మణి మంజరి మహల్ 115

కొన్ని రోజులు అదే బెంగ తో రమా దేవి మంచాన పడింది….రాజ్యం లో అకాల వర్షాలు ….అంతులేని వ్యాధులు ప్రబలడం జరిగాయి….అత్యంత సంపద ఉన్న రాజ్యం కాస్త నిధుల కొరత లోకి వెళ్ళింది ….విక్రముడు కూడా ఉన్న సంపద అంత ప్రజల కష్టాలు చూసి అందిస్తూ పోయాడు…పూర్తి దుర్భిక్షం లో కి వెళ్ళింది మయూర పురం….. సిద్ధాంతులను పిలిపించి పూజలు కూడా నిర్వహించాడు….అప్పుడు వారు చెప్పిన సంగతి విని నిర్ఘాంత పోయాడు….ఆ మహల్ లో ఒక ప్రేతాత్మ ఉందని దాని ప్రభావం వల్ల నే ఇలా జరుగుతుంది అని చెప్పారు….చెప్పాల్సిన అవసరం లేదు అది మణి మంజరి దే నని….

విక్రముడు ఎంత పెద్ద తప్పు జరిగింది అని తెలుసుకుని ఈ చిక్కు ప్రశ్న కి జవాబు లేదని చెప్పి తన వద్ద మిగిలిన సంపద మొత్తం ప్రజల్లో పంచేసి….తను సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు…ఆ తర్వత కొన్ని ఏళ్లకు కాలం చేశాడు…..ఆ మాహల్ కూడా ఆ తర్వాత… మణి మంజరి మహల్ గా పేరు చెంది నిర్మానుష్యంగా మారిపోయింది….కాల క్రమేణా దాని మీద వేరు వేరు కథలు ప్రచారం లోకి వచ్చాయి….

మీరు చెప్పిన దాన్ని బట్టి…ఆ ఆత్మ ఇంక అక్కడే ఉంది….పైగా మీ అమ్మాయి ఆ కత్తికి గాయం అవడం వలన ఆ ఆత్మకి శరీరం దొరికింది….
చే : స్వామి మీరే ఎలాగోలా కాపాడాలి నా కూతురి ని
జ : ముందు ఆ మహల్ కి వెళ్తే నే ఈ సమస్య. కి పరిష్కారం ఉంది…

సిద్ధాంతి అందరినీ తీసుకుని మహల్ కి వెళ్ళారు…అక్కడ మహల్ ముందే పూజ మండపాన్ని ఏర్పాటు చేసి ….అందులో రజిత ని కూర్చోపెట్టాడు….మహల్ అవరణ లో మంజరి శక్తి రెం డింతలు పెరిగింది , ఆమెని ఆపడం కష్టంగా ఉంది…సిద్ధాంతి తన శక్తులన్నీ ఒడ్డి మంజరి ఆత్మ ని తన వశం లోకి తెచ్చాడు….
జ : మంజరీ నీకేం కావాలి….ఈ అమ్మాయి అమాయకురాలు …ఆమె శరీరాన్ని విడిచి వెళ్ళి పో..
ర : నాకు విక్రమ సేనుడు కావాలి వాడు మళ్ళీ నన్ను చెరబట్టాడు….నేను వాడిని వదలను..
జ : అతను విక్రమసేనుడు కాదు …ఆమెని చేసుకోబోయే వరుడు…ఆమె ని విడిచి పెట్టు…
ర : మరి ఆ విక్రముడు ఎక్కడా…వాడిని వదించాలి….
జ : విక్రముడు ఎప్పుడో పరమపదించాడు …అదుగో అతని సమాధి …అని అక్కడ ఏర్పాటు చేసిన చిన్న కట్టడాన్ని చూపాడు….
ర : హహహ హహహ హహహ….ఆహ్హ…హాహః…చచ్చాడు నీచుడు….అహహ…
జ : ఇక వెళ్ళు….
ర. : హహహ హహహ…..వెళ్తున్న ……
అంటూ స్పృహ కోల్పోయి రజిత పడిపోయింది….
జ : ఇక మీ కుమార్తె పూర్తిగా కొలుకున్నట్టే ….
కానీ ఈ మహల్ ఏనాటికైనా ఇబ్బంది కలిగించే స్థలం…దీనికి పూర్తి ఉపాయం చేయాలి….

సిద్ధాంతి చెన్నకేశవ.లు వేంకటపతి రాయుడు లతో కలిసి ఆ మహల్ ని పడగొట్టించాడు…మళ్ళీ ప్రేతాత్మ లు ఆ ప్రాంతం లో శక్తి పుంజుకోకుండా పెద్ద ఆది పరాశక్తి గుడి కట్టించారు….అంతటి తో ఆ సమస్య సమసి పోయింది….అదే గుడి లో రజిత శ్రీను లా వివాహం అట్ట హాసంగా జరిగింది….సిద్ధాంతి కూడా వారిని ఆశీర్వదించాడు….

మరునాడు శోభనం గది లో శ్రీను ప ట్టె మంచం మీద కూచుని వెయిట్ చేస్తున్నాడు….పాల గ్లాస్ పట్టుకుని వచ్చింది బ్యూటిఫుల్ గార్జియస్ రజిత….రతీ దేవి లా ఉంది….శ్రీను ఆమెను పట్టుకుని కిస్ చేయబోయాడు….
ర : …. ఏమిరా విక్రమసేనా ఎంత ధైర్యం రా నీకు …( బిగ్గర గొంతులో…)

ఉలిక్కి పడ్డాడు శ్రీను…భయపడి చచ్చాడు…
మరు క్షణం లో నవ్వుతూ
ర : హేహేహే …భయపడ్డావ బావ….హహహ
శ్రీ : అమ్మనీ నన్నే ఆట పట్టిస్తావ….నిన్ను…
ఆంటు బావ మరదళ్ల సరసం మొదలయింది…

(సమాప్తం…)