్దమ్మ : ష్ ష్ ష్ ఇంకేమైనా ఉందా , నీ దేవతలు మూడోకన్ను తెరిచినా తెరిచేస్తారు , దేవతలచే కాదు కానీ నీ ప్రియుడితోనే స్నానామాచరించే అవకాశం వస్తుందిలే ……
ఎప్పుడు ఎప్పుడు పెద్దమ్మా …… ? అంటూ గట్టిగా అడిగి వెంటనే సిగ్గుపడుతోంది , త్వరలోనేనా ? .
పెద్దమ్మ : కళ్ళల్లో చెమ్మ ……
బుజ్జిజానకి : పెద్దమ్మా పెద్దమ్మా ……
పెద్దమ్మ : నీకోరిక తప్పకుండా తీరుతుంది , వేచి చూసేంత ప్రేమ ఉండాలి .
ఉంది ఉంది అంతులేని ప్రేమ దాగి ఉంది మా చెల్లి మనసులో , దేనికోసమైతే వేచిచూడమన్నారో అంత ప్రేమతో ఎదురుచూస్తుంది చెల్లి ……
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ ……
మీ గుసగుసలు ఆ అల్లరి పిల్లాడి గురించి కాదు కదా అంటూ దేవతలు .
అక్కయ్యలు : అవునోకాదో ప్రక్కకు పెట్టండి , మాట మాట్లాడితే చాలు తమ్ముడినే తలుచుకుంటున్నారు , ఏమైనా అంటే మాపై కోప్పడతారు .
అంటీలు : అవునుకదా ….. , ఈ అల్లరి పిల్లాడు తెగ డిస్టర్బ్ చేసేస్తున్నాడు , అవును నిజమే ఎందుకంటే మా ఈ బుజ్జితల్లి సంతోషాలకు కారణమౌతున్నాడు కాబట్టి …… , ఈరోజే లాస్ట్ – రేపటి నుండి అటువంటి అవకాశమే రాదులే గుర్తుంది కదా తల్లులూ ……
అక్కయ్యలు : అమ్మలూ ……
అంటీలు : తెలుసు తెలుసు , మీపై నమ్మకం లేకనే మీ తమ్ము ….. ఆ అల్లరి పిల్లాడి మాట తీసుకుంది , అల్లరి చేసినా మాటపై నిలబడతాడు .
అక్కయ్యలు : ఆ నమ్మకమైనా ఉంది సంతోషం ……
పెద్దమ్మ : తల్లులూ ……
అక్కయ్యలు : Sorry లవ్ యు లవ్ యు పెద్దమ్మా ……
పెద్దమ్మ : తల్లులూ …… ALL IS WELL , మీ మనసు స్వచ్ఛమైంది అంతా మంచే జరుగుతుంది , సమయం పట్టినా మీరు ఆశించినట్లుగానే జరుగుతుంది అంటూ చెవిలో గుసగుసలాడారు , దేవతలను బాధపెడితే మీ తమ్ముడు కూడా క్షమించడు .
అక్కయ్యలు : అమ్మో అదిమాత్రం నిజం , మాకంటే దేవతలంటేనే ప్రాణం తమ్ముడికి , అమ్మలు చెప్పినట్లే చేస్తాము .
అంటీలు : ఆ అల్లరి పిల్లాడి గురించి ఆపి మీ చెల్లిని స్నానం చేయించడంలోకి వస్తే బాగుంటుంది .
అక్కయ్యలు : లవ్ టు లవ్ టు అంటూ కురులపై బుగ్గలపై ముద్దులుకురిపించి పూలవర్షం కురిపించారు .

మీరు పూలు మాత్రమే మేము పూలతోపాటు పన్నీరు అంటూ పూలరేకులతో నిండిన పాత్ర నుండి పోశారు దేవతలు .
చల్లగా ఉన్నాయనుకుని వణకబోయి వెచ్చగా ఉన్నాయి దేవతలూ నీళ్లు అంటూ అక్కయ్యలు – దేవతలపై దోసిళ్ళతో చిలకరిస్తోంది బుజ్జిజానకి ……
వొళ్ళంతా పూలతో పూర్తిగా తడిచిన తరువాత బుజ్జిజానకి వొళ్ళంతా ఒకరి తరువాత మరొకరు పసుపు రాసి కుంకుమ ఉంచి హారతిపట్టారు .
బుజ్జిజానకి : చిరునవ్వులు చిందించి , నా దేవతలు మీరే అంటూ హారతి అందుకుని దేవతలకు పట్టింది .
అంటీలు : లవ్ యు సో మచ్ బంగారూ ….. అంటూ కౌగిలిలోకి తీసుకుని ముద్దులతో ఆశీర్వదించారు .
బుజ్జిజానకి : లవ్ యు అత్తయ్యలూ – అంటీ – పెద్దమ్మా – అక్కయ్యలూ అంటూ అందరి బుగ్గలపై పసుపు రాసింది , అయ్యో విలువైన పట్టుచీరలు పసుపుమయం అయిపోయాయే ……
అంటీలు : మా బంగారుతల్లి బహుమతిగా జీవితాంతం దాచుకుంటాము అంటూ ముద్దులుపెట్టి , కూర్చోబెట్టి పూలతో నిండిన పన్నీరు – నీటితో తలంటు స్నానం చేయించారు , చివరగా పూలవర్షం కురిపించి పొడి వస్త్రం ను చుట్టూ చుట్టి లోపలికి తీసుకెళ్లారు , బుజ్జితల్లీ ….. కురులు ఆరేంతవరకూ టీవీ చూస్తూ కూర్చో అంతలోపు రెడీ అయ్యి వచ్చేస్తాము .
బుజ్జిజానకి : ఎక్కడ ఎక్కడ ? .
అంటీలు : ఇక్కడేలే బుజ్జితల్లీ , లవ్ యు అంటూ ముద్దులుపెట్టి రెండు బాత్రూమ్లలో ఫ్రెష్ అయ్యారు .
అంటీలు – మేడమ్ – పెద్దమ్మ – అమ్మమ్మ …… పట్టుచీరలలో , అక్కయ్యలు ….. పట్టు లంగావోణీలలో రెడీ అయ్యి వచ్చారు .

Wow wow wow బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ …… నా దిష్టి నే తగిలేలా ఉంది దిష్టి చుక్కలు పెట్టండి .
నీ అక్కయ్యలకే కదా ఇప్పుడే పెడతాము బుజ్జితల్లీ అంటూ దేవతలు ……
అక్కయ్యలు : అబ్బాబ్బాబ్బాబ్బా …….. ఏమి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ , చెల్లి దిష్టి తగులుతుంది అని ఎవరికి అన్నదో తెలిసి భలేగా నటిస్తున్నారు , అబ్బబ్బా ….. సిగ్గులోకటి అంటూ కాటుక తెచ్చి కురులపై – అరి పాదాలపై ఉంచారు .
మురిసిపోతున్నట్లు తెగ సిగ్గుపడుతూనే …… మీకు కూడా అంటూ కాటుక ఉంచారు దేవతలు ……
అక్కయ్యలు : దేవతలంత అందం కాదులే , కదా చెల్లీ ……
బుజ్జిజానకి : దేవతలూ – దేవకన్యల మధ్య పోటీ చాలా చాలా తీవ్రంగా ఉంది .
అక్కయ్యలు : మా ముద్దుల చెల్లి ఓటు మాఇద్దరికీ పడినా తమ్ముడి ఓటు దేవతలకే కాబట్టి దేవతలే గెలిచినట్లు , సో దేవతలే అందగత్తెలు …….
బుజ్జిజానకి : యాహూ ….. ఐదుగురి దేవతలదే గెలుపు లవ్ యు లవ్ యు అత్తయ్యలూ అంటూ ముద్దులు వదులుతోంది .

అంటీలు : లవ్ యు లవ్ యు బుజ్జిజానకీ అంటూ పరవసించిపోతూనే బుజ్జిజానకి చుట్టూ చేరి పట్టరాని ఆనందం – సిగ్గులతో ముద్దులుకురిపిస్తున్నారు , నీ అక్కయ్యలు మరియు మా ఈ ఐదుగురిని మించి మా బుజ్జిజానకిని ….. బంగారం – వజ్రాలు పొదిగిన పట్టుచీర మరియు నగలలో సౌందర్యారాశిలా అంటే అచ్చు జానకిలా రెడీ చేస్తాము అంటూ బెడ్రూంలోకి పిలుచుకునివెళ్లారు .

అంటీలు : బుజ్జిజానకీ ….. అంటూ బంగారు జరీ మరియు వజ్రాలు పొదిగిన మేలిమి పట్టుచీరను చూయించారు , నీ ఐదుగురు దేవతలూ కలిసి ప్రాణం పెట్టి సెలెక్ట్ చేసాము , అసలు ఇలాంటి పట్టుచీరలు ఉన్నాయన్న సంగతే మాకు తెలియదు , పెద్దమ్మే ఒకచోటకు తీసుకెళ్లారు , ఒక్కొక్క పట్టుచీర ఒక్కో రకం , ఇలాంటి చీరలు 10 తీసుకుంది పెద్దమ్మ మా బుజ్జి బంగారం కోసం , ఎలా ఉంది ? .
బుజ్జిజానకి : దేవతలే స్వయంగా సెలెక్ట్ చేశారు , అది చాలదూ , అద్భుతం మహాద్భుతం దేవతలూ లవ్ యు సో మచ్ , అంటే దేవతలు కట్టుకున్న పట్టుచీరలు కూడా …….
Yes yes అంటూ అందంగా సిగ్గుపడుతున్నారు ……
బుజ్జిజానకి : మా దేవతల అందం – అలంకరణ – సిగ్గు – సంతోషం చూస్తుంటే ఫంక్షన్ నాకులా లేదు , దేవతల ఫంక్షన్ లా ఉంది .
దేవతలు : మురిసిపోతున్నారు మరిన్ని సిగ్గులతో , అవునా అయితే మామూలుగా రెడీ అవుతాము వీటిని తీసేసి …….
నో నో నో అంటూ దేవతలను చుట్టేసింది బుజ్జిజానకి , దేవతల అందం – ఆనందమే ……. మాకు మహదానందం , కొరుక్కుని తినేయ్యాలని ఉంది ఇంతటి అందాలను …….
అక్కయ్యలు : చెల్లీ నీకే కొరికెయ్యాలనిపిస్తే మరి మరి …….
అంటీలు : ఈ సంతోష సమయంలో ఆ అల్లరి పిల్లాడి గురించి అవసరమా ? …..
అక్కయ్యలు : కూల్ కూల్ …… చెల్లికే కొరికెయ్యాలనిపిస్తే మాకెలా అనబోయాము కానీ మీ మనసుల నిండా తమ్ముడే ఉన్నాడని మరొకసారి ఋజువుచేశారు , చూసావా చెల్లీ ……
బుజ్జిజానకి : అవునవును అక్కయ్యలూ …… , దేవతల హృదయాలు మహేష్ ఒక్కడితోనే నిండిపోయినట్లున్నాయి , మనం ఉన్నామో లేమో ? .
అక్కయ్యలు : డౌటే చెల్లీ డౌటే చెల్లీ అంటూ నవ్వుకున్నారు .
లేదు లేదు లేదు లేనే లేడు , మా మనసులలో ఉన్నదల్లా ఇప్పుడు మా తల్లులే …. , ఇక ఆ అల్లరి పిల్లాడిని తలుచుకునేదే లేదు , అమ్మో టైం అవుతోంది తల్లులూ మీరు డిస్టర్బ్ చేయకండి …..
అమ్మలూ ……
నో నో ……
అమ్మలూ …..
నో నో నో ……
అధికాదే అమ్మలూ …… , మొదట రెడీ చెయ్యాల్సినది పట్టుచీరతో కాదు .
అంటీలు : అవునుకదా ….. , లంగావోణీలో తీసుకెళ్లి కూర్చోబెట్టి ముత్తైదువులు ఆశీర్వదించిన తరువాత పట్టుచీరలోకి మార్చాలి .
అవును అమ్మలూ …… , మేము ముగ్గురం ఎలా మరిచిపోతాము ……
దేవతలు : లవ్ యు అంటూ మేలిమి పట్టు – బంగారంతో నేసిన మరియు వజ్రాలు పొదిగిన లంగావోణీ వేసి వొళ్ళంతా నగలతో అలంకరించారు .
బ్యూటిఫుల్ సో సో సో బ్యూటిఫుల్ దేవతలూ ……
లవ్ యు అక్కయ్యలూ – దేవతలూ అంటూ లేచివచ్చి గుండెలపైకి చేరింది అందమైనవ్వులతో …….
అక్కయ్యలు : అమ్మమ్మా – అంటీ ఆనందబాస్పాలే కదూ …….
అమ్మమ్మ : అవును తల్లులూ అంటూ వెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చారు .
అక్కయ్యలు : కారణం మేము చెబుతాము మేము చెబుతాము , అచ్చు జానకి అమ్మలా ఉందికదూ ……
అమ్మమ్మ : అక్కయ్యల కురులపై స్పృశించి ఆశీర్వదించారు , తల్లులూ చూడండి అంటూ ఆల్బమ్ ఓపెన్ చేసి చూయించారు .
ఆశ్చర్యం …… , అమ్మలా కాదు అమ్మే అమ్మే అంటూ బుజ్జిజానకిని హత్తుకున్నారు ముద్దులు కురిపిస్తూ …….
అంటీలు – పెద్దమ్మ కళ్ళల్లో కూడా ఆనందబాస్పాలు , జానకీ అంటూ ప్రాణంలా పిలిచి కౌగిలిలోకి ఆహ్వానించారు .
ఆ పిలుపుకు పరవసించిపోయినట్లు అంతులేని ఆనందంతో లవ్ యు దేవతలూ అంటూ కౌగిలిలోకి చేరింది .
కొద్దిసేపు సంతోషమైన ఉద్విగ్న వాతావరణం నెలకొంది .

దేవతలు : ఇకనుండీ జానకి అని ప్రాణంలా పిలవాలేమో …… , జానకీ జానకీ ……
బుజ్జిజానకి : లవ్ యు సో మచ్ దేవతలూ …… , ఏదో చెప్పబోయి ఆగిపోయింది .
ఏంటి జానకీ ……
అక్కయ్యలు : ఏమిటో మాకు తెలుసు , మీకు కోపం తెప్పిస్తుందని ఆగిపోయింది .
దేవతలు : మా ముద్దుల జానకి చెబితే కోపమా నెవర్ నెవర్ ……
అక్కయ్యలు : బాగా ఆలోచించుకోండి అమ్మలూ …… , చెల్లి ఏమి చెప్పబోయి ఆగిపోయిందంటే …… నువ్వు చెబితేనే బాగుంటుంది చెల్లీ – మేము చెబితే కొట్టినా కొడతారు .
బుజ్జిజానకి : దేవతలూ …… మీరు మొదటిరోజున అందంగా నాకు చీర కట్టించినప్పుడే చెప్పాడు జానకి అమ్మలా ఉన్నావని ……
అంటీలు : ఆ అల్లరి పిల్లాడేనా ? , అన్నీ తెలిసిపోతాయి ఆ పిల్లాడికి ……
అసూయపడుతున్నారు అక్కయ్యలూ – చెల్లీ అంటూ నలుగురూ గుసగుసలాడి నవ్వుకుంటున్నారు .

అంటీలు : అలాంటిదేమీ లేదులే , ముందైతే బయట ఫంక్షన్ డెకరేషన్ లేకపోనీ ఆ అల్లరి పిల్లాడి సంగతి చూస్తాము అంటూ బయటకు నడిచారు . నథింగ్ నథింగ్ , 6 pm అవుతోంది – గంటలో ఫంక్షన్ మొదలవ్వాలి , ఇప్పటికీ నిన్నటి డెకరేషన్ మాత్రమే ఉంది , ఫంక్షన్ జరిపించడానికి ప్రిన్సెస్ చైర్ అయినా లేదు , ఏదీ ఆ అల్లరి పిల్లాడు ఎక్కడ ఎక్కడ ? , మీరేమీ టెన్షన్ తీసుకోవద్దు మొత్తం మొత్తం నేనే చూసుకుంటాను పూర్తిచేస్తాను అన్నాడు కదా – ఎక్కడ ఆ అల్లరి పిల్లాడు ఎక్కడ ? అంటూ కోపం …… , ఫంక్షన్ ఏర్పాట్లు లేకపోతేనేమి కనీసం ఆహ్వానితులైనా ఈపాటికి రావాల్సింది కదా – ఇంతకూ పిల్లలు ఎక్కడ ? , రెడీ అయ్యి కొత్త బట్టలలో వస్తామన్నారు కదా ……
అవునవును నాకూ కంగారువేస్తోంది .
అక్కయ్యలు : అమ్మలూ – అంటీ …… ఇంకా సమయం ఉందికదా అంటూ బుజ్జిజానకి చేతులలో చేతులు పెనవేసి బుగ్గలపై ముద్దులు కురిపించారు .
అంటీలు : మీ హాఫ్ సారీ ఫంక్షన్స్ లో ఈపాటికి బంధువులతో నిండిపోయి ఉంది , తప్పంతా ఆ అల్లరి పిల్లాడిదే , చిన్న పిల్లాడి మాటలను నమ్మడం మన తప్పు …..
బుజ్జిజానకి : అత్తయ్యలూ ….. నామీద ప్రేమతో కంగారుపడుతున్నారు , అక్కయ్యల – పెద్దమ్మ పెదాలపై సంతోషాలను చూడండి .
లేదు లేదు లేదు నేనూ టెన్షన్ పడుతున్నాను , ఆ అల్లరి పిల్లాడిని కదిగిపారేయ్యాల్సిందే , దేవతలూ ….. మీకోపంలో తప్పేమీ లేదు అంటూ మరింత ఆజ్యం పోసి అక్కయ్యలవైపు కన్నుకొట్టారు పెద్దమ్మ .
అంటీలు : రానివ్వండి రానివ్వండి చెబుతాము , గంట టైం లేదు ఇంకా అమ్మవారి చెంతకువెళ్లి ఆశీర్వాదాలు తీసుకోవాలి బుజ్జిజానకి ……