సేల్స్ స్టార్ 2 126

ఉదయ్ కూడా గూట్లే చూపులు గమనిస్తూనే వున్నాడు. గూట్లే కి “వెనక్కి తగ్గు” అన్న ధోరణి లో ఒక సిగ్నల్ ఇవ్వాలునుకున్నాడు కాబోలు, తన కుడి చేతిని ప్రియ వీపు చుట్టూ తెచ్చి ప్రియ కుడి భుజం పొదివి పట్టుకున్నాడు. ఉదయ్ వేళ్ళు ఆచ్చాదన లేని భుజానికి తగలగానే, ప్రియ శరీరం కొద్దిగా వణికింది.

“ఈ డీల్ సక్సెస్ అవుతుందని మేం ఇద్దరం చాలా ఎక్సైట్ అయి వున్నాం” ఉదయ్ అన్నాడు.

ఉదయ్ ప్రియ ని దగ్గిరికి లాక్కోవటం చూసిన గూట్లే, నవ్వుతూ తన పచ్చటి గార పళ్ళు బయట పెట్టాడు. ఉదయ్ ఇప్పుడు చేసిన పని ఒక ఆడ కొలీగ్ తో ప్రొఫెషనల్ రిలేషన్ లో చేసే పని కాదు. వాళ్ళ ఇద్దరి మధ్య ఇంకా ఏదో వుంది వుండాలి. అదే వాడి నవ్వు కు అర్థం, అని ప్రియ కి అర్థం అయింది. “ఎంత ధైర్యం వీడికి, మా మధ్య ఇంకేదో వుంది అనుకోటానికి? వుందే అనుకో.. వీడెవడు వెకిలి నవ్వులు నవ్వటానికి?”

ఉదయ్ తన ఉద్దేశం లో గూట్లే కి తన పరిధిని మర్మగర్భం గా గూట్లే కి తెలియచేసానని అనుకునుంటే, తను పొరపాటు పడ్డట్టే. అదేదీ పని చెయ్యలేదని చెప్పాలి. ఉదయ్ చెయ్యి ప్రియ భుజం చుట్టూ ఉన్నా, అది గూట్లే చూపుల్ని ఆపలేక పోయింది. ఆర్డర్ తీసుకోటానికి వైటర్ తావటం ఒక్కటే వాడి దృష్టి మరల్చ గలిగింది.

వైటర్ పేరు చెప్పుకుని, మెనూ లు చేతికి ఇచ్చి, ఆరోజు స్పెషల్ వంటలని చదివాడు.

“తాగటానికి ఏం తెమ్మంటారు సర్ ?”

ఇండియా లో పెద్ద ఫాన్సీ హోటల్లలో కూడా వైటర్ లు ఆర్డర్ విషయానికి వచ్చేసరికి, ఆడ వాళ్ళు కూడా ఉన్నారు అన్న సంగతి పట్టించుకోకుండా, మగ వాళ్ళే అన్ని నిర్ణయాలూ తీసుకుంటారు అని అనుకోవటం ప్రియ కి చాలా కోపం తెప్పించింది. తను అప్పుడప్పుడూ యౌరప్ ట్రిప్ లకి వెళ్ళినప్పుడు ఈ రకమైన ప్రవర్తన చూడలేదు. “మేరా భారత్ మహాన్” లో మాత్రం ఆర్డర్ చేసే అధికారం అంతా “సర్” దే. “మేమ్” కి ఆ పవర్ లేదు.

“షాంపేన్!.. అందరికీ షాంపేన్..” గోట్లే లేచినంత పని చేసాడు.

“గ్రేట్ ఐడియా.. మనం ఈ కొత్త రిలేషన్ ని సెలెబ్రేట్ చేసుకోవాలి” అంటూనే, ఉదయ్ ప్రియ భుజం నొక్కాడు. అది గూట్లే కంట పడనే పడింది. వాడు మళ్ళీ ఒక వెకిలి నవ్వు నవ్వాడు. మెనూ చూసి ఒక ఎక్సోటిక్ గా వినిపించే షాంపేన్ ఆర్డర్ చేసాడు. ప్రియ మెనూ లో చూస్తె, అది పదకొండు వేలు వుంది! “వావ్.. ఎంత పెద్ద డీల్ ఐనా, ఎకౌంటు చెయ్యటం కష్టమే” అనుకుంది.

ప్రియ మనసు చదివినట్టు, గూట్లే, “ఇవ్వాల్టి బిల్లు జినో కార్ప్ దే” అన్నాడు.

“నో వే.. మీరు మా క్లైంట్. బిల్లు బాధ్యత మాదే” అన్నాడు ఉదయ్.

కాసేపు వాళ్ళిద్దరూ సరదాగా వాదించుకుని చివరికి గూట్లే బిల్లు చేసే లాగా ఇద్దరూ వప్పుకున్నారు. షాంపేన్ తో బాతో గూట్లే ఇంకో రెండు ఏపెటైజేర్స్ కూడా ఆర్డర్ చేసాడు.