మణి మంజరి మహల్ 115

ఉదయం అయింది…శ్రీను మహల్ బయట ఉన్న చెత్తుకి కట్టేసి ఉన్నాడు…దూరంగా రజిత అపస్మారక స్థితిలో పడి ఉంది నెల మీద…. ఇద్దరూ రాత్రి నుండి కనపడట్లేదు అని పొద్దునే ఊరి జనాలు వెదుకులాట మొదలెట్టారు….కాసేపటికి గొర్రెలు కాసుకునే వాళ్ళు …శ్రీను రజిత ను చూసి వెళ్లి గ్రామస్తులను తీసుకొచ్చారు….వెంకట పతి … చెన్నకేశవులు తమ పిల్లల్ని చూసి ఆనంద పడాలో భయపడాలో తేలిక అయోమయపడ్డారు….ముందు ఇద్దరినీ ఇంటికి తీసుకెళ్లి ఏమయి ఉండచ్చు అని అంచనా వేశారు….శ్రీను రజిత లు స్పృహ లో కి వస్తే గాని …ఏమయిందో తెలీదు….

అసలు ఆ మహల్ లో నిజంగా దెయ్యముందా….ఇంతకీ ఆ శక్తి ఎంటి….ఆ నీడ బావ మరదలు ని ఎందుకు దాడి చేసింది….ఆ గది ఎవరిది….రేపు తెలుస్తుంది….

ఇంటికి తీసుకొచ్చాక ఇద్దరు మత్తులో పడి ఉన్నారు…కానీ కాసేపటికి శ్రీను కి మెలుకువ వచ్చింది….రజిత కి మాత్రం ఒళ్ళు కాలిపోతూ ఇంకా అపస్మారక స్థితి లో ఉంది…దగ్గరలో ఉన్న డాక్టర్ ని పిలిపించి ఇంజెక్షన్ వేసి …సలైన్ ఎక్కించారు ..బహుశా భయపడి ఉంటది అని అనుమాన పడ్డారు…2-3 గంటల తర్వాత రజిత కి మెలుకువ వచ్చింది..

అందరూ చుట్టూ చేరారు…రజిత మెలుకవ రాగానే…కానీ తను మాత్రం ఏదో మాట్లాడుతుంది …కేవలం పెదాలు కదుపుతూ….కనురెప్పలు ఇంకా తెరవలేదు…కను గుడ్డు మాత్రం చాలా వేగంగా అటూ ఇటూ తిరుగుతున్నది…ఏదో ఆందోళన లో ఉన్నట్టు ఉంది….సడెన్ గా పైకి లేచి కూర్చుంది……ఆఆ ఆఆ ఆఆ ఆఆ అంటూ గట్టిగా పొలికేక పెట్టింది…ఆమె స్వరం లో ఆడతనం కన్నా గద్గద స్వరం తో భీకరంగా ఉంది….ఒక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళు ఉలిక్కి పడ్డారు ఆ శబ్దానికి….ఏమయిందమ్మ ఏమయిందమ్మా తల్లి అంటూ వాళ్ళ నాన్న పట్టుకుని అడుగుతున్నాడు…..
ర : ఆ ఆ ఆ ఆ ఆ…..ఎవర్రా మీరంతా….. హహ్…..ఆఆ విక్రమసేనుడు ఎక్కడా…వాడి దుష్ట శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికి నా పంతం అందుకోవాలి…. ఓరీ విక్రమసేన…ఎందుల దాక్కున్న వచ్చి నీ మృత్యువు చూసేద…..ఈ మణి మంజరి నుండి తప్పించుకోలేవు రా …..
అని బలంగా అక్కడున్న సామాన్లు కుర్చీలు అన్ని విసిరికొట్టింది…ఖచ్చితంగా అమ్మాయికి దెయ్యం పట్టింద ని అందరూ గుస గుస లాడారు..
ఇంట్లో వాళ్ళు అలాగే అనుకోవడం తో మందులు డాక్టర్లతో తీరే సమస్య కాదిది అని అర్థం చేసుకుని…పక్క ఊరిలో ఉన్న శ్రీపురం ఆశ్రమానికి రజిత ను అతి కష్టం మీద పట్టుకుని తీసుకెళ్లారు…అక్కడ ఉన్న జయేంద్ర సిద్ధాంతి మంచి పేరు ఉన్న దైవజ్ఞులు…రజిత రాక తో నే ఆయనకి అపాయ ఘంటికలు మోగాయి…ఆయన కున్న శక్తులతో ఆమె లో ఉన్న సమస్య ని పసిగట్టాడు…

చె : స్వామి…మా అమ్మాయి రజిత…
జయేంద్ర : హ్మ్మ్ ….నీ అమ్మాయి ని ఒక ప్రేతాత్మ పట్టి పీడిస్తుంది…
చె : ఒహ్ స్వామీ ….మీకెలా ముందే తెలుస్తుంది…
జ : మీ పుత్రిక అడుగు పెట్టగానే ఆశ్రమం అంత ప్రతికూల శక్తి (నెగటివ్ ఎనర్జీ) చుట్టింది అప్పుడే అనుకున్నాము మీ పుత్రిక లో ఏదో ప్రేతాత్మ చేరిందని…అది తన ఆఖరి కోరిక తీర్చుకోవాలని తపిస్తుంది…
చె : అయ్యో నా కూతురి ని మీరే ఎలాగైనా కాపాడాలి స్వామి…అసలు ఆ ఆత్మ కి ఏమి కావాలి ….నా కూతురి నోట ఏవేవో పేర్లు వినిపించాయి…. మణి మంజరి అని… విక్రమసేనుడు అని …ఏదో పేర్లు చెబుతుంది…
జ : అది మీ గ్రామంలో ఉన్న ఆ మహల్ కి సంబంధించినవి….ముందు మీకు ఆ మహల్ చరిత్ర తెలియాలి …నేను మా పూర్వీకుల నుండి విన్న కథనం ప్రకారం…

1700 వ సంవత్సరం…అప్పటి విజయనగర సామ్రాజ్యం అస్తమించిన తర్వాత… విక్రమసేనుడు మయూరపురం (ఇప్పటి నెమళ్ళ పాలెం) ని పరిపాలించాడు…పూర్వీకుల నుండి వచ్చిన మితిమీరిన సంపదతో అష్టైశ్వర్యాలు అనుభవించాడు….అతని భార్య రమాదేవి…వాళ్ళిద్దరికీ ఒక పుత్రుడు ….రాజ్యం కూడా మంచి సిరి సంపదలతో అలరారుతూ ఉండేది…అలా గడుస్తున్న సమయం లో ఆ ఊరికి కొత్తగా ఒక స్వర్ణ కారుడు వచ్చాడు …అతని పేరు చారుదత్తుడు….అతని భార్య మణి మంజరి..అపురూప సౌందర్యవతి…ఆమె లావణ్యాన్ని చూసి ముగ్ధుడు అవని మగవాడు ఉండడు….అందుకే చారుదత్తుడు కూడా తన దగ్గర ఉన్న స్వర్ణం బోలెడు ఎదురిచ్చి ఆమెను అర్థాంగి గా చేసుకున్నాడు

అలా ఆ రాజ్యం లో చారుదత్తుడు కొత్త గా వ్యాపారం మొదలుపెట్టాడు….చిన్నపాటి స్వర్ణశాల తెరిచి ఆ రాజ్యం లో వాళ్ళకి ఆభరణాలు విక్రయించే వాడు … విక్రమసేనుడు ఒక మారు రజ్యనగర వీధుల్లో సంచారం చేస్తుండగా…చారుదత్తుని స్వర్ణశాల దగ్గర కి వచ్చాడు….అప్పుడే మణి మంజరి అక్కడ కనపడింది…. విక్రమసేనుడు ఆమె సొగసును చూసి చలించిపోయాడు….ఆమె అపురూప లావణ్యం అతని లో అలజడి రేపింది…ఎందరో మంది కన్యా మణుల ను చూసాడు కానీ ఇలాంటి గంధర్వ వనిత ను ఎప్పుడు చూడలేదు…అతని మనసు ఆగలేదు…వెంటనే అంబారీ నుండి కిందికి దిగాడు…రాజ భటుల బృందం చారుదత్తుని స్వర్ణ శాల ముందు ఆగింది…అది చూసి చారుదత్తుడు ఆశ్చర్యపడ్డాడు…స్వయానా మహారాజు దిగి వస్తున్నాడు అని ఆనందపడ్డాడు…
వి : మీరు… ఈ రాజ్యంలో కొత్త గా నివాసితులు అయ్యారా…తమరి నామధేయం…
చా : శుభోదయం మహారాజా…మేము స్వర్ణకారులం.. ఈ మధ్యే వ్యాపార నిమిత్తం మయూర పురం వచ్చాము…నా పేరు చారుదత్తు….ఈమె మా అర్థాంగి మణి మంజరి…
మణి : ప్రణామాలు మహారాజా…
వి : మంచిది….మీ అభరణాలు బహు అందంగా ముచ్చటగా ఉన్నాయి…మహారాణి వారు వీటిని బాగా ఇష్టపడుదురు…మీరు మా ఆస్థానం లో కి విచ్చేసి మాకు కొన్ని ఆభరణాలు చేయగలరా …మీకు కావలసిన వసతులన్ని అక్కడే మా మంత్రి కి చెప్పి పొందుపరుస్తాము…తగిన మూల్యం కూడా మీకు దక్కేలా చూసుకుంటాము…