అభినందన 237

కొడైకెనాల్ …డిసెంబర్….డాల్ఫిన్స్ నోస్ పీక్..సాయత్రం 5 గంటలు…. టూరిస్ట్స్ ఎవరూ లేకుండా ఉండడం తో అభినవ్ అక్కడి నుండి రూం కి వెళ్ళాలని బైక్ స్టార్ట్ చేసాడు…ఫోకస్ లైట్ అటు దూరంగా పడి ఎవరో మనిషి ఆకారం కనపడింది….ఆడ మనిషి లా అనిపించింది…వ్యువ్ పాయింట్ రైలింగ్ దాటి కొండ చివరన నించుంది….డిసెంబర్ అవడం తో అప్పటికే చీకటి కమ్మేసింది…..ఆమె ప్రవర్తన అతనికి ఏదో అనుమానం గా అనిపించింది…అసలే అది సూసైడ్ పాయింట్ అని ఫేమస్.

బైక్ ఆఫ్ చేసి అటువైపు పరిగెత్తాడు…. టప్పున రైలింగ్ దూకి ఆ కొండ అంచు కి వెళ్ళాడు….చిన్నగా జల్లు కూడా మొదలైంది…40-45 మధ్య ఉంటాయి ఆమెకి , ఒక్క ఉదుటున అభినవ్ ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగాడు….కళ్ళలో కన్నీటి ధార తో ఒక మిడిల్ ఎజెడ్ మహిళ విసుగ్గా చూసింది…”లీవ్ మీ …” అని అరిచింది….”యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు బి హియర్..ప్లీజ్ గెట్ బాక్ ఫ్రమ్ దేర్..”…చెయ్యి విడిపించుకుంటుంది,కానీ అభినవ్ వదల్లేదు…”ఛా ఏమీ ఖర్మ రా బాబు…చావనివ్వరు కూడా నా” అని గొణుక్కుంది…”చావు అన్నిటికీ సొల్యూషన్ కాదండీ…నా మాట విని ప్లీజ్ వచ్చేయండి.. “… ” అయినా నువ్వెవరు …నువ్వు చెప్పింది నేను వినాలా….నీ పని నువ్వు చూస్కో…నేను వదులు…నన్ను ఆపే హక్కు నీకు లేదు…” ……” ఒక మనిషిగా సాటి మనిషి ని కాపాడటం ఆ దేవుడిచ్చిన హక్కు…ఒక్క సారి నా మాట వినండి ప్లీజ్…ఇంకాసేపు ఇక్కడే ఉంటే సెక్యూరిటీ అధికారి వస్తారు…..పెద్ద న్యూసెన్స్ అవుతుంది..”….”ఏహే…..జీవితమే సంకనాకిపోయింది అంటే మధ్యలో నీ గొడవేంటి….” ….ఇహ అభినవ్ కి ఓపిక నశించి పోయింది, మాటలతో పని అవలేదు ఇంక చేతికి పని చెప్పాడు, ఆమె చెంపని చెళ్లు మనిపించాడు…బుగ్గ ఎర్రగా వాచిపోయింది, నోట మాట ఆగిపోయింది,చుట్టూ పెరుగుతున్న చలికి ఒళ్ళు లో ఒణుకు మొదలైంది…జల్లు వాన జోరెక్కింది…ఆమె మెల్లగా స్పృహ కోల్పోయేలా ఉంది….ఆమె చేయి పట్టుకుని లాక్కొని అక్కడినుండి తీసుకెళ్ళాడు…వెళ్లి బైక్ మీద కూచుపెట్టి ఆ చీకటి లో నే డ్రైవ్ చేసుకుంటూ టౌన్ వైపు వెళ్ళాడు….నేరుగా రెండు గదుల తన చిన్న ఇంటికి తీసుకెళ్ళాడు….దారిలో ఆమె భుజం మీద తల పెట్టు నిద్రపోయింది…ఆమెతో పాటు ఆమె హ్యాండ్ బాగ్ ఒకటే ఉంది…ఆమెను పట్టుకుని తన రూం కి తీసుకెళ్ళాడు….

ఆమెని బెడ్ మీద పడుకో బెట్టి రూం హీటర్ ఆన్ చేసాడు….కొన్ని చెక్కలు వేసి రూం ఫర్నేస్ లో మంట పెట్టాడు…కాసేపటికి రూం వేడెక్కింది…ఆమె మీద బ్లాంకెట్ కప్పి డోర్ వేసి వచ్చాడు….సోఫా లో ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూసాడు…ఆమె కార్డ్స్ మీదున్న పేరు నందనప్రియ నేరెల్ళ. చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫ్ నందన టీ ఎస్టేట్…. ఒహ్ ఇంత మంచి పొజిషన్లో ఉండి ఎందుకు ఈ డెసిషన్ తీసుకుంది అని అవాక్కయ్యాడు అభినవ్….

గంట తరువాత నందన కి మెళుకువ వచ్చింది…తలపోటు భరించలేనంత ఉంది…మెల్లగా కళ్లు తెరిచి చూసింది….చూస్తే ఏదో కొత్త ప్రదేశం లా ఉంది…ఎవరిదీ ఇల్లు ,అసలు నేను ఎక్కడ ఉన్నాను అని పిచ్చి పిచ్చి గా ఉంది మైండ్….ఆమె అనుమానాలకు బ్రేక్ ఇస్తూ తలుపు ఓపెన్ చేశాడు అభినవ్….”ఒహ్ లేచారా..ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నౌ? ” …….”నేనెక్కడ ఉన్నాను …నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు…నేను వెళ్ళాలి ..”….”హెల్లో హెల్లో…ఇది నా ఇల్లే…ఇక్కడ మీరు సేఫ్ … డోంట్ వర్రీ…ఈ టైం లో మీరు బయటకి వెళ్ళడం అంత మంచిది కాదు…నిమోనియా చేస్తుంది…ప్లీజ్ ఈ నైట్ కి ఇక్కడే ఉండండి…అక్కడ వాష్ రూం హాట్ వాటర్ ఉన్నాయి వెళ్లి ఫ్రెష్ అవ్వండి….”

గత్యంతరం లేక నందన వాష్రుం కెళ్ళి వెక్కి ఏడ్చి అలసిన ముఖాన్ని వేడి నీళ్ళతో వాష్ చేసుకుంటే కొంచెం హాయి గా ఉంది …చలి ప్రభావం కొంచెం తగ్గినట్టు అనిపించింది…అక్కడే ఉన్న ఫ్రెష్ టవల్ తో తుడుచుకుని బయటకొచ్చింది…..రాగానే అక్కడే టేబుల్ మీద పొగలు కక్కుతున్న టీ కప్పు అక్కడ ఉంచి ….” కొంచెం వేడి టీ తాగండి….యూ విల్ ఫీల్ బెటర్…” వచ్చి మంచం మీద కూచుని కప్ అందుకుంది…2-3సిప్పులు తాగక ఒంటికి చాలా హాయిగా అనిపించింది….”థాంక్యూ…” మొదటిసారిగా అభినవ్ కి పాజిటివ్ గా చెప్పింది.

“ఐ యాం అభినవ్…ఇక్కడ టూరిస్ట్ గైడ్ గా పని చేస్తుంటాను…”
“ఒహ్..ఒకే… ఐ యాం నందన…”
“చూసాను మీ పేరు….అదే మీ ఐడి కార్డ్ లో”
“ఒకే…నేను ఇక్కడ టీ ఎస్టేట్ లో….చీఫ్ ఎక్జిక్యూటివ్…”
” అదే నా డౌట్ అంత పెద్ద ఎస్టేట్ ఓనర్ అయ్యుండి మీకేమి…”
” అంటే డబ్బుంటే అన్ని ఉన్నట్టే నా….”
” అంటే నా ఉద్దశ్యంలో డబ్బే అన్ని సమస్యలకూ కారణం…కాబట్టి ఆ డబ్బు ఉండీ కూడా ప్రాబ్లమ్స్ ఆ అని నా డౌట్..”
“డబ్బు ఉంటే నే అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం….అందరూ దానికోసమే గోతి కాడి నక్కల్లా వేచి చూస్తుంటారు…”
“ఒకే …కాం డౌన్…ప్లీజ్ రిలాక్స్…అన్నిటికీ సోలుషన్ ఉంటాయి…కొంచెం ప్రశాంతంగా ఉండండి….మీకు ఆల్రైట్ అన్నపుడే మీ సమస్య చెప్పండి…ఐ వొంట్ ఫోర్స్ అన్ యు….ముందు డిన్నెర్ చేయండి …రేపు పొద్దున మాట్లాడుకుందాం…ప్లీజ్…”
“ఇట్స్ ఓకే….నాకు ఆకలి గా లేదు…నేను వెళ్తాను ఇక…” అని ఏదో మూడ్ ఆఫ్ లో గబ గబ లేచి అభినవ్ ని తోసుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళబోయింది…
” అయ్యో రామా నేను ఇపుడు ఏమన్నాను అండి….ఈ టైం లో వెళ్ళడం అంత మంచిది కాదు ….చాలా వర్షం వస్తుంది …పైగా చలెక్కువ….ప్లీజ్ నా మాట వినండి…” అని ప్రాధేయపడినా వినకుండా …ధడేల్ మని తలుపు ఓపెన్ చేసి రెండు అడుగులు వేసింది…..

4 Comments

  1. సుహాసిని23

    Story Bagundhi

  2. సుహాసిని23

    Story Bagundhi excited

  3. Hi Suhasini..how are you.. do u have any stories in pdf format?

Comments are closed.