ఒక మనిషి గమ్యాన్ని నిర్దెషించెది ఏది ? 120

సాయంకాలం సూర్య అస్థమయం ఎంత బాగుంటుంది..అనుకుంటూ అలా అలలు ఎగసి పడుతుంటే వాటినె చూస్తూ ఉండి పొయాడు కుమార్.
జనాలు అంతా ఎవరి ఆనందం లొ వాళ్ళు ఉన్నారు. కొత్త జంటలు కాబొలు… చాలా సరదాగా ఒకరి కౌగిలి లొ ఒకరు వాలి పొయి ఈ ప్రపంచాన్ని సైతం మర్చిపొయి వారి వారి సరదాల్లొ మునిగి తెలుతూ ఉన్నారు. కాలేజి పిల్లలు జంటలు జంటలు గా ఎవరితొ మాకు సంబంధం లెధు అన్నట్లూగా కబుర్లు చెప్పుకుంటున్నారు.
పిల్లలు ఇసుకలొ గూళ్ళు కట్టుకుంటున్నారు.
అవన్ని చూస్థున్న కుమార్ స్వగతం లా అనుకున్నాడు.
ఓ సాగర తీరమా..
ఎన్నొఆటు పొటులతొ నిరంతరం శ్రమిస్థున్నా…మా అడుగుల ప్రతి రూపాల్ని అందంగా తనలో దాచుకుంటూ ..
మన మాటలతో పాటుగా తన అలల జోరుని జత చేస్తూ ..
ఎదురు చూపులతో ఒంటరిగా ఉన్న ఎన్నో మనసులకు నేనున్నా మీ జతగా అంటూ తన అలలతో ఆప్యాయంగా పాదాల్ని స్పృశిస్తూ మండే హ్రుధయాలకి తన చల్లని చిరుగాలులతో సేద తీరుస్తూ ..
ఆరుణొదయాన్ని.. అస్తమించే అగ్ని గొళాన్ని తనలో దాచుకుంటూ మన కనులకు మాత్రం అందగా చూపిస్తూ ఉండే ఓ సాగర తీరమా అంతులేని కధలకి .. ఎన్నో జ్ఞాపకాలకి ప్రతీరూపంగా ఉన్న నీకు నా జోహార్లు ..
అనుకొకుండా టైమ్ చుసుకున్నాడు. అప్పటికె 7.30 దాటింధి. ఇంటికి వెళ్ళాలి అనుకుని లేచాడు. కారు స్టార్ట్ చెయ్యబొతుండగా క్రిష్ణ ప్రసాద్ ఫొన్ వఛింధి.. ఈ టైమ్ లొ ఫోన్ చేసాడు ఎంటి అని లిఫ్ట్ చేసాడు.హలొ చెప్పు అన్నా …”
“ఎక్కడ ఉన్నావురా..” అడిగాడు ప్రసాద్
ఇంటికి వెళ్ధాం అని అలొచిస్థున్నా.” చెప్పు ఎదైనా పని ఉంధా.
“ఎమి లెధురా.. ఎలా ఉన్నావ్ అని ఫొనె చెసాను. అడ్వాన్సె హ్యపి బర్త్ డే.”
‘’ ఒహ్హ్ థాంక్స్ అన్నా.. రీయల్లీ చాలా థ్యాంక్స్ …’’ అని ఫొన్ పెట్టే సాడు.
అవును.. రేపు తన పుట్టిన రోజు .. ఎలా ఉండెంది చిన్నపుడు , కాలేజి రొజుల్లొ …. ఎంత సరదాగా ఉండేది.
ఇంటికి బయలుదేరాడు.
ట్రాఫిక్ లొ ఇంటికి చెరెసరికి 10.00 అయ్యింధి. ఈ రొజు ఎమి వినాల్సి వస్థుంది అనుకుని ఇంట్లో కి ప్రవేశించాడు.
హాల్లొ ఒక లైట్, బెడ్ రూం లొ ఒక లైట్ వెలుగుతూ ఉన్నాయి .గది లొ తన 3 ఎళ్ల కొడుకు తన తల్లి పక్కన హాయి గా నిద్రపొతూ ఉన్నాడు . అపురూపంగా కొడుకుని చూసుకుని హల్లొ కి వచ్చాడు.
అమ్మా నాన్న వాళ్ళ గదిలొఉన్నారు నిద్రపొతు ఉన్నారు.
నిరాశగా బోజనం పెట్టుకుని తినబొయాడు. కాలిగా ఉన్న కుర్చిలు తన ఒంటరితనాన్ని వెక్కిరిస్థున్నట్టు గా అనిపించింధి. అన్నం సహించటం లేదు . కంచం లొ చేతులు కడిగి విశ్రాంతి గా సొఫా లొ కూర్చున్నాడు . ఒక్కసారిగా తన జ్జ్నాపకాలు చుట్టుముట్టాయి.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *