మణి మంజరి మహల్ 115

చిత్తూరు జిల్లా….చంద్రగిరి కి దగ్గర లో నెమళ్ళ పాలెం అనే ఊరు…చెరుకు తోటలు…మొక్కజొన్న పొలాలు కొబ్బరిచెట్లు తో కళ కళ లాడే ఊరు…మనసు దోచే ప్రకృతి అందాలు… గళ గళ పారే సెలయేళ్ళు అక్కడి ప్రత్యేకత….సీదా సాదా మనుషులు…వ్యవసాయమే జీవన వృత్తి అక్కడి వారికి…

అలాంటి ఊరిలో కొంచెం డబ్బులున్న జమీందారులు వేంకటపతి రాయుడు… చెన్నకేశవులు..ఇద్దరు బంధువులు…మంచి మనుషులు …పైగా పేదవారికి ఎపుడు అండదండగా ఉండే వ్యక్తిత్వాలు..వారి పిల్లలు శ్రీనివాస్ రజితలు….బావ మరదళ్లు…రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోయే వాళ్ళు…ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ….పైగా రజిత అందానికి శ్రీను పిచ్చివాడు అయ్యాడు…ఇద్దరు పట్నం లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారు…దసరా పండక్కి ముందుగానే వచ్చారు సొంతూరు కి…

వెం: ఏమ్మా రజిత …ప్రయాణం బాగా సాగిందా…
ర: హా మామయ్య ….అంతా సాఫీగానే జరిగింది…
వెం : ఈ సారి అయినా మా వెధవ ని పెళ్లి చేసుకుంటావా..
ర: పొండి మామయ్య…నేను ఎపుడు కాదన్నాను…అయిన ఈ ఏడు ఎలాగూ చేసేస్తామన్నారు గా మీరే….శ్రీను కే చెప్పండి…
చె : బావ ని నువ్వే ఒప్పించి చేసుకో తల్లి…
శ్రీ : ఎంటీ రజిత….మా నాన్న కి మీ నాన్నకి ఇద్దరికీ కలిపి మార్కులు కొట్టేస్తున్నావా…
ర : హమ్మ్. ..చూడండి మామయ్య్య శ్రీను నన్ను ఏడిపిస్తూ ఉంటాడు ఎపుడు…
వెం : ఈ ఏడు వాడితో నీ మెళ్ళో ఆ మూడు ముళ్లు వేయిస్తాను…ఆ పైన జీవితాంతం నువ్వే వాడిని ఏడిపించు…
రజిత శ్రీను ను చూసి వెవ్వెవ్వే అని వెక్కిరించింది..

చెరుకు తోట పంపు సెట్టు దగ్గర కలిశారు బావ మరదలు , ఇంటిలో బంధువుల తాకిడి ఎక్కువ ఉంటే ఏకాంతం కరువైంది ప్రేమజంట కి….
శ్రీ : ఏమే రజిత….నాన్న కి నా మీద చాడీలు చెప్పావు…
ర : ఆ నీ మీద కాక …ఇంకెవరి మీద చెప్పాలి..
శ్రీ : నిన్ను ఇలా కాదే …అని గట్టిగ వాటేసుకుని బుగ్గ కొరికాడు…
ర: అవూచ్…..ఎంటి బావ నీ మొరటు సరసం ….వదులు నన్ను…
శ్రీ : ఉహ్హున్ వదలను…
ర : ఎవరైనా చూస్తారు బావ…చీ వదులు..
శ్రీ : చూస్తే చూడని తప్పేముంది…
ర: ఆ నీకేమి ఎన్నైనా చెప్తావు….అందరూ నన్నే ఆడి పోసుకుంటారు…
శ్రీ : సరే గానీ …సాయంత్రం సినిమా కి వెళ్దాం రెడీ గా ఉండూ….తిరిగి వచ్చేపుడు…మనం మహల్ కి వెళ్దాం…
ర : ఎంది …ఆ మణి మంజరి మహల్ కా?
శ్రీ : ఆ అక్కడకే…