మణి మంజరి మహల్ 115

చా : ధన్యం మహారాజా…మీ ఆహ్వానం మాకు నచ్చింది…తప్పకుండా మీ ఆస్థానం కి విచ్చేస్తాము…కానీ మా ఆడవారు నాతో ఉంటేనే పని కాస్త త్వరగా అవుతుంది….కావున…
వి : ఓహ్ తప్పకుండా …మీ అర్థాంగి కి కూడా తగిన వసతులు కల్పిస్తాము…
చా : తనకు నాట్యము మరియు గానము లో ప్రావీణ్యం ఉంది మహారాజా….మీ ఆస్థానంలో ఎవరికైనా శిక్షణ కూడా ఇప్పించగలదు…
వి : ఒహ్ ..మిక్కిలి ఆనందముగా వుంది…తప్పకుండా మీ పత్ని కి మా రాజ్యం.లో ఉన్నత స్థానం లభిస్తుంది…
చా : ధన్యులం మహారాజా…
వి : సరే …సెలవు మరి…మళ్ళీ కలుద్దాము

చారుదత్తుడి మనసు ఆనందం లో మునిగితేలింది.. ఎన్ని రోజులు కష్ట పడిన లభించని ఫలితం రాజు గారి కొలువు లో దొరుకుతుంది అన్న మాట కి అతడు మణి మంజరి తో కలిసి మిక్కిలి సంతోషంగా మెలిగాడు…కానీ రాజు గారు అందించిన ఆపన్న హస్తం వెనుక ఉన్న కుటిల పన్నాగాన్ని గ్రహించలేక పోయాడు…. విక్రంసేనుడు ఎలాగైనా మణి మంజరి ని అనుభవించాలి అన్న తీవ్రమైన కోరిక తో ఆస్థాన పని అని పన్నాగం పన్నాడు…

మరునాడు ఉదయమే చారుదత్త మంజరీ లు మయూర మహల్ కి చేరుకున్నారు…వారిని చూసి విక్రమసేనుడు ఆహ్వానించాడు…వారికి కావలిసిన సదుపాయాలు అన్ని సమకూర్చాడు..
వి : రమా దేవీ …. వీరే నేను చెప్పిన స్వర్ణ కారులు… చారుదత్త…వారి సతీమణి మణి మంజరీ…
ర : నమస్కారం…!!! రండి దేవీ…
వి : మహా మంత్రీ వీరికి కావలిసిన స్వర్ణ భాండాగారం చూపించండి… చారుదత్త మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మహా మంత్రి గారికి చెప్పండి….రమా దేవీ….మంజరి గారిని నాట్య మందిరానికి పరిచయం చేయండి…ఆమెను తోబుట్టువులా చూస్కోండి…
చా : ధన్యులం మహారాజా…!!!

విక్రమసేనుడు కొన్ని వారాలు వారిని బాగానే చూసుకున్నాడు…కానీ రోజు రోజుకి దగ్గరగా చూస్తున్న మంజరి అందానికి మతి కోల్పోయాడు. ఒకరోజు నాట్య మందిరం లో ఆమె ముగ్ధ మనోహరమైన నాట్య కౌశలం చూసి పరితపించి పోయాడు…
ఏదోకటి చేసి ఆమెని వంచించి ఆమె అందాలను సొంతం చేసుకోవాలనే కుట్ర లో మొదటి అడుగు వేశాడు…తన రహస్య భటుల సహాయం తో కొన్ని స్వర్ణ ముద్రలు గుట్టుగా చారుదత్తు ని గదిలో నిగూఢంగా ఉంచాడు…

మరునాడు స్వర్ణ భాండాగారం లో కొన్ని ముద్రలు ఎవరో తస్కరించారని వార్త వచ్చింది… విక్రమసేనుడు మహల్ లో అన్ని గదులు వెదక మని ఉత్తర్వులు జారీ చేశాడు.భటులు మహల్ ని క్షుణ్నంగా వెదికారు…అనుకున్న విధంగా నే చారుదత్తు ని గది లో ఒక వస్త్రం లో చుట్టిన ముద్రలు దొరికాయి….భటులు అమాంతం అతన్ని పట్టుకుని సంకెళ్లు వేసి రాజు గారి సభ లో ప్రవేశ పెట్టారు…
వి : చారుదత్తా …నువ్వా ఈ పని చేసింది …మీ నుండి ఇది ఆశించలేదు….మీకు నా ఆస్థానంలో విలువైన వృత్తి ని అప్పగిస్తే నీవు చేసిన పని ఇదా…నమ్మక ద్రోహం మాకు చాలా అయిష్టం…
చా : మహారాజా…నాకు ఏ పాపం తెలియదు…ఇవి నా గది యందు ఎలా వచ్చినవో కూడా నాకు తెలియదు…దయుంచి నా వాక్కు ని నమ్మండి….తస్కరించుంట మా స్వభావం లో లేదు…
వి : మీకు తెలియకుండా మీకు గదిలోని కి నడిచి వచ్చినవా అవి….బుకాయించకు దత్తా…నీవే మా ముద్రలు కాజేసావు… తప్పు ఒప్పుకున్న చిన్న శిక్ష తో వదిలి వేయగలం…
చా : చేయని. నేరం ఎందుకు ఒప్పుకొనవలేను మహారాజా….
వి : నీవు మాటలతో వినవు … భటులారా…వీడిని చెరసాల లో బందించి వెయ్యి కొరడా దెబ్బలు వేయండి
మంజరి : మహారాజా…కొంచెం దయచూపండి…మేము ఈ నేరం చేయలేదు మమ్మలని నమ్మండి …మా నిజాయితీ రుజువు చేసుకునే అవకాశం ఇవ్వండి…
వి : హ్మ్మ్ అటులనా…అయితే నీవు మా పాద. దాసి గా మమ్ములను మెప్పించు అప్పుడు నీ పతి కి శిక్ష తగ్గించ గలం.
చా : ఒరీ దుర్మార్గుడా….నీచుడా..పవిత్రమైన వనిత… పతీవ్రత లాంటి నా సతీమణి ని అంత మాట అంటావా…నిన్ను ఖండ ఖండాలుగా నరికి మృత్యువు ని చూపిస్తా…
వి : ఎన్ని గుండెలు రా నీకు …నన్నే దూషిస్తావ….రాజ దూషణ మహాపాపం అని తెలియదా…. భటులారా…రాజ దూషణ చేసిన ఈ పాపాత్ముడు ని …విష నాగులతో కరిపించి మృత్యు దండన విదించండి…
మంజరి బాధ తో విలవిల లాడిపోయింది.

వెళ్లి మహారాజు కాళ్ళ మీద పడి బ్రతిమాలింది…
మంజరి : మహారాజా …దయచేసి క్షమించండి మాకే పాపం తెలియదు …మా మీద ఎవర్రో కుట్ర పన్నారు…మేము అలాంటి వారము కాదు…. దయచూపండి…
వి : భటులారా…ఈ పాపి ని కూడా చెరసాల లో పడేయండి….అని ఆదేశించాడు…

భటులు చారుదత్తు ని బందించి కారాగారం కి తీసుకెళ్లారు…ఆ రోజు సంధ్య వేళ నే విష సర్పాలతో కరిపించి చారుదత్తు ని మృత్యు దండన విధించారు….అది విన్న మంజరి చెరసాల లో వెక్కి వెక్కి ఏడ్చింది.. ఏ పాపం చేశామని విధి మమ్మల్ని ఇంత పగ పట్టింది దేవుడా అని మొర పెట్టుకుంది…కానీ రాజు గారి పన్నాగం ఎక్కువ రోజులు దాగ లేదు…ఆ నోట ఈ నోట పడి మంజరి దాకా చేరింది….కావాలనే రాజు చారుదత్తు ని మీద దొంగతనం నేరం మోపి తన పై మోహం తో అనుభవించాలని ఇలా చేశాడు అని తెలుసుకుని విస్తుపోయింది…ఆఖరికి తన కు ఉన్న అందమే తన శత్రువు అయ్యి జీవితాన్ని పాతాళానికి తొక్కేసింది అని గ్రహించి బాధపడింది …..అలా ఉండగా విక్రమసేనుడు కారాగారానికి వచ్చాడు….నేరుగా మణి మంజరి చెరసాల కి వచ్చి….

వి : ఎలా ఉన్నారు మంజరి….
మంజరి : చీ నీచుడా…నీ ముహము చూసిన పాపమే…నీ కామానికి నా పతిని బలి జేస్తావ… అంతకంత అనుభవిస్తావు…నా పాపం నీ రాజ్యానికి తగులుతుంది ఇది నా శాపం…
వి : ఒహ్హో నీకు తెలిస్పోయిందా…అయితే నీ దగ్గర దాయడం ఎందులకు…..ఇలాంటి శాపాలు ఎలా పట్టించుకుంటాను….మర్యాదగా నీ మనసు మార్చుకుని ….మా మగసిరిని ఆరాధించి మా రెండో రాణీ గా మీకు కానుక ఇస్తున్నాము స్వీకరించండి…

మంజరి : నా కంఠం లో ప్రాణాలు ఉండగా నా మేని మీద నీ నీడ ని కూడా తాక జాలనివ్వను రా…
వి : సరే నీ మొండి పట్టుదల తో ఎన్ని రోజులు ఈ చెరసాల లో ఉంటావో నేను చూసెద….

రోజులు గడిచాయి అంతకంతకూ మంజరి కుమిలిపోయింది.. కానీ విక్రమ సెనుడికి దయ కలుగ లేదు… ఈ పాడు బతుకు ఎందుకు ఇంక అని నిర్ణయించుకుంది మంజరి…కానీ తన మృత్యువు ఒక భయోత్పాత ఘటన లా ఉండాలి …ఇక మీద ఒక స్త్రీ ని చెరపట్టాలి అంటే తన మృత్యువు గుర్తుకు రావాలి ….మగజాతి వణుకు పుట్టించాలి అన్న సంకల్పం చెబట్టింది….భటుల ద్వారా తన కు రాజు తో సంభోగం సమ్మత మేనని కబురు పంపింది…. విక్రమసేనుడు మంజరి అనుమతి విని ఉబ్బి తబ్బిబ్బయ్యడు…..స్వర్ణ మణిమయ మైనా వస్త్రాలు …ఆభరణాలు …పంపి ఆమెను మళ్ళీ మహల్ లోని ప్రత్యేక గదిలోని కి పంపాడు…..రమా దేవికి ఈ మొత్తం ఘట్టం అస్సలు నచ్చలేదు…కానీ రాజుకు అడ్డుచెప్పే ధైర్యం లేదు….కనీసం మంజరి బ్రతికి ఉంది అని సంతోషించి తన కు సవతి గా మంజరి వచ్చినా పర్లేదు అనుకుంది….