బుజ్జిజానకి : అమ్మమ్మ చెప్పినది నిజమే అన్నమాట , కొద్దిసేపటి ముందు వచ్చి పడుకున్నాడన్నమాట ….. , రాత్రంతా ఎంత కష్టపడ్డాడో ……
అక్కయ్యలు : అవును చెల్లీ ….. , రాత్రి 2 దాకా మేల్కొనే ఉన్నాము , చదువుతూ చదువుతూనే బాల్కనీలోనే నిద్రపోయాము కానీ ఉదయం లేచిచూస్తే గదిలో ఉన్నాము అంటే తమ్ముడు ఇంటికి వచ్చినట్లే కదా అయినా మాముగ్గురమూ లోపలికి ఎలా చేరాము ? .
బుజ్జిజానకి : అత్తయ్యలు కాదు అంటే తమ్ముడే ……
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ మురిసిపోతున్నారు .
అంటీలు : ఎంత ధైర్యం ….. అంటూ భద్రకాలుల్లా నావైపుకు చూస్తున్నారు .
అక్కయ్యలు – బుజ్జిజానకి సైగలతో నవ్వుకుంటున్నారు , అమ్మలూ ….. చెబితే నమ్మేలా ఉండాలి ఇంత బరువుగా ఉన్న మమ్మల్ని తమ్ముడు మీ తుంటరి పిల్లాడు ఎలా ఎత్తుకోగలడు ఆలోచించండి .
అంటీలు : అవును నిజమేకదా …… sorry sorry sorry , అది సరేకానీ ఇప్పటికే ఆలస్యం అయ్యింది బుజ్జిజానకికి స్నానం చేయించాలి అదిగో మీ పెద్దమ్మ – మేడమ్ అంటీ వచ్చారు లోపలికి పదండి లోపలికి పదండి అంటూ వారిని పలకరించారు .
బుజ్జిజానకి : పెద్దమ్మా – అంటీ ….. అంటూ వెళ్లి గుండెలపైకి చేరింది ష్ ష్ అంటూ …….
అక్కయ్యలు : అమ్మలూ మీరు వెళ్లి స్నానానికి ఏర్పాట్లుచేయ్యండి మేము వస్తాము అంటూ పెద్దమ్మ చెంతకు చేరారు .
పెద్దమ్మ : తల్లులూ ….. మేము వెళ్లి ఏర్పాట్లుచేస్తాము మీ ప్రియమైన – ప్రాణమైన బుజ్జిహీరోను జోకొట్టండి వెళ్ళండి వెళ్ళండి .
చెప్పకుండా మీకెలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోతున్న బుజ్జిజానకి – అక్కయ్యలను నాదగ్గర వదిలి , తుంటరి పిల్లాడా అంటూ బుగ్గపై గిల్లేసి వెళ్లారు .
స్స్స్ ……
నొప్పివేసిందా ? ఉండు మందు రాస్తాను అంటూ బుగ్గపై పెదాలతో ముద్దుపెట్టి తుర్రుమన్నారు మేడమ్ ……
మన బుజ్జిదేవుడు ఇక్కడ ఉన్న విషయమే కాక తుంటరి పిల్లాడు అన్న విషయం కూడా ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూనే , అయ్యో బుగ్గ ఎర్రగా కందిపోయింది , మేడమ్ అంటీ ముద్దు మాత్రమే సరిపోయేలా లేదు అంటూ నలుగురూ ముద్దులుపెట్టి నవ్వుకుని చుట్టూ చేరారు .
బుజ్జిజానకి : రాత్రి ఎప్పుడు ఇంటికి చేరుకున్నావు ? – ముగ్గురు అక్కయ్యలనూ …… గదిలోని బెడ్ పైకి ఎలా చేర్చావు ? – ఇక్కడికి ఎలా ఎప్పుడు వచ్చావు ? ….. ఈ విషయాలన్నీ పెద్దమ్మకు ఎలా తెలుసు ? అంటూ ఆశ్చర్యపోతోంది అక్కయ్యలతోపాటు …… , అక్కయ్యలూ ….. లోపలనుండి ఏ క్షణంలోనైనా పిలుపు రావచ్చు మనలో ఒక్కరైనా ఇక్కడే ఉండాలి .
అక్కయ్యలు : అవునవును ప్రాణంలా జోకొట్టడానికి ఉండాలి అంటూ బుగ్గలపై తాకేతాకనట్లు చేతులతో ముద్దులుపెట్టారు బంగారం అంటూ ……
బుజ్జిజానకి : అవును బంగారమే , అత్తయ్యలకు ఇష్టం లేకపోయినా మీకెందుకు అక్కయ్యా అంత ప్రాణం ఈ అల్లరి పిల్లాడంటే ……
అక్కయ్యలు : మా బుజ్జిచెల్లికి అమ్మమ్మ చెప్పినట్లే మాకు మా నాన్నలు చెప్పారు ……. మీ తమ్ముడిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోమని – మహేష్ సంతోషమే మన సంతోషం అని మాట తీసుకున్నారు , మాకు తమ్ముడంటే ఎంత ప్రాణమో అంతకు రెట్టింపు ప్రాణం అమ్మలంటే తమ్ముడికి – తమ్ముడి ప్రేమ ….. అమ్మలకు తెలిసేంతవరకే వన్స్ తెలిసిందా ఇక మేమైతే గుర్తుకూడా ఉండము , దేవతలు దేవతలు దేవతలు …… దేవతలు తప్ప మరొక లోకం ఉండదు ఈ తుంటరి పిల్లాడికి …..
అవునవును అదిమాత్రం నిజం అక్కయ్యలూ ….. అంటూ అక్కయ్యలతోపాటు సంతోషంగా నవ్వుకుంది బుజ్జిజానకి .
బుజ్జిజానకి : ఇక్కడా అలాగే అక్కయ్యలూ …… , అమ్మమ్మకు – తాతయ్యకు మరియు ఇక్కడ ఉన్న అమ్మకు …… నాకంటే ఈ అల్లరి పిల్లడంటేనే ఎక్కువ ఇష్టం , ఇలా పడుకున్న ఈ బుజ్జిహీరోను చూసి ముద్దులతో ప్రేమతో జోకొట్టవే అంటూ మొట్టికాయలు వేసింది అమ్మమ్మ చిన్నగా కాదు గట్టిగా ……
అక్కయ్యలు : మరి కానివ్వు చెల్లీ ……
బుజ్జిజానకి : అక్కయ్యలతోపాటు అయితేనే ……
అక్కయ్యలు : అంతకంటే అదృష్టమా అంటూ నలుగురూ ఒకేసారి బుగ్గలపై – నుదుటిపై – హృదయంపై ముద్దులుపెట్టి సంతృప్తిగా ఆనందిస్తున్నారు .
బుజ్జిజానకీ – తల్లులూ ……
వస్తున్నా అత్తయ్యలూ ….. , అక్కయ్యలూ ఇక్కడే ఉండండి , మీఇష్టం ముద్దులలో ముంచెయ్యండి అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి లోపలకువెళ్లింది బుజ్జిజానకి …….
అంటీలు : తల్లులూ ….. మీరుకూడా , వస్తారా లేదా లాక్కుని వెళ్ళాలా ? .
అక్కయ్యలు : ప్చ్ ప్చ్ ప్చ్ sorry లవ్ యు చెల్లీ ……
అమ్మమ్మ : లోపలకువెళ్లి ఒకరితరువాతఒకరు రండి అంతవరకూ నేను జోకొడతాను .
అక్కయ్యలు : లవ్ యు అమ్మమ్మా అంటూ ముద్దులుపెట్టి లోపలకువెళ్లారు .
బుజ్జిజానకి : అక్కయ్యలూ …… అంటూ కంగారుపడుతోంది .
అక్కయ్యలు : ( అమ్మమ్మ ఉన్నారులే చెల్లీ ….. , నిమిషం నిమిషం పాటు వన్ బై వన్ వెళ్లివస్తాములే …… )
బుజ్జిజానకి : లవ్ యు అక్కయ్యలూ అంటూ రోజూలానే తెల్లని వస్త్రాన్ని చుట్టుకుని పీఠపై కూర్చుంది .
రోజూలానే అత్తయ్యలు – మేడమ్ – పెద్దమ్మ ….. చివరగా అక్కయ్యలు ఒకరితరువాతఒకరు బుజ్జిజానకి వొళ్ళంతా పసుపు పూసి నుదుటిపై కుంకుమ ఉంచి హారతిపట్టి నీళ్లుపోసి స్నానం చేయించి కొత్త లంగావోణీ – నగలలో అలంకరించి పుత్తడి బొమ్మలా రెడీ చేశారు .
అక్కయ్యలు : చెల్లీ బ్యూటిఫుల్ ……
బుజ్జిజానకి సంతోషిస్తూ వెళ్లి పెరడులోకి చూసి వచ్చి , అమ్మమ్మ ఐదుగురి దేవతల ఆశీర్వాదం తీసుకుని అత్తయ్యల మధ్యకు చేరుకుంది .
అత్తయ్యలు : బుజ్జితల్లి బుజ్జిజానకీ ….. నీకోసం పెద్దమ్మ అన్ని వంటలనూ తీసుకొచ్చారు అంటూ అక్కయ్యలతోపాటు ప్రాణంలా తినిపించి తిన్నారు .
గోరుముద్ద గోరుముద్దకూ ప్రాణంలా బయటకు చూస్తుండటం చూసి , బుజ్జిజానకీ ….. హాయిగా నిద్రపోతున్నాడులే లేచాక నీ బుజ్జిచేతులతో తినిపించవచ్చు .
బుజ్జిజానకి : లవ్ యు పెద్దమ్మా …..
అత్తయ్యలు : బుజ్జిజానకీ ….. నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలను ఆహ్వానించడానికి ఎప్పుడు వెళ్ళాలి .
బుజ్జిజానకి : ఎలాగో రాత్రి ఉండమంటే ఉండరు – ఇప్పుడు మిమ్మల్ని వదిలి అయితే ఉండలేను , నేనూ …. మీతోపాటు రావచ్చా ? అత్తయ్యలూ అంటూ చుట్టేసింది .
దేవతలంతా ఒకరినొకరు చూసుకున్నారు , శాస్త్రాలున్నవి మన సంతోషం కోసం మాత్రమే ……
అంటీలు : పెద్దమ్మ చెబితే దేవత చెప్పినట్లే , ఎప్పుడు వెళదాము ? టిఫిన్ చెయ్యగానే వెళదామా ? .
బుజ్జిజానకి : అక్కయ్యలు …..
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ ….. ఉమ్మా ఉమ్మా ఉమ్మా , exam పూర్తవగానే వచ్చేస్తాము .
బుజ్జిజానకి : అయితే అప్పుడే వెళదాము అత్తయ్యలూ ….. , ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి మా ఫ్రెండ్స్ కూడా ఇంట్లోనే ఉంటారు , మేడమ్ అంటీ కూడా ఫ్రీ ……
మేడమ్ : బుజ్జిజానకీ ….. , కాలేజ్ రెనోవేషన్ ఫైల్ సబ్మిట్ చెయ్యమని కలెక్టర్ ఆఫీస్ నుండి పిలుపు వచ్చింది గంటలో వచ్చేస్తాను …..
అంటీలు : అయితే మేమూ వెళ్లి లంచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చేస్తాము , అప్పుడు ఎంచక్కా భోజనం చేసి అందరమూ ఆహ్వానించడానికి వెళ్లొచ్చు .
బుజ్జిజానకి : తొందరగా వచ్చేయ్యాలి ……
లవ్ టు లవ్ టు అంటూ అందరూ బుజ్జిజానకిని ముద్దులతో ముంచెత్తారు .
లవ్ యు దేవతలూ ……..
9: 30 అవ్వడంతో మొదట అక్కయ్యలు ….. బుజ్జిజానకి – దేవతల బుగ్గలపై ముద్దులుపెట్టి బయలుదేరడానికి రాత్రి ఇక్కడే పార్క్ చేసిన స్కూటీ కీస్ అందుకున్నారు .
బుజ్జిజానకితోపాటు అందరూ ALL THE BEST చెప్పి గుమ్మం వరకూ వచ్చారు .
అంటీలు చూస్తుండగానే నాబుగ్గలపై ముద్దులుపెట్టారు అక్కయ్యలు ……
అంటీలు : తల్లులూ వద్దు వద్దు వద్దు ……
అక్కయ్యలు : ఈర్ష్య వేస్తోంటే మీరూ ముద్దులు పెట్టుకోండి తమ్ముడు కాదనడు …..
మిమ్మల్నీ అనేంతలో …..
లవ్ యు లవ్ యు లవ్ యు అమ్మలూ అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చిరునవ్వులు చిందిస్తూ స్కూటీలలో తుర్రుమన్నారు .
అక్కయ్యలూ ….. జాగ్రత్త .
లవ్ యు బుజ్జిజానకీ అంటూ ముద్దులుకురిపించి నవ్వుకున్నారు అంటీలు – మధ్యాహ్నం వస్తారుకదా …… అప్పుడు చెబుతాము మీ అక్కయ్యల సంగతి , ఈ తుంటరి పిల్లాడు పడుకోవడం వలన ప్రశాంతంగా ఉంది .
పెద్దమ్మ : నిజం చెప్పండి ……
అంటీలు : నిజమే ఏదో వెలితిగా ఉన్నట్లుంది – అలా రోజూ అల్లరితో అలవాటు చేసేసాడు ఇడియట్ ……
బుజ్జిజానకి : మా అత్తయ్యలకు ఇష్టమైన ఇడియట్ ……
అంటీలు : ఆ ఇడియట్ విన్నాడంటే సడెన్ గా లేచి మళ్లీ మొదలుపెడతాడు , లేచేలోపు వెళ్లిపోవాలి ……
బుజ్జిజానకి : అత్తయ్యలూ ……
అంటీలు : మా బుజ్జితల్లికి ఇష్టమైన భోజనం వండుకుని రావాలంటే ఇప్పుడు వెళ్లాలికదా ……
బుజ్జిజానకి : త్వరగా వచ్చెయ్యండి అత్తయ్యలూ …….
అంటీలు : అలాగే …… , చెల్లీ …… కలెక్టర్ ఆఫీస్ లో వదిలి వెళతాము రా …..
మేడమ్ : లవ్ యు అక్కయ్యలూ …… , వన్ సెకెండ్ అంటూ వచ్చి నాబుగ్గపై ముద్దుపెట్టారు .
అంటీలు : మీముద్దులకు అంతెత్తుకు వెళ్లి కూర్చుంటాడు .
మేడమ్ : మీ మంచి ఇడియట్ కదా అక్కయ్యలూ ……
అంటీలు : మంచి ఇడియట్ కాదు తుంటరి ఇడియట్ అంటూ కారులో వెళ్లారు .
ఇక నేనూ వెళ్లనా బుజ్జిజానకీ …… ? అంటూ పెద్దమ్మ .
బుజ్జిజానకి : పెద్దమ్మా ……
పెద్దమ్మ : మీ ఇద్దరి మధ్యన పానకంలో పుడకలా నేనెందుకు అని , నేనుంటే మోహమాటంతో తక్కువ ముద్దులతోనే సంతోషిస్తావు అని ……
బుజ్జిజానకి : మా పెద్దమ్మ ముందు మొహమాటం దేనికి , మేమంటే ప్రాణం మా పెద్దమ్మకు అంటూ ప్రాణంలా చుట్టేసింది .
పెద్దమ్మ : లవ్ యు బంగారూ ….. , మా బుజ్జిజానకి ఫ్రెండ్స్ మరియు ఫ్రెండ్స్ అమ్మలను గిఫ్ట్స్ తో ఆహ్వానించాలని మీరే తీసుకురావాలని బోలెడంత డబ్బు ఇచ్చాడు నీ హీరో , మీ అత్తయ్యలనూ తీసుకెళతానులే …..
బుజ్జిజానకి : పెద్దమ్మా అంటూ ఆనందబాస్పాలతో నావైపుకు ఆరాధనతో చూస్తోంది .
అమ్మమ్మ : మాకోసం వచ్చిన బుజ్జిదేవుడే , ఏ జన్మలో అదృష్టం చేసుకున్నామో స్వయానా బుజ్జిదేవుడే మా జీవితంలోకి వచ్చాడు అంటూ ఆనందబాస్పాలను తుడుచుకుని ఆనందిస్తున్నారు .
పెద్దమ్మ : ఇప్పుడైతే పానకంలో పుడకనే కదూ …… , పెద్దమ్మా ….. తొందరగా వెళ్ళండి అని మనసులో అనుకుంటున్నావులే ……
బుజ్జిజానకి : పెద్దమ్మా ……
పెద్దమ్మ : Ok ok ….. , ముద్దుల వర్షమే కురవబోతుందని అర్థమైపోయిందిలే , నేను వెళతానులే అమ్మా అంటూ బుజ్జిజానకి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , ఆ తుంటరి ఇడియట్ కు నా ముద్దుకూడా నువ్వే ఇవ్వు అనిచెప్పి వెళ్లిపోయారు .
పెద్దమ్మను కారు వరకూ వదిలి పరుగున నాప్రక్కన చేరిపోయింది – నేనంటే అంత ఇష్టమా ? మహేష్ …….
ఇష్టం కాదు ప్రాణం – ప్రాణం కంటే ఎక్కువ అంటూ లేచి కూర్చున్నాను ఒళ్ళు విరుస్తూ …….
లవ్ యు అంటూ కూర్చునే నన్ను చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది బుజ్జిజానకి ……
హలో స్టాప్ స్టాప్ …… ప్రాణం – ప్రాణం కంటే ఎక్కువ అన్నది నా జానకి అమ్మ గురించి …… , అమ్మ సంతోషమే నా సంతోషం ……
బుజ్జిజానకి : అయితే డబల్ సంతోషం అంటూ ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ …… అంటూ ముద్దులు కురిపించి తనివితీరడం లేదు అంటూ కొరికేసింది .
స్స్స్ ….. అమ్మా చూడమ్మా ……
బుజ్జిజానకి అందమైన నవ్వులు …… , లవ్ యు లవ్ యు అంటూ పంటిగాటుపై ముద్దులు కురుస్తున్నాయి .
చాలు చాలు చాలు …… నువ్వు కేవలం బుజ్జిజానకివి – జానకమ్మ ముద్దులు అయితే …… ఆపనే ఆపను .
బుజ్జిజానకి : నాకూ చూడటం ఇష్టమేలే …..
లవ్ యు బుజ్జిజానకీ ….. , అఅహ్హ్ సూపర్ నిద్ర …… అమ్మమ్మ – మేడమ్ – పెద్దమ్మ మరియు మరియు నా హృదయదేవకన్య ముద్దులు …… అంటూ మురిసిపోతున్నాను .
బుజ్జిజానకి : అక్కయ్యలు కూడా …… , ప్రాణంలా ముద్దులుపెట్టారు .
ష్ ష్ ష్ అంటీలు విన్నారంటే ఇక అంతే అంటూ చుట్టూ చూసి హమ్మయ్యా అనుకున్నాను .
బుజ్జిజానకి : నవ్వుకుని , అత్తయ్యలు వెళ్లిపోయారులే ……. , ఏమి జరిగిందో తెలుసా exam కు వెళుతూ అత్తయ్యలు చూస్తుండగానే ముద్దులు కురిపించి పట్టుబడకుండా వెళ్లిపోయారు .
అక్కయ్యలు చెబితే వినరు …… , ముందుగా అక్కయ్యల exam కు ALL THE BEST ……
బుజ్జిజానకి : నా హీరో విషెస్ నేను చెప్పానులే ……
లవ్ యు బుజ్జిజానకీ …….
బుజ్జిజానకి : లేచినప్పటి నుండీ చూస్తున్నాను లవ్ యు లవ్ యు అంటున్నావు కానీ కానీ ……
కానీ కానీ ఏంటి బుజ్జిజానకీ ……..
బుజ్జిజానకి : తెలిసి ఆటపట్టించకు అంటూ చేతిని చుట్టేసే బుంగమూతి పెట్టుకుంది .
అమ్మమ్మా …… ముద్దొ ….. ముచ్చటగా ఉందికదూ …..
నిన్నూ అంటూ దెబ్బలు కురుస్తున్నాయి .
అమ్మ చూస్తున్నారులే , ఇందాక కొరికావు ఇప్పుడేమో దెబ్బలు ……
బుజ్జిజానకి : మరి నాకిష్టమైనవి ఇచ్చేదాకా గిల్లేస్తాను కూడా అంటూ నడుముపై – బుగ్గపై గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ …… అంటూనే బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టాను .
అంతే ఒక్కసారిగా బుంగమూతి పెదాలపై అందమైన నవ్వు ….. , ఒక్కటేనా ….. ? అంటూ బుగ్గపై ముద్దులు కురుస్తూనే ఉన్నాయి .
ముద్దుముద్దుకూ ….. తియ్యదనం అలా అలా పెరుగుతూనే ఉంది , అమ్మమ్మా ….. ఆకలివేస్తోందని తెలిసికూడా వదలడం లేదు .
బుజ్జిజానకి : అమ్మమ్మా వడ్డించుకునిరా ……
ఆగు ఆగు అమ్మమ్మా …… బ్రష్ చేసి ఫ్రెష్ అవ్వాలి , వదిలితే ఇంటికివెళ్లి గంటలో వచ్చేస్తాను .
అంతే కదలనీకుండా ఏకంగా నడుమును చుట్టేసింది బుజ్జిజానకి ……
అమ్మమ్మ : మంచిపనిచేశావు బుజ్జితల్లీ ….. , ఇది తనిల్లు కాదా ? .
బుజ్జిజానకి : కోపంతో బుగ్గపై కొరికేసింది .
స్స్స్ …… సరే సరే ఇక్కడే మన ఇంటిలోనే ఫ్రెష్ అవుతాను .
బుజ్జిజానకి : లవ్ యు అంటూ బుగ్గపై ముద్దు …… , నేనే స్వయంగా తీసుకెళతాను అంటూ లేపి బాత్రూం లో వదిలింది .
వెళ్ళూ ……..
బుజ్జిజానకి : వెళ్ళాలా ? ప్చ్ ప్చ్ ……
మరి అంటూ పేస్ట్ అందుకున్నాను .
బుజ్జిజానకి : ఉండు కొత్త బ్రష్ తీసుకొస్తాను అంటూ వెళ్లి వచ్చి చూసేసరికి బ్రష్ తో బ్రష్ చేస్తున్నాను , అది నా బ్రష్ …….
అయితే తీసుకో ……
ఛాతీపై ప్రేమతో కొడుతోంది ……
Ok ok తెలిసే తీసుకున్నాను – అమ్మ పర్మిషన్ తీసుకున్నానులే ……
బుజ్జిజానకి : లవ్ యు అంటూ తెగ మురిసిపోతూ చేతిని చుట్టేసి నా కళ్ళల్లోకే చూస్తోంది .
చూడు అమ్మమ్మా ….. , బ్రష్ చేసుకోనివ్వడంలేదు – స్నానం చేసుకొనివ్వడం లేదు .
బుజ్జిజానకి : అమ్మమ్మకు వినిపించినా పట్టించుకోదు , అమ్మమ్మకు ఇప్పుడు నాకంటే నువ్వే ప్రాణం ….. , వెళతానులే హ్యాపీగా స్నానం చేసి తొందరగా రావా ప్లీజ్ ప్లీజ్ …..
టవల్ ……
బుజ్జిజానకి : క్షణంలో తీసుకొస్తాను , కొత్త టవల్ అంటూ అందించింది .
ప్చ్ ప్చ్ అంటూ నిరాశతో చూసి బయటకు తోసేసి తలుపు వేసేసుకున్నాను .
బుజ్జిజానకి : ప్చ్ ప్చ్ & ఆ చూపుకు అర్థం ఏమిటబ్బా ….. , అయ్యో ….. నేను తుడుచుకున్న టవల్ ఆశించాడు , నీకు బుద్ధిలేదే …… , మహేష్ మహేష్ …..
వద్దులే వెళ్లు ……
