గులాబీ రంగు చనుమొనలతో 9 1

“నేను వస్తున్నాను,” అని అలీషా అంది. ఆమె స్వరం మాకు గుర్తుంది: నేను ఆమెని విడిచిపెట్టినప్పటి నుండి నా మనస్సులో మెదులుతున్న ఆమె మంత్రముగ్దుల్ని చేసే స్వరం అది. అది పక్షి పాటల లాగా వినిపించింది, ఆమె స్వరం మాత్రమే కాకుండా ఆమె సంగీత నైపుణ్యాలని కూడా మరింత వినాలని నేను కోరుకున్నాను. ఆమె తలుపు దగ్గరికి వచ్చి చివరికి తెరిచింది. కొన్ని ప్యాచ్ లు ఉన్న అందమైన వేసవి బట్టల్లో ఆమె అక్కడ నిలబడి ఉంది. పియానోను చూడగానే ఆమె చేతులు నోటికి చేరుకున్నాయి, ఆమె కళ్ళు నా నుండి వాయిద్యం మీదకి తిరిగాయి.

“నిజంగా ?” అని ప్రశ్నిస్తూ నెమ్మదిగా దాని వైపు ఒక అడుగు వేసింది, పెద్దగా తెరిచిన కళ్ళతో దానిని పరిశీలిస్తూ చూసింది. ఆమె భయంగా ఒక కీని నొక్కింది. సంగీత స్వరం ఆమె కళ్ళని వెలిగించింది. అక్కడ ఉన్న దుఃఖం ఆనందంగా మారింది, ఆమె మరొక కీని నొక్కి నవ్వడం మొదలు పెట్టింది. అప్పుడు ఆమె నా వైపు తిరిగింది, ఆమె కళ్ళు నీటితో నిండి ఉన్నాయి. “మీరు దానిని తిరిగి తెచ్చారా… కేవలం నా కోసమేనా ?”

“నేను నిన్న మీకు అలా చేస్తానని చెప్పాను,” అన్నాను, ఆమె నవ్వు చూడటం నా హృదయాన్ని వెచ్చగా చేసింది.

“కానీ అవి కేవలం మాటలు,” అని ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ అంది.

“అయితే నేను చెప్పే ప్రతి మాటని నిలబెట్టుకుంటాను.”

అలీషా ముక్కు చీది ఆనందంతో ఏడవడం మొదలు పెట్టింది. నేను తన కోసం నా చేతులు చాచాను, ఆమె వాటిలోకి చేరింది. ఆమె బీద స్థితిలో ఉన్నప్పటికీ, ఆమె గులాబీ లాగా అందంగా వాసన వచ్చింది. ఆమె గులాబీ సుగంధ ద్రవ్యం ఏదైనా ఉపయోగించిందో లేదా అది ఆమె సహజమైన వాసనో నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అది స్త్రీత్వం ఇంకా వ్యసనపరంగా వుంది. “అది పోయిందని నేను ఆశలు వదిలేసుకున్నాను,” అని నా ఛాతీ మీద కళ్ళు తుడుచుకుంటూ అంది. “నిన్న, మీలాంటి ఒక వ్యక్తి ఉన్నాడని చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను. నిన్న నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, అది కలనా కాదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. మీలాంటి వ్యక్తి దీనిని తిరిగి ఇవ్వడానికి సమయం తీసుకున్నారని నేను నమ్మలేకపోతున్నాను.”

“సరే, మీరు కలగనడం లేదు,” అన్నాను. “నేను ఇది మీ కోసమే చేశాను.”

“చాలా సంతోషం. నా హృదయపూర్వక ధన్యవాదాలు,” అంది ఆమె. “పియానో, మీ పని రెండూ నాకు చాలా విలువైనవి.”

ఆమె నవ్వడం చూసి నాకు సంతోషంగా అనిపించింది. అకస్మాత్తుగా, అప్పగించిన పని విజయవంతంగా పూర్తయినందున నా భుజాల మీది నుండి ఒక బరువు దిగినట్లు అనిపించింది.

మీరు దొంగిలించబడిన వస్తువుని ఆలీషాకి విజయవంతంగా తిరిగి ఇచ్చారు.
బహుమతి: యాభై మాన. ఐదు ఔన్సుల బంగారం. పెరిగిన బలం, దృష్టి ఇంకా విలువిద్య.

నా కళ్ళు పెద్దగా తెరుచుకున్నాయి. అది గొప్ప ఉదారమైన బహుమతి, అయితే అది నాకు ముఖ్యం కాదు. అలీషా సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం. ఆమె కదిలింది. “ఉహ్, మీరు దానిని లోపల పెట్టడానికి నాకు సహాయం చేయగలరా ?”

“తప్పకుండా,” అన్నాను.

“మీరు టెర్రేస్ నుండి వెళ్ళాలి,” అని అలీషా అంది.

“తప్పకుండా,” అన్నాను.

“నేను మీ కోసం తలుపు తెరుస్తాను.” ఆమె తన పెరట్లో వెనకకి పరిగెత్తింది, ఆమె గోధుమ రంగు జుట్టు అటూ ఇటూ ఊగుతోంది.

కామిని నాతో చూపులు కలిపింది. “నేను ఇంత సంతోషంగా ఉన్న ఎవరినీ చూడలేదు,” అంది ఆమె.

“తనకి ఆ అర్హత ఉంది,” అన్నాను.

“అవును,” అని ఆమె అంగీకరించింది.

నేను దానిని ఎత్తుకున్నాను, నా మెరుగైన బలాన్ని వెంటనే గమనించాను. అది ఒక ఆకంతా బరువుగా ఉంది. నేను దానిని సులభంగా టెర్రేస్కు తీసుకువెళ్లాను. అలీషా టేప్ వేసిన గాజు తలుపులు రెండింటినీ తెరిచింది. ఆమె దానిని ఎక్కడ ఉంచాలో నాకు చూపించింది, నేను దానిని నెమ్మదిగా దించాను.

“మీ కిటికీకి ఏమైంది ?” అని తనని అడిగాను.

“ఓహ్, ఆ భయంకరమైన దొంగలు దానిని పగలగొట్టారు,” అని నిట్టూర్చింది. “నేను టేప్ వేయవలసి వచ్చింది లేకపోతే దోమలు లోపలికి వస్తాయి.”

నేను నా ముక్కు ముడుచుకున్నాను. “సరే, మీరు వాళ్ళ గురించి మళ్ళీ ఎప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.”

“బదులుగా నేను మీకు స్థానికంగా పండించిన కొన్ని పండ్లు ఇవ్వనా ? నా దగ్గర ఇప్పుడు అంతే ఉన్నాయి.”

నేను కామినితో చూపులు కలిపాను. “ఏమిచ్చినా సరే మేము కృతజ్ఞులం,” అన్నాను.

ఆమె మాకు ఏదో ఇవ్వాలని అనుకోవద్దని నేను కోరుకున్నాను. కానీ ఆమె పట్టుబట్టి, అంజీరాల లాగా కనిపించే ఒక బుట్టతో తిరిగి వచ్చింది. మేము సోఫాలో కూర్చున్నాము. నేను ఒకటి అందుకున్నాను, అది లోపల చాలా తియ్యగా రసంతో ఉంది. “మీకు నచ్చాయా ?” అని అలీషా అడిగింది, నన్ను సందేహంగా చూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *