ఆమె ఒప్పుకుంది. “మీరు నన్ను చూసేది ఇదే చివరిసారి కాదు.”
నేను కళ్ళు తిప్పాను. “ఏమో ఎవరికి తెలుసు.”
“మీరు ఎక్కడి నుండి వచ్చారు ?” అని ఆమె పట్టుబట్టి అడిగింది.
ఇప్పుడు కామిని తన కళ్ళు తిప్పే వంతు వచ్చింది, ఆమె తన చేతుల్లోని వెండి నాణేలతో టేబుల్ మీద తట్టింది. “హలో… మనకి ఇక్కడ ఒక ఒప్పందం ఉంది.”
కామిని ఒప్పందం గుర్తు చేసినప్పుడు, ఆమె భయపడినట్లు కనిపించింది. తన ఒప్పందం యొక్క చివరి భాగాన్ని నిలబెట్టుకోలేననే భయంతో, ఆ అమ్మాయి కామినికి పండ్లు ఇచ్చింది. కామిని ఆమెకి వెండి ఇచ్చింది. ఆ అమ్మాయి వెంటనే వెనుక ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్లి ఒక అందమైన వ్యక్తి తనని ముద్దు పెట్టుకున్నాడని గొప్పలు చెప్పుకుంది.
“కొంతమంది అమ్మాయిలు నిజంగా నిరాశలో ఉన్నారు,” అని చెప్పాను.
కామిని నవ్వింది. “ఆ సంగతి నాకే చెబుతున్నారా… పిల్లలని చూడటానికి ఇక నేను వేచి ఉండలేను.”
“బహుశా మనం ఆ గుంపుని తప్పించుకోవడానికి వేరే దారి లోకి వెళ్ళలేమా ?” నేను రాతి నేల వీధిని చూసి, వీధిలో పైకి క్రిందికి కదులుతున్న జీవుల గుంపుని చూసి కొంచెం భయపడ్డాను.
“నాకు కూడా గుంపులు అంతగా ఇష్టం ఉండవు, రండి, మనం పార్క్ నుండి వెళ్దాం” అని అంది.
నేను రెండు సంచులని నా కుడి చేతిలో పట్టుకున్నాను, కామిని నా ఎడమ చేతిని పట్టుకుంది.
“నేను ఒక సంచిని పట్టుకుంటే ఎలా ఉంటుంది ?” అని కామిని అడిగింది.
నేను ఆమెని చూశాను. “నేను గాలి సంచులని మోస్తున్నట్లు ఉంది.”
“సరే,” అని కామిని వినయంగా అంది. అయితే కొంతమంది మగాళ్లని దాటుతున్నప్పుడు, సాధారణంగా అక్కడ అమ్మాయిలు సంచులు పట్టుకుని ఉండటం చూసాను, అయినా నేను తన కోరికని తీర్చలేదు.
మేము స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ పార్క్ గుండా నడిచాము. కొంతమంది యువకులు ఆడుకోవడం, మరికొందరు ఒంటరిగా కూర్చుని చదువుకోవడం చూశాను. సూర్యకాంతి నుండి మమ్మల్ని రక్షించే చెట్ల తోరణం కింద నుండి మేము వెళ్ళాము. నేను నా చొక్కా కాలర్ ని జరిపి చల్లని గాలిని ఆస్వాదించాను.
“ఇక్కడ వేడి ఎక్కువవుతున్నట్లు అనిపిస్తోంది,” అని చెప్పాను.
“కానీ రసఖండంలో ఎప్పుడూ సమానమైన ఉష్ణోగ్రత ఉంటుంది, బహుశా మీకు మాత్రమే వేడిగా అనిపిస్తున్నట్లుంది” అని కామిని అంది.
“హ్మ్మ్, నిజమే అయివుంటుంది,” అని అన్నాను. ఆమె ఆకర్షణీయమైన వేడి గురించి మాట్లాడుతోందా లేదా ఉష్ణోగ్రత గురించే మాట్లాడుతోందా అనేది నాకు ఖచ్చితంగా తెలియలేదు. “మీరు అందరూ ఇలా వొళ్ళు చూపించే బట్టలు వేసుకోవడానికి అదొక కారణం కావొచ్చు.”
“అవును… సంవత్సరం పొడవునా.”
“ఇక్కడ ఎప్పుడైనా వర్షం పడుతుందా ?”
“పడుతుంది, అయితే ఎక్కువగా కాదు. ఈ కన్యల దీవుల్లో వర్షపాతం ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి, అయితే అవి చాలా దూరంగా ఉంటాయి, అలాగే వర్షం పడని, భగభగ మండే సూర్యుడు ఉన్న పొడి ప్రాంతాలు కూడా ఉన్నాయి.”
“అలాగా,” అని అన్నాను. మార్కెట్ యొక్క అన్ని శబ్దాల నుండి మేము దూరంగా రావడంతో ఊపిరి పీల్చుకున్నాను.
“ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది. నాకు ఇలాంటి ప్రదేశాలు, మీ ద్వీపం చాలా ఇష్టం. మీరు ఇష్టమైన వాళ్ళతో ఒంటరిగా ఉన్నప్పుడు కేవలం ప్రకృతి శబ్దాలు మాత్రమే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.”
“నేను ఒప్పుకుంటున్నాను,” అని అన్నాను, దృశ్యాన్ని కూడా ఆస్వాదించాను. సంగీతం వాయిస్తున్న ఇద్దరు మగాళ్లని మేము దాటుకుంటూ వెళ్ళాము. నేను వాళ్ళ వైపు తిరిగి ఆ అందమైన సంగీతానికి నవ్వాను. “వాళ్ళు సంగీతం వాయించడం ఇష్టపడుతున్నారు.”
“ఎందుకంటే వేరే మనుషులు మా సంగీతం వినాలని మేము కోరుకుంటాము, ఎవరైనా దానిని వినడం అది ఒక గౌరవం” అని అంది.
“అది మీ ప్రత్యేకతలా అనిపిస్తుంది,” అని చెప్పాను.
“అవును, నేను నిన్ను ప్రేమించడానికి ఇది కూడా ఒక కారణం. మీరు వెంటనే నా మాట విన్నారు” అని కామిని నా చేయి ఒత్తింది.
మేము చూపులు కలిపాము, నేను మళ్ళీ ఆమె లోతైన, నీలి కళ్ళ రంగులో మునిగిపోయాను.
“అక్కడ అనాథాశ్రమం ఉంది,” అని కామిని తల అటువైపు తిప్పింది. కొంతమంది పిల్లలు ఇసుక గుంటలో ఇసుక కోటలు తయారు చేస్తున్నారు, మరికొందరు ట్యాగ్ ఆడుతున్నారు, కొంతమంది వాయిద్యాన్ని నేర్చుకుంటున్నారు, అయితే వాళ్ళందరూ సంతోషంగా కనిపించారు.
“కామినీ,” అని ఒక అమ్మాయి పిలుస్తూ తన చేతులు ఆమె వైపు చాచింది.
“హలో,” అని కామిని ఆమెని విష్ చేసి కౌగిలించుకుంది.
“నిన్ను చూడటం చాలా సంతోషంగా ఉంది, ఏమైంది ? నువ్వు ఈ మధ్య అంతగా కనిపించడం లేదు” అని ఆమె నవ్వుతూ అడిగింది.
“OK, నాకు ఒక ప్రేమికుడు దొరికాడు. రేవంత్, తాను జూలీ ఇంకా జూలీ తాను రేవంత్” అని పరిచయం చేసింది.
జూలీ చేతులు ఆమె నోటికి చేరుకున్నాయి, ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి. “ఓహ్, గహనా, ఎలాంటి మనిషి.”
“మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది,” అని ఆమె వణుకుతున్న చేయి పట్టుకుని చెప్పాను.
“మీరు ఎక్కడి నుండి వచ్చారు ?” అని జూలీ ఆశ్చర్యంగా అడిగింది. ఆమెకి ముదురు బంగారు రంగు జుట్టు, నిండు ఎర్రటి పెదవులు ఉన్నాయి. ఆమె మోకాలి పొడవున్న బట్టలు వేసుకుంది, అది ఆమెకి కొంచెం బిర్రుగా పట్టింది, ఆమె పెద్ద రొమ్ములు బట్టలకి బిగుసుకుని కనిపించాయి.
“ఇక్కడి నుండి చాలా దూరం,” అని చెప్పాను.
“నీలాంటి మనిషిని నేను చూడలేదు, వినలేదు కూడా,” అని జూలీ చెబితూ ఆమె కళ్ళు కామిని వైపు తిరిగాయి. “నీలాంటి మంచి అమ్మాయి అతనిలాంటి మనిషిని కనుక్కోవడం నాకు ఆశ్చర్యం అనిపించ లేదు.”
“నేను అతన్ని కనుక్కోలేదు, అతనే నన్ను కనుక్కున్నాడు,” అని కామిని ఆమెని సరిదిద్దింది.
“సారీ, తప్పకుండా అదే అయివుంటుంది, అయితే అది అసాధారణమైన విషయం అని మీకు తెలుసు” అని జూలీ అంది.
“నాకు అర్థమైంది,” అని కామిని అంది. నేను పట్టుకున్న సంచుల వైపు ఆమె చూపింది. “మేము పిల్లల కోసం తినడానికి తెచ్చాము.”
