గోపీ – Part 2 201

ఖనిజ ఏమీ మాటాడలేదు.ఆమె అందానికి లోలోపలే ఈర్ష్య పడుతూ..
హలో నాతో మాటాడాలనొచ్చి ఏమీ మాటాడకపోతే ఎలా ..చెప్పండి ఏం పని మీదొచ్చారు.
ఖ:- సారీ ఫల్గుణీ గారూ మీరు ఇంత క్యూట్ గా ఉంటారని ఊహించలేదు ..మీ గురించి వినడమే కాని ఎప్పుడూ చూసింది లేదు..అందుకే ఏం మాటాడాలో తెలియలేదు. ఇతను నా తమ్ముడు గోపీ అస్ట్రాలజర్ ..నేను పారా నార్మల్ యాక్టివిటీస్ మీద డాక్టరేట్ చేస్తున్నా… శయన మాకు పెద్దమ్మ వరస అవుతుంది.ఒక సారి ఏదో సందర్భంలో మీ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మీకు తొందరలో ఏదో గండం వుందని నా తమ్ముడు చెప్పడం జరిగింది. మీరు రెప్యూటెడ్ పర్సన్ కాబట్టి వాటి వివరాలు డైరెక్ట్ గా మీకే చెబుతానంటే మా పెద్దమ్మ ద్వారా మిమ్మల్ని కలవాల్సి వచ్చింది అని గడ గడా పాటం వొప్పజెప్పినట్టుగా చెప్పేసింది.
పల్గుణీ ఒక్క క్షణం సీరియస్ గా ఉండి పక్కున నవ్వేసింది…నవ్వి నవ్వి నవ్వు ఆపుకొంటూ …ముందుగా మీ కాంప్లిమెంటుకు చాల థాంక్స్. నాకు గండాలు జాతకాలం మీద నమ్మకం లేనే లేదు.. ఒకవేళ అటువంటివి ఏవైనా జరిగితే ప్రపంచంలో ఉండే మహ మహా మంత్రగాళ్ళు తంత్ర సాధకులు చిటికెలో మా ఇంటి ముందుకు రప్పించుకొనే సత్తా మాకుంది.కాబట్టి మీరు నా గురించి ఏమీ బాధ పడాల్సిన అవసరం లేదు. ఆ విశయాలు కూడా నాకు అవసరం లేదు.దయ చేసి ఇటువంటివి మరెప్పుడూ నా ముందు ప్రస్తావన తేకండి అని పుల్ల విరిచినట్టుగా నిర్మొహమటంగా చెప్పి లేచి వెళ్ళిపోయింది.

గోపీ ఖనిజలిద్దరూ ఒకరినొకరు చూసుకొని గుంభనంగా నవ్వుకొంటూ అక్కడి నుండి వచ్చేసారు.
ఫల్గుణి ఇంటి వచ్చాక ఖనిజ గోపీ ఇద్దరూ ముందుకు ఆలోచించారు.అదే సమయంలో శయన కూడా అవకాశం కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది.
తారాబలం చూసుకొని గోపీ శయనలో ప్రవేశపెట్టిన శక్తిని పిలిచి శయన కదలికలని ఆలోచనలని తెలుసుకొని వణికి పోయాడు.ఆమె తమ మొత్తం కుటుంబాన్నే లేపెయ్యాలని అనుకొంటోంది. అందుకు కావాల్సిన దారులను కూడా అన్వేషిస్తోంది. ఫల్గుణి మాత్రం తమ గురించి ఎటువంటి ఆలోచన చేయడం లేదని కాస్త ఊరటపొందాడు.
అదే విశయాన్ని అక్కతో అన్నాడు.
ఖనిజ కోపంతో ఊగిపోయింది.అందుకే రా ఆ ముండని ఆరోజు ఎత్తిపొడిచింది. ఇప్పుడైనా అర్థం అయ్యిందా.. అది ఎంత డేంజరో..
నిజమేనే వాళ్ళు కోట్లకు పడగలెత్తిన వారు. మన లాంటి చిన్నా చితకా వాళ్ళను ఏం చేయడానికైనా వెనుకాడరు.
హ్మ్ మ్మ్ ..ఏం చేద్దాం అంటావురా ఫల్గుణి అడ్డం పెట్టుకొని ఒక పెద్ద షాట్ కొట్టేద్దాం అనుకొంటే ఇది ఇలా అడ్డుపడుతోంది….నీ మంత్ర శక్తి ద్వారా ఏమీ చేయడానికి కాదా..?
అక్కా నా మంత్ర శక్తి చాలా పరిమితమే.. తాత్కాలికంగా ఏదో చేయవచ్చు కాని శాశ్వత ఫలితాలుండవు.అందునా దర్షిణీ,కుముద్వతి లాంటి వాళ్ళ మీద ప్రయోగించినా డబ్బున్న వాళ్ళు కాబట్టి అంతో ఇంతో ఇచ్చి చేతులు దులుపుకొంటారు. పెద్దమ్మ ల్లాంటి వారి విశయం వేరు. అందునా తన విశయం వేరు…
ఏం మన నాన్నను అమ్మను లొంగ దీసుకొన్నప్పుడు…కుముద్వతి పార్టీలో ఇద్దరు ముగ్గురితో పడుకొన్నప్పుడు రాని అక్కసు నువ్వు అనుభవిస్తే వచ్చిందా…అంది గొంతు పూడుకుపోతుండగా
సరేలేవే పాత విశయాలు తోడుకొని ప్రయోజనం లేదు.పెద్దమ్మను ఎలా ఆపాలో అది అలోచించాలి ముందు.
ఖ:-దాని వీడియోను అడ్డం పెట్టుకొంటే…