ఒక మనిషి గమ్యాన్ని నిర్దెషించెది ఏది ? 120

ముందు మాట
ఒక మనిషి గమ్యాన్ని నిర్దెషించెది ఏది ?
తన మనుగడను ప్రశ్నించేది ఏది?
సృష్టి లొ గొప్పధి ఎధి..?
ఎవరిని అడిగినా ఎవరు సరిగ్గా సమధానం చెప్పలెధు….
ఒకరు విధి అన్నారు… ఇంకొకరు తలరాతా అన్నారు.. మరొకరు పూర్వ జన్మ ఫలం అన్నారు. చాలా మంధి ధేవుడు అన్నారు.. కాని ఎవరు సరీగ్గా నన్ను త్రుప్థి పరిచే సమాధానం చెప్పలెక పొయారు
ఎప్పుడొ ఎవరొ చెప్పగా విన్నాను. ప్రతి మనిషి లో కూడా ఎదొ ఒక శక్తి ఉంటుంధి అని.. కాని అది మన లొ ఉండే బలహీనతల వలన బయటి కి రాలేదు అని.. ఎమో నిజమే కావొచ్చు.
ఏధి ఎమైనా ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానము మాత్రం ఒక అంతు చిక్కని ప్రశ్న గా మిగిలి పొయింధి.
ఒక పెద్దమనిషి.. నా శ్రేయోభిలాషి.. ఒక మాట చేప్పారు.. ప్రతి మానవ సంబంధం అర్ధికపరమైన సంబంధం అని. అర్ధికం అంటే అది కెవలం డబ్బై కానక్కర లేదు.. ఏదైనా ఆశించినా కుడా అది అర్ధికమే..అది ఎంత వరకు నిజమో మరి.. ఈ కదకి మూలం కూడా అదే .
వీడెంటి నిజమో కాదో అని.. ఈ కధ కి మూలం అంటున్నాడు అనుకుంటున్నారా. ముందుముందు మీకె తెలుస్థుంది.
మన లేదా మన చుట్టు ప్రక్కల మనం చూసే చాల మనుష్యులు చాలావరకు మీకు ఈ కధలొ కనిపిస్తారు. ఏమో మీకు మీరె అనిపించవచ్చు.. అవన్ని మీకు సంధర్బానుసారం ఎధురు రావచ్చు. ప్రతి ఒక్కరికి ఎన్నొ ఆశలు.. ఎన్నెన్నొ కొరికలు..కాని అవ్వన్ని నెరవేరుతాయి అన్నధి గ్యారంటి లేని మిలియన్ డాలర్ల ప్రశ్న…
కాని ఎంత మంది వాళ్ల అశలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మంది గమ్యం చేరుకునే
ప్రయత్నం లొ చతికిల పడుతున్నారు. ఇంకెంతమంది దిశను మార్చుకున్న దిక్సుచిలా వల్ల ప్రయాణాన్ని సాగిస్థున్నారు.
అపుడెపుడొ అత్రెయ మహా కవి చెప్పాడు .. సుడీ లొ మునిగి ఎదురీదక మునక మేలనుకోవొయ్.
కాని ఈ కధ లో ఎన్నొ ఆటు పొట్లకి ఎధుర్కొని ధైర్యంగా పరిస్తుతులకి ఎధురొడ్ది, ఎదురీది, పొరాడీ గెలిచిన క్రిష్ణ ప్రసాద్,
పరిస్థితుల ప్రభావం వలన, తన చుట్టూ ఉండే మనుష్యుల ప్రభావం వలన,,పరిస్తుతులకి ఎదురీద లేక తనకి అంటూ ఎమి లేకుండా నలుగురి తొ నారాయణా అని తన జీవితాన్ని ఎలాగొ ఒక లా సాగిద్ధాం అని అనుకునే కుమార్,
చంచలమైన మనస్తత్వం కలిగి,కొరికలకి ఎదురీద లేక..మంచిదో కాదో తెలియని ఒక అమాయకంగా కనిపించే వేధిక,
మనం మాత్రమే కాధు మనతొ పాటు అంతా బాగుండాలి అని కొరుకునే ఏడుకొండలు.,వేణు,,
మోసపొయి ఎలాఅయిన తన జీవితం లొ గమ్యం అనే ఒక ఒడ్డు కి ఎదురీదుతూ ఒంటరి పొరాటం చేసే ఉమ.
స్వార్దానికి, ఆసుయాకి మారు పేరు అయిన కవిత..
ఇలా మన చుట్టూ,, మీ చుట్టూ… ఉండే మనుష్యులు మీకు కనిపిస్తారు.
ఒకవేళ వీళ్ళంతా ఒకె చోట కలిసి ఉంటే.
మనుష్యులలొ.. మనసులలొ… ఉండే కొపాలు.. ప్రేమలు..స్వార్ధాలు….ద్వేషం… కోరికలు.. ఇలా అవన్ని ఒకచొట ఉంటే ఎలా ఉంటుంది..
అలాంటి.. మనస్థస్థ్వాల కలియికె..నా ఈ ఎదురీత..
ధన్యవాధములు.