పెళ్లి 1989

కవిత… మూర్తి పేరెంట్స్ వచ్చారు….పెళ్ళికెళ్ళిన ప్రభావతి… మొగుడు సుధీర్… చెల్లెలు సత్యవతి …కూడా వచ్చారు… ఎంగేజ్మెంట్ కి ముహూర్తం పెట్టుకునే వచ్చారు…. నెక్స్ట్ వీక్ ఎండ్ లో చెయ్యాలని అనుకున్నారు… సరైన ప్లేస్ కోసం వెతకసాగారు… అదే సమయం లో మూర్తి … మోహన్ కి ఫోన్ చేసాడు…

మూర్తి: హాయ్…. ఎలావున్నావు?

మోహన్; ఐ యాం ఫైన్. చెప్పు నీ పెళ్లి పనులు ఎక్కడిదాకా వచ్చాయి..

మూర్తి: నెక్స్ట్ వీక్ ఎండ్ … saturday మా ఎంగేజ్మెంట్ ని ఫిక్స్ చేశారు… ప్లేస్ కోసం వెతుకుతున్నాను….

మోహన్ : ఎంత మంది ని పిలుస్తున్నావు?

మూర్తి: ఫామిలీ మెంబెర్స్ ఓన్లీ …. నా పేరెంట్స్… కవిత పేరెంట్స్…. నేను … కవిత… కళ్యాణి.. కుమార్… ప్రభావతి… సుధీర్… సుజాత… సుందర్… సత్యవతి… సరోజ… నువ్వు… ఓన్లీ 15 మెంబెర్స్…. ప్లస్… ఎంగేజ్మెంట్ కి కావాల్సిన పూజారి… మొత్తం కలిపినా 20 మంది కూడా వుండరు.

మోహన్: ఓహ్… నన్ను కూడా పిలుస్తున్నావా….

మూర్తి: నువ్వు లేకుండా ఎలా? నువ్వు నా చీఫ్ గెస్ట్ వి ….. నువ్వు తప్పకుండా ఉండాలి…. నా పెళ్లి చూపులకి వచ్చావు…. ఎంగేజ్మెంట్, పెళ్లి కి కూడా రావాలి… లేకపోతే ఊరుకోను…

మోహన్: థాంక్యూ వెరీ మచ్….

మూర్తి: నువ్వు తప్పకుండా ఉండాలి… నీకు ముందే చెపుతున్నాను…. చివరి నిమిషం లో హ్యాండ్ ఇవ్వకూడదు.

మోహన్: సరే… నాకో ఐడియా వచ్చింది… ఎంగేజ్మెంట్ కి హోమాలు అవి ఏమి చెయ్యరు కదా…

మూర్తి: అవును.. అవన్నీ పెళ్లి కి ఉంటాయి… ఎంగేజ్మెంట్ కి కాదు… ఆ రోజు పౌరోహితుడు ఏదో మంత్రాలు చదివిన తరువాత తాంబూలాలు మార్చుకుంటారు…. ఆ తరువాత లంచ్ చేస్తాము…

మోహన్: ఇంట్లో ఎటువంటి హోమాలు ఉండవంటే … వెర్మాంట్ లో నా హాలిడే హౌస్ లో పెట్టుకోవచ్చు….

మూర్తి: నిజంగానా…. నా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అక్కడ పెట్టుకోవచ్చా….

మోహన్: ఎస్… ఫైర్ అలారమ్ ఆక్టివేట్ అవ్వనంతవరకు నాకేమి అభ్యంతరం లేదు… నువ్వు ముందుగా అక్కడికెళ్లి ఏర్పాట్లు చూసుకో… మీవాళ్లంతా ఫ్రైడే నైట్ వచ్చేలా చూసుకో…. నేను శనివారం ఉదయం ముహూర్తం టైం కి వచ్చి వెళ్తాను…. నువ్వు నాకు ఒక ప్రామిస్ చెయ్యాలి….. నేను నీకు నా హాలిడే హౌస్ వాడుకోవడానికి ఇచ్చినట్లు ఎవరికి చెప్పకూడదు.

మూర్తి: అలాగే…. తప్పకుండా… నాకు తెలుసు నీ ఆ ఇల్లు అంటే చాలా ఇష్టమని… నువ్వు ఎవ్వరిని అక్కడికి రానివ్వవని…. థాంక్యూ వెరీ మచ్…. లైఫ్ లాంగ్ గుర్తుండిపోయాలా నా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చావు…

మోహన్: నో వర్రీస్…. ఈ విషయం ఎవరికి చెప్పకు….

మూర్తి: సరే… ఎవ్వరికీ చెప్పను…

మూర్తి ఈ విషయాన్ని కవిత కి చెప్పాడు… అందరూ చాలా ఆనందించారు…. అక్కడి కి ఎలా వెళ్ళాలి… ఎవరెవరి కార్స్ లో వెళ్ళాలి అన్న ప్లానింగ్ చేసుకున్నారు. కేటరింగ్ వాళ్ళకి కూడా చెప్పేసారు. అందరూ ఫ్రైడే నైట్ అక్కడికి చేరుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు… మోహన్ కి Lake Champlain కి దగ్గర్లో ఒక మంచి హాలిడే హౌస్ వుంది. ఫ్రైడే సాయంత్రానికల్లా అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరికి ఆ ఇల్లు చాలా బాగా నచ్చింది. ఇండిపెండెంట్ హౌస్…. దాదాపు 2000 గజాల ప్లాట్ లో కట్టారు… ఇంటికి ముందు వెనక మంచి స్పేస్ వొదిలి చక్కగా కట్టారు.. 5 బెడ్ రూమ్స్ …. కిచెన్… లివింగ్ రూమ్…. డ్రాయింగ్ రూమ్ …స్టోర్ రూమ్…. బేసెమెంట్ … కార్ పార్కింగ్ గ్యారేజ్ …. మోహన్ శనివారం ఉదయం అక్కడికి చేరుకున్నాడు. Lake Champlain కి 20 మైళ్ళ దూరం లో ఒక పెద్ద కొండ మీద ఉన్నది … బాగా పోష్ ఏరియా లాగా ఉంది ….