అభినందన 237

జోరున వర్షం…ఇందాకే మొదలైనట్లు ఉంది…. నివార్ తుఫాన్ కమ్మేసింది తమిళనాడు ని అందుకే ఆ విపత్కరమైన వెదర్….ఒక్కసారిగా నందన పూర్తిగా తడిచిపోయింది…ఆ జోరు వర్షం లో కనీసం పది అడుగుల దూరం కూడా సరిగ్గా కనపట్టం లేదు….ఒక్కసారిగా గా భయం తో వణికి పోయింది నందన…..
“అభినవ్వివ్వ్వ్….” అని గట్టిగా అరిచింది…
అరుపు విని అభి చేతిలో గొడుగు పట్టుకుని పరిగెత్తాడు ….ఆమె మీద గొడుగు పెట్టి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి….వడి వడిగా అక్కడి నుండి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళాడు..
“ఇట్స్ ఓకే ఇట్స్ ఒకే … రిలాక్స్…రండి లోపలికి….”
లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ టవల్ చుట్టి కుచ్చోపెట్టడు….
” ఎందుకండీ అలా చేశారు ..చూడండి మళ్ళీ తడిచిపోయారు…”
తను చేసిన మూర్ఖపు పని కి వెక్కి వెక్కి ఏడ్చింది నందన..
” ఐ యాం సో సారీ…నా మైండ్ పని చేయట్లేదు….నా వల్ల మీకు ఇబ్బంది కలిగింది”
“అయ్యో ఇట్స్ ఓకే నందన గారు….ప్లీజ్ మీరు రిలాక్స్ అవ్వండి….చూడండి మళ్ళీ ఎలా తడిచిపోయారో…”
“అభినవ్ గారు …చాలా చలిగా ఉంది….ప్లీజ్ … హెల్ప్ మీ….ప్లీజ్….హ్మ్మ్ హ్మ్మ్…”అని జ్వరం వచ్చినట్టు మూలిగింది…
“ఓహ్ మై గాడ్….”అని అభినవ్ కంగారు గా ఆ రూం హీటర్ తెచ్చి ఆమె పక్కనే పెట్టాడు…మాక్సిమం హీట్ సెట్టింగ్ పెట్టి..ఆమె పక్కనే కుచ్చూని దాని వేడి చేతికి పట్టి ఆమె ఫేస్ కి పెట్టాడు….ఆమె అరచేతుల్ని తన చేతుల్తో రుద్దుతూ ఆమె ఒంటికి వేడి రాజేసాడు…..టవల్ పక్కన పడేసి ఒక లావు రగ్గు తెచ్చి కప్పాడు….ఇంకా వణుకుతూనే ఉంది నందన…బయట ఉరుములు ఢమ ఢమ అని శబ్ధం చేశాయి…ఉలిక్కిపడింది నందన….”నాకు భయంగా ఉంది….ప్లీజ్ హెల్ప్ మీ….”అని మళ్ళీ ఏడుస్తుంది….

అభినవ్…గట్టిగా ఆమెని పట్టుకున్నాడు…”డోంట్ వర్రీ…నేనున్నాను… నందనగారు…భయపడకండి….మీకు ఏమి కాదు….నేనున్నాను” అని ధైర్యం చెప్పాడు…
“ప్లీజ్ ఇక్కడే వుండు…నన్ను వదలకు …ప్లీస్….నాకు చాలా భయంగా ఉంది …” అంటూ నందన అభినవ్ చేతుల్తో గట్టిగా పట్టుకుని …..తన మొహాన్ని వాటి పై పెట్టుకుని ప్రాధేయపడింది….

అభినవ్ ఆమె చుట్టూ చెయ్యి వేసి ఎప్పటికప్పుడు వెచ్చదనం అందించాడు…ఇంకా ఇంకా ఒద్దిగ్గా ఉండిపోయింది నందన….ఇంతసేపు తన దగ్గర ఉంటేనే చీదరించుకున్న ఆమె ఇప్పుడు తనని వదిలి వెళ్ళద్దు అని అనడం విడ్డూరంగా ఉంది అభి కి….ఆమె శ్వాశ లో వేడి గాలి అతని చేతులకి తాకుతుంది….హై ఫీవర్ వచ్చేలా ఉంది…కనీసం హాస్పిటల్ కి వెళ్ళాలి అంటే బయట కుండపోత వర్షం….ఆమెను అక్కడే ఉంచి తన కిట్ లో నుండి థర్మా మీటర్ తెచ్చి చూసాడు…103F చూపింది….. ఓహ్ గాడ్ అనుకున్నాడు….తనకి తెలిసిన ఒక డాక్టర్ కి ఫోన్ చేసాడు…అవతల వ్యక్తి “ఇంట్లో పారాసెటమాల్ ఉంటే వెయ్యి…. రూమ్ టెంపరేచర్ తగ్గకుండా చూసుకో….హాట్ సూప్ గానీ… టీ గానీ సర్వ్ చేస్తుండు….నార్మల్ ఫీవర్ అయితే మార్నింగ్ కల్ల సెట్ అవుతుంది…టేక్ కేర్” అని పెట్టేశాడు…

వెంటనే అభినవ్ నందన ని పడుకోబెట్టాడు బెడ్ మీద…హిటర్ ని ఇంకొంచెం దగ్గర ఉంచి కిచెన్ లో కి పరుగెత్తాడు… స్టౌవ్ మీద వేడి నీళ్లు కాచి …పక్కనే సూప్ కూడా తయారుచేశాడు…బెడ్ దగ్గరికి వచ్చి వణుకుతున్న నందన చూసి ఒక బట్టతో వేడి నీళ్ళతో తాపడం పెట్టాడు…కాసేపు అలా పెడుతూనే ఉన్నాడు…..నెమ్మదిగా కొంచెం వేడి తగ్గుతుంది….అలానే ఒక పది నిమిషాలు ఉంచి …మళ్ళీ ఆమె ను పట్టి కూర్చోపెట్టాడు….బౌల్ లో తెచ్చిన వేడి వేడి సూప్ ని స్పూన్ తో కొంచెం నోటికి అందించాడు….నోటికి రుచించి మెల్లగా తాగింది నందన…అభి చూపుతున్న కేర్ కి ప్రేమ కి నందన కరిగిపోతుంది…కానీ పూర్తి స్పృహ లో లేదు

కానీ అభి చేస్తున్న సేవ తెలుస్తుంది ఆమెకి….అందుకే స్పృహ లేకున్నా అభి భుజం మీద తల వాల్చి అతని భుజం దగ్గరే అతని చెయ్యి గట్టిగా పట్టుకుని అతుక్కుపోయింది…చాలా ఎమోషనల్ అయిపోయింది…పగ పట్టినట్లు వర్షం ఇంకా ఉద్రేకంగా మారింది….దానికి తోడు హోరు గాలి…చాలా సేపటి నుండి వాడేసరికి హీటర్ ఓవర్ హీట్ అయి ఆగిపోయింది…అంత చలికి తట్టుకోలేక పొయ్యి కర్రలు కూడా చల్లబడ్డాయి….ఒక్కసారిగా చలి మరింత పెరిగింది….

4 Comments

  1. సుహాసిని23

    Story Bagundhi

  2. సుహాసిని23

    Story Bagundhi excited

  3. Hi Suhasini..how are you.. do u have any stories in pdf format?

Comments are closed.