ఒక మనిషి గమ్యాన్ని నిర్దెషించెది ఏది ? 120

కుమార్ వెల్లిన వైపు చూసి నవ్వుకుంటూ తన వర్క్ లొ మునిగిపోయింది.
సాయంత్రం డ్యూటీ అవ్వగానే కుమార్ కొసం ఎధురు చుస్తూ ఉంది.
సుజన ని చూడగానే తప్పించు కొవాలని ట్రై చెయసాగాడు.
“ అయ్యో మహానుభావా మిమ్మల్ని నేను ఎమి తినను గాని.. ఇంటికి వెళ్ళడానికి తోడు కొసం చుస్తున్నా. వస్తే కలిసి వెల్ధాం అని చుస్థున్నా”. అని తన దగ్గరికి వచింది.
“ అదేమి లేధండీ ఎవరో పిలిచినట్టు అనిపిస్తేనూ.” అని “వెల్ధాం రండి అని బయలుదేరాడు.
“ ఈ రొజు ఈ రూట్ లొ వద్దు. న్యూ బ్రిడ్జి మీధ నుండి వెల్ధాం అక్కడి వాతావరణం బాగుంటుంది. మీతొ కలిసి వెళ్ళాలని ఉంది. ప్లీజ్ నాకోసం .నో అని చెప్పకుండా రండి.” అని బ్రతిమాలసాగింది.
ఇక తప్పదు అని ‘ సరే అయితే కాని. త్వరగా వెళ్ళాలి. మళ్లీ నాకు ప్రెస్ కి లేట్ అవుతుంది.” అన్నాడు
“ఒహ్హ్ తప్పకుండా” అని ఇద్దరూ నడవ సాగారు.
పది నిముషాలు నడిచే సరికి బ్రిడ్జ్ ఎదురైంధి. రాత్రి 10 కావస్థుంధి. నిండు గర్బిని లా అకాశం లొ చందమామ బారంగా కదులుతుంది. పల్లె పడుచుల నడకంత వయ్యరంగా నాగవళి నది ఒంపులు తిరిగి పారుతుంది. నవంబర్ నెల లొ చలిగాలులు పసిపాపల నవ్వుల్లా గిలిగింతలు పెట్టసాగాయి. అప్పుడే మంచుకురవటం మొదలైంధి. వేగంగా నడవసాగాడు కుమార్.
“ మీరు అలా నడుచుకుంటూ ఒక్కలె వెళ్ళే దానికి నాతొ తోడు రావడం ఎంధుకు.. నాకు కంపెనీ ఇవ్వరా.. ఒక్కదానినే నడవడానికి భయం స్వామి.” అని కొపంగా అరిచింది సుజన.
అప్పుడు గమనించాడు అవును తనని వదిలేసి చాలా దూరం వచ్చేసాడు కుమార్.
రోడ్ మీధ ఎవరు లేరు.. అంతా నిర్మానుష్యంగా ఉంది… అలా వచ్చేసినందుకు తనలో తాను తిట్టుకున్నాడు.
“ త్వరగా రండి.. లేట్ అవుతుంది” . అని ఆగి తన కొసం వైయిట్ చెయ్యసాగాడు.
అప్పటి కే తను బ్రిడ్జ్ మద్యలొ ఉన్నాడు. నెమ్మదిగా తనని చెరుకుంది సుజన.
“ నాకు కొంచెం అలసటగా ఉంది. కొంచెం సెపు కూర్చుంధామా ఇక్కడ.. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. ప్లీజ్.” అని కుమార్ సమాధానం కొసం చూడకుండా బెంచ్ పై కుర్చిండి పొయింది. చేసేది ఎమి లెక తను కుడా అలానే కూర్చిండి పొయాడు.
“ అయినా నిక్షెపంగా ఆటో లొ వెళ్ళి పొక మీకు ఎంధుకు ఈ శ్రమ”.. అని చిరాకు పడ్డాడు.
“ ఆ సంగతి అలా ఉంచండి.. మీకు ఇప్పుడు ఈ టైమ్ లొ ఎమనిపిస్తుంది” అని చిరునవ్వుతొ తన చెతిని ఆమె చేతిలో తీసుకుంటూ అడిగింధి.
“ప్రెస్ కి లేట్ అవుతుంది.. అక్కడ సూపర్ వైజర్ తిడతాడు అని అనిపిస్తుంది.” అని మ్రుదువుగా తన చెతిని విడిపించుకొవడానికి ట్రై చెస్థూ.
అతని చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని దగ్గరా లాక్కుంది.
తన ముఖాన్ని దగ్గరగా తీసుకుని కళ్ళలొ కి సూటి గా చూడసాగింది. ఆ చూపులకి ఇబ్బంది పడ్డాడు.
తనని పరిశిలనగా చూసాడు.
నది గాలికి ఆమె ముంగురులు ఎగరి పడసాగయి. వెన్నెల కాంతి ఆమె కళ్ళలో వింతగా కనిపించసాగింది. సహజంగా అందంగా ఉండే ఆమె సొగసు ఆ కాంతి లొ ఇంకా అంధంగా కనిపించింధి.
ఆమె తన గుండెలపై తల వాల్చుకుని కావలించుకుని. నిశభ్ధంగా ఉండిపోయింది.
ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ కలగసాగింది. ఆమె లో, తన లో కలుగుతున్న మార్పులు తనకే కొత్తగా అనిపించసాగయి. తన శరిరం వేడెక్కడం తెలుస్తుంది. అంత చలిలో కూడా అరచేతులు చెమటలు పట్టసాగాయి.
ఒక్కసారిగా తన ముఖంపై వెలుతురు పడగానె ఒక్కసారిగా ఉల్లిక్కిపడ్డాడు. ఒక లారీ వెగంగా వెల్లిపొయింది.
తనని ఒక్కసారిగా విదుల్చుకుని.. దూరంగా లేచి నిలబడ్దాడు.
“ఐ యఁ సొరీ… టైమ్ అవుతుంది. ఇక వెళ్దామా.” అని అడిగాడు.
సొరీ .. అని లేచి నడవసాగింది. పది నిముషాల్లో వాళ్ళ ఇంటికి దగ్గరకి చేరుకున్నారు.
“ఉంటాను గుడ్ నైట్ రేపు కలుద్ధాం”..అని వెనక్కు తిరిగాడు.
“ కుమార్ ఒక్క నిముషం .. నీతొ మట్లాడాలి.”
“ ఇప్పటికె లేట్ అయ్యింధి.. రేపు మట్లాడదాం”
“ ఒక్క నిముషం “ అని గట్టిగా కౌగిలించుకొని ఇంట్లొ కి పరిగేత్తింధి.
కుమార్ కి బుర్ర పనిచెయటం మానేసింది.
అక్కడికి దగ్గరలొ ఉన్న రూం కి బయలుదేరాడు. అంతలొ ప్రెస్ కి వెళ్లాలి అని గుర్తుకు వచ్చి అటువైపు వెళ్ళాడు.. ఈ అమ్మాయి తొ జాగ్రత్తగా ఉండాలి అని గట్టిగా అనుకున్నాడు.
డ్యూటి ముగించుకుని రూం చేరే సరికి టైం 1.30 దాటింది..
రూం లొ తన జూనియర్ వర్మ ముసుగుతన్ని పడుకున్నాడు..
తనకి కూడా అలసట గా అనిపించి పడుకున్నాడు.