గోపీ – Part 2 201

తిట్టి తిట్టి అలుపొచ్చేసింది శయనకు. చివరగా ఒరేయ్ మీ ఇద్దరినీ పోలీసులకు పట్టించి పుట్టగతులు లేకుండా చేస్తా చూడండి అంటూ బయలు దేరబోయింది.
అప్పుడు నోరు విప్పింది ఖనిజ.నోరు ముయ్యవే బజారు దానా ..పొలీసులూ అదనీ ఇదనీ అంటే నీవు ఈ దేశం వదలి పోలేవు.
శయన కంగుతింది.ఖనిజ అలా గట్టిగా అరిచేసరికి.
ఖనిజకు ముక్కుపుటాలు అదిరిపోతుండగా …ఏం సందు దొరికింది కదా అని పార్టీలో ఇద్దరు ముగ్గురితో పడుకున్నప్పుడు రాలేదా ఈ ఆవేశం…మేం చేస్తే మాత్రం ఉలుకొచ్చిందేం? పార్టీలోనూ, ఇక్కడా జరిపిన నీ బండారం మొత్తం వీడియోలో రికార్డ్ అయ్యి వుంది.. నీవు పతిత్తులా రోడ్డుకెక్కి కూయాలను కొంటే మాకన్నా నీకే ఎక్కువ నష్టం. ఐర్లాండుకు వీసా దొరకదు. అక్కడ మీరు పెట్టిన పెట్టుబడులంతా బ్లాక్ చేస్తారు.విదేశాల్లో సెటిల్ అయిన నీ ఇద్దరి పిల్లలనూ వెనక్కి పంపేస్తారు….
శయనకు నోటి మాట రాలేదు,ఈ పిచ్చిది తనని ఇలా ఎమోషనల్ గా బ్లాక్ మైల్ చేస్తోంది అనుకొని నోరు పెగల్చుకొని ఒసేవ్…. మీరు నా బిడ్డల్లాంటి వారే….
ఆ.. ఆ ..బిడ్దల్లాంటి వారే….. కాని బిడ్డలు కాదుగా..అందుకే మెడపట్టి గెంటబోయావు.మీ బార్యభర్తల విలాసాలకు మా కుటుంబాన్ని బలి చేసారు. ఒకే రక్తం పంచుకు పుట్టిన వారైనా మీ ఆయన బ్రతుక్కీ మానాన్న బ్రతుక్కీ ఎంత తేడా చూడు.నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా.. మీరేమో విదేశాల్లో స్థిర పడతారా మా నాన్నేమో వెధవ గుమాస్తా గిరి చేసుకొంటూ బ్రతికేయాలా..ఛీ ….బిడ్డల్లాంటి వారనే దానికి నీకు కనీస అర్హతన్నా ఉందా..అంది ఖనిజ చీదరించుకొంటూ
శయనకు లోలోపల ఏదో తట్టింది. దీనికేదో రహస్యం తెలిసినట్టుంది… అందుకే ఎదురు దాడి చేస్తోంది…ఇక్కడ తను తగ్గి మాటాడక పోతే కొంపలంటుకుపోతాయి అనుకొని .భాదగా మొహం పెట్టుకొంటూ ఇంతకూ మీకేం కావాలర్రా ..
గోపీ తెల్లబోయి చూస్తున్నాడు ఇద్దరినీ ఇంత సీన్ క్రియేషను అవసరమా అని.అనుకొంటే శయనలో తాను ప్రవేషపెట్టిన శక్తిని తలచుకొంటే పెద్దమ్మే తన మనస్పూర్తిగా పనులు చేసి పెట్టగలదు…కాని అక్కేమిటీ ఓవర్ యాక్షన్ చేస్తోందీ అనుకొంటూ ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నాడు.
అప్పటికి ఖనిజ కూడా శాంత పడింది.